Cornwallis Code | కారన్‌వాలీస్ కోడ్ అంటే ఏమిటి?
వారెన్ హేస్టింగ్స్ (క్రీ.శ.1773-1785)
-రాబర్ట్ ైక్లెవ్ బెంగాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని 1773లో వారెన్ హేస్టింగ్స్ రద్దు చేశారు.
-ద్వంద్వ ప్రభుత్వం స్థానంలో బెంగాల్, బీహార్, ఒడిశాల్లో వేలం వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.
-జిల్లా సూపరిండెంట్ పేరును జిల్లా కలెక్టర్‌గా మార్చారు.
-హేస్టింగ్స్ బెంగాల్ రాజధానిని, ఖజానాను ముర్షిదాబాద్ నుంచి కలకత్తాకు మార్చారు.
-రాష్ట్ర, జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టులను స్థాపించారు.
-హిందూ న్యాయ చట్టాలను కోడ్ ఆఫ్ హిందూ లా పేరుతో వారన్ హేస్టింగ్స్ క్రోడీకరించారు.
-మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ముస్లిం న్యాయ చట్టాలను ఫత్వా-ఐ-అలంఘీర్ పేరుతో పర్షియన్ భాషలో క్రోడీకరించగా, వారన్ హేస్టింగ్స్ వాటిని ఆంగ్లంలోకి అనువదించారు.
-క్రీ.శ.1781లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో మదర్సా (ముస్లిం విద్యాసంస్థ)ను స్థాపించారు.
-దోపిడీలకు పాల్పడే దిగంబర సన్యాసులను వారన్ హేస్టింగ్స్ అరికట్టారు.
-వారెన్ హేస్టింగ్స్ హయాంలో 3 యుద్ధాలు జరిగాయి. అవి: 1. రోహిల్ ఖండ్ యుద్ధం (1773), 2. మొదటి మరాఠా యుద్ధం (1775-1782), 3. రెండో మైసూర్ యుద్ధం (1780-1784).
-అభిశంసనకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ – వారన్ హేస్టింగ్స్.
-వారెన్ హేస్టింగ్స్‌పై వచ్చిన అభియోగాలు: ఎ. కాశీ రాజు చైత్యసింగ్ను తొలగించడం, బి. బెంగాల్లో ఉన్నత కుటుంబానికి చెందిన నందకుమార్‌కు మరణశిక్ష విధించడం, సి. అయోధ్య బేగంల (వితంతువులు) ఆస్తులను కొల్లగొట్టడం.
-ఏడేండ్ల విచారణ అనంతరం వారన్ హేస్టింగ్స్ నిర్దోషిగా ప్రకటితమయ్యారు.
కారన్‌వాలీస్ (క్రీ.శ.1786-1793)
-కారన్‌వాలీస్ ఆంగ్ల ఉద్యోగుల వేతనాలను పెంచడం ద్వారా ఉద్యోగుల అవినీతిని అరికట్టే ప్రయత్నం చేశారు.
-పన్ను చెల్లింపు విధానంలో వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన వేలం వేసే విధానాన్ని కారన్‌వాలీస్ రద్దు చేశారు.
-వేలం వేసే విధానం స్థానంలో కారన్‌వాలీస్ 1793లో శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతి అనే నూతన రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు.
-శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతిలో జమీందారులు శిస్తు వసూలు చేస్తారు. ఈ విధానం ఇంగ్లండ్‌లో ఫ్యూడలిజాన్ని పోలి ఉంటుంది.
-భారతీయ కోర్టుల్లో ఇంగ్లిష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ జరిపే పద్ధతిని కారన్‌వాలీస్ ప్రవేశపెట్టారు.
-భారతీయ న్యాయవ్యవస్థలో కారన్‌వాలీస్ అమలు చేసిన న్యాయ సంస్కరణలను కారన్‌వాలీస్ కోడ్ అంటారు.
-కారన్‌వాలీస్ అంగ విచ్ఛేదన లాంటి శిక్షలను రద్దుచేసి కారాగార శిక్షలను విధించారు.
-కలెక్టర్లకుగల న్యాయాధికారాలను కారన్‌వాలీస్ రద్దుచేశారు.
-అనాదిగా కొనసాగుతున్న పంచాయతీ న్యాయస్థానాలను కూడా కారన్‌వాలీస్ రద్దుచేశారు.
-కింది స్థాయిలో మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేసిన కారన్‌వాలీస్.. భారతీయులను న్యాయాధికారులుగా నియమించారు.
-కారన్‌వాలీస్ నాలుగు సంచార న్యాయస్థానాలు/సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశారు. అవి: 1. కలకత్తా, 2. ఢాకా, 3. పాట్నా, 4. ముషీరాబాద్ కోర్టులు.
-కారన్‌వాలీస్ కాలంలో చార్టర్ చట్టాల్లో మొదటిదైన 1793-చార్టర్ చట్టం అమల్లోకి వచ్చింది.
-దేశంలో తొలిసారిగా సివిల్ సర్వీస్ వ్యవస్థను కారన్‌వాలీస్ ప్రవేశపెట్టారు.
-ఆధునిక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసిన కారన్‌వాలీస్.. ప్రతి 29 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్‌ను నెలకొల్పారు. ఈ పోలీస్ స్టేషన్లను ఠాణాలు అని పిలిచేవారు.
-ఠాణాల అధికారిని దరోగా అనేవారు. కారన్‌వాలీస్ ప్రతి జిల్లాకు ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను నియమించారు.
-కారన్‌వాలీస్ చేసిన ఏకైక యుద్ధం- మూడో మైసూరు యుద్ధం.
-హైదరాబాద్ నిజాం, మహారాష్ర్టులతో కలిసి త్రైపాక్షిక కూటమిని ఏర్పర్చిన కారన్‌వాలీస్.. మూడో మైసూరు యుద్ధంలో మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను ఓడించారు.
-1792లో శ్రీరంగపట్నం సంధితో మూడో మైసూరు యుద్ధం ముగిసింది.
-కారన్‌వాలీస్ 1788లో హైదరాబాద్ పాలకుడు నిజాం అలీఖాన్ నుంచి గుంటూరు ప్రాంతాన్ని పొందారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు