ఫాక్లాండ్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి?
1. కింది వాటిని జతపర్చండి.
1. ట్రోపో ఆవరణం ఎ. జీవక్రియలు జరుగుతాయి
2. స్ట్రాటో ఆవరణం బి. ఓజోన్ పొర కేంద్రీకృతమై ఉంటుంది
3. మీసో ఆవరణం సి. ఉల్కాపాతాలు సంభవిస్తాయి
4. ఐనో ఆవరణం డి. రేడియో, దూరదర్శన్ తరంగాల పరావర్తనం
5. ఎక్సో ఆవరణం ఇ. కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఆవరణం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
4) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి
2. కింది వాటిని జతపర్చండి.
1. పశ్చిమ పసిఫిక్ తీరం ఎ. హరికేన్లు
2. మెక్సికో సింధుశాఖ బి. టైపూన్లు
3. హిందూ మహాసముద్రం సి. విల్లీవిల్లీలు
4. దక్షిణ ఆస్ట్రేలియా డి. సైక్లోన్లు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-ఎ
3. కింది ప్రాంతాలు, వర్షారంభపు జల్లుల పేర్లను జతపర్చండి.
1. ఉత్తరప్రదేశ్ ఎ. కాలాబైశాఖీలు
2. పశ్చిమబెంగాల్ బి. అంథీలు
3. అసోం సి. మ్యాంగో షవర్స్
4. కేరళ డి. నార్వెస్టర్స్
5. కర్ణాటక ఇ. చెర్రీబ్లాసమ్స్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4- డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
4) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి
4. కింది మాతృశిల, రూపాంతర శిలను జతపర్చండి.
1. గ్రానైట్ ఎ. పాలరాయి
2. ఇసుకరాయి బి. నీస్
3. సున్నపురాయి సి. గ్రాఫైట్
4. షేల్ డి. క్వార్ట్
5. నేల బొగ్గు ఇ. పలకరాయి
1) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5- సి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి
5. భారత్‌కు ఇంచుమించు మధ్యగా పోతున్న ప్రధాన అక్షాంశమైన కర్కటరేఖ కింది ఏ రాష్ట్రం గుండా వెళ్లడం లేదు?
1) బీహార్ 2) మిజోరం 3) త్రిపుర 4) ఛత్తీస్‌గఢ్
6. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1) అక్షాంశాలను ఉపయోగించి భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల శీతోష్ణస్థితులను గుర్తించవచ్చు
2) రేఖాంశాలను ఉపయోగించి భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల్లోని సమయాన్ని తెలుసుకోవచ్చు
3) భూమిపై అక్షాంశాలు, రేఖాంశాలు ఒక దానితో ఒకటి లంబకోణంలో ఖండించుకోవడం వల్ల ఏర్పడే గ్రిడ్ ఆధారంగా వివిధ ఖండాలు, దేశాలు, రాష్ర్టాల ఉనికిని తెలుసుకోలేం
4) పైవన్నీ సరైనవే
7. కింది వాటిలో భూభ్రమణం ఫలితం కానిది?
1) పగలు, రాత్రులు ఏర్పడుతాయి
2) పోటు, పాటులు ఏర్పడుతాయి
3) పవనాలు, సముద్ర ప్రవాహాల దిశలో మార్పులు సంభవిస్తాయి
4) రాత్రి, పగలు సమయాల్లో తేడాలు ఏర్పడుతాయి
8. కింది వాటిని జతపర్చండి.
1. పరిహేళి ఎ. జనవరి 3
2. అపహేళి బి. జూలై 4
3. విషవత్తులు సి. మార్చి 21, సెప్టెంబర్ 23
4. ఉత్తరాయణాంతం డి. జూన్ 21
5. దక్షిణాయణాంతం ఇ. డిసెంబర్ 22
1. 1-ఎ, 2-బి, 3- సి, 4- డి, 5-ఇ
2. 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి
3. 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
4. 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి
9. కింది ఖండాలు, ఎత్తయిన పర్వత శిఖరాలను జతపర్చండి.
1. అంటార్కిటికా ఎ. కోషియాస్కో
2. ఐరోపా బి. మెకిన్లీ
3. దక్షిణ అమెరికా సి. అకన్కాగువా
4. ఉత్తర అమెరికా డి. ఎల్‌బ్రజ్
5. ఆస్ట్రేలియా ఇ. విన్సస్ మాసిఫ్
1) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి
2) 1-ఇ, 2-డి, 3-బి, 4-సి, 5-ఎ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
4) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఇ, 5-డి
10. కింది వాటిని జతపర్చండి.
1. పసిఫిక్ మహాసముద్రం ఎ. లవణీయత అధికంగా ఉన్న సముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం బి. అత్యధిక సంఖ్యలో దీవులు ఉన్న సముద్రం
3. హిందూ మహాసముద్రం సి. నాలుగో అతిపెద్ద సముద్రం
4. అంటార్కిటికా మహాసముద్రం డి. లోతైన అగాథం (సుందా ట్రెంచ్)
5. ఆర్కిటిక్ మహాసముద్రం ఇ. లవణీయత తక్కువగా ఉన్న మహాసముద్రం
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
11. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి.
1) పోటుపాటుల వల్ల ఓడరేవుల్లోకి నీరు ప్రవహించి ఓడల రాకపోకలు తేలికవుతాయి
2) నదీ ముఖద్వారాల్లో పోటుపాటులవల్ల ఇసుక మేట వేయదు
3) పోటుపాటుల వల్ల బ్యాక్ వాటర్స్, లాగూన్లు, కయ్యలు ఏర్పడుతాయి
4) పైవన్నీ సరైనవే
12. కింది ప్రాంతాలు, తెగలను జతపర్చండి.
1. అండమాన్ ఎ. వెడ్డాలు
2. శ్రీలంక బి. పపువా
3. బోర్నియా సి. కాబూలు
4. న్యూగినియా డి. దయకా
5. సుమత్రా ఇ. సెంట్నెలీలు
1) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5- సి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి
13. కింది వాటిని జతపర్చండి.
1. భూమధ్య రేఖా మండలం ఎ. పొగ మంచు ఏర్పడదు
2. ఉష్ణమండల ఎడారులు బి. ఉష్ణోగ్రత వ్యత్యాసం అత్యధికం
3. ఉష్ణమండల గడ్డి భూములు సి. శీతాకాలంలో వర్షం,వేసవిలో పొడి వాతావరణం
4. మధ్యదరా మండలం డి. రుతువులు ఏర్పడవు
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
14. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి.
1) ఎడారుల్లో ఏర్పడే తాత్కాలిక వాగులు- వాడీలు
2) ఎడారుల్లో ఏర్పడే తాత్కాలిక సరస్సులు- ప్లయాలు
3) ఎడారుల్లో ప్రవహించే నదులు- ఎక్సోటిక్
4) పైవన్నీ సరైనవే
15. ఆసియాలో ప్రఖ్యాతిగాంచిన ఒక సరస్సు ఉత్తర తీరం అత్యధిక విలువైన రాగి నిధులతో సమృద్ధిగా ఉంది. ఆ సరస్సు C ఆకారంలో కనిపిస్తున్నది. అది ఏది?
1) కజకిస్తాన్‌లోని బల్కాష్ సరస్సు
2) రష్యాలోని బైకాల్ సరస్సు
3) కంబోడియాలోని టోన్లి సప్ సరస్సు
4) ఇరాన్‌లోని యురేమియా సరస్సు
16. కున్లున్ పర్వతాలు, ఆలిన్తగ్ మధ్య ప్రాంతాన్ని ఏమంటారు?
1) మంగోలియన్ పీఠభూమి
2) జుంగేరియన్ హరివాణం
3) త్పైదమ్ హరివాణం
4) టారిమ్ హరివాణం
17. ఫాక్లాండ్ దీవులు ఏ సముద్రంలోని ద్వీప సమూహంలో ఉన్నాయి?
1) దక్షిణ పసిఫిక్ సముద్రం
2) ఉత్తర పసిఫిక్ సముద్రం
3) దక్షిణ అట్లాంటిక్ సముద్రం
4) ఉత్తర అట్లాంటిక్ సముద్రం
18. కింది దేశాల్లో భారత ఉపఖండంలో భాగంకానిది?
1) మాల్దీవులు 2) భూటాన్
3) శ్రీలంక 4) మయన్మార్
19. భారత భూభాగీయ సముద్రం వరకు వ్యాపించి ఉన్నది?
1) 12 నాటికల్ మైళ్లు 2) 6 నాటికల్ మైళ్లు
3) 15 నాటికల్ మైళ్లు 4) 10 నాటికల్ మైళ్లు
20. పాట్కాయ్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి?
1) భారత్ నేపాల్ సరిహద్దుల్లో
2) భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో
3) భారత్ మయన్మార్ సరిహద్దుల్లో
4) భారత్- బంగ్లాదేశ్- మయన్మార్ సరిహద్దుల్లో
21. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం?
1) దొడబెట్ట 2) అనైముడి
3) మహాబలేశ్వర్ 4) పచ్మర్హి
22. భారతదేశంపై ఎల్‌నినో సాధారణంగా వర్షాభావానికి కారమవుతున్నది. మరి వర్షపాతాన్ని తెచ్చేది కింది వాటిలో ఏది?
1) దక్షిణ డోలనం
2) భూమధ్యరేఖా హిందూ మహాసముద్ర డోలనం
3) లానినో
4) హిందూ మహాసముద్ర డైపోల్
23. అత్యధిక నీటిపారుదల భూమి గల రాష్ట్రం?
1) హర్యానా 2) పంజాబ్
3) ఉత్తరప్రదేశ్ 4) తెలంగాణ
24. ట్యూడర్ వంశ పాలనను ప్రారంభించింది?
1) హెన్రీ-VIII 2) ఎలిజబెత్-I
3) చార్లెస్-I 4) జేమ్స్ – I
25. మహావిప్లవం ఎప్పుడు జరిగింది?
1) 1688 2) 1687 3) 1689 4) 1690
26. అమెరికన్లు ఫ్రాన్స్ నుంచి ఏ ప్రాంతాన్ని సంపాదించారు?
1) లూసి 2) లూసియానా 3) ఫ్లోరిడా 4) టెక్సాస్
27. ఫ్రాన్స్ పార్లమెంట్ ఎస్టేట్ జనరల్‌ను 16వ లూయీ ఎన్నేండ్ల తర్వాత సమావేశపరిచాడు?
1) 170 2) 175 3) 181 4) 185
28. నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తి అయిన సంవత్సరం?
1) 1800 2) 1802 3) 1803 4) 1804
29. యంగ్‌టర్క్ అనే వర్గానికి చంద్రశేఖర్ ఎప్పుడు నాయకత్వం వహించారు?
1) 1968 2) 1970 3) 1969 4) 1971
30. బ్రిటిష్ ప్రభుత్వం లండన్‌లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసింది?
1) దేశ విభజనపై తుది నిర్ణయం చేయడానికి
2) గాంధీతో ఒడంబడికపై సంతకం చేయడానికి
3) నెహ్రూ నివేదికపై చర్చించడానికి
4) సైమన్ కమిషన్ నివేదికను చర్చించడానికి
31. కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి.
1) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో అలెగ్జాండర్ కన్నింగ్‌హాం ఆధ్వర్యంలో స్థాపించబడింది
2) ఈ సంస్థ స్థాపన కాలం నాటి గవర్నర్ జనరల్ – లార్డ్ హార్డింజ్
3) లార్డ్ కర్జన్ హయాంలో ఈ సంస్థను పునరుద్ధరించారు
4) ఈ సంస్థ భారత సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది
32. కింది ప్రదేశం, తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తల క్రమాన్ని జతపర్చండి.
1. హరప్పా ఎ. అలెగ్జాండర్ కన్నింగ్‌హాం
2) మొహెంజోదారో బి. ఆర్డీ బెనర్జీ
3) లోథాల్ సి. యూఆర్ రావు
4) రోపార్ డి. వైడీ శర్మ
5) కాలీబంగన్ ఇ. బీబీలాల్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
33. కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి.
1) సింధూ ప్రజలు పూజించిన ప్రధాన పక్షి- పావురం
2) సింధూ ప్రజలు పూజించిన ప్రధాన వృక్షం- రావి
3) సింధూ ప్రజలు పూజించిన ప్రధాన జంతువు-
మూపురం ఉన్న ఎద్దు
4) సింధూ ప్రజలు రాతితో చేసిన స్త్రీ, పురుష
జననేంద్రియాలను పూజించలేదు
34. కింది వాటిని జతపర్చండి.
1. హరప్పా ఎ. కోట, రాజప్రసాదం లేని ఏకైక నగరం
2. మొహెంజోదారో బి. అమ్మతల్లిని పూజించని ఒకే ఒక పట్టణం
3. లోథాల్ సి. ప్రపంచపు మొదటి టైడల్ ఓడరేవు
4. కాలీబంగన్ డి. మహాస్నానవాటిక బయటపడిన నగరం
5. చన్హుదారో ఇ. ధాన్యాగారాల నగరం
1) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
2) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
3) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
4) 1-ఇ, 2-సి, 3-డి, 4-బి, 5-ఎ
35. కింది వాటిని జతపర్చండి.
1. న్యాయ ఎ. పతంజలి
2. సాంఖ్య బి. జైమిని
3. మీమాంస సి. గౌతముడు
4. యోగ డి. కపిల
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
36. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
1) జ్యోతిషం – నక్షత్రశాస్త్రం
2) నిరుక్త -కష్టమైన పదాల అర్థం
3) ఛందస్సు – వ్యాకరణం
4) శిక్ష – సరైన ఉచ్ఛారణ
37. రుగ్వేదకాలంనాటి ఆర్యులు ఇంద్రుడిని దేని కోసం పూజించారు?
1) జ్ఙాన సముపార్జనకు
2) మరణానంతర జీవనానికి
3) జననమరణాల నుంచి ముక్తి కోసం
4) భౌతిక సౌకర్యాలను, విజయం ఆశించి
38. సత్యమేవ జయతే అనే పదాలు దేని నుంచి స్వీకరించారు?
1) భగవద్గీత 2) ముండకోపనిషత్తు
3) వేదాలు 4) మహాభారతం
39. సిద్ధార్థుడు, బుద్ధుడిగా మారడానికి స్ఫూర్తినిచ్చిన నాలుగు సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించండి?
1) వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, సన్యాసం
2) అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం, సన్యాసం
3) మరణం, సన్యాసం, అనారోగ్యం, వృద్ధాప్యం
4) సన్యాసం, మరణం, వృద్ధాప్యం, అనారోగ్యం
40. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
1) బుద్ధుడి మొదటి బోధనకు చిహ్నం- చక్రం
2) బుద్ధుడి పుట్టుకకు చిహ్నం- తామర
3) బుద్ధుడి జ్ఙానోదయానికి చిహ్నం- బోధివృక్షం
4) బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి వెళ్లడానికి చిహ్నం- చైత్యం
41. ధర్మమహామాత్రలను ప్రస్తావించిన అశోకుని శాసనం?
1) రెండో శిలాశాసనం 2) ఒకటో శిలాశాసనం
3) మూడో శిలాశాసనం 4) ఐదో శిలాశాసనం
42. మౌర్యుల కాలంలో విధించిన భాగ అనే పన్ను దేనికి సంబంధించినది?
1) వ్యవసాయ ఉత్పత్తులు, పశువులు
2) ఓడరేవులు
3) విదేశీ దిగుమతులపై పన్ను
4) మతపరమైన పన్ను
43. కింది వాటిని జతపర్చండి.
1. నీతిసారం ఎ. ఆర్యమంజుశ్రీ
2. దేవీచంద్రగుప్తం బి. వజ్జికుడు
3. మృచ్ఛకటికం సి. శూద్రకుడు
4. కౌముదీమహోత్సవం డి. విశాఖదత్తుడు
5. మూలకల్ప బౌద్ధగ్రంథం ఇ. కామందకుడు
1) 1-ఇ, 2-డి, 3-బి, 4-సి, 5-ఎ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
4) 1-ఇ, 2-బి, 3-డి, 4-సి, 5-ఎ
44. మెహ్రౌలి ఇనుపస్తంభ శాసనం ప్రసిద్ధికి కారణం?
1) పరిమాణం 2) ఎత్తు
3) లోహ పోతలో నైపుణ్యం 4) అందం
45. సముద్రగుప్తుడు సాధించిన విజయాలు ఎక్కడ చెక్కబడినవి?
1) హాథిగుంఫా శిలా చెక్కడాలు
2) అలహాబాద్ స్తూప చెక్కడాలు
3) గిర్నార్ శిలా చెక్కడాలు
4) సారనాథ్ శిలా చెక్కడాలు
46. హుయాన్‌త్సాంగ్ ఏ పల్లవ రాజు రాజ్యాన్ని సందర్శించాడు?
1) మొదటి పరమేశ్వరవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) రెండో నరసింహవర్మ
4) రెండో మహేంద్రవర్మ
47. తూర్పు చాళుక్యుల వంశస్థాపకుడు?
1) ఒకటో విష్ణువర్ధనుడు 2) జయసింహవల్లభుడు
3) విజయాదిత్యుడు 4) కుబ్జవిష్ణువర్ధనుడు
48. హర్షవర్ధనుడి కాలంలో అత్యధికంగా వ్యాప్తిచెందిన సామాజిక దురాచారం?
1) పరదా వ్యవస్థ 2) బాల్యవివాహాలు
3) కులాంతర వివాహాలు 4) సతి వ్యవస్థ
49. పృథ్వీరాజ్ చౌహాన్ ఏ రాజవంశానికి చెందినవాడు?
1) ప్రతిహారులు 2) పరమారులు
3) చందేలులు 4) చౌహానులు
50. కోణార్క్ సూర్యదేవాలయం నిర్మించినది?
1) అనంతవర్మ 2) నరసింహ దేవా-1
3) రాజేంద్రచోళుడు 4) రెండో పులకేశి
51. కింది వాటిలో బాల్బన్ ధరించిన బిరుదు?
1) టుటె-ఇ- హింద్ 2) కైస్-ఈ-హింద్
3) జిల్-ఎ- ఇలాహి 4) ఏదీకాదు
52. కుతుబ్మీనార్ను పూర్తిచేసిన కాలం?
1) 1234-35 2) 1206-08
3) 1210-12 4) 1231-32
53. దివాన్ -ఇ- కోహి అనే శాఖను నెలకొల్పిన ఢిల్లీ సుల్తాన్?
1) బాల్బన్ 2) ఫిరోజ్ షా తుగ్లక్
3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) మహ్మద్‌బిన్ తుగ్లక్
54. జౌన్పూర్ పట్టణ నిర్మాత?
1) మహ్మద్‌బిన్ తుగ్లక్ 2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) ఫిరోజ్ షా తుగ్లక్ 4) సికిందర్ లోడి
55. భారతదేశంలో ప్రవేశించిన తొలి సూఫీశాఖ?
1) సుహ్రావర్ధి 2) నక్షాబందీ 3) ఖాదిరీ 4) చిస్తీ
56. భక్తతుకారాం ఎవరి సమకాలికుడు?
1) బాబర్ 2) అక్బర్ 3) జహంగీర్ 4) జౌరంగజేబ్
57. అక్బర్ ఎవరి స్మారకార్థం బులంద్ దర్వాజాను ఏర్పాటు చేశాడు?
1) చిత్తోడ్‌పై విజయానికి చిహ్నంగా
2) మేవార్‌పై విజయానికి చిహ్నంగా
3) గుజరాత్‌పై విజయానికి చిహ్నంగా
4) దక్షిణాదిపై విజయానికి చిహ్నంగా
58. దహసాలా పద్ధతిని ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు?
1) 1582- తోడరమల్ 2) 1572- తోడరమల్
3) 1565- అక్బర్ 4) 1570- అక్బర్
59. తాజ్‌మహల్ రూపకర్త?
1) ఉస్తామన్సూర్ 2) ఉస్తాద్ ఇసా
3) ఉస్తాద్ రోహిణి 4) ఉస్తాద్ షంషేర్
60. కింది మొగల్ చక్రవర్తులు, వారి సమాధులు ఉన్న ప్రదేశాలను జతపర్చండి.
1. బాబర్ ఎ. కాబూల్
2. హుమాయున్ బి. ఢిల్లీ
3. అక్బర్ సి. సికిందర్
4. జహంగీర్ డి. లాహోర్
5. షాజహాన్ ఇ. ఆగ్రా
6. ఔరంగజేబ్ ఎఫ్. ఔరంగాబాద్
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి, 5-ఎఫ్, 6-ఇ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ, 6-ఎఫ్
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి, 5-ఇ, 6-ఎఫ్
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-ఎఫ్, 6-డి
61. కింది వాటిని జతపర్చండి.
1. బానిసత్వం పన్ను రద్దు ఎ. 1562
2. తీర్థయాత్రలపై పన్ను రద్దు బి. 1563
3. జిజియా రద్దు సి. 1564
4. హల్దీఘాట్ యుద్ధం డి. 1576
5. బులంద్దర్వాజా నిర్మాణం ఇ. 1579
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-డి, 5-సి
3) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి, 5-బి
4) 1-డి, 2-బి, 3-సి, 4-1, 5-ఇ
62. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట?
1) ఆగ్రాకోట 2) సెయింట్ జార్జి కోట
3) సెయింట్ డేవిడ్ కోట 4) హుగ్లి కోట
63. రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ముజఫర్‌జంగ్, చందాసాహెబ్లకు మద్దతు పలికిన ఫ్రెంచ్ గవర్నర్?
1) లెనోయిర్ 2) బుస్సీ
3) డూప్లే 4) కౌంట్- డీ- లాలి
64. కైజర్- ఇ- హింద్ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
1) మహాత్మాగాంధీ
2) సుభాష్ చంద్రబోస్
3) తిలక్ 4) గోఖలే
65. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
1) 1948, జనవరి 26 2) 1947, ఆగస్టు 16
3) 1946, డిసెంబర్ 9 4) 1947, డిసెంబర్ 26
66. స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వంలో శాఖలు, మంత్రులను జతపర్చండి.
1. బీఆర్ అంబేద్కర్ ఎ. రక్షణశాఖ
2. సర్దార్ బల్దేవ్సింగ్ బి. రైల్వేలు
3. షణ్ముగం శెట్టియార్ సి. పౌరవిమానయానం
4. జాన్ మత్తాయ్ డి. న్యాయశాఖ
5. రఫీక్ అహ్మద్ కిద్వాయ్ ఇ. ఆర్థికశాఖ
1) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
2) 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-బి, 3-ఇ, 4-సి, 5-ఎ
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఇ, 5-ఎ
67. కింది వారిలో ముసాయిదా కమిటీలో సభ్యుడు కానిది?
1) కేఎం మున్షి 2) ఎంఎం మున్షి
3) బీఎల్ మిత్తల్ 4) డీబీ ఖైతాన్
68. కింది రాజ్యాంగ పరిషత్తు విధాన నిర్ణాయక కమిటీలు, చైర్మన్లను జతపర్చండి.
1. కేంద్ర ప్రభుత్వ అధికార కమిటీ ఎ. జవహర్లాల్ నెహ్రూ
2. రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ బి. వల్లభాయ్ పటేల్
3. ఆర్థికాంశాలపై కమిటీ సి. నళినీ రంజన్ సర్కార్
4. చీఫ్ కమిషనర్ల ప్రాంతాలపై కమిటీ డి. పట్టాభి సీతారామయ్య
5. సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ ఇ. ఎస్ వరదాచారి అయ్యర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి, 5-సి,
3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-సి, 5-డి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి, 5-ఇ
69. కింది వాటిని జతపర్చండి.
1. క్యాబినెట్ ప్రభుత్వం ఎ. ఆస్ట్రేలియా
2. న్యాయ సమీక్ష బి. అమెరికా
3. ఆదేశిక సూత్రాలు సి. ఐర్లాండ్
4. గవర్నర్ల నియామకం డి. కెనడా
5. స్వేచ్ఛా వ్యాపార వాణిజ్య చట్టాలు ఇ. బ్రిటన్
1) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
2) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
3) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
4) 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
70. కింది వాటిని జతపర్చండి.
1. 9వ షెడ్యూల్ ఎ. షెడ్యూల్ ప్రాంతాలు, తెగల పరిపాలన
2. 10వ షెడ్యూల్ బి. పట్టణ, నగర పాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి
3. 11వ షెడ్యూల్ సి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం
4. 12వ షెడ్యూల్ డి. భూ సంస్కరణ చట్టాలు
5. 5వ షెడ్యూల్ ఇ. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి
1) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
4) 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
71. కింది ఆర్టికళ్లు, వాటి అంశాలను జతపర్చండి.
1. సమానత్వపు హక్కు ఎ. 19-22 అధికరణలు
2. స్వాతంత్య్రపు హక్కు బి. 14-18 అధికరణలు
3. మత స్వాతంత్య్రపు హక్కు సి. 13వ అధికరణ
4. రాజ్యాంగ పరిహారపు హక్కు డి. 32వ అధికరణ
5. న్యాయ సమీక్ష అధికారం ఇ. 25- 28 అధికరణలు
1) 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-సి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-సి
3) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-డి, 5- సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5- ఇ
72. ప్రాథమిక విధులకు సంబంధం లేనిదానిని గుర్తించండి?
1) భారతీయ చారిత్రక సంపద, సంస్కృతిని సంరక్షించడం
2) పర్యావరణాన్ని, అడవులను, కొలనులను రక్షించడం
3) శాస్త్రీయ, మానవతా దృక్పథాలను అలవర్చుకోవడం
4) 4- 14 ఏండ్ల లోపల వారికి విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించడం
73. కింది వాటిని జతపర్చండి.
1. 40వ అధికరణ ఎ. ఆరేండ్ల లోపు వారికి పూర్వ ప్రాథమిక విద్య అందించాలి
2. 44వ అధికరణ బి. పశు సంపదను సంరక్షించుకోవాలి
3. 45వ అధికరణ సి. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి
4. 48వ అధికరణ డి. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు
5. 50వ అధికరణ ఈ. ఉమ్మడి పౌరస్మృతి
1) 1-డి, 2-ఈ, 3-బి, 4-ఎ, 5-సి
2) 1-డి, 2-ఈ, 3-సి, 4-ఎ, 5- బి
3) 1-డి, 2-ఈ, 3-ఎ, 4-బి, 5- సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ, 5- ఈ
74. కింది వాటిని జతపర్చండి.
1. అధికరణ 243(ఎ) ఎ. ఎన్నికల సంఘం
2. అధికరణ 243 (డి) బి. రాష్ట్ర ఆర్థిక సంఘం
3. అధికరణ 243 (ఐ) సి. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు
4. అధికరణ 243 (కె) డి. రిజర్వేషన్లు
5. అధికరణ 243 (ఎల్) ఇ. గ్రామసభ
1) 1-ఇ, 2-డి, 3-బి, 4-సి, 5-ఎ
2) 1-ఇ, 2-ఎ, 3-బి, 4-సి, 5-డి
3) 1-ఇ, 2-డి, 3-బి, 4-ఎ, 5-సి
4) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ, 5-సి
75. సాధారణ బడ్జెట్ ఆమోదం పొందకముందే పార్లమెంట్ మంజూరు చేసే ముందు చెల్లింపును ఏమంటారు?
1) ఓట్ ఆన్ అకౌంట్ 2) టోకెన్ గ్రాంట్
3) అదనపు గ్రాంట్ 4) ఓట్ ఆన్ క్రెడిట్
76. పౌరులకు కల్పించే సంస్కృతి, విద్యాహక్కుల ముఖ్య ఉద్దేశం?
1) భారత సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడానికి
2) భారత్‌లో ఒకేరకం సంస్కృతి వృద్ధి చేయాలి
3) మైనార్టీల సంస్కృతిని పరిరక్షించడానికి
4) పైవన్నీ
77. బీఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కు రాజ్యాంగం హృదయం, ఆత్మ అని వర్ణించారు?
1) సమానత్వ హక్కు
2) మత స్వాతంత్య్రపు హక్కు
3) రాజ్యాంగ పరిహారపు హక్కు
4) పైవన్నీ
78. రాష్ట్రపతి రాజ్యసభకు కళలు, సాహిత్యం, సామాజిక సేవ తదితర అంశాల్లో సేవలందించిన ఎంతమందిని నామినేట్ చేస్తారు?
1) 2 2) 10 3) 12 4) ఏదీకాదు
79. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టేది?
1) మార్షల్ కోర్టు విధించిన అన్ని శిక్షల్లో
2) కేంద్ర, ఉమ్మడి జాబితాల్లోని అన్ని అంశాలకు చెందిన అన్ని కేసుల్లో
3) మరణశిక్ష పడిన అన్ని కేసుల్లో
4) పై అన్ని నేరాలకు
80. డిమాండ్ ఫల సమీకరణం Dx=f (px,Y,Psc,T)a లో Y దేనిని సూచిస్తుంది?
1. వినియోగదారుడి అభిరుచులు
2. వినియోగదారుడి ఆదాయం
3. డిమాండ్ ఫలం
4. వస్తువుల ధర
81. ఒక వస్తువు సప్లయ్‌ని నిర్ణయించే అంశాల్లో ప్రధానమైంది?
1. వస్తువు ఉత్పత్తి పరిమాణం
2. వస్తువు ధర
3. వస్తువుకు ఉన్న ప్రత్యామ్నాయాలు
4. వస్తువుకు ఉన్న పూరకాలు
82. సంపూర్ణపోటీ మార్కెట్ లక్షణం కానిది?
1. ప్రకటనలు, రవాణా ఖర్చులు ఉంటాయి
2. సంస్థల ప్రవేశం, నిష్క్రమణకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది
3. ప్రభుత్వ జోక్యం ఉండదు
4. మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.
83. స్వాతంత్య్రానంతరం దేశంలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి 1949 ఆగస్టు 4న ఏర్పాటుచేసిన కమిటీకి చైర్మన్ ఎవరు?
1. వీకేఆర్‌వీ రావు 2. డీఆర్ గాడ్గిల్
3. పీసీ మహలనోబిస్ 4. షణ్ముగంశెట్టి
84. GNP= C+I+G+(X-M)+(R-P) లో X-M దేనిని సూచిస్తుంది?
1. ఎగుమతులు 2. దిగుమతులు
3. నికర ఎగుమతులు 4. విదేశీ చెల్లింపులు
85. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో బడ్జెట్‌ను ఏ పేరుతో పొందుపర్చారు?
1. వార్షిక ఆదాయ వ్యయ నివేదిక
2. వార్షిక ఆదాయ నివేదిక
3. ఆదాయ వ్యయ నివేదిక
4. వార్షిక బడ్జెట్
86. టెండర్ ద్రవ్యాన్ని ఎవరు జారీ చేస్తారు?
1. వాణిజ్య బ్యాంకులు 2. లీడ్ బ్యాంకులు
3. కార్పొరేషన్లు
4. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం
87. ఏ ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది?
1. సేవింగ్ ఖాతాదారులు
2. కరంట్ ఖాతాదారులు
3. 1, 2 4. వ్యక్తులకు ఉండదు
88. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1975 అక్టోబర్ 2 2. 1975 అక్టోబర్ 3
3. 1975 అక్టోబర్ 4 4. 1975 అక్టోబర్ 5
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు