1971 లో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం ఏది?
జాతీయ మానవ హక్కుల కమిషన్
- 1993లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2006లో చేసిన సవరణ ప్రకారం రాష్ట్రస్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే విధంగా సవరణలు చేశారు.
- ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతే తొలగిస్తారు. చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయి ఉండాలి.
- మానవ హక్కుల ఉల్లంఘన, ఇతర అంశాలకు సంబంధించి విచారణ జరిపి నివేదికలు సమర్పిస్తుంది.
- మొట్టమొదటి చైర్మన్- జస్టిస్ రంగనాథ్ మిశ్రా
- ప్రస్తుత (7వ) చైర్మన్- జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
- 2007లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీనిలో ఒక చైర్మన్ 6గురు సభ్యులు ఉంటారు. వీరిని కేంద్రప్రభుత్వం 3 సంవత్సరాల కాలానికి నియమిస్తుంది.
- బాలల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి వివిధ రక్షణ సౌకర్యాలు పరిశీలించి తగిన సిఫారసులు చేస్తుంది.
- చైర్మన్ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. సభ్యులకు 60 సంవత్సరాలు.
- మొట్టమొదటి చైర్పర్సన్- శ్రీమతి ప్రొఫెసర్ శాంతా సిన్హా
- ప్రస్తుత చైర్పర్సన్- ప్రియాంక్ కనుంగో
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
- ప్రభుత్వ పాలనలో అవినీతిని అరికట్టడానికి 1964లో కే సంతానం కమిటీ సూచన ద్వారా దీనిని ఏర్పాటు చేశారు.
- 1998లో ఆర్టినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తూ బహుళ సభ్య కమిషన్‌గా మార్చారు.
- దీనికోసం 2003లో పార్లమెంట్ ఒక సమగ్ర చట్టాన్ని చేసింది.
- ఇందులో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు.
- వీరిని రాష్ట్రపతి 4 సంవత్సరాల కాల పరిమితికి నియమిస్తారు.
- వీరి పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
- రాష్ట్రపతికి వీరిని తొలగించే అధికారం ఉంది.
- మొట్టమొదటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్- నిట్టూరు శ్రీనివాసరావ్
- ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ చీఫ్ కమిషనర్- సీవీసీ సంజయ్ కొఠారి
లోక్‌పాల్- లోకాయుక్త వ్యవస్థ
- ఉన్నత స్థాయిలో అవినీతి ఆరోపణలపై విచారణ చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
- స్కాండినేవియా దేశాల్లో (స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే) ఈ వ్యవస్థను అంబుడ్స్‌మన్ అంటారు.
- లోకాయుక్తను మొట్టమొదట ఏర్పాటు చేసిన రాష్ట్రం – మహారాష్ట్ర (1971)
- కేంద్రంలో లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారిగా 1968లో దీనిని ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.
- లోక్‌పాల్ బిల్లు 2013ను పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం కేంద్రస్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్‌పాల్ ఏర్పాటవుతుంది.
- లోక్‌పాల్ ఏర్పాటైన సంవత్సరం లోగా రాష్ర్టాలు లోకాయుక్తను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది.
- లోక్‌పాల్ చైర్మన్‌తో పాటు గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న స్పీకర్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది.
- వీరి పదవీ కాలాన్ని బట్టి ఐదేళ్లు లేదా 75 ఏండ్ల వయస్సు వచ్చేవరకు కొనసాగుతారు.
- ప్రధానమంత్రి (కొన్ని పరిమితులకు లోబడి) కేంద్రమంత్రులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి.
- ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే.
- దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు.
- ప్రస్తుత లోక్‌పాల్- పినాకి చంద్రఘోష్
లోకాయుక్త వ్యవస్థ
- రాష్ట్రస్థాయిలో పాలనా యంత్రాంగం పనితీరు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం మొదలైన అంశాలను విచారణ చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
- ఉమ్మడి రాష్ట్రంలో 1983లో దీనిని ఏర్పాటు చేశారు.
- ఇందులో ఒక లోకాయుక్త, ఉప లోకాయుక్త ఉంటారు.
- వీరిని గవర్నర్ 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు.
- ప్రస్తుత లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు
ప్రణాళికా సంఘం
- ఇది రాజ్యాంగేతర, చట్టేతర సంస్థ. క్యాబినెట్ నిర్ణయం ద్వారా 1950 మార్చి 15న ఏర్పాటయ్యింది.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షునిగా ఉంటారు.
- కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు తాత్కాలిక సభ్యులుగా అలాగే 4 నుంచి 6 వరకు నిష్ణాతులైన వారు పూర్తికాల సభ్యులుగా ఉంటారు.
- దీనికి ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఇతడిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
- ప్రణాళికా సంఘం మొట్టమొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీ లాల్ నందా.
- ప్రస్తుతం దీని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు.
నీతి ఆయోగ్
- NITI -National Institution for Transforming India (జాతీయ పరివర్తన సంస్థ)
- దీనిని ‘విధాన రూపకల్పన సంఘం’ అని పిలుస్తారు. (నీతి-విధానం, ఆయోగ్- సంఘం)
- 1950 మార్చి 15న పేదరిక నిర్మూలన, నిరుద్యోగం, ఆదాయ అసమానతలను తగ్గించడం వంటి లక్ష్యాలతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన ప్రణాళికా సంఘం సఫలీకృతం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో లక్ష్యాలు సాధించలేదు.
- నీతి ఆయోగ్ రాజ్యాంగేతర (Extra Constitutional) శాసనేతర (Non-Stationary) సంస్థ.
- నీతి ఆయోగ్‌లో ఇమిడి ఉండే నినాదం- సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి)
- నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం: యోజన భవన్ (న్యూఢిల్లీ)
- నీతి ఆయోగ్ అధికారిక పత్రిక: యోజన
- నీతి ఆయోగ్‌ను రెండు ప్రధాన ఉద్దేశాలతో ఏర్పాటు చేశారు. అవి..
- Team India Hub (రాష్ర్టాలు కేంద్రంతో కలిసికట్టుగా పనిచేయడం)
- Knowledge and Innovation Hub (నీతి ఆయోగ్‌ను నూతన ఆలోచనల భాండాగారంగా నిర్మించడం)
ప్రత్యేక ఆహ్వానితులు
- నితిన్ గడ్కరీ (కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి)
- పీయూష్ గోయల్ (రైల్వే, వాణిజ్యం)
- థావర్‌చంద్ గెహ్లాట్ (సామాజిక న్యాయం, సాధికారత)
- రావ్ ఇంద్రజీత్ సింగ్ (స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ప్రణాళిక)
- ముఖ్య కార్యనిర్వాహక అధికారి- అమితాబ్ కాంత్ (2016 జనవరి నుంచి)
నీతి ఆయోగ్ పాలక మండలి (NAGC)
- నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులు
- ప్రధానమంత్రి (అధ్యక్షుడు )
- నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
- నీతి ఆయోగ్‌లోని పూర్తికాల సభ్యులు
- నీతి ఆయోగ్‌లోని పదవి రీత్యా సభ్యులు
- నీతి ఆయోగ్‌లోని ప్రత్యేక ఆహ్వానితులు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు
- శాసన సభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు
- అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్
- నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశాలను ‘టీమ్ ఇండియా’గా వ్యవహరిస్తారు.
నీతి ఆయోగ్ విధులు
- విధానాల రూపకల్పనలో రాష్ర్టాలు భాగస్వాములయ్యే విధంగా ఒక ‘సహకార సమాఖ్య’ (కో ఆపరేటివ్ ఫెడరలిజం)ను రూపొందించడం (భారత సమాఖ్యను గ్రాన్విల్లే ఆస్టిన్ సహకార సమాఖ్య’ అని పేర్కొన్నాడు)
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వైజ్ఞానిక, సాంకేతిక సలహాలను అందించే ‘మేధోకేంద్రం (Think Tank) (నూతన ఆలోచనల భాండాగారం)గా వ్యవహరించడం.
- గ్రామ స్థాయి ప్రణాళికలను ఉన్నత స్థాయి ప్రణాళికలతో అనుసంధానం చేయడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించడం.
- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న విషయాల్లో, విద్య, విధాన పరిశోధనా సంస్థలకు సూచనలు చేస్తుంది. అభివృద్ధి ఎజెండాలో భాగంగా వివిధ రంగాలు, వివిధ శాఖల మధ్య ఒక పరిష్కార వేదికగా
- నిలుస్తుంది.
ఆర్థికాభివృద్ధి ద్వారా లబ్ధి పొందలేని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.
ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించ డానికి వివిధ కార్యక్రమాలు, ప్రోత్సాహకాల అమలును పర్యవేక్షిస్తుంది. - 2015 మార్చి 16న ‘నీతి ఆయోగ్’ పేదరిక నిర్మూలన, వ్యవసాయ అభివృద్ధిపై 2 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. 2016 జూన్ 30న వ్యవసాయ బీమాపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
- పేదరిక నిర్మూలనపై టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్- నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
- వ్యవసాయ అభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్- నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
- వ్యవసాయ బీమాపై టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్- పీకే అగర్వాల్
- వ్యవసాయ బీమాపై టాస్క్‌ఫోర్స్ సెక్రటరీ- జేపీ మిశ్రా (నీతి ఆయోగ్ సలహాదారుడు)
- CCAFS- Climate Change, Agriculture Food Security)
- ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి ఒక నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది.
- ఈ ప్రాంతీయ మండళ్లకు ‘నీతి ఆయోగ్’ చైర్మన్ (ప్రధానమంత్రి) లేదా ఆయన నియమించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటారు.
జాతీయాభివృద్ధి మండలి
- ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ.
- 1952లో క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఏర్పాటు చేశారు.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
- ప్రణాళికా సంఘంలోని సభ్యులందరూ ఇందులో సభ్యులే.
- ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను ఆమోదిస్తుంది. అమలు తీరును పరిశీలించి ప్రాధాన్యతను మార్పు చేస్తుంది.
గమనిక: దీనిని ప్రస్తుతం రద్దు చేశారు.
జాతీయ సమైక్యత మండలి
- ఇది కూడా రాజ్యాంగేతర సంస్థే.
- 1961లో దీనిని ఏర్పాటు చేశారు.
- 2010లో పునర్వ్యవస్థీకరించారు.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
- దేశ ఐక్యత, సమగ్రతలకు సబంధించి ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.
జాతీయ భద్రతా మండలి
- 1998లో ఏర్పాటైంది.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
- జాతీయ రక్షణ కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్..
1. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరి రోజు?
1) 24-1-1950
2) 26-11-1949
3) 24-1-1951
4) 26-08-1948
2. ఎన్నికల అజమాయిషీ, సూచన, నియంత్రణ ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలని రాజ్యాంగంలోని ఏ అధికరణ సూచిస్తుంది?
1) 323 2) 324 3) 325 4) 334
3. భారత రాజ్యాంగ ప్రవేశికలో సమైక్యత అనే మాటలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1) 42 2) 43 3) 47 4) 44
4. కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలనే డిమాండ్ మొదటిసారిగా ఎప్పుడు చేశారు?
1) 1918 2) 1919 3) 1920 4) 1915
5. భారత రాజ్యాంగంలోని ఏ భాగం పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ప్రస్తావించింది?
1) XIV భాగం 2) XV భాగం
3) XVI భాగం 4) XVII భాగం
6. పార్లమెంట్ సమావేశాల మధ్య అనుమతించ దగ్గ అతి ఎక్కువకాల వ్యవధి ఎంత?
1) మూడు నెలలు 2) నాలుగు నెలలు
3) ఐదు నెలలు 4) ఆరు నెలలు
7. రాష్ట్ర ఆగంతుక నిధి (కంటిన్జెన్సీ) ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
1) ముఖ్యమంత్రి 2) గవర్నర్
3) ఆర్థికమంత్రి 4) హోంమంత్రి
8. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు?
1) నాలుగు 2) ఐదు 3) ఆరు 4) ఎనిమిది
9. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను విడదీశారు?
1) ప్రాథమిక హక్కులు 2) పీఠిక
3) మూడవ షెడ్యూల్
4) ఆదేశిక సూత్రాలు
10. భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్‌లో హిందీని రాజభాషగా పరిగణించారు?
1) ఆర్టికల్ 340 2) ఆర్టికల్ 343
3) ఆర్టికల్ 346 4) ఆర్టికల్ 351
11. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు చట్టం ద్వారా కొత్త రాష్ర్టాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది?
1) ఆర్టికల్ 3 2) ఆర్టికల్ 4
3) ఆర్టికల్ 5 4) ఆర్టికల్ 7
12. 1971లో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలిరాష్ట్రం ఏది?
1) ఒడిశా 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) కర్ణాటక
సమాధానాలు
1-1, 2-2, 3-1, 4-1, 5-1, 6-4, 7-2, 8-2, 9-4, 10-4, 11-1, 12-1.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






