అతిపురాతన వృక్షం ఏదో తెలుసా?
స్వీడన్‌లోని దలార్నా ప్రావిన్స్‌లోగల ఫలుఫ్జల్లెట్ పర్వతంపైన ఉన్న ఓల్డ్ టిజికో వృక్షం ప్రపంచంలోనే అతిపురాతన (క్లోనల్) వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయస్సు 9,958 ఏండ్లు. అయినా ఇది కేవలం 16 నుంచి 20 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ చెట్టు వయస్సును లెక్కించారు.
-ఫలుఫ్జల్లెట్ పర్వతం ఎప్పుడూ మంచుతో కప్పి ఉండటంవల్ల కొన్ని వేల ఏండ్లపాటు ఈ వృక్షం మోడుబారిన పొదలాగా కనిపించేది. 20వ శతాబ్దంలో వాతావరణంలో మార్పులు జరిగి మంచు కరగడంతో ఇది బయటపడింది. దీన్ని లీఫ్ కుల్మన్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. తన చనిపోయిన కుక్క టిజికో గుర్తుగా ఈ వృక్షానికి ఓల్డ్ టిజికో అని పేరుపెట్టాడు.
-ఓల్డ్ టిజికో వృక్షంలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రకాండ భాగం పురాతనమైనది కాదు. ఈ చెట్టు కాండం గరిష్టంగా 600 ఏండ్లు మాత్రమే సజీవంగా ఉంటుంది. అయితే వేరువ్యవస్థ మాత్రం ఎన్నేండ్లయినా చెక్కుచెదరదు. కాండం నశించగానే వేరు నుంచి కొత్త కాండం మొలకెత్తుతుంది.
-ఈ విధంగా ఓల్డ్ టిజికో వృక్షం కొన్ని వేల ఏండ్ల నుంచి నశించిన భాగాలను పునరుత్పత్తి చేసుకుంటూ తన మనుగడ కొనసాగిస్తున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు