ఉత్తరార్ధగోళంలో లేని ఆసియా దేశ దీవులేవి..?
– సూర్యకుటుంబ వరుసలో మూడోదిగాను, పరిమాణంలో ఐదోదిగాను ఉన్నదే భూమి. దీని గురించి భూగోళశాస్త్రం వివరించినంతగా మరే శాస్త్రం వివరించదు.
– భోగోళశాస్త్రం ప్రకారం భూమి వివిధ ఆకారాల్లో ఉన్నదనే భావన అభూత కల్పనే. భూమి ఆకారాన్ని ‘జియాయిడ్ (Geoid)’ అంటారు.
– ఏ వస్తువైతే భూమి ఆకారం కలిగి ఉందో దాన్ని జియాయిడ్ అంటారు.
– ఈ ఆకారంగల వస్తువు మన భూమి తప్ప సృష్టిలో మరొకటి లేదు.
– జాయాయిడ్ పూర్తిగా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది.
– అక్షాంశాలపరంగా ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ. దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ.
– రేఖాంశాలపరంగా పూర్వార్ధగోళంలో భూభాగం ఎక్కువ. పశ్చిమార్ధగోళంలో జలభాగం ఎక్కువ.
– భూమిపై ఏర్పడిన ఖండాలను పరిశీలిస్తే ఇవి ఇంచుమించు త్రిభుజాకారంగా ఉన్నాయి.
ఉదా: పూర్వార్ధగోళంలో ఉన్న ఖండాలు ఆసియా, ఐరోపా (యూరప్), ఆఫ్రికా, ఆస్ట్రేలియా
– పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు కూడా త్రిభుజాకారంలో ఉన్నాయి.
– భూగోళంపై ఏర్పడిన ఐదు ఖండాల పేర్లు పరిశీలిస్తే అవి.. ఏ ఇంగ్లిష్ అక్షరంతో ప్రారంభమవుతుందో అదే అక్షరంతో ముగియడం మన ఖండాల ప్రత్యేకత.
ఉదా: ఆసియా, యూరప్, అంటార్కిటిక, ఆస్ట్రేలియా
– ఖండాలను వాటి స్థితిగతులను అనుసరించి మూడు భాగాలుగా చేశారు. అవి.. త్రిఖండ నేల (ఆసియా, ఆఫ్రికా, యూరప్), ద్విఖండ నేల (ఉత్తర, దక్షిణ అమెరికాలు), ఏకఖండ నేల (ఆస్ట్రేలియా)
– వీటిలో పెద్దది ఆసియా. చిన్నది ఆస్ట్రేలియా
ఖండాలు
– మహాసముద్రాలను వేరుచేస్తూ ఏర్పడిన భూభాగాలు ఖండాలు.
– విస్తీర్ణంపరంగా ఖండాలు.. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా
ఆసియా
– ప్రపంచంలో ఇది అత్యధిక జనాభాగల ఖండం
– ఇది అత్యధిక వైశాల్యంగల ఖండం
– ఎత్తయిన పర్వతాలు, లోతైన ప్రాంతాలుగల ఖండం
– ఈ ఖండంలో 50 దేశాలు ఉన్నాయి. దీనిలో మూడు దేశాలు రష్యా, కజకిస్థాన్, టర్కీ యూరప్ ఖండ భూభాగంలో సాంకేతికంగా ఉన్నాయి.
సరిహద్దులు
– ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం
– తూర్పున పసిఫిక్ మహాసముద్రం (బేరింగ్ జలసంధి వరకు)
– దక్షిణాన హిందూ మహాసమద్రం
– పశ్చిమాన యూరల్ పర్వతాలు, కాకసస్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం, నల్లసముద్రం, మధ్యదరా సముద్రం
– నైరుతిన ఎర్ర సముద్రం ఉన్నాయి.
– మధ్యదరా సముద్రం, నల్ల సముద్రాలు ఆసియా-యూరప్ ఖండాలను వేరుచేస్తున్నాయి.
– ఎర్ర సముద్రం (సూయజ్ కాలువ) ఆసియా-ఆఫ్రికా ఖండాలను వేరుచేస్తున్నది.
– కాకసస్ పర్వతాలు, యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం, యూరల్ నది రెండు ఖండాల్లో కూడా విస్తరించి ఉంది.
– వీటి సరిహద్దులు రష్యా, కజకిస్థాన్, అజర్ బైజాన్, జార్జియా, టర్కీ దేశాలతో ఉన్నాయి. అందువల్ల ఇవి రెండు ఖండాల్లో విస్తరించాయి.
– అర్మేనియా, సైప్రస్ దేశాలు భౌగోళికంగా ఆసియాలో ఉన్నాయి. కానీ రాజకీయంగా, సాంస్కృతికంగా మాత్రమే యూరప్‌లో భాగంగా ఉన్నాయి.
ఉనికి
– అక్షాంశాల దృష్ట్యా- ఉత్తరార్ధగోళంలో 100 దక్షిణ అక్షాంశాల నుంచి 800 ఉత్తర అక్షాంశాలు
– రేఖాంశాల దృష్ట్యా- పూర్వార్ధగోళంలో 250 తూర్పు రేఖాంశాల నుంచి 1700 పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించింది.
జనాభా
– ప్రపంచంలో ఆసియా ఖండం అత్యధిక జనాభాగలది.
– ఆసియా ఖండ జనాభా 4.54 బిలియన్లు
– ప్రపంచ జనాభాలో ఆసియా ఖండ జనాభా 60 శాతం ఉంది.
– ఆసియాలో అత్యధిక జనాభాగల దేశాలు: 1) చైనా (1.43 బిలియన్లు) భారతదేశం (1.36 బిలియన్లు). (2019, సెప్టెంబర్ 12 యూఎన్ అంచనాల ప్రకారం)
– ప్రపంచ జనాభాలో చైనా జనాభా 18.29 శాతంగా ఉంది. భారతదేశ జనాభా 17.71 శాతంగా ఉంది.
– ప్రపంచ జనాభాలో చైనా, భారతదేశాల జనాభానే 36 శాతం వరకు ఉంది.
– ఇవి ప్రపంచంలో అత్యధిక జనాభాగల మొదటి, రెండు దేశాలు. మూడోది ఇండోనేషియా (0.27 బిలియన్లు)
అత్యల్ప జనాభాగల దేశాలు
1) బ్రూనై- 4 లక్షల 34 వేలు
2) మాల్దీవులు- 4 లక్షల 44 వేలు
3) భూటాన్- 7 లక్షల 63 వేలు
– జనసాంద్రత (148 Per km2)
నోట్: ఆసియా ఖండంలోని తూర్పు చివరి ప్రాంతం డెజన్యావో అగ్రం (సైబీరియా), పశ్చిమ చివరి ప్రాంతం బాబా అగ్రం (టర్కీ)
– ఆసియా ఖండంలోని ఉత్తర చివరి ప్రాంతం- తిమోర్
– ఆసియా ఖండంలో ఇంతవరకు ఏ దేశ ఆధీనంలో లేని దేశం (వలస రాజ్య స్థాపన జరగని దేశం) థాయిల్యాండ్
– ఆసియా ఖండంలో ఎత్తయిన ప్రాంతం- ఎవరెస్ట్ శిఖరం (8848 మీ.) ఇది నేపాల్‌లో ఉంది. ఇది ప్రపంచంలో భూఉపరితలంపై ఎత్తయిన శిఖరం.
– ఆసియా ఖండం పర్వతాలకు పుట్టినిల్లు.
– ఆసియా ఖండంలో లోతైన సముద్రం మృత సముద్రం (డెడ్ సీ). ఇది జోర్డాన్‌లో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం.
– ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం మంగోలియా
– ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి పామీర్/టిబెట్ పీఠభూమి. ఇది ఆసియాలోని టిబెట్ ప్రావిన్స్‌లో ఉంది.
ప్రత్యేకతలు
– ప్రపంచంలో జనాభా పరంగా పెద్దదేశం- చైనా
– విస్తీర్ణపరంగా 4వ పెద్ద దేశం- చైనా
– ప్రపంచంలో అధికజనాభాగల రెండో దేశం- భారత్
– సూర్యుడు మొదట ఉదయించే దేశం- జపాన్ (నిప్పన్)
– ప్రపంచంలో అతితక్కువ తీరరేఖ గల దేశం- జోర్డాన్
– ప్రపంచంలో అధికంగా ఆటవస్తువులను ఉత్పత్తి చేసే దేశం- హాంకాంగ్
– హిందూమహాసముద్రపు ‘అశ్రునీటి బిందువు’- శ్రీలంక
– పవిత్రభూమి- జెరూసలేం
– ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్- థాయ్‌లాండ్
– ల్యాండ్ ఆఫ్ థౌజెండ్స్ ఎలిఫెంట్స్- లావోస్
– ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్- కొరియా
– ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగెన్- భూటాన్
– ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా- మయన్మార్
– ఫర్బిడెన్ సిటీ- లాసా (టిబెట్)
– సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్- బాగ్దాద్ (ఇరాక్)
– హిమాలయాల రాజ్యం
– నేపాల్ ముఖ్యమైన భూస్వరూపాలు
మైదానాలు
– సైబీరియా మైదానం: ఇది రష్యాలో ఉంది. యూరాల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది.
– చైనా మైదానం: ఇది హొయాంగ్‌హో, యాంగ్ట్సికియాంగ్, సికియాంగ్ నదుల మధ్య ఉంది.
– మెసపటోమియా మైదానం: ఇది ఇరాక్‌లో ఉన్నది. టైగ్రిస్, యూప్రటిస్ నదుల మధ్య ఉన్నది.
– ఐరావతి మైదానం: ఇది మయన్మార్‌లో ఉన్నది.
– గంగా-సింధు మైదానం: ఇది భారతదేశంలో ఉన్నది. ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రుమట్టితో కూడినది.
– మెకాంగ్ నది మైదానం: ఇది ఆగ్నేయాసిలో ఉన్నది.
– తురానియన్ మైదానం: ఇది కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో ఆముదార్య, సిరిదార్య నదుల మధ్య ఉన్న మైదానం. ఇవి ప్రపంచంలో మొదట అనుసంధానం చేసిన నదులు.
ఆసియాఖండంలోని దేశాలు-రాజధానులు తూర్పు ఆసియా దేశాలు-8
– జపాన్- టోక్యో
– ఉత్తరకొరియా- ప్యాంగ్యాంగ్
– దక్షిణ కొరియా- సియోల్
– చైనా- బీజింగ్
– తైవాన్- తైపీ
– హాంకాంగ్- విక్టోరియా
– మాకు- చైనా స్వతంత్రప్రాంతం
– మంగోలియా- ఉలాన్బాటర్
ఆగ్నేయాసియా దేశాలు- 11
– ఇండోనేషియా- జకార్తా
– వియత్నాం- హనోయి
– థాయ్‌లాండ్- బ్యాంకాక్
– సింగపూర్- సింగపూర్
– మలేషియా- కౌలాలంపూర్
– ఫిలిప్పీన్స్- మనీలా
– కాంబోడియా- నామ్పెన్హ్
– మయన్మార్- నేపిడా
– లావోస్- వియన్టియన్
– బ్రూనై- బండర్ సెరీ బెగవాన్
– తిమోర్ లెస్టి (తూర్పు తిమోర్)- దిలీ
భారత ఉపఖండ దేశాలు- 7
– బంగ్లాదేశ్- ఢాకా
– భూటాన్- థింపూ
– భారత్- న్యూఢిల్లీ
– మాల్దీవులు- మాలె
– నేపాల్- కఠ్మాండూ
– పాకిస్థాన్- ఇస్లామాబాద్
– శ్రీలంక- కొలంబో
పశ్చిమాసియా దేశాలు-23
– యెమెన్- సనా
– ఒమన్- మస్కట్
– యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- అబుధాబీ
– ఆఫ్ఘనిస్థాన్- కాబూల్
– సౌదీఅరేబియా- రియాద్
– కువైట్- కువైట్
– ఇరాక్- బాగ్దాద్
– ఇరాన్- టెహ్రాన్
– జోర్డాన్- అమ్మాన్
– సిరియా- డెమాస్కస్
– టర్కీ- అంకారా
– బహ్రెయిన్- మనామా
– అర్మేనియా- యెరివాన్
– జార్జియా- టిబిలిసి
– అజర్ బైజాన్- బాకు
– కిర్గిజ్‌స్థాన్- బిష్కెక్
– కజకిస్థాన్- ఆస్థానా
– తుర్కుమెనిస్థాన్- అష్గబట్
– ఇజ్రాయెల్- టెల్అవిన్
– లెబనాన్- బీరుట్
– ఉజ్బెకిస్థాన్- తాష్కెంట్
– తజకిస్థాన్- దుషాన్చి
– సైప్రస్- నికోసియా
– రష్యా- మాస్కో
విస్తీర్ణం
– ఈ ఖండం విస్తీర్ణం 44.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ విస్తీర్ణంలో సుమారు 30 శాతం ఆక్రమిస్తున్నది.
అత్యధిక వైశాల్యంగల ఆసియా దేశాలు
– రష్యా (17.07 మి. చ.కి.మీ.)- ఇది ప్రపంచంలో అత్యధిక వైశాల్యంగల దేశం.
– చైనా (9.5 మి. చ.కి.మీ.)- ఇది ప్రపంచంలో అత్యధిక వైశాల్యంగల నాలుగో దేశం.
– భారతదేశం (3.28 మి. చ.కి.మీ)- ఇది ప్రపంచంలో అత్యధిక వైశాల్యంగల ఏడో దేశం.
– అత్యల్ప వైశాల్యంగల దేశం: మాల్దీవులు 300 చ.కి.మీ.
నోట్: ఆసియా ఖండం మధ్యగుండా 900 రేఖాంశం వెళ్తున్నది.
– ఈ ఖండంగుండా భూమధ్యరేఖ (00 అక్షాంశం) దక్షిణ, ఆగ్నేయంగా వెళ్తున్నది.
– 23 1/20 ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ ఈ ఖండంగుండా వెళ్తున్నది.
– 66 1/20 ఉత్తర అక్షాంశమైన ఆర్కిటిక్ వలయం ఈ ఖండంగుండా వెళ్తున్నది.
– భూమధ్యరేఖ వెళ్లే ఆసియా ప్రాంతాలు: ఇండోనేషియాలోని బోర్నియా, సుమత్రా, సులవేసి (సెలిబస్ దీవులు)
నోట్: ఇండోనేషియా కొన్ని దీవులు తప్ప మిగతా ఆసియా ఖండమంతా ఉత్తరార్ధగోళంలోనే ఉంది.
– భూమధ్యరేఖకు దగ్గరగాగల నగరం సింగపూర్
– కర్కటరేఖ వెళ్తున్న ఆసియా దేశాలు: తైవాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భారతదేశం, ఒమన్, యూఏఈ, సౌదీఅరేబియా
ఆర్కిటిక్ వలయంలోని ఆసియా దేశం: రష్యా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు