Monetary policy | మానిటరీ పాలసీ
గ్రూప్-1 ఎకనామీలో భాగంగా అందిస్తున్న వ్యాసాలు మెయిన్స్, ప్రిలిమ్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నాం. ద్రవ్యం, ద్రవ్య సప్లయ్లోనే అతి ముఖ్యమైన చాప్టర్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ-ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన విధానం. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మంత్రిత్వశాఖ చేసే విధానాల కన్నా ఈ మానిటరీ పాలసీ మరింత ముఖ్యమైంది. ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మొత్తం ఒక మార్పుతో మార్చే మరో ముఖ్య విధానమే ఈ మానిటరీ పాలసీ. దీని గురించి తెలుసుకుందాం..
మానిటరీ పాలసీ అంటే?
-ఏదైనా ఒక దేశ కేంద్రక బ్యాంక్ (మన దేశంలో ఆర్బీఐ, అమెరికాలో ఎఫ్‌బీఏ, ఈయూలో ఈసీబీ మొదలైనవి) ఆ దేశ ద్రవ్య సరఫరా నియంత్రణకు తీసుకొనే విధాన నిర్ణయమే మానిటరీ పాలసీ. దీన్నే క్రెడిట్ పాలసీ అని కూడా అంటారు. ఒకదేశ ఆర్థికశాఖ, ప్రభుత్వ ఇతర సంస్థలు తీసుకొనే విధాన నిర్ణయాలను విత్త విధానం అంటారు.
మానిటరీ పాలసీలో ఏం ఉంటాయి?
-ద్రవ్య సరఫరాను, బ్యాంక్ రుణాల లభ్యతను, వడ్డీరేట్లను నియంత్రించడానికి ఆర్బీఐ వాడే వివిధ రకాల టూల్స్‌నే మానిటరీ పాలసీ అంటారు.
మానిటరీ పాలసీ విధానం లక్ష్యాలు, లాభాలు
-ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఎలా: వడ్డీరేట్లను తగ్గించి, పెంచడం ద్వారా కొన్ని సెక్టార్లలో పెట్టుబడులను ప్రోత్సహించి ఆ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలను పెంచుతారు.
-ధరల స్థిరత్వం ఎలా: ద్రవ్య సరఫరాను నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడం ద్వారా.
-అసమానతలను తగ్గించడం ఎలా: వెనుకబడిన వర్గాలకు ఎక్కువ రుణాలు అందేటట్టు చేయడం ద్వారా
-ప్రాధాన్యత రంగాన్ని ప్రోత్సహించడం ఎలా: ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ద్వారా
-ఆర్థిక వృద్ధిని పెంపొందించడం
-ఇతర దేశాలతో లావాదేవీలను సైతం స్థిరీకరిస్తుంది
-మానిటరీ పాలసీలో రెండు రకాల టూల్స్ ఉంటాయి. అవి..
1. పరిమాణాత్మక టూల్స్ 2. గుణాత్మక టూల్స్
పరిమాణాత్మక టూల్స్
-నిలువ నిష్పత్తులు (CRR, SLR)
-బహిరంగ మార్కెట్ (OMO)
-విధాన రేట్లు (LAF, బ్యాంక్రేటు, MSF)
గుణాత్మక టూల్స్
-మార్జిన్ రిక్వైర్మెంట్స్
-వినియోగదారుల రుణ నియంత్రణ
-రుణ హేతుబద్ధత
-నైతిక ఉద్బోధ
-ప్రత్యక్ష చర్యలు
-ఇంతకుముందే చర్చించినట్టు మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు వస్తువులకు గిరాకీ పెరిగి, వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే ప్రజల ఆదాయాలు పెరిగితే ద్రవ్య సరఫరా పెరుగుతుంది. తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయి. లేదా వస్తువుల ఉత్పత్తి తగ్గి వస్తువుల కొరత ఏర్పడినప్పుడు కూడా వస్తువుల ధరలు పెరిగి ద్రవోల్బణం ఏర్పడుతుంది.
-ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు ద్రవ్య విలువ (వస్తువులను కొనే సామర్థ్యం) కూడా తగ్గిపోతుంది. ఇది కూడా తెలుసుకున్నాం. పై ద్రవ్య సరఫరాను నియంత్రించడం ఈ మానిటరీ పాలసీ ముఖ్య విధి.
ఎన్‌డీటీఎల్ అంటే..
-ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బునే ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్) అంటారు.
-టైమ్ లయబిలిటీస్: ఫిక్స్డ్ డిపాజిట్లు, క్యాష్ సర్టిఫికెట్లు, బంగారంలో దాచిన డబ్బు.
-డిమాండ్ లయబిలిటీస్: సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, డిమాండ్ డ్రాఫ్టుల్లో దాచిన డబ్బు.
మానిటరీ పాలసీలో పరిమాణాత్మక టూల్స్‌లో నిలువ నిష్పత్తి నిల్వలు
క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)
-బ్యాంకు ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద నగదు రూపంలో నిలువ ఉంచే పద్ధతే ద్రవ్య విలువ నిష్పత్తి (సీఆర్ఆర్).
-ఉదాహరణకు ఎస్బీఐ మొత్తం ఎన్‌డీటీఎల్ రూ. 100 కోట్లు అనుకుందాం. ఈ మొత్తాన్ని లోన్ల రూపంలో అందరికీ పంచింతే అప్పుడు డబ్బు దాచినవారందరూ వచ్చి మా డబ్బు మాకు కావాలి అంటే ఆ బ్యాంకు ఎలా తెచ్చిస్తుంది?
-ఆ సందర్భంలో డిపాజిట్‌దారులు ఎస్బీఐపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మొత్తం ఎన్‌డీటీఎల్‌ను రుణాల రూపంలో, లోన్ల రూపంలో ఇవ్వకుండా ఆర్బీఐ కొన్ని నియంత్రణలను బ్యాంకులపై విధిస్తుంది. ఇందులో భాగంగా ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలని నియంత్రణ విధిస్తుంది.
-ఉదా: సీఆర్ఆర్ 4 శాతం అని ఆర్బీఐ ఒక విధానం వెల్లడిస్తే ఇంతకుముందు అనుకున్నట్లు రూ. 100 కోట్లు ఎన్‌డీటీఎల్‌లో 4 శాతం అంటే 4 కోట్ల నగదును ఆర్బీఐ వద్ద ఎలాంటి వడ్డీ లేకుండా ఉంచాలి.
సీఆర్ఆర్ ద్రవ్యసరఫరా నియంత్రణ
-సీఆర్ఆర్ను పెంచినప్పుడు ఎక్కువ ద్రవ్యాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. అప్పుడు బ్యాంకులు రుణాలు, లోన్లు ఇవ్వడానికి తక్కువ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. తద్వారా తక్కువ మొత్తంలో లోన్లు ఇచ్చి మార్కెట్లో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది.
-సీఆర్ఆర్ను తగ్గిస్తే: ఆర్బీఐ వద్ద తక్కువ నగదు ఉంచాల్సి ఉంటుంది. అది ఎక్కువ ద్రవ్య సరఫరాను మార్కెట్లో పెంచడానికి ఉపయోగపడుతుంది.
ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ పాత్ర
-మార్కెట్లో ఎక్కువ ద్రవ్య సరఫరా ఉన్నప్పుడు సీఆర్ఆర్ను పెంచి లోన్ లభ్యతను కష్టతరం చేస్తూ ఆర్బీఐ ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది.
సీఆర్ఆర్ గురించి…
-ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచే ద్రవ్యం.
-ద్రవ్యోల్బణ సమయంలో సీఆర్ఆర్ను పెంచుతారు. దీనిపై బ్యాంకులకు ఆర్బీఐ నుంచి ఎలాంటి వడ్డీ లభించదు.
చట్టబద్ధ ద్రవ్య నిల్వ (ఎస్ఎల్ఆర్)
-ఆర్బీఐ గుర్తించిన సెక్యూరిటీల రూపంలో (బంగారం, బాండ్లు, నగదు) ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతాన్ని బ్యాంకు వద్దే నిల్వ ఉంచడాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు.
-సీఆర్ఆర్ కేవలం నగదు రూపంలోనే ఉంటుంది. కానీ ఎస్ఎల్ఆర్ నగదు, బంగారం, బాండ్లు, సెక్యూరిటీల రూపంలో ఉండవచ్చు.
-ఉదాహరణకు.. ఎస్బీఐకి రూ. 100 కోట్లు ఎన్‌డీటీఎల్ వస్తే అందులో సీఆర్ఆర్ రూపంలో 4 శాతం ఆర్బీఐ వద్ద ఉంచారని అనుకుంటే ఎస్ఎల్ఆర్ రూపంలో మరికొంత బ్యాంకు వద్దే ఉంచాలి.
-ఎస్ఎల్ఆర్ 26 శాతం అనుకుంటే… ఎన్‌డీటీఎల్‌లో 26 శాతం అంటే రూ. 26 కోట్ల విలువగల నగదు, బంగారం, మొదలైనవి బ్యాంకు వద్దే ఉండాలి.
-అంటే 100 కోట్ల ఎన్‌డీటీఎల్‌లో 4 శాతం సీఆర్ఆర్, 26 శాతం ఎస్ఎల్ఆర్ లోన్లు, రుణాలు ఇవ్వడానికి స్టేట్ బ్యాంకు వద్ద మిగిలిన సొమ్ము రూ. 70 కోట్లు మాత్రమే.
-ద్రవ్యోల్బణ సమయంలో ఎస్ఎల్ఆర్ను పెంచుతారు. దీంతో రుణాలు ఇవ్వడానికి ఉండాల్సిన నగదు తగ్గిపోయి మార్కెట్లో ద్రవ్య సరఫరా తగ్గుతుంది. తద్వారా వస్తువులకు గిరాకీ తగ్గిపోయి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
సీఆర్ఆర్
-ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచే ద్రవ్యం.
-ద్రవ్యోల్బణ సమయంలో సమయంలో సీఆర్ఆర్ను పెంచుతారు. దీనిపై బ్యాంకులకు ఆర్బీఐ నుంచి ఎలాంటి వడ్డీ లభించదు.
ఎస్ఎల్ఆర్
-ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతాన్ని నగదు, బంగారం, సెక్యూరిటీలు, బాండ్లు, మొదలైన రూపంలో బ్యాంకు వద్ద ఉంచుకోరాదు.
-ద్రవ్యోల్బణ సమయంలో ఎస్ఎల్ఆర్ను పెంచుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు