ఇవీ 2018 లో ఇస్రో గఘన విజయాలు
పీఎస్ఎల్వీ సీ-40
-జనవరి 12న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ-40 ప్రయోగం చేపట్టింది. ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్ – 2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతోపాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో చేర్చింది. పీఎస్ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉన్నది. కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, దక్షిణకొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.
జీఎస్ఎల్వీ ఎఫ్08
-ఇస్రో మార్చి 29న జీఎస్ఎల్వీ ఎఫ్08 వాహకనౌక ద్వారా 2140 కిలోల బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే, ప్రయోగించిన రెండు రోజుల్లోనే కమాండ్ సెంటర్‌తో శాటిలైట్ సంబంధాలు కోల్పోయింది.
పీఎస్ఎల్వీ సీ-41
-ఏప్రిల్ 12న ఇస్రో పీఎస్ఎల్వీ సీ -41 ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా భారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ – 1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ బరువు 1,425 కిలోలు. నావిక్ దిక్యూచీ పనిచేయడానికి కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా, ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. ఇందులో మొదటి ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏను 2013, జూలై 1న కక్ష్యలోకి పంపారు. ఇందులో సమయాన్ని నిర్ధారించడానికి ఏర్పాటు చేసిన మూడు రుబీడియం గడియారాలు విఫలం కావడంతో ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్‌ను ప్రయోగించారు. అదీ విఫలం కావడంతో ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐను ప్రయోగించారు.
క్రూ ఎస్కేప్ సిస్టమ్
-వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ఇస్రో తొలిసారిగా జూలై 5న విజయవంతంగా పరీక్షించింది. మానవ సహిత అంతరిక్ష నౌకలను ప్రయోగించే సమయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే క్రూ ఎస్కేప్ సిస్టమ్ వెంటనే అప్రమత్తమై వ్యోమగాములున్న మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి సురక్షితంగా దిగేలా చేస్తుంది.
పీఎస్ఎల్వీ -సీ42
-సెప్టెంబర్ 16న ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ -సీ42 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన నోవాఎస్ఏఆర్, ఎస్1-4 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. దీంతో ఇప్పటి వరకు 23 దేశాలకు చెందిన 243 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టినట్లయింది.
-నవంబర్ 14న ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్3 -డి2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్29ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈశాన్య రాష్ర్టాలు, జమ్ముకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్ అవసరాలను జీశాట్-29 తీర్చనున్నది.
పీఎస్ఎల్వీ -సీ43
-నవంబర్ 29న ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ43 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా హైసిస్ (హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిదేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
జీశాట్-11
-డిసెంబర్ 4న సమాచార ఉపగ్రహం జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా జీశాట్-11ను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అన్నింటికంటే జీశాట్-11 బరువైంది. దీని బరువు 5,854 కిలోలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు