దేశంలో అత్యధిక నిరుద్యోగిత గల రాష్ట్రం ఏది?
1. బ్రిటిష్‌వారి పాలనలో భారతీయ పేదరికం, ఆర్థిక వ్యవస్థ గురించి దాదాభాయ్ నౌరోజీ ఏ పుస్తకంలో రాశారు?
1) ఇండియన్ ఎకానమీ అండర్ బ్రిటిష్ రాజ్
2) బ్రిటిష్ రూల్ అండ్ ఎకనామిక్ డ్రైన్ ఆఫ్ ఇండియా
3) ఎకనామిక్ డ్రైన్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా
4) పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా
2. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఔద్యోగిక పెట్టుబడి, వలస వాణిజ్యానికి గురికానిది?
1) సుంకాలు లేని తయారీ వస్తువుల భారతంలో దిగుమతులపై
2) భారత దిగుమతులపై బ్రిటిష్‌వారు విధించిన ఎక్కువ కస్టమ్ సుంకాలు
3) రైల్వే నిర్మాణానికి బ్రిటిష్‌వారు చేసిన ఆర్థిక సహాయం
4) జనపనార పరిశ్రమలో బ్రిటిష్‌వారు పెట్టిన ఎక్కువ పెట్టుబడులు
3. రెండు రంగాల నమూనా సమతౌల్యంలో ఉండటానికి కావల్సిన పరిస్థితులు?
1) సమష్టి ఆదాయం= సమిష్టి వ్యయం
2) పొదుపులు= పెట్టుబడులు
3) ఎగుమతులు= దిగుమతులు
4) పన్నులు= ప్రభుత్వ వ్యయం
4. ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్-పబ్లిక్ రంగాల సహజీవనాన్ని ఏమని పిలుస్తారు?
1) నియంత్రణ ఆర్థిక వ్యవస్థ
2) పెట్టుబడిదారీ విధానం
3) మధ్యంతర రంగం
4) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
5. భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థికాభివృద్ధి సూచికను తెల్పండి?
ఎ. ప్రధాన రంగం నుంచి వచ్చే స్థూల జీడీపీ
బి. ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపక మార్పులు
సి. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి నిర్మాణాత్మక మార్పు
డి. కలయికల వృద్ధి లేదా రూపాంతరం
1) బి, సి, డి
2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి
4) బి, సి
6. సంతులిత వృద్ధి అనే భావన దేనికి సంబంధించింది?
1) సహజ ఆర్థిక శాస్త్రం అనే భావన
2) పూర్తి ఉద్యోగిత సమతౌల్య భావన
3) మార్కెట్ల విధులు
4) అభిప్రాయ సిద్ధాంతం
7. గోల్డ్ స్టాండర్డ్‌లో సర్దుబాటును వివరించేది?
1) ధర-నాణెం-ప్రవాహ పద్ధతి
2) అస్థిర మారకపు రేటు
3) జాతీయాదాయంలో అసమానతలు
4) మారకపు రేట్లు
8. కింది ఆర్థికవేత్తలు, వారికి సంబంధించినవాటిని జతపర్చండి.
ఎ. వీకేఆర్‌వీ రావు
1. పేదరికపు అంచనాలు
బి. సుఖమయ్ చక్రవర్తి
2. జాతీయాదాయ అంచనాలు
సి. రాజా చెల్లయ్య
3. కోశ విధానం
డి. దండేకర్, రథ్
4. అభివృద్ధి ప్రణాళికారచన
1) బి-1, ఎ-2, డి-3, సి-4
2) డి-1, ఎ-2, సి-3, బి-4
3) సి-1, డి-2, బి-3, సి-4
4) బి-1, డి-2, సి-3, ఎ-4
9. కింది వాటిలో సరైనది?
1) పదో పంచవర్ష ప్రణాళికలో అదనంగా 41,110 మెగావాట్ల విద్యుత్ శక్తిని పెంచాలని ప్రతిపాదించారు
2) పదకొండో పంచవర్ష ప్రణాళికలో అదనంగా 60వేల మెగావాట్ల విద్యుత్ శక్తిని పెంచాలని ప్రతిపాదించారు
3) 1, 2
4) 1
10. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి తీసుకున్న వ్యూహంలో సరైనది?
ఎ. నీటిపారుదలగల భూమి వృద్ధిరేటు రెట్టింపు చేయడం
బి. నీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్‌షెడ్ అభివృద్ధిని మెరుగుపర్చడం
సి. పరపతిని సులభంగా పొందే ఏర్పాటు చేయడం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
11. భారత్ నిర్మాణ్ పథకంలో భాగంకాని అవస్థాపనా సౌకర్యం ఏది?
1) నీటిపారుదల
2) గ్రామీణరోడ్డు
3) గ్రామీణ ఆరోగ్యం
4) గ్రామీణ ఆవాసం
12. ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రత్యక్ష పద్ధతి?
1) ఎస్టేట్ పన్ను
2) సంపదపై పన్ను
3) ఆదాయ లాభాల పన్ను
4) వ్యవసాయ భూమిపై గరిష్ఠ పరిమితి
13. 13వ విత్త సంఘంతో పోలిస్తే, 14వ విత్త సంఘం పన్నుల పంపిణీ కోసం కింది ఏ కొత్త చలాంకాలను పరిగణనలోకి తీసుకుంది?
ఎ. రాష్ర్టాల ఆర్థిక క్రమశిక్షణ
బి. అటవీ విస్తీర్ణం
సి. రాష్ట్ర మానవాభివృద్ధి సూచిక
డి. 2011 జనాభా
1) ఎ, బి
2) ఎ, బి, డి
3) బి, డి
4) సి, డి
14. భారత ఆర్థికవ్యవస్థ వెనుకబడి ఉండటానికి కింది వాటిలో ఏది ముఖ్యకారణం?
1) అధిక జనసాంద్రత
2) మూలధన కొరత
3) వినియోగంకాని మానవ వనరులు, సహజ వనరుల సహజీవనం
4) స్వల్ప తలసరి ఆదాయం
15. కింది వాటిలో ద్రవ్యాన్ని సృష్టించే ఏజెన్సీ కానిది?
1) కుటుంబ రాబడి
2) వాణిజ్య బ్యాంకులు
3) కేంద్ర బ్యాంకు
4) ప్రభుత్వం
16. పొదుపు దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది?
1) ఆదాయ చక్రీయ ప్రవాహంలో పెరుగుదల
2) ధనాత్మకంగాను, రుణాత్మకంగాను
3) చక్రీయ ప్రవాహం తరుగుదల
4) ఏదీకాదు
17. రాష్ట్ర ప్రణాళికలను తయారు చేయడానికి ఆధారమైనవి?
1) జిల్లా ప్రణాళికలు
2) మండలి ప్రణాళికలు
3) కేంద్రప్రభుత్వం పంపిన నిర్దిష్టమైన సూచనలు
4) రాష్ట్రప్రభుత్వ శాఖలు సమర్పించిన ప్రణాళికలు
18. భారత ప్రణాళికా రంగంలో జవహర్లాల్ నెహ్రూ దేని అభివృద్ధిని గురించి నొక్కి చెబుతూ ఉండేవారు?
1) ఉద్యోగ కల్పన
2) వ్యాపారం, వాణిజ్యం
3) చిన్నతరహా పరిశ్రమలు
4) మౌలిక, భారీ పరిశ్రమలు
19. భారతదేశపు రెండో పంచవర్ష ప్రణాళికను ప్రాతిపదికగా ఉపయోగించిన మహలనోబిస్ నమూనాను రూపొందించిన వారు?
1) అలెక్ నోవె
2) ఎల్వీ నాటోరౌట్
3) జీఏ హెల్డ్ మగాన్
4) వీఎస్ నెంచినౌ
20. దేశంలో హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమయ్యింది?
1) 2వ పంచవర్ష ప్రణాళిక
2) 3వ పంచవర్ష ప్రణాళిక
3) 1966-69 వార్షిక ప్రణాళిక
4) 4వ పంచవర్ష ప్రణాళిక
21. భారీ వ్యూహ రచన కౌశలం కిందివారిలో ఎవరికి సంబంధించినది?
1) బ్రహ్మానంద
2) మహలనోబిస్
3) భగవతి
4) చక్రవర్తి
22. దేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందినది?
1) వ్యవస్థాపక నిరుద్యోగం
2) అల్ప ఉద్యోగిత
3) సాంకేతిక నిరుద్యోగం
4) ఏదీకాదు
23. ప్రత్యక్షంగా దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలను భారీ ఎత్తున ప్రారంభించిన కాలం?
1) 3వ పంచవర్ష ప్రణాళిక కాలం
2) 4వ పంచవర్ష ప్రణాళిక కాలం
3) 8వ పంచవర్ష ప్రణాళిక కాలం
4) 6వ పంచవర్ష ప్రణాళిక కాలం
24. సంపూర్ణ ఉద్యోగిత స్థితిలో సైతం ఏ రకం నిరుద్యోగిత ఉండవచ్చు?
1) నిర్మాణాత్మక నిరుద్యోగిత
2) ప్రకార్యాత్మక నిరుద్యోగిత
3) చక్రీయ నిరుద్యోగిత
4) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
25. భారత్‌లో అత్యధిక నిరుద్యోగిత గల రాష్ట్రం?
1) పశ్చిమబెంగాల్
2) కేరళ
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్
26. పేదరిక రేటును ఎలా తెలుసుకుంటాం?
1) (మొత్తం జనాభా/పేదవారి సంఖ్య) X 100
2) (మొత్తం జనాభా/పేదవారి శాతం) X 100
3) (పేదవారి శాతం/మొత్తం జనాభా) X 100
4) (పేదవారి సంఖ్య/మొత్తం జనాభా) X 100
27. కింది వాటిలో సరికానిది?
1) 20 సూత్రాల పథకం- 1975
2) అంత్యోదయ పథకం- 1977
3) ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్-1964
4) జాతీయ విస్తరణ సేవా పథకం- 1962
28. హరిత విప్లవం సత్ఫలితాలను ఇచ్చిన రాష్ర్టాలు వరుసగా?
ఎ. హర్యానా
బి. ఉత్తరప్రదేశ్
సి. పంజాబ్
డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ఇ. తమిళనాడు
1) డి, సి, బి, ఎ, ఇ
2) ఇ, సి, ఎ, డి, బి
3) ఎ, బి , సి, డి, ఇ
4) సి, ఎ, బి, డి, ఇ
29. వ్యవసాయ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళికను సిఫారసు చేసింది?
1) జాతీయ వ్యవసాయ విధానం- 1993
2) జాతీయ వ్యవసాయ విధానం- 2000
3) ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సంఘం
4) స్వామినాథన్ కమిషన్
30. నిరంతర హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రకటించారు?
1) 2000, జూలై 28
2) 2006, జూన్ 3
3) 2006, అక్టోబర్ 18
4) 2004, నవంబర్ 18
31. రైతు సాధికార సంస్థ గురించి సరైనది?
1) వ్యవసాయ రుణ విముక్తి కలిగించడం
2) రైతుల అభివృద్ధికి కృషిచేయడం
3) వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం
4) 1, 2
32. ప్రపంచంలో పాల ఉత్పత్తి అధికంగా గల దేశం?
1) చైనా
2) అమెరికా
3) భారతదేశం
4) ఆఫ్రికా
33. ఉత్తమమైన సహకార వ్యవసాయం?
1) సహకార సామాజిక వ్యవసాయం
2) సహకార కౌలుదారీ వ్యవసాయం
3) సహకార మేలురకపు వ్యవసాయం
4) సహకార ఉమ్మడి వ్యవసాయం
34. చిన్న కమతం గరిష్ఠ హద్దు?
1) 1 హెక్టార్
2) 2 హెక్టార్లు
3) 4 హెక్టార్లు
4) 10 హెక్టార్లు
35. చిన్నతరహా పరిశ్రమల స్థిర పెట్టుబడికి సంబంధించి సరైనది?
ఎ. 1997లో మూడు కోట్లకు పెంచారు
బి. 2001లో కోటికి తగ్గించారు
సి. 2005లో 5 కోట్లకు పెంచారు
1) పైవన్నీ సరైనవే
2) ఎ, బి
3) బి, సి
4) ఎ, సి
36. కింది వాటిలో సరికానిది?
ఎ. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్- 1956
బి. జాతీయ చిన్నతరహా పరిశ్రమల సంస్థ- 1955
సి. జాతీయ సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ- 1960
1) ఎ
2) బి, సి
3) బి
4) పైవన్నీ సరైనవే
37. ఒక దేశంలో ఆయుఃప్రమాణం, అక్షరాస్యత, విద్య, ప్రజల జీవన ప్రమాణాలు బేరీజు వేసే సూచీ?
1) ద్రవ్యోల్బణం
2) సెన్సెక్స్
3) ఎస్ఎల్ఆర్
4) హెచ్‌డీఐ
38. సామాజిక మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం కానిది?
1) విద్య
2) దూరశ్రవణ సేవలు
3) తాగునీటి వసతి
4) ఆరోగ్యం
39. భారత వ్యవసాయ రంగ లక్షణం?
1) మిగులు భూమి, వ్యవసాయ కూలీల కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థ
2) మిగులు భూమి, అధిక వ్యవసాయ కూలీలున్న ఆర్థిక వ్యవస్థ
3) భూమి కొరత, అధిక వ్యవసాయ కూలీలున్న ఆర్థిక వ్యవస్థ
4) భూమి కొరత, వ్యవసాయ కూలీల కొరత ఉన్న ఆర్థిక వ్యవస్థ
40. కింది వాటిలో భారత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్లో లేనిది?
1) సర్వశిక్షా అభియాన్
2) ఎంజీఎన్ఆర్ఈజీఏ
3) మధ్యాహ్న భోజన పథకం
4) ఓవర్సీస్ భారతీయ పౌరసత్వ పథకం
41. పడకుండా నిలిచే స్థిర అభివృద్ధికి సరైన అర్థం?
1) భావితరాల అవసరాలపై ప్రభావం లేకుండా ప్రస్తుత తరానికి స్థితిగతులను అభివృద్ధిపర్చడం
2) సంఘంలో కింది స్థాయిలో ఉన్న విభాగాలవారి అభివృద్ధి
3) సాంఘిక న్యాయంతో అభివృద్ధి
4) చాలాకాలం కొనసాగే అభివృద్ధి
42. ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థికవృద్ధి, …. ?
1) ధరల స్థిరత్వం
2) ద్రవ్యోల్బణం
3) ప్రతి ద్రవ్యోల్బణం
4) సామాజిక మార్పు
43. మానవాభివృద్ధి సూచికలో అంశం కానిది?
1) జనన కాలం నుంచి ఆయుర్ధాయం
2) అక్షరాస్యత రేటు, పాఠశాల సగటు ఏడాదులు
3) శిశుమరణాల రేటు
4) ఆదాయం
44. అభివృద్ధికి నూతన కొలమానం?
1) తలసరి ఆదాయం
2) సాంకేతిక పరిజ్ఞానం
3) ఎగుమతులు
4) మానవాభివృద్ధి సూచీ
45. దేశాల అధిక, మధ్య, తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థ వర్గీకరణ దేని ఆధారంగా చేస్తారు?
1) జనాభా
2) జీఎన్‌పీ
3) విస్తీర్ణం
4) తలసరి జీఎన్‌పీ
46. ఆర్థికాభివృద్ధితో పాటు వ్యవసాయరంగంలోని శ్రామిక శక్తి శాతం?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) స్థిరంగా ఉంటుంది
4) అనిశ్చిత రీతిలో మారుతుంది
47. కిందివాటిలో ఏది అల్పస్థాయి అభివృద్ధి చెందిన దేశాల లక్షణం కాదు?
1) అధిక జనాభా వృద్ధిరేటు
2) అధిక నిరుద్యోగిత
3) అధిక పొదుపు ప్రవృత్థి
4) అధిక నిరాక్షరాస్యత రేటు
48. భారతదేశంలో ఆదాయ పంపిణీ ….
1) సరైన ఆదాయ పంపిణీ
2) అసమాన ఆదాయ పంపిణీ
3) ఆదాయ పంపిణీతీరు
4) ఆదాయ పంపిణీ తక్కువ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు