National Flood Control Act | జాతీయ వరద నియంత్రణ చట్టం?
1. కిందివాటిలో దేని ఉపరితలంపై ఎత్తు పల్లాలను
గుర్తించారు?
ఎ) గ్రహం బి) నక్షత్రం
సి) సముద్రం డి) నక్షత్ర అంతర్భాగం
2. కిందివాటిలో అనేక పటాలు ఉంటాయి?
ఎ) అట్లాస్ బి) మ్యాప్ పుస్తకం
సి) పాఠ్య పుస్తకం డి) నోట్బుక్
3. కొలంబస్ ఏ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కనుగొన్నాడు?
ఎ) తూర్పు వైపు బి) దక్షిణం వైపు
సి) పడమటి వైపు డి) ఉత్తరం వైపు
4. బాబిలోనియన్లు, సుమేరియన్లు ప్రస్తుత ఏ ప్రాంతానికి చెందినవారు?
ఎ) ఇరాన్ బి) ఇరాక్ సి) రష్యా డి) అమెరికా
5. సర్వే ఆఫ్ ఇండియా స్థాపించినవారు?
ఎ) డచ్వారు బి) ఫ్రెంచ్వారు
సి) బ్రిటిష్వారు డి) పోలెండ్వారు
6. పోర్చుగీస్ అన్వేషకుల పేర్లు కానిదేది?
ఎ) మాజిలాన్ బి) వాస్కోడిగామా
సి) బార్త్లోక్ మ్యూడియస్ డి) పైవన్నీ
7. రాష్ట్రంలో నల్లరేగడి నేలలు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి?
ఎ) మెదక్ బి) రంగారెడ్డి
సి) ఆదిలాబాద్ డి) నిజామాబాద్
8. రాష్ట్రంలో ఎక్కువ ఉన్న నేలలు?
ఎ) ఒండ్రు నేలలు బి) నల్ల నేలలు
సి) లెటరైట్ డి) ఎర్ర నేలలు
9. భూ మధ్యరేఖ వద్ద ఉండే అడవులు?
ఎ) సమశీతోష్ణ అడవులు బి) ఉష్ణమండల అడవులు
సి) శీతోష్ణ అడవులు డి) ఉప శీతోష్ణ అడవులు
10. రాష్ట్రంలో 100 సెం.మీ కన్నా ఎక్కువ వర్షం పొందని జిల్లా?
ఎ) కరీంనగర్ బి) నల్లగొండ
సి) వరంగల్ డి) ఆదిలాబాద్
11. ఆగస్టు నెలలో గరిష్ట, కనిష్ట సగటు ఉష్ణోగ్రతల్లో
తేడా ఎంత?
ఎ) 100c బి) 90c సి) 80c డి) 70c
12. హైదరాబాద్ ఏ నెలలో గరిష్ట ఉష్ణోగ్రత 390c ఉంటుంది?
ఎ) ఏప్రిల్ బి) మే సి) జూన్ డి) ఏదీకాదు
13. హైదరాబాద్ గుండా 170c ఉత్తర అక్షాంశం పోతుంది. జనవరిలో ఉష్ణోగ్రత ఎంత?
ఎ) 220c-240c మధ్య బి) 200c-22.50c మధ్య
సి) 190-220c మధ్య డి) 210-23.50c మధ్య
14. సౌరశక్తి ఏయే రూపాల్లో ఉంటుంది?
ఎ) కాంతి బి) వేడి
సి) అల్ట్రావయొలెట్ తరంగాలు డి) పైవన్నీ
15. వోస్టోక్ కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) ఆస్ట్రేలియా బి) ఆర్కిటిక్
సి) అంటార్కిటికా డి) అమెరికా
16. కిందివాటిలో వేడెక్కటానికి, చల్లబడటానికి ఎక్కువ సమయం తీసుకునేవి?
ఎ) భూమి బి) సముద్రాలు సి) కొండలు డి) లోయలు
17. ఇండోనేషియా ఏ ప్రాంతంలో ఉంది?
ఎ) ఆర్కిటిక్ బి) అంటార్కిటికా
సి) సమశీతోష్ణ డి) భూమధ్యరేఖ
18. కింది ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఎత్తును
అనుసరించి తగ్గేది?
ఎ) ఉష్ణోగ్రత బి) సూర్య
సి) సూర్యవికిరణం డి) పరివర్తనం
19. చాంబర్లీన్-మౌల్టన్ సిద్ధాంతం దేని పుట్టుక గురించి తెలుపుతుంది?
ఎ) నక్షత్రాలు బి) భూమి
సి) నదులు డి) సౌర కుటుంబం
20. భూమి నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగపడేది?
ఎ) భూకంప తరంగాలు బి) x-తరంగాలు
సి) గామా కిరణాలు డి) అతిధ్వనులు
21. భూమిలోకి వెళ్లేకొద్దీ ఎన్ని మీటర్లకు 10c ఉష్ణోగ్రత
పెరుగుతుంది?
ఎ) 24 మీ బి) 20 మీ సి) 32 మీ డి) 35 మీ
22. ఒకదేశ ప్రామాణిక కాలం దేని ఆధారంగా గుర్తిస్తారు?
ఎ) భూమధ్యరేఖ బి) కర్కటరేఖ
సి) ఆ దేశం మధ్యగా వెళ్లే అక్షాంశం
డి) ఆ దేశం మధ్యగా వెళ్లే రేఖాంశం
23. స్పటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెందటం వల్ల ఏర్పడినవి?
ఎ) లాటరైట్ నేలలు బి) ఎర్ర నేలలు
సి) జెర్నోజం నేలలు డి) పర్వత నేలలు
24. రవాణా అయిన పదార్థాల వల్ల ఏర్పడినవి?
ఎ) కోత మైదానాలు బి) తీర మైదానాలు
సి) నిక్షేపిత మైదానాలు డి) శిలా మైదానాలు
25. ముడత పర్వతాలు ఏర్పడటానికి కారణం?
ఎ) సంపీడన బలాలు బి) విరూపాకారక చర్యలు
సి) లావా ప్రవాహం డి) ఏదీకాదు
26. వాతావరణంలోని కిందిపొరలు దేనివల్ల వేడెక్కుతాయి?
ఎ) భూవికిరణం బి) సౌర వికిరణం
సి) పారదర్శకత డి) సూక్ష్మదర్శకత
27. భూమి వైపు నిరంతరం ప్రసరించే శక్తిని ఏమంటారు?
ఎ) సూర్యపుటం బి) సౌరవికిరణం
సి) సూర్యకాంతి డి) సూర్యరశ్మి
28. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని ఏమంటారు?
ఎ) ఉష్ణోగ్రతా క్షీణతాక్రమం బి) ఉష్ణోగ్రతా విలోమనం సి) ఉష్ణోగ్రతా అనుపాతం డి) ఏదీకాదు
29. పశ్చిమ పవనాల విషయంలో కిందివాటిలో సరైనవి?
ఎ) ఉప అయన ప్రాంతాల నుంచి భూమధ్య రేఖపైకి వీస్తాయి
బి) ఉపధృవ ప్రాంతాల నుంచి అయన రేఖా ప్రాంతాలకు వీస్తాయి
సి) ఉప అయన ప్రాంతాల నుంచి ఉపధృవ ప్రాంతాలకు వీస్తాయి డి) ఏదీకాదు
30. కిందివాటిలో సరి కానిదేది?
ఎ) భూమధ్య రేఖా ప్రాంతంలో వర్షపాతం 200 సెం.మీ వరకు ఉంటుంది
బి) 600 అక్షాంశాల వద్ద వర్షపాతం 25 సెంటీమీటర్లుగా ఉంటుంది
సి) ధృవాల వైపుపోయే కొద్ది వర్షపాతం తగ్గుతుంది
డి) పైవన్నీ సరైనవే
31. అతి తక్కువ లోతు కలిగిన సముద్ర భాగం?
ఎ) ఖండతీరపు అంచు బి) ఖండతరపు వాలు
సి) అగాథ మైదానం డి) సముద్ర ఉపరితలం
32. పౌర్ణమి, అమావాస్యలలో ఏర్పడే తరంగాలను ఏమంటారు?
ఎ) లఘువేలా తరంగాలు బి) ప్రాథమిక తరంగాలు
సి) పర్వవేలా తరంగాలు డి) ద్వితీయ తరంగాలు
33. ప్రపంచంలో ఎక్కువ లవణీయత గల ప్రాంతం?
ఎ) బాల్టిక్ సముద్రం బి) మృతసముద్రం
సి) ఎర్ర సముద్రం డి) పసిఫిక్ సముద్రం
34. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత?
ఎ) 50c నుంచి 150c బి) 20c 290c
సి) 30c నుంచి 300సి డి) -20సి నుంచి 290c
35. సాధారణ లవణీయత అంటే ఎంత శాతం లవణాలు ఉండాలి?
ఎ) 25 శాతం బి) 35 శాతం
సి) 50 శాతం డి) 30 శాతం
36. నైరుతి రుతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పొందే ప్రాంతం?
ఎ) రాయలసీమ బి) కోస్తా
సి) తమిళనాడు డి) తెలంగాణ
37. మాల్వా పీఠభూమికి వాయవ్యంగా గల పర్వతాలు?
ఎ) వింద్య బి) ఆరావళి
సి) పంచ్మర్హి డి) సాత్పూరా
38. మధ్యప్రదేశ్లోని మూల్టాయి వద్ద జన్మించినది?
ఎ) తపతి బి) నర్మద
సి) సబర్మతి డి) మహి
39. కిందివాటిలో ఉపశుష్క శీతోష్ణస్థితి గల ప్రాంతం?
ఎ) పశ్చిమ కనుమలు బి) పంజాబ్, హర్యానా
సి) ఈశాన్య భారత్ డి) ఒడిశా
40. జాతీయ వరద నియంత్రణ చట్టం?
ఎ) 1987 బి) 1952 సి) 1960 డి) 1954
41. దేశంలో ఆర్థికంగా ప్రాముఖ్యం గల అడవులు?
ఎ) సతతహరిత అరణ్యాలు
బి) ఉష్ణమండల శుష్క అరణ్యాలు
సి) ఉష్ణమండల తేమ ఆకురాల్చే అరణ్యాలు
డి) మడ అడవులు
42. సుందరవనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) తమినాళడు బి) పశ్చిమ బెంగాల్
సి) కేరళ డి) తెలంగాణ
43. అడవుల విస్తీర్ణం ఎక్కువ గల జిల్లా?
ఎ) హైదరాబాద్ బి) కామారెడ్డి
సి) భూపాలపల్లి డి) రంగారెడ్డి
44. ప్రీకార్బొనేట్స్ లోపించిన నేలలు?
ఎ) నల్లరేగడి బి) ఒండ్రు నేలలు
సి) ఎర్ర నేలలు డి) ఎడారి నేలలు
45. అనార్థ్ర వ్యవసాయానికి అనువైన మృత్తికలు?
ఎ) లాటరైట్ బి) ఎర్ర మృత్తికలు
సి) ఒండ్రు మృత్తికలు డి) నల్లరేగడి మృత్తికలు
46. దేశంలో ఎక్కువగా విస్తరించిన నేలలు?
ఎ) నల్లరేగడి నేలలు బి) ఎర్ర నేలలు
సి) లాటరైట్ నేలలు డి) ఒండ్రు నేలలు
47. హిందుస్థాన్ ఫొటోఫిల్మ్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) సిమ్లా బి) మౌంట్అబూ
సి) వారణాసి డి) ఊటీ
48. గ్రామీణ జనాభా అధికంగా గల రాష్ట్రం?
ఎ) రాజస్థాన్ బి) మహారాష్ట్ర
సి) మధ్యప్రదేశ్ డి) హిమాచల్ప్రదేశ్
49. నైవేలి లిగ్నైట్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) కేరళ బి) తమినాళడు సి) తెలంగాణ డి) జోహర్
50. ఆర్కియన్ శిలల్లో దొరికే ఖనిజం?
ఎ) మాంగనీసు బి) ఇనుము
సి) బాక్సైట్ డి) రాగి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు