A Brief History of Railways | రైల్వేల సంక్షిప్త చరిత్ర
-దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు.
-మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు 1853 ఏప్రిల్ 16న ప్రయాణం చేసింది.
-హైదరాబాద్ రాష్ట్రంలో 1873 నాటికి నిజాంస్టేట్ రైల్వే వ్యవస్థ కొలువు తీరింది. మొదటి రైల్వే లైను 1874, జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్‌కు ప్రారంభమైంది.
-1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.
-భారతీయ రైల్వేల నినాదం జాతి జీవన రేఖ
-1951లో భారతీయ రైల్వేలను ప్రభుత్వం జాతీయం చేసింది.
-భారతీయ రైల్వేలు 150 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2002 ఏప్రిల్ 16న భోలు ది గార్డ్ మస్కట్‌ను విడుదల చేసింది.
-ప్రపంచంలో పొడవైన రైలు ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. దీని పొడవు 1.3 కి.మీ.
-ప్రపంచ రైల్వే నెట్‌వర్క్‌లో అమెరికా (2,28,218 కి.మీ.), చైనా (1,21,000 కి.మీ.), రష్యా (87,157కి.మీ.), భారత్ (65,408 కి.మీ.), కెనడా (46,552 కి.మీ.) వరుస స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయి. వాటిలో అతిపెద్దది ఉత్తర రైల్వేజోన్ (6,968 కి.మీ.), అతి చిన్న జోన్ తూర్పు రైల్వే (2,414 కి.మీ.)
-దేశంలో ప్రయాణించే మొత్తం రైళ్లు 21 వేలు. ఇవి ప్రతి రోజు 13.4 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తాయి.
-అత్యధిక దూరం ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్సెప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు నడుస్తుంది. ఇది 110 గంటల్లో 4,273 కి.మీ. ప్రయాణం చేస్తుంది.
-దేశంలో అత్యల్ప దూరం (3 కి.మీ.) ప్రయాణించే రైలు నాగపూర్-అజ్నీ ప్యాసింజర్ రైలు.
-దేశంలో అత్యధిక వేగంగా ప్రయాణం చేసే రైలు గతిమాన్ (గంటకు 160 కి.మీ. వేగంతో) న్యూఢిల్లీ – ఆగ్రా మధ్య నడుస్తుంది.
-దేశంలో అత్యల్ప వేగంగా ప్రయాణం చేసే రైలు నీలగిరి ప్యాసింజర్. ఇది మెట్టుపాలెం-ఊటీ మధ్య నడుస్తుంది. ఇది గంటకు 10 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
దేశంలో నాలుగు మూలల్లో ఉన్న రైల్వే స్టేషన్లు
-ఉత్తరం – బారాముల్లా (జమ్ముకశ్మీర్)
-దక్షిణం – కన్యాకుమారి (తమిళనాడు)
-తూర్పు – లెడో (అసోంలోని తీన్ సుకాడియాలో)
-పడమర – నలియా (గుజరాత్‌లోని భుజ్ సమీపంలో)
యునెస్కో వరల్డ్ హెరిటేజ్
-యునైటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (జల్పాయిగురి-డార్జిలింగ్), నీలగిరి మౌంటెన్ రైల్వే (నీలగిరి కొండలు), ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై), కల్కా-సిమ్లా రైల్వే (హిమాచల్‌ప్రదేశ్‌లోని శివాలిక్ పర్వత శ్రేణులు)కు స్థానం లభించింది.
-రైల్వే పింక్ బుక్: భారతీయ రైల్వేల ఆదాయ, వ్యయ కేటాయింపు వివరాలను నమోదు చేసే సంస్థ.
ఇండియన్ రైల్వే-గణాంకాలు
ఉద్యోగులు -18 లక్షలు
రెవెన్యూ -రూ. 1,63,450 కోట్లు
రైళ్లు -12,617 (ప్రతిరోజు)
గూడ్స్ బండ్లు -7,421 (ప్రతిరోజు)
ప్రయాణికులు -23 లక్షలు (ప్రతిరోజు)
రవాణా -దేశ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు
ఉత్పత్తి సంస్థలు -12
ఇంధన ఖర్చు -రూ. 12,635 కోట్లు (2014-15 విద్యుత్) రూ. 18,586 కోట్లు (2014-15 డీజిల్)
రైలు మార్గం పొడవు -65,000 కి.మీ.
స్వాతంత్య్రం వచ్చాక -11,000 కి.మీ.
స్టేషన్లు -7,172
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు