కనిపించని ప్రళయం-భూకంపాలు
భూ అంతర్భాగంలో కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో కలిగే ఆకస్మిక చలనం వల్ల ప్రకంపనాల రూపంలో శక్తి విడుదలవుతుంది. ఇది రాతి పొరల ద్వారా ప్రయాణించినప్పుడు భూమి కంపిస్తుంది.
భూకంపం
-భూమి ఉపరితలం ఆకస్మికంగా కదలడాన్ని భూకంపం అంటారు. ఇలాంటి భూ కంపాలను భూపటల విరూపకారక భూకంపాలు అంటారు.
భూకంప నాభి
-భూకంపం సంభవించే ప్రాంతాన్ని భూకంప నాభి అంటారు. లేదా భూకంపం సంభవించే అంతర్భౌమ బిందువును భూకంప నాభి అంటారు.
అధికేంద్రం
-భూకంప నాభిపై ఉన్న భూమి ఉపరితలంలోని ప్రాంతాన్ని అధికేంద్రం అంటారు. లేదా భూకంప నాభికి ఊర్ధ్వంగా ఉపరితలంపై ఉన్న కేంద్రాన్ని అధికేంద్రం అంటారు.
-భూకంప నాభి వద్ద ఉత్పత్తి (ప్రారంభమైన) తరంగాలు భూ అధికేంద్రం వద్దకు చేరి భూప్రకంపనాలు విడుదలవుతాయి. కాబట్టి సహజంగా అతి తీవ్రమైన నష్టం కూడా ఈ అధికేంద్రం వద్ద, పరిసర ప్రాంతాల్లోనే సంభవిస్తుంది.
-భూకంపాల్లో వెలువడే శక్తి తరంగాల రూపంలో ఉంటుంది.
-భూకంపాలు ఏర్పడినప్పుడు మూడు రకాలైన తరంగాలు వెలువడుతాయి. అవి…
1. P-తరంగాలు (Primary waves- ప్రాథమిక తరంగాలు)
2. S-తరంగాలు (Secondary waves-ద్వితీయ తరంగాలు)
3. L-తరంగాలు (Love waves- దీర్ఘ తరంగాలు)
-ఇవి భూకంప నాభి నుంచి అన్ని వైపులకు ప్రసరిస్తాయి.
P-తరంగాలు
-వీటిని ప్రాథమిక తరంగాలు అంటారు.
-ఇవి మిగిలిన తరంగాలకంటే 17 రెట్లు అధిక వేగంగా ప్రసరిస్తాయి. కాబట్టి ఇవి భూకంప నమోదు కేంద్రాలను ముందుగా చేరుతాయి.
-ఇవి ఘన, ద్రవ, వాయు పదార్థాలు లేదా మాధ్యమాలగుండా ప్రసరిస్తాయి.
-ఇవి తమ మార్గంలోని అణువులను (ప్రారంభ స్థానం నుంచి పయనించే దిశకు) ముందుకు, వెనుకకు ఊగిసలాడుతూ పయనిస్తాయి.
S-తరంగాలు
-వీటిని గౌణ లేదా ద్వితీయ తరంగాలు అంటారు.
-ఇవి P-తరంగాల తర్వాత భూకంప నమోదు కేంద్రాలను చేరుతాయి.
-ఇవి ద్రవ పదార్థా గుండా ప్రసరించలేవు.
-ఇవి భూ ఉపరితలంలో తరంగ మార్గానికి అణువులను (తరంగ ప్రసరణ దిశకు) లంబంగా (పైకి, కిందికి) ప్రసరింపజేస్తాయి.
L-తరంగాలు
-వీటిని లవ్ లేదా దీర్ఘ లేదా ర్యాలీ తరంగాలు అంటారు.
-ఇవి ఘన, ద్రవ, వాయు పదార్థాల నుంచి ప్రసరిస్తాయి.
-ఇవి భూ ఉపరితల తరంగ మార్గానికి లంబంగా పైకి కిందికి లవ్ తరంగాలుగా తరంగ మార్గానికి అనుగుణంగా సముద్ర కెరటంలా (ర్యాలీ తరంగాలు) ప్రసరిస్తాయి.
-ఈ మూడు తరంగాల పరిజ్ఞానం భూమి అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
-భూకంప తరంగ లేఖిని: భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరం.
-రిక్టర్ స్కేలు: భూకంప తరంగాల తీవ్రతను కొలిచే ప్రమాణం (రిక్టర్ ప్రమాణం).
-సిస్మోగ్రామ్: భూకంపాలను నమోదు చేసిన గ్రాఫ్‌ను భూకంప తరంగ చిత్రం లేదా భూకంప రేఖా చిత్రం అంటారు.
నాభిలోతు ఆధారంగా భూకంపాలు మూడు రకాలు. అవి..
1. అగాథ భూకంపాలు (Deep focus): వీటి నాభిలోతు 300 కి.మీ.ల కంటే ఎక్కువ ఉంటుంది. వీటినే లోతునాభి భూకంపాలు అంటారు. ఈ భూకంపాలు వేటి వల్ల సంభవిస్తాయో ఇప్పటికీ కనుక్కోలేకపోయారు.
2. మాధ్యమిక భూకంపాలు: ఇవి 30-55 కి.మీ.ల మధ్యలోతు వరకు వ్యాపించి ఉంటాయి.
3. గాథ భూకంపాలు: ఇవి ఉపరితలం నుంచి 55 కి.మీ. వరకు వ్యాపించి ఉంటాయి. ఈ భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. వీటినే తక్కువ లోతు నాభి భూకంపాలు అంటారు.
భూకంపాలకు కారణాలు ఉపరితల కారణాలు
-కొత్తగా ఉద్భవిస్తున్న పర్వతాల వల్ల, గనులు కూలడం, సొరంగ మార్గాల పైకప్పులు కూలడం, అణ్వస్త ప్రయోగాలు చేపట్టడం, కొండ చరియలు విరగడం, భూపాతాలు, హిమ సంపాతాలు సంభవించడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి.
-అగ్నిపర్వత సంబంధాల వల్ల
-పాతాళ సంబంధమైన కారణాల వల్ల
-అంతర్భూజల నిక్షేపాలను వినియోగించడంవల్ల చమురు నిక్షేపాల వల్ల.
-భూకంపాల ఫలితాలు: ధన, ప్రాణ, జంతు నష్టం.
సునామీ
-సముద్ర భూతలంపై సంభవించే భూకంపాల ఫలితంగా పెద్ద పెద్ద తరంగాలు ఏర్పడతాయి. వీటినే సునామీలు అంటారు.
-వీటి తరంగాల తరంగధైర్ఘ్యం 200 కి.మీ.ల వరకు, ప్రయాణవేగం 800 కి.మీ.ల వరకు ఉంటుంది.
-దీంతో వీటి ప్రయాణమార్గంలో అనేక విపత్తులు సంభవిస్తాయి.
-నదులు తమ గమనాన్ని మార్చుకుంటాయి.
-గనులు, నూతులు కూరుకుపోయి ఉంటాయి.
-కొన్ని ప్రాంతాలు కుంగిపోతాయి.
ఆధునిక భారతదేశంలో ప్రధాన భూకంపాలు
1. 1819- కచ్ భూకంపం
2. 1897- అసోం భూకంపం
3. 1904- బీహార్ నేపాల్ భూకంపం
4. 1950- అసోం భూకంపం
5. 1976- కొయనా భూకంపం (మహారాష్ట్ర)
6. 1992- ఉత్తరకాశీ భూకంపం (ఉత్తరాఖండ్)
7. 1993- లాతూర్ భూకంపం (మహారాష్ట్ర)
8. 2001- భుజ్ భూకంపం (గుజరాత్)
దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు
-అసోం (గరిష్టంగా), హిమాలయాలు, గుజరాత్, మహారాష్ట్ర
ప్రపంచవ్యాప్తంగా భూకంపాల విస్తరణ
-ప్రపంచంలో భూపటలంలో ఉన్న రెండు నిర్ధిష్టమైన బలహీన ప్రదేశాల వెంబడి భూకంపాలు సంభవిస్తున్నాయి. అవి అగ్నిపర్వతాలు, ముడుత పర్వతాలు/భ్రంశాలు ఏర్పడిన ప్రదేశాల వెంబడి వస్తున్నాయి. ఇవన్నీ చాలావరకు సముద్ర గర్భాల్లో ఏర్పడుతున్నాయి.
వీటిని రెండు భాగాలుగా విభజించారు. అవి..
1. పసిఫిక్ పరివేష్టిత మేఖల
-ఇవి 68 శాతం వరకు ఉన్నాయి.
-ఇందులో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల పశ్చిమ తీర ప్రాంతాలు, అలూషియన్ ద్వీపాలు, కురైల్ ద్వీపాలు, జపాన్, ఫిలిప్పైన్స్ ద్వీపాలు ఉన్నాయి.
2. ప్రపంచ మధ్య మేఖల
-ఈ మేఖలలో 21 శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి.
-ఇందులో మధ్యదరా సముద్ర ద్వీపాలు, కాకసస్ పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఉన్నాయి.
-భూకంప నాభి లోతు పెరిగే కొద్ది భూకంప ప్రభావానికి గురయ్యే ప్రాంత వైశాల్యం పెరుగుతుంది.
-భూకంప నాభిలోతు తగ్గే కొద్ది భూకంప తీవ్రత పెరుగుతుంది.
-భూకంప తీవ్రత ఆధారంగా భూకంపాలను లెక్కిస్తారు. అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ వినాశనం జరుగుతుంది. దీన్ని రిక్టర్ స్కేల్‌పై సంఖ్యాప్రమాణంగా చూపిస్తాం.
అగ్నిపర్వతాల ఫలితాలు
-అగ్నిపర్వతాల ఉద్భేదనం వల్ల భూపొరల్లో ఉండే ఖనిజ సంపద బయటకు వస్తుంది.
-లావా ద్రవం ప్రవహించి కొన్ని వందల ఏండ్లకు చల్లబడి ఘనీభవించి సారవంతమైన పొరగా భూమిపై ఏర్పడుతుంది. ఉదా: దక్కన్ పీఠభూమి
-అగ్నిపర్వత ఉద్భేదన ప్రక్రియవల్ల వేడినీటి బుగ్గలు ఏర్పడతాయి. వీటిలో ఖనిజ పదార్థాల శాతం ఎక్కువ.
అగ్నిపర్వతాల దుష్ఫలితాలు
-అగ్నిపర్వతాల నుంచి ఉష్ణశిలాద్రవమైన లావా కొన్ని వేల చ.కి.మీ. వరకు విస్తరించి పంటలకు నష్టాన్ని తెస్తుంది.
-ఆకస్మిక అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం కలుగుతుంది.
-అగ్నిపర్వత పరిసర ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండవు.
అగ్నిపర్వతం నుంచి వెలువడే పదార్థాలు
-అగ్నిపర్వతం పెల్లుబికినప్పుడు లావా అనే శిలాద్రవంతోపాటు ఘన, వాయు పదార్థాలు బయటికి వస్తాయి.
ఘనపదార్థాలు
-బూడిద రంగులో ఉన్న ఇసుక రేణువుల వంటి ధూళి పదార్థాన్ని టెఫ్రా లేదా పైరోక్లాస్టిక్స్ అని, సన్నని బొగ్గు కణాలు, బూడిద, ధూళితోపాటు ఉల్లిపాయ సైజులో ఉండే రాతి ముక్కలు కూడా ఉంటాయి. వీటిని అగ్నిపర్వత బాంబులు అని అంటారు.
-చిన్న చిన్న రాళ్లతో కూడిన అగ్నిపర్వత శిలా పదార్థం- లాఫిల్లే
-అగ్ని పర్వత ధూళి/బూడిద- టఫ్
-టఫ్జిగురుగా ఉంటే దాన్ని ఇగ్నింబ్రైట్ అంటారు.
-లావా వెదజల్లిన తర్వాత దానిపై తెట్టులా ఏర్పడే మురికి పదార్థం- ప్యూమిస్
నోట్: ప్యూమిస్ మీద నురుగ ఉండి చిన్న చిన్న బుడగలు ఉంటాయి. ఇది చాలా తేలికగా ఉంటుంది. దీన్ని ప్రస్తుతం మార్కెట్లో ప్యూమిస్స్టోన్గా అమ్ముతున్నారు.
ద్రవపదార్థాలు
-భూమిలో ఉన్న శిలా ద్రవాన్ని మాగ్మా అని, బయటికి వచ్చిన మాగ్మాను లావా అని అంటారు.
నోట్: మాగ్మా అనే శిలాద్రవం భూమిలోపల గానీ, భూమిపై గానీ చల్లబడటంవల్ల అగ్నిశిలలు ఏర్పడతాయి.
-లావాను చిక్కదనం ఉన్న లావా అని, చిక్కదనం లేని లావా అని రెండు రకాలుగా విభజించారు.
-మిగిలిన 11 శాతం భూకంపాలు ప్రపంచంలో వివిధ ఇతర ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి.
-ప్రతి ఏడాది సుమారు 10 లక్షల భూకంపాలు సంభవిస్తున్నట్లు అంచనా.
2014-19 మధ్య సంభవించిన భూకంపాలు
1. 2014, ఆగస్టు 3- Ludian earthquake (China)- 6.1 తీవ్రత- 756 మంది మరణించారు.
2. 2015, ఏప్రిల్ 25- నేపాల్ భూకంపం- 7.8 తీవ్రత- 9624 మంది మరణించారు.
3. 2016, ఏప్రిల్ 16- ఈక్వెడార్ భూకంపం- 7.8 తీవ్రత- 139 మంది మరణించారు.
4. 2017, నవంబర్ 12- ఇరాన్-ఇరాక్ భూకంపం
(ఇరాక్)- 7.3 తీవ్రత- 1232 మంది మరణించారు.
5. 2018, సెప్టెంబర్ 28- సులవేసి భూకంపం, సునామీ (ఇండోనేషియా)- 7.5 తీవ్రత- 5239 మంది మరణించారు.
6. 2019, ఏప్రిల్ 22- లుజాన్ భూకంపం (ఫిలిప్పైన్స్)- 6.1 తీవ్రత- 53 మంది మరణించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు