టెట్రాసైక్లిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1. జీవశాస్త్రం గురించిన లిఖితపూర్వక సమాచారం మొదటిసారిగా ఎవరి నుంచి లభించింది?
1) అరిస్టాటిల్, గేలన్ 2) వెసాలియస్, హార్వే 3) లామార్క్, డార్విన్ 4) ష్లైడెన్, ష్వాన్
2. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్రకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. వరణాత్మక ప్రజననం, సంకరణం, జెనెటిక్ ఇంజినీరింగ్ లాంటి పద్ధతులను ఉపయోగించి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో జీవశాస్త్రం కీలకపాత్ర పోషిస్తున్నది బి. ఎప్పటికప్పుడు వ్యాధికారక జీవుల గురించి అధ్యయనం చేస్తూ, వ్యాధులు వ్యాప్తిచెందే విధానాలను తెలుసుకుంటూ, వ్యాధికారకాలను నశింపజేసే ఔషధాలను తయారు చేయడంలో జీవశాస్త్రం తోడ్పడుతున్నది
సి. అటవీవర్ధన ప్రక్రియను రూపొందించడానికి, బయోఫర్టిలైజర్స్ ఉత్పత్తికి జీవశాస్త్రం తోడ్పడింది
డి. మానవునికి మానసిక ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే పార్కులు, తోటలు, జంతుప్రదర్శనశాలల అభివృద్ధిలో జీవశాస్త్రం ఉపయోగపడింది
1) ఎ, బి 2) ఎ, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
3. మొక్క కణజాలాన్ని పరీక్షనాళికలో పెంచుతూ కణాల్లోకి కావాల్సిన లక్షణానికి సంబంధించిన జన్యువును ప్రవేశపెట్టడాన్ని ఏమంటారు?
1) వరణాత్మక ప్రజననం 2) కణజాల వర్ధనం
3) జెనెటిక్ ఇంజినీరింగ్ 4) సంకరణం
4. పూర్వకాలంలో ఇన్సులిన్‌ను వేటి నుంచి సేకరించేవారు?
1) పిల్లులు, కుక్కలు 2) పందులు, పశువులు
3) పక్షులు, సరీసృపాలు 4) కోతులు, కొండెంగలు
5. అరిస్టాటిల్ అనంతరం దాదాపు రెండువేల ఏండ్ల కాలాన్ని శాస్ర్తానికి చీకటి యుగం అంటారు ఎందుకు?
1) పరిశోధనలపై నిషేధం ఉండటంతో శాస్త్రీయ పురోగతి నిలిచిపోవడంవల్ల
2) శాస్త్ర భావాల కంటే మతపరమైన భావాల ప్రాబల్యం ఎక్కువగా ఉండి, క్రమపద్ధతిలో శాస్త్ర పరిశీలనలు జరుగకపోవడంవల్ల
3) పరిశోధనకు అనువైన పరిస్థితులు లేకపోవడంవల్ల
4) పైవన్నీ
6. హరితవిప్లవం కిందివాటిలో వేటి వాడకంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది?
ఎ. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు
బి. రసాయనిక ఎరువులు
సి. క్రిమిసంహారక మందులు
1) ఎ 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
7.కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. వరణాత్మక ప్రజననం ద్వారా ఎక్కువ పాలనిచ్చే హాలిస్టీన్ ఆవులు, ఎక్కువ గుడ్లు పెట్టే లేయర్ కోళ్లను ఉత్పత్తి చేశారు
బి. మొక్కలు జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తిని కలిగి ఉంటాయి
సి. బ్యాక్టీరియాను సంహరించే పెన్సిలిన్ లాంటి సూక్ష్మజీవ నాశకాలను శిలీంధ్రాల నుంచి తయారుచేస్తారు
1) ఎ, బి 2) బి 3) బి, సి 4) ఏదీకాదు
8. జన్యుసంబంధ వ్యాధులకు సంబంధించి సరైనవి?
ఎ. జన్యువుల్లో సంభవించే ఆకస్మిక మార్పుల (ఉత్పరివర్తనాలు) వల్ల జన్యుసంబంధ వ్యాధులు వస్తాయి.
బి. జన్యుచికిత్స పద్ధతి ద్వారా జన్యుసంబంధ వ్యాధులను నయం చేయవచ్చు.
సి. సరిగా పనిచేయని జన్యువులను గుర్తించి, వాటి స్థానాన్ని పనిచేసే జన్యువులతో భర్తీ చేయడమే జన్యుచికిత్స.
డి. హీమోఫీలియా, వర్ణాంధత్వం జన్యుసంబంధ వ్యాధులు కావు
1) ఎ, డి 2) బి, డి 3) ఎ, బి, సి 4) బి, సి, డి
9. కింది వాటిలో అనువంశికతకు సంబంధించిన శాస్త్రం?
1) వర్గీకరణ శాస్త్రం 2) కణశాస్త్రం
3) జన్యుశాస్త్రం 4) ఆవరణశాస్త్రం
10. గతించిన జీవులకు సంబంధించిన ముద్రలను ఏమంటారు?
1) మృతకళేబరాలు 2) శిలాజాలు
3) పై రెండూ 4) ఏదీకాదు
11. కింది వాటిని జతపర్చండి.
1. శరీర ధర్మశాస్త్రం ఎ. జీవులు, వాటి పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే శాస్త్రం
2. జీవావరణ శాస్త్రం బి. మొక్కలు, జంతువుల శరీర అంతర్నిర్మాణం గురించి తెలిపే శాస్త్రం
3. శరీర నిర్మాణశాస్త్రం సి. జీవులు, వాటి బాహ్య లక్షణాల గురించి తెలిపే శాస్త్రం
4. స్వరూపశాస్త్రం డి. జీవుల శరీరభాగాలు, అవి జరిపే జీవక్రియల గురించి తెలిపే శాస్త్రం
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
12. కణ నిర్మాణం, కణజాలాల గురించిన అధ్యయనం?
1) కణజాల శాస్త్రం 2) కణజీవశాస్త్రం
3) పై రెండూ 4) ఏదీకాదు
13. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. గతించిన జీవుల అధ్యయనం – పురాజీవశాస్త్రం
బి. అణుస్థాయిలో జీవుల అధ్యయనం – అణుజీవ శాస్త్రం
సి. సముద్ర జీవుల అధ్యయనం – మెరైన్ బయాలజీ
డి. జీవుల్లో రసాయన చర్యల అధ్యయనం – జీవ రసాయన శాస్త్రం
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
14. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ. సూక్ష్మజీవుల గురించి అధ్యయనాన్ని వైరాలజీ అంటారు
బి. జీవుల్లో భౌతిక ధర్మాలు, భౌతికాధార ప్రక్రియల గురించి అధ్యయనాన్ని జీవభౌతిక శాస్త్రం అంటారు
సి. జీవులపై రేడియోధార్మిక ప్రభావం గురించి తెలిపే శాస్ర్తాన్ని రేడియోధార్మిక జీవశాస్త్రం అంటారు
1) ఎ 2) బి 3) సి 4) బి, సి
15. జీవశాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త?
1) డార్విన్ 2) మెండల్
3) విలియం హార్వే 4) జీన్ లామార్క్
16. కిందివాటిలో సరికానిది ఏది?
1) వృక్షాల పిండోత్పత్తిశాస్త్ర పితామహుడు – వాట్సన్
2) హరితవిప్లవ పితామహుడు – ఎంఎస్ స్వామినాథన్
3) సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు – లూయీపాశ్చర్
4) జీవశాస్త్ర పితామహుడు – అరిస్టాటిల్
17. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. బ్యాక్టీరియాల ప్రాముఖ్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్త – లూయీపాశ్చర్
బి. నీరు, రక్తం, దంతాల పాచి, విసర్జితాల్లో సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త- ల్యూవెన్ హుక్
సి. పరస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్న భారత శాస్త్రవేత్త – పంచానన్ మహేశ్వరి
డి. హైదరాబాద్‌లో మలేరియాపై పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్త – సర్ రోనాల్డ్‌రాస్
1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
18. కింది వాటిని జతపర్చండి.
1. ఆంత్రాక్స్ టీకా కనుగొన్న శాస్త్రవేత్త ఎ. వాట్సన్, క్రిక్
2. మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన తొలి శాస్త్రవేత్త
బి. లూయీ పాశ్చర్
3. టెట్రాసైక్లిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త
సి. ఎల్లాప్రగడ సుబ్బారావు
4. అణుజీవశాస్ర్తానికి పునాది వేసినది డి. ల్యూవెన్ హుక్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ 4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
19. కింది వారిలో నోబెల్ బహుమతి పొందని జీవశాస్త్రవేత్తలు?
ఎ. వాట్సన్, క్రిక్ బి. రోనాల్డ్ రాస్
సి. హరగోవింద్ ఖొరానా డి. విలియం హార్వే
1) ఎ 2) ఎ, బి 3) బి, సి 4) డి
20. కింది వాక్యాల్లో ఏది సత్యం?
ఎ. వైద్యరంగంలో విశేష సేవలందించిన జీవరసాయన శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావును అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని అభివర్ణిస్తారు
బి. హరగోవింద్ ఖొరానా అనే శాస్త్రవేత్త జన్యుస్మృతిని వెలుగులోకి తెచ్చాడు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
21. డీఎన్ఏ ద్వికుండలిని నిర్మాణం కలిగి ఉంటుందని కొనుగొన్న శాస్త్రవేత్తలు?
1) జెన్నర్, రాస్ 2) వాట్సన్, క్రిక్
3) పాశ్చర్, జెన్నర్ 4) ఆవ్రే, ష్వాన్
22. ఏ వృక్షశాస్త్రవేత్త పరిశీలనలు ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువును ఇచ్చాయి?
1) బీర్బల్ సహానీ 2) లిన్నేయస్
3) రాబర్ట్ బ్రౌన్ 4) డార్విన్
23. పత్తి వంగడాల అభివృద్ధి కోసం పరిశోధనలు చేసే సంస్థ?
1) CRRI 2) CIMR
3) CICR 4) CCMB
24. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. NIN – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
బి. NIO – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ
సి. NIV – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ
డి. NII – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి 3) పైవన్నీ 4) ఏదీకాదు
25. దేశంలో ఉష్ణమండల పంటమొక్కలపై పరిశోధన చేస్తూ, వాటి బీజపదార్థ నిలువకు తోడ్పడుతున్న అంతర్జాతీయ సంస్థ?
1) ICRISAT 2) CCMB
3) NBRI 4) ICMR
26. ICRISAT విస్త్రృత రూపం తెల్పండి?
1) ఇండియన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్
2) ఇండియన్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్
3) ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్
4) ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్
27. కింది వాటిలో హైదరాబాద్‌లో లేని సంస్థ ఏది?
1) CCMB 2) ICRISAT
3) NIN 4) CICR
సమాధానాలు
1-1, 2-4, 3-3, 4-2, 5-2, 6-4, 7-4, 8-3, 9-3, 10-2, 11-1, 12-2, 13-4, 14-1, 15-4, 16-1, 17-4, 18-3, 19-4, 20-3, 21-2, 22-1, 23-3, 24-4, 25-1, 26-3, 27-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు