The seeds of the Constitution in India | భారత్‌లో రాజ్యాంగ బీజాలు
-కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిథ్యం కల్పించారు. ఆరుగురు శాసనసభ్యుల్లోని నలుగురు సభ్యులను మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు. సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించేపద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందుకు 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నూతన పరీక్షావిధానాన్ని ప్రవేశపెట్టింది.
-వివిధ లా కమిషన్ల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)లను రూపొందించారు.
-కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట పేర్కొనకపోవడంతో కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి చార్టర్ చట్టం మార్గం సుగమం చేసింది. భారతీయులకు ప్రభుత్వంలో సరైన భాగస్వామ్యం కల్పించకపోవడంతో జరిగిన పరిణామాలు సిపాయిల తిరుగుబాటుకు దారితీశాయి.
-1773 నుంచి 1858 వరకు భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. 1858 నుంచి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడంతో ఆ తర్వాత చేసిన రాజ్యాంగ సంస్కరణలు భారతప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు.
IIIవ దశ- 1858-1909
-భారత ప్రభుత్వ చట్టం (1858): సిపాయిల తిరుగుబాటుతో దేశంలో కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది. ఇది రాజ్యాంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. 1858, నవంబర్ 1న బ్రిటిష్ రాణి భారత పరిపాలనాధికారాన్ని చేపడుతూ ఒక ప్రకటన జారీచేసింది. దీన్నే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు.
-గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ కానింగ్. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్గా వ్యవహరిస్తారు. వైస్రాయ్ దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి.
-భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. మొదటి కార్యదర్శి చార్లెస్ ఉడ్. అన్ని విషయాల్లో ఇతనిదే తుది నిర్ణయం. ఇతనికి సహాయంగా 15 మంది సభ్యులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి బిరుదు ధరించింది.
-1858 చట్టం దేశంలో పరిపాలనాపరమైన అంశాలను ముఖ్యంగా దేశంలో ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ఇగ్లండ్‌లో ఇందుకు సంబంధించిన మార్పులను చేశారే తప్ప దేశంలో ఉన్న పరిపాలనా వ్యవస్థలకు ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శకుల అభిప్రాయం.
-1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో అవసరమైన పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడానికి, భారతీయుల సహకారాన్ని తీసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించింది. వీటినే కౌన్సిల్ చట్టాలు అంటారు.
-1861 కౌన్సిల్ చట్టం- ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం కల్పించింది. 1862లో వైశ్రాయ్ లార్డ్ కానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశారు. బెనారస్ రాజు, పాటియాలా రాజు, సర్ దినకర్ రావు ఈ విధంగా నామినేట్ అయ్యారు. కానింగ్ ఫోర్ట్‌ఫోలియో (మంత్రిత్వ శాఖల కేటాయింపు) విధానాన్ని ప్రవేశపెట్టారు.
-1862లో వరుసగా కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో హైకోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత 4వ హైకోర్టును 1866లో అలహాబాద్‌లో ఏర్పాటు చేశారు. 1773 చట్టం ద్వారా రద్దయిన బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను పునరుద్ధరించడం ద్వారా వికేంద్రీకృత పాలనకు శ్రీకారం చుట్టారు.
-ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వైస్రాయ్, కౌన్సిళ్లను సంప్రదించకుండా 6 నెలల కాలానికి ఆర్డినెన్స్‌లను జారీచేసే అధికారం కల్పించింది.
-కౌన్సిల్ చట్టం 1892- 1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టం చేశారు. ముఖ్యంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటం, విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సందర్భంలో ఈ చట్టాన్ని రూపొందించారు.
-ఈ చట్టం మొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను ఎన్నుకొనే విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా 16కు మించకుండా ఉండే విధంగా, అదే విధంగా రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
-లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార విస్తృతపరిచి వైస్రాయ్ భారతీయులకు గవర్నర్ల కౌన్సిల్లో స్థానం కల్పించారు. 1) సురేంద్రనాథ్ బైనర్జీ 2) గోపాలకృష్ణ గోఖలే 3) దాదాభాయి నౌరోజీ 4) ఫిరోజ్‌షా మెహతా 5) రాస్బిహారీ ఘోష్ 6) బిల్‌గ్రామీ కౌన్సిల్లో ప్రాతినిథ్యం పొందారు. బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన మొదటి భారతీయుడు దాదాభాయి నౌరోజీ (1892).
IVవ దశ- 1909-35
-ఆనాటి భారతరాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, భారత వైశ్రాయ్ మింటో పేర్లతో ఈ చట్టాన్ని సూచించారు. దీంతో దీన్ని మింటో-మార్లే సంస్కరణల చట్టం అంటారు.
-మింటో-మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశం 1892 చట్టంలోని దోషాలను పరిష్కరించడం, అలాగే దేశంలో తీవ్రవాద జాతీయవాదంతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడం, కాంగ్రెస్‌లోని మితవాదులను మచ్చిక చేసుకోడానికి బ్రిటిష్‌వారు ఈ చట్టం ద్వారా ప్రయత్నించారు.
-గవర్నర్ జనరల్ శాసనమండలిలో 4 రకాల సభ్యులుంటారు. వారు.. 1) నామినేటెడ్ అధికార సభ్యులు 2) సభ్యులు అధికార సభ్యులు కావడంతో బిల్లులు ఆమోదించడం ప్రభుత్వానికి సులభమయ్యేది. వైస్రాయ్, గవర్నర్ల కార్యనిర్వహణ మండలిలో మొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. ఈ విధంగా సభ్యత్వాన్ని పొందిన భారతీయుడు సత్యేంద్రప్రసాద్ సిన్హా.
-ముస్లింలు, వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ముస్లింలకు వారి జనాభాకు మించిన ప్రాధాన్యం ఈ చట్టం కల్పించింది. ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునే వీలు కల్పించారు. ఇందుకు ప్రత్యేక మత నియోజక గణాలు ఏర్పాటు చేశారు. దీంతో లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడిగా పిలుస్తారు.
-కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీచేసే అభ్యర్థులకు కచ్చితమైన అర్హతలను ఈ చట్టం నిర్ణయించింది. అంతేకాకుండా మతప్రాదికన భారత్, పాకిస్థాన్‌లుగా విడిపోవడానికి ఈ చట్టమే పునాది .
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు