Disasters | సామాజిక, సహజ వైపరీత్యాలు అంటే?
విపత్తుల వర్గీకరణ
– విపత్తులు సంభవించే వేగం, వాటికి దారితీసే కారణాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. వేగాన్ని అనుసరించి
2. సంభవించే కారణం ఆధారంగా
వేగాన్ని అనుసరించి సంభవించే విపత్తులు
– ఇవి నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు, వేగంగా వచ్చే విపత్తు అని రెండు రకాలుగా ఉంటాయి.
– నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు: రోజులు, నెలలు, ఏండ్ల తరబడి కొనసాగే విపత్తును నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు అంటారు.
ఉదా: కరువు, కీటకాల దాడులు, మహమ్మారి వ్యాధులు, పర్యావరణ క్షీణత
– వేగంగా వచ్చే విపత్తు: ఇది తక్షణ విఘాతంవల్ల సంభవించే విపత్తు. ఈ రకమైన విపత్తు సంభవించడానికి కొంత సమ యం పడుతుంది. అంటే నిమిషాలు, కొన్ని సెకన్లు, కొన్ని గంటలు, లేదా కొన్ని రోజులపాటు సంభవించవించ్చు. దీని ప్రభావం స్వల్ప కాలం లేదా దీర్ఘ కాలం ఉంచవచ్చు.
ఉదా: భూకంపం, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం, తుఫానులు, సునామీలు.
సంభవించే కారణాలను బట్టి విపత్తులు
– ఇవి సహజ విపత్తులు, మానవకారక విపత్తులు అని రెండు రకాలుగా ఉంటాయి.
– సహజ విపత్తులు లేదా ప్రకృతి సిద్ధమైన విపత్తులు: ఇవి ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించే విపత్తులు. ఈ విపత్తులను మనం నివారించలేం. కానీ మనకున్న శాస్త్ర, సాంకేతిక, సమాచార పరిజ్ఞానంతో వాటివల్ల సంభవించే నష్టాలను తగ్గించవచ్చు.
ఉదా: భూకంపాలు (నేపాల్ భూకంపాలు- 2015), వరదలు (కేదార్నాథ్, బద్రీనాథ్ వరదలు- 2013), తుఫానులు, సునామీ (హిందూ మహాసముద్రంతో సంభవించిన సునామీ- 2004), భూపాతాలు.
– మానవకారక విపత్తులు: మానవ కల్పిత కారణాలవల్ల, ప్రమాదవశాత్తు, నిర్లక్ష్యంవల్ల సంభవించి ప్రాణనష్టం, ఆస్తినష్టం, పర్యావరణ నష్టం కలిగించే విపత్తును మానవ కారక విపత్తు అంటారు.
– ఈ విపత్తులవల్ల మానవుని బాధలు పెరగడంతోపాటు, ప్రాణ నష్టానికి దారితీస్తాయి. దేశ ఆర్థికవ్యవస్థ, ఉత్పాదక సామర్థ్యాలకు దీర్ఘకాలపు నష్టాన్ని కలిగిస్తాయి.
ఉదా: వాయువుల లీకేజీ, ప్రమాద విపత్తులు, రసాయన విపత్తులు, రసాయనాల విస్ఫోటనం, బాంబు పేలుళ్లు, తొక్కిసలాట, బయో ఉగ్రవాదం, పారిశ్రామిక ప్రమాదాలు.
గమనిక: ప్రాణాలకు, ఆస్తికి, పర్యావరణానికి భారీ నష్టాన్ని తెచ్చే ఆయుధాలను సామూహిక విధ్వంసక ఆయుధాలు (డబ్ల్యూఎండీ) అంటారు. అవి.. అణ్వాయుధాలు, జీవాయుధాలు, రసాయన ఆయుధాలు.
– 2003లో జరిగిన అమెరికా-ఇరాక్ యుద్ధంతో డబ్ల్యూఎండీ పదం విరివిగా వాడుకలోకి వచ్చింది.
– మానవ కారక విపత్తులను నివారించడానికి.. ప్రజల ఆలోచనా సరళిలో మార్పును తీసుకురావడం, విపత్తుల గురించి అవగాహన కలిగించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన కార్యక్రమాల వంటివి చేపట్టాలి.
వైపరీత్యం (Hazard)
– ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టానికి కారణమయ్యే ప్రమాదకరమైన సహజ లేదా మానవ కార్యకలాప ఘటనను వైపరీత్యం అంటారు.
– HAZARD అనే పదం Hasard అనే పురాతన ఫ్రెంచి పదం నుంచి వచ్చింది.
– az-zatir అంటే అరబిక్‌లో అవకాశం/అదృష్టం.
– వైపరీత్యాలను రెండు రకాలుగా విభజించారు. అవి…
సహజ వైపరీత్యాలు
– సహజ వైపరీత్యాలు ఏర్పడటానికి కారణం సహజసిద్ధ కారకాలు. వాతావరణ, భౌగోళిక, జైవిక విపత్తుల కారణంగా ఈ వైపరీత్యాలు ఏర్పడతాయి.
ఉదా: సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనం
గమనిక: సామాజిక-సహజ వైపరీత్యాలైన వరదలు, భూపా తాలు, కరువుల వంటి వాటికి ప్రకృతి, మానవ ప్రేరేపిత కారణాలు ఉంటాయి. అందుకే వాటిని సామాజిక-సహజ వైపరీత్యాలు అంటారు.
ఉదా: వరదలు సహజసిద్ధంగా కురిసే అధిక వర్షాలతో రావచ్చు లేదా మానవ నిర్లక్ష్యంతో సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంవల్ల కూడా రావచ్చు.
మానవ ప్రేరేపిత వైపరీత్యాలు
– ఇవి మానవ నిర్లక్ష్యంవల్ల సంభవిస్తాయి. పారిశ్రామిక ప్రమాదాలు, శక్తినిచ్చేవి, పేలుడు నిచ్చేవి (ఉగ్ర దాడులు), విషపూరిత వ్యర్థాల లీకేజీ, కాలుష్యం, ఆనకట్టలు కూలిపోవడం, యుద్ధం, అంతర్గత తిరుగుబాటు మొదలైనవి.
దుర్బలత్వం (Vulnerability)
– భౌతిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారకాలు లేదా ప్రక్రియలతో నిర్ధారించబడి కమ్యూనిటీ వైపరీత్యాల ప్రభావానికి గురయ్యే సున్నితత్వాన్ని పెంచే స్థితి దుర్బలత్వం.
– దుర్బలత్వాలను భౌతిక దుర్బలత్వం, సామాజిక-ఆర్థిక దుర్బలత్వంగా వర్గీకరించవచ్చు.
భౌతిక దుర్బలత్వం
– భూకాంపాలు లేదా వరదల వంటి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయే, విధ్వంసానికి గురయ్యే వ్యక్తులు, వనరులు దీని పరిధిలోకి వస్తాయి. ఇది భవనాలు, మౌలిక వసతుల వంటి ముంపు కలిగిన నిర్మాణాలు, ప్రజలు ఆ వైపరీత్యానికి ఉన్న సామీప్యత, ప్రదేశం, స్వభావంపై ఆధారపడి ఉంటుంది. విపత్తు జరిగే సమయంలో భవనాలు, నిర్మాణాలు దాని బలాలను ఎదుర్కోవడానికి కలిగి ఉన్న సాంకేతిక సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.
సామాజిక ఆర్థిక దుర్బలత్వం
– ప్రజల సామాజిక-ఆర్థిక స్థితి కూడా వైపరీత్య ప్రభావ తీవ్రతను నిర్ధారిస్తుంది. దీన్నే సామాజిక-ఆర్థిక దుర్బల త్వం అంటారు.
ఉదా: సముద్ర తీరంలో నివసించే పేద ప్రజలకు దృఢమైన కాంక్రీటు భవనాలు నిర్మించుకోవడానికి అవసరమైన డబ్బు ఉండదు. అందువల్ల వారు ముప్పులోనే ఉంటారు. బలమైన ఈదురుగాలులు లేదా తుఫాన్లు వచ్చినా తమ నివాసాలను కోల్పోతారు. పేదరికం కారణంగా తిరిగి ఇండ్లను నిర్మిచుకోలేరు.
విపత్తు నిర్వహణ పత్రికలు
– జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్
– జాతీయ వైపరీత్యం, విపత్తు నిర్వహణ పుస్తక రచయిత- సత్యేష్ చక్రవర్తి
– అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించిన- డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచ్స్ గ్రంథ కర్త
– అరవింద్ కుమార్
విపత్తు దినోత్సవాలు
– అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం- అక్టోబర్ 13
– అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం- 1990-1999
– జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం- అక్టోబర్ 29
– విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సులను వాల్డన్ యూనివర్సిటీ, కెప్లాన్ యూనివర్సిటీ, గ్రాండ్ కెన్యన్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి.
– విపత్తు నిర్వహణపై ఇంధిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ కోర్సున నిర్వహిస్తున్నది.
విపత్తు నిర్వహణకు సంబంధించిన జాతీయ సంస్థలు
– జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం)- న్యూఢిల్లీ
– జాతీయ విపత్తు నిర్వహన ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ)- న్యూఢిల్లీ
– సార్క్ విపత్తు నిర్వహణ సెంటర్ (ఎస్డీఎంసీ)- న్యూఢిల్లీ
– కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)- న్యూఢిల్లీ
– భారత వాతావరణ పరిశోధన సంస్థ- న్యూఢిల్లీ
– నేషనల్ ఫ్లాట్పార్మ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్- న్యూఢిల్లీ
– సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్- హైదరాబాద్
– ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్- గచ్చిబౌలీ
– నేషనల్ రిమెట్ సెన్సింగ్ ఏజెన్సీ- షాద్‌నగర్
– ఇండియన్ సునామీ వార్నింగ్ సెంటర్
– హైదరాబాద్ (ఇది 2007, అక్టోబర్ 15న ప్రారంభమైంది)
– ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్- హైదరాబాద్
– నేషనల్ జియోగ్రఫికల్ రిసెర్చ్ సెంటర్- ఉప్పల్
విపుత్తు నిర్వహణపై 1999లో జేసీ పంత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ 31 రకాల విపత్తులను గుర్తించి వాటిని 5 ప్రధాన ఉపగ్రూపులుగా విభజించింది. అవి..
1. నీరు-వాతారణ సంబంధిత విపత్తులు,
2. భౌగోళిక విపత్తులు,
3. రసాయన, పారిశ్రామిక విపత్తులు,
4. ప్రమాద విపత్తులు,
5. బయాలాజికల్ లేదా జైవిక విపత్తులు
విపత్తు నిర్వహణ వెబ్సైట్లు
– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ http: //nidm.gov.in
– నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ http: //ndma.gov.in
– సెంట్రల్ వాటర్ కమిషన్- www.nic.in- Indian meteorological department www.imd.gov.in
– రీజినల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజర్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ www.rimes.in
– యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ www.unisdr.org
– సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హ్యుమానిటేషన్ www.cdmha.org
– సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ http://saarc.sdmc.nic.in
– వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ www.wcdm.org
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?