Hidden Buddhist shrines | మరుగునపడిన బౌద్ధ క్షేత్రాలు
చరిత్రపరంగా తెలంగాణలో అశోకుడి కన్నముందే బౌద్ధమతం ఉందని ఆధారాలు దొరికాయి..
దొరుకుతున్నాయి. కరీంనగర్ జిల్లా (పోతన్).. అదే నేటి బోధన్, బోధన్ కుర్తి అని అంటున్నారు.
-16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపగా సింగేయుడు మొదలైనవాళ్లు బౌద్ధమత సిద్ధాంతాలను నేర్చుకొని రాగా తెలంగాణలో బౌద్ధం విస్తరించింది అనడానికి మరికొన్ని ఆనవాళ్లు లభ్యమవుతున్నాయి. బౌద్ధాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు (పాలకులు) విష్ణుకుండినులే. తెలంగాణలో అక్కడక్కడ గోవిందవర్మ, మాధవ వర్మల శాసనాల్లోనూ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఉత్తర భారతం కంటే దక్షిణాపథంలో బౌద్ధం విస్తరించిందనడానికి చరిత్రే సాక్ష్యం. తెలంగాణలో బౌద్ధారామాలు (బౌద్ధాలయాలు) కొన్ని మాత్రమే వెలుగుచూశాయి. అలాగే కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) రాష్ట్ర పురావస్తుశాలల శాఖ కనుగొని బౌద్ధానికి సంబంధించిన వస్తువులు, శాసనాలను భద్రపర్చారు. ఇప్పటివరకు తెలంగాణలో 1. కోటిలింగాల కరీంనగర్ 2. బోధన్కుర్తి 3. దూళికట్ట 4. ఫణిగిరి 5. కొండాపూర్ మెదక్ (నేటి సంగారెడ్డి) మొదలైన కొన్నింటిని మాత్రమే పరిశోధించారు. ఇంకా ఎన్నో బౌద్ధారామాలు ఉన్నాయి. బౌద్ధం 16 (షోడశ) జన పదాల్లో అస్మక అనే పదం ఉన్నప్పటికినీ, అస్మక అనే రాజు కూడా ఉండేవాడని, అతను కూడా బౌద్ధమతాన్ని స్వీకరించినట్టుగా కూడా కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
-క్రీ.పూ 3వ శతాబ్దం క్రీ.శ. 1వ శతాబ్దాల మధ్య ఘన చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఆ చరిత్ర గురించి బౌద్ధ సోదకులైన కొండన, శరభాంకపాలుని రచనలు చెబుతున్నాయి. క్రీ.పూ. 230 సంవత్సరం నుంచి 2016 వరకు అంటే సుమారు 2,310 సంవత్సరాల ఘన చరిత్ర మెదక్ జిల్లాది. పూర్తి సమాచార లఘుచిత్రం యూట్యూబ్‌లో ఉన్నది. అయితే నిజామాబాద్, దేవరకొండ, మెదక్, నల్లగొండ జిల్లాల్లో బౌద్ధారామ దిబ్బలు ఉన్నాయి. ప్రభుత్వాలు, ప్రజలు, పరిశోధకులు, బౌద్ధ ప్రాచీన చరిత్రను పరిశోధించి వెలికితీయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
-1995లో పైడి గుమ్మల్ (నేటి సంగారెడ్డి జిల్లా)లో ఒక దిబ్బను కనుగొన్నారు. శాతవాహనుల ఆనవాళ్లు ఝరాసంగం-కుప్పానగర్, మరకత మణిపురం మర్పడగ కనుగొని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. విదేశీయుల దాడికి ఎన్నో బౌద్ధారామాలు ధ్వంసమయ్యాయి. (ఉదా: ప్రాచీన బౌద్ధారామాన్ని బద్దలు కొట్టిన బాబర్) వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి కొండాపూర్-పైడి గుమ్మల్ మొదలైనవి. వలిగొండ నాగారం వద్ద మహాదేవి విహారం కూడా నిర్లక్ష్యానికి గురైందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం, బీఎన్ శాస్త్రి (శాసనాలశాస్త్రి) కుమారుడైన గోపాలక్రిష్ణ శాస్త్రి, చరిత్ర పరిశోధకుడైన సిలివేరు లింగమూర్తి చెప్పారు. కరీంనగర్ జిల్లా సింగరాయలొద్దిలో వరంగల్ జిల్లా కొన్నె ప్రాంతం గజగిరి గుట్ట మీద అలాగే భువనగిరి జిల్లా రాయగిరి మల్లన్నగుట్ట రామస్వామి గుట్ట రఘునాథపురం, వాసాలమర్రి బొడ్మట్‌పల్లి ఆరామ దిబ్బ మొదలైన బౌద్ధ ప్రాంతాలు ఉన్నట్టుగా చరిత్ర. అయితే పాళీ చతుస్తవలో.. పరమార్ధస్తవం కూడా గొప్పదే. అలాంటి బౌద్ధ మహోన్నత చరిత్ర మన తెలంగాణలో లభిస్తుందేమోనని చరిత్రకారుల అభిప్రాయం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు