Endicol inscriptions | ఎండికోలు శాసనాలు
చరిత్రను శోధిస్తే గొప్ప చారిత్రక సంపద మన తెలంగాణది. పౌరాణికపరంగా, చరిత్రపరంగా మెదక్జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అందోల్ తాలూఖాలోని వెండికోలు గ్రామం చరిత్రలో చెప్పుకోదగినది. శాతవాహనుల కాలంలోనే కుండినాపురం, కొండాపురం (కుండలీపురం) వలె వెండికోలు సైతం పట్టణంగా విలసిల్లినది. ఇక్కడ ప్రాచీన శాసనాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖవారు 3, 4 శాసనాలను ముద్రించినారు. అయితే చరిత్రపరంగా ప్రాచీన శివాలయం (సిద్దేశ్వరాలయం) ఇక్కడ ఉన్నది. స్వయంభూః అని చరిత్ర సాక్ష్యం. ఈ ప్రాంతంలో విష్ణుకుండిన రాజులు, కళ్యాణి చాళుక్య రాజులు వేసిన శిలాశాసనాలు ఉన్నాయి. పౌరాణికపరంగా సుదర్శన దీక్షితులవారు కూడా దర్శించినారని చరిత్ర. 1. వెండికోలు, 2. కంకోలు, 3. రంజోలు, 4. యాజోలు ఇలా దాదాపు 16 (షోడశ) నామాలు కలిగిన గ్రామాలు కూడా ఉన్నట్లు చరిత్ర. ఇక్కడి వెండికోలు నందు మరో ప్రాచీన త్రికూటాలయం కూడా ఉన్నది. కన్నడ, తెలుగు, సంస్కృత శిలాశాసనాలు, ఒక తాళపత్ర గ్రంథము ఉన్నాయి. ఇక్కడి దాన శాసనాల్లో దేవాలయ మాణ్యం వసుంధరాం (భూమి) దానంగా ఇచ్చినట్టు చరిత్ర తెలుపుతున్నది. ఒకప్పుడు ఇక్కడ సంస్కృత పండితుల కుటుంబాలు ఉన్నట్టు చరిత్ర. కాలక్రమేణ ఆ కుటుంబాలు వలస వెళ్లినాయి. 879 శకనామ సంవత్సర ప్రభవ విశాఖ-సోమవారం 15 ఏప్రిల్ 967 ఏడీ శాసనం మన కన్నులకు స్పష్టంగా కనబడుతున్నది. పూర్తి శాసనచరిత్ర విపులంగా త్వరలో రానున్నది. విగ్రహాలు, కాలభైరవ స్థూపం అక్కడి దేవాలయ ప్రాచీన గోడలలో నిక్షిప్తమై ఉన్నాయి.
1వ శాసనం
1. స్వస్తి శకనృప కాళాతీత సంవత్సర గళెణ్డు
2. ….నెయప్రభవ సంవత్సర ప్రవత్తి
3. సెత ద్వరి షా భ్యన్తరద వైశాఖ సుద్ధత
4. దిగె సుక్ర వార దొళు కాసుగుళ
5. బిజ్జ రస రెణ్డి కొలద ఆదిత్య దేవగ్గె ఫడు
6. వాళ బిబ్బయ్య ఆయ్చణ గావుణ్డ రేవణ
7. గావుణ్డం బంక రేవణ గావుణ్డ బ్రభుం—–
8. బిబ్బయ్య ఇంతి అయ్వరుం ప్రాత్థి సిదె —–
9. దిం— ఆదిత్య దేవగ్గె బిజ్జయర
10. స కొట్ట కరియ కెయ్నేల మ
11. త్త పన్నెరడు అదక్కె సిద్ధాయ ధర
12. ణిం కెయ్నూదొళ్—- బణ్డ్రి య భతి
13. ర రి ళ్ద బణరసి ప్రయాగె
2వ శాసనం
1. స్వస్తి సమస్త భువనాశ్రయ శ్రీ
2. ప్రిథ్వీ వల్లభ మహారాజాధి రాజ ప
3. రమేశ్వర పరమభట్టారక సత్యాశ్రయ
4. కుళతిళక న(0) కళ క చరితశ్రీమ
5. ది తివ బెడె(0) గె దేవర రావుల కొ
6. ళె బిడిననోళ్ రాజ్యం గెయ్యుత్తిరె స్వ
7. స్తి సమధిగత ప(0) – మహా శ
8. బ్ద మహాసామస్త నభినవ కణ్న
9. నహతన వజ్ర సుభట రాది
10. త్యం శ్రీమత్ గ(0) గయ్య రసర్
11. శకవష 3…….. నె(య) పరాభవ
12. సంవత్సరద ఆశ్వయుజ శు
13. ద్ధ బిదిగె బృహస్పతి వార
14. దందు థుళాసంక్రాన్తి యోళ్ చె
15. ళ్వ ఱేల తీత్థ ధీ రామేశ్వర
16. దేవర వున్దె సోమ జినాల
రెండో వైపు
17. య దోళ్ శ్రీ బాళ చన్ద్ర
18. పణ్డిత భట్టక్కె వి
19. న కాల(0) కఱ్చి ధా
20. రా పూవ్వక సోమ
21. య్య రసగె ధమ్మ
22. భి వృద్ధి యాగె వె
23. ణ్డ కొళద ఎళవ
24. లళకెయ్య యోళ్
25. ద్ధ మ కొట్టర్ సామ
26. న్యోయం ధమ్మ సేతు
27. నృపాణాం కాళేకాళే
28. పాళనీయో భవద్భి
29. సవ్వా నేతాన్భావి నత్పా
30. త్ధి వేన్ద్రా న్భూ యో భూ
31. యో యాచతే రామ
32. చంద్ర
3వ శాసనం
1. స్వస్తి సమస్త భువవాశ్రయ శ్రీ
2. పృత్వీ వల్లభమహారాజాధిరాజప
3. (ర)మేశ్వర పరమ భట్టారక సత్యాశ్రయ
4. కుళ తిళక వకళంక చరితశ్రీమ
5. దిఱివ బెడెంగె దేవరరావుళ కొ(ళె)
6. నె(లి) వీడినోళ్ రాజ్యం గెయ్యుత్తిరె స్వ
7. స్తి సమధి గత పఞ్చ మహాశ
8. బ్ద మహాసామన్త నభినవ కణ్న
9. నహితన వజ్ర సుభటరాది
10. త్యశ్రీమత్ గ(0) గయ్యరసర్
11. శకవష….. 3…… నె(య) పరాభవ
12. సంవత్సరద ఆశ్వయుజ శు
13. ద్ధ బిదెగె బృ హస్పతివార
14. దందు తుళాసంక్రాన్తి యోళ్ వె
15. లూఱెల తీత్ధద రామేశ్వర
16. దేవర వుణ్డె సోమజినాల
17. యద విమళ చన్ద్ర
18. పణ్డిత బట్టా(ర)క
19. రకాలం కఱ్చి ధా
20. రా పూవ్వకం సోమ
21. య్యరసంగె ధమా ()
22. భివృద్ధి యాగె ఎ
23. ణ్డికోళద ఎళెవ
24. లద కెయ్యల అ
25. ద్ధ మ కోట్టర్ సామా
26. న్యోయం ధమ్మ సేతూ
27. నృపాళం కాళే కాళే
28. పాళనీయో భవద్భిః
29. సవ్వానేతా న్భావిన ఱ్పా
30. త్ధివేన్ద్రా న్భూ యోభూ
31. యో యాచతే రామ
32. చంద్ర
4వ శాసనం
1. స్వస్తి సమస్త భువ
2. నాశ్రయ శ్రీ పృధ్వీవ
3. ల్లభ మహా రాజాధి
4. రాజ పరమేశ్వర
5. పరమ భట్టారకం
6. సత్యాశ్రయ కుళ
7. తిళక నకళంక
8. చరిత శ్రీమది
9. ఱివ బెడెంగ దే
10. వర సుఖ సన్త
11. థా వినోదది రాజ్యం
12. గెయ్యుత్తిరెడి బై
13. నూఱ ఇప్ప త్తోంబ
14. త్త నెయ ప్లవంగ
15. సంవచ్చరద మా
16. ఘ మాసద సుద్ధ
17. పక్షద పఞ్చ
18. మియు బృ(హ)సృతి
19. వారం కోలాణ్డి
20. నక్షత్ర దన్దు ఎ
21. ణ్డి కోళద
రెండోవైపు
22. నామయ్య సెట్టియ
23. బసదిగె నారాయ
24. ణ్నను అతన పె
25. ణ్ణతి ఇరుగల్లె
26. యు అరసరపు
27. రవరి యోళగె
28. నూఱ ఇప్పత్తు
29. …. మత్తకెయ్య
30. బన్దమతి కన్ది
31. యర కాలం కచ్చి
32. కోట్ట సామాన్యూ
33. యం ధమ్మ సేతు
34. నృపాణాం కాళే
మూడోవైపు
35. కాళే పాళనీయో
36. భవద్భిః సవ్వా నే
37. తాన్భవిన ఱ్పా
38. త్తి వేన్ద్రా న్భూయో
39. భూయో యాచ
40. తె రామభద్రః
5వ శాసనం
1. స్వస్తి సమస్త (భు)
2. వ నాశ్రయశ్రీ
3. ప్రి ధ్వీ వల్లభ మ
4. హ రాజాధి రాజ
5. పరమేశ్వర పర
6. మ భట్టారక (0) సత్యా
7. శ్రయ కుళతి (ళ)
8. క నకళంక చ
9. రిత శ్రీమది
10. ఱివ బెతుంగ దే
11. వర రావుళ కొ
12. ళ బిడినూళ్ స
13. నగెయ్దు రాజ్యం
14. గెయ్యుత్తి రె
15. స్వస్తి సమధిగత
16. పంచ మహాశబ్ద
17. మహా సామన్త (మ)
18. హో మణ్డ (ళి)క(సు)భ(ట)
19. వైరి నారాయణ (0)
20. పతి హితా చరిత – – – –
21. గో మాళవ థూ
రెండోవైపు
22. మకేత శ్రీమతు బిజ్జ
23. య్య సరసర్ శక వ
24. ష నెయ పరాభవ
25. సంవత్సరద పుష్యమా
26. సద సుద్ధ బిదిగెయు మ(ం)
27. గాళవార నుత్తరాయణ
28. ద సంక్రాన్తి యోళెణ్డి కొళ
29. ద మన్నెరస గెయ్యళుగె
30. సోమ జినాలయక్కె వి
31. మళ చన్ద్ర ఫణ్డతర
32. కాలం కఱ్చి రాజమాన
33. మత్తం గెయ్య ధారా పూర్వ
34. కం కొట్టర్ ……
మూడో వైపు
35. ——–
36. సామాన్యోయ ధ
37. మ్మ సేతు న్నృ పాణా(0)
38. కాళే కాళే పాళ
39. నీయో భవద్భిః
40. సవ్వా నేతాన్భా
41. విన ఱ్పాత్థి వేం
42. ద్రా న్భూయో భూ
43. యో యాచతే
44. రామ చంద్ర
ముత్తాయి కోట శాసనం
-ముత్తాయి కోట సిద్దేశ్వరాలయానికి కొంత భూమిని (మాణ్యాన్ని) సుగుణమ్మ అనే భక్తురాలు దానంగా ఇచ్చిన చిన్న శిలాశాసనం. స్వస్తిశ్రీ హేవలంభి నామసం॥ (18వ శతాబ్దం)లో సుగుణమ్మ అనే భక్తురాలు శంకరంపేట నందు ఈ దేవాలయం సముదాయానికి కొంత వసుంధరాంను (భూమిని సర్వే నం 332తో) ఇచ్చినట్టుగా దాన శాసనం తెలుపుతున్నది. భూమిలో పండే ధాన్యాన్ని పూజారులు (సిద్దేశ్వరునికు ప్రతిరోజు ధూప, దీప, నైవేద్యాలను సమర్పిస్తూ) శాశ్వతంగా అనుభవించాల్సిందిగా ఈ శాసనం తెలియజేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు