1. విస్తాపన/ పోడు వ్యవసాయం
2. జీవనాధార వ్యవసాయం
3. విస్తృత వ్యవసాయం
4. సాంద్ర వ్యవసాయం
5. తోట వ్యవసాయం
6. మిశ్రమ వ్యవసాయం
Rainbow revolution | ఇంద్రధనస్సు విప్లవం ఎప్పుడు ప్రారంభించారు?
ఆసియా వ్యవసాయం
-ఈ రకమైన వ్యవసాయాన్ని గిరిజన జాతులవారు అవలంభిస్తారు.
-ఈ వ్యవసాయంలో చెట్లను నరికి, ఎండబెట్టి, కొంతకాలం తర్వాత తగలబెట్టి చదును చేసి వ్యవసాయం చేస్తారు. చెట్లను నరకడం, ఎండబెట్టడం, తగలబెట్టడం అనే పద్ధతి ద్వారా విస్తాపన వ్యవసాయం చేస్తారు.
-నిర్దిష్ట కాలం తర్వాత (2 లేదా 3 ఏండ్లకు భూసారం తగ్గిన తర్వాత) ఆ భూమిని వదిలి వేరేచోటుకు వెళ్తారు. అక్కడ తిరిగి ఇదే పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. ఇలా వేరొక భూమికి మారిపోయే ప్రక్రియను విస్తాపన /సంచార/ పోడు వ్యవసాయం అని పిలుస్తారు.
తెలంగాణ- పోడు
ఆంధ్రప్రదేశ్- పోడు
అసోం, ఈశాన్య రాష్ర్టాలు-జూమ్
మధ్యప్రదేశ్- లేవార్, పెండ
జార్ఖండ్- కురువా, పెండ
కేరళ- పొనమ్
పశ్చిమ కనుమలు- కుమ్రి లేదా కుమారి
ఒడిశా- పామగాలి
రాజస్థాన్- వాత్రా
హిమాలయాలు- ఖిల్
శ్రీలంక- చినా
ఇండోనేషియా- లడంగ్
థాయ్‌లాండ్- తయారీ
వియత్నాం- రే
బ్రెజిల్- రోకా
వెనెజులా- కొనుకో
మధ్య అమెరికా- మిల్ఫా
మధ్య ఆఫ్రికా- మసోలి
-ఇందులో జంతువులను ఉపయోగించి పొలాలను దున్నడం వంటి పురాతన పద్ధతులను ఉపయోగిస్తారు.
-కమతాల పరిమాణం తక్కువ, జనసాంద్రత ఎక్కువ (ఎక్కువ మంది కూలీలు అవసరం).
-నీటిపారుదల వసతులు తక్కువ, క్రిమిసంహారక మందుల వాడకం ఎక్కువ.
ఉదా: భారతదేశం.
-ఈ రకమైన వ్యవసాయాన్ని బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టారు.
-ఈ వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం అవసరం (అధిక దిగుబడినిచ్చే విత్తనాలు).
-సాధారణంగా ఈ రకమైన వ్యవసాయం ఎత్తయిన ప్రదేశాల్లో పర్వతాలు లేదా కొండల వాలు వెంబడి అనుకూలంగా ఉంటుంది.
-ఈ వ్యవసాయంలో భాగంగా కాఫీ, తేయాకు, రబ్బరు లాంటి పంటలను పండిస్తారు.
-దేశంలో పశ్చిమకనుమల్లో, ఈశాన్య రాష్ర్టాల్లో ఈ రకమైన వ్యవసాయం ఎక్కువ.
-వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహించడమే మిశ్రమ వ్యవసాయం.
-అంటే వ్యవసాయంతోపాటు పశుపోషణ, కోళ్లు, పట్టు పురుగులు, తేనెటీగలు, చేపలు మొదలైన వాటి పెంపకాన్ని చేపట్టడం.
-మిశ్రమ వ్యవసాయం ఇంద్రధనస్సు విప్లవంలో ఒక భాగం.
గమనిక: 2000 ఏడాది తర్వాత భారత ప్రభుత్వం మిశ్రమ వ్యవసాయాన్ని ప్రారంభించింది.
-ఉద్యానవన పంటలు కూడా మిశ్రమ వ్యవసాయంలో భాగం.
గమనిక: మిశ్రమ వ్యవసాయంలో వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధిలోకి తీసుకురావడానికి విప్లవాత్మక మార్పులను చేపట్టారు.
-ఊదా (Violet) విప్లవం- ఉన్ని వస్తువుల అభివృద్ధి
-నీలి విప్లవం- చేపలు, సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి
-హరిత విప్లవం- గోధుమ ఉత్పత్తుల అభివృద్ధి
-పసుపు విప్లవ- నూనె గింజల ఉత్పత్తుల పెంపకం
-ఆరెంజ్ విప్లవం- నిమ్మజాతి తోటలు లేదా ఉద్యానవన పంటల దిగుబడులు పెంచడం
-ఎరుపు విప్లవం- మాంసం, టమాటా ఉత్పత్తుల పెంపకం
-శ్వేత లేదా క్షీర విప్లవం- పాలు లేదా పాల ఉత్పత్తుల పెంపకం
-నలుపు విప్లవం- చమురు లేదా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులను అధికం చేయడం
-బూడిద విప్లవం- కృత్రిమ ఎరువుల ఉత్పత్తి అధికం చేయడం
-గులాబి విప్లవం- రొయ్యల అభివృద్ధి
-బ్రౌన్ విప్లవం- సుగంధ ద్రవ్యాల ఉత్పత్తుల పెంపకం లేదా అభివృద్ధి
-వెండి విప్లవం- కోడిగుడ్ల ఉత్పత్తుల పెంపకం
-బంగారు విప్లవం- పండ్ల ఉత్పత్తులు
-రౌండ్ విప్లవం- ఆలుగడ్డల ఉత్పత్తుల పెంపకం
-బంగారు పీచు విప్లవం- జనపనార ఉత్పత్తుల పెంపకం
-ఆహారపు గొలుసు విప్లవం- గోదాముల ఏర్పాటు
-ఇంద్రధనస్సు విప్లవం- అన్నిరకాల ఉత్పత్తుల పెంపకం
గమనిక: 2000 జనవరి 28న మొదటిసారిగా భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం విప్లవాలన్నింటిని ఏకీకృతం చేస్తూ ఇంద్రధనస్సు విప్లవంను ప్రవేశపెట్టింది. ఇందులో మిశ్రమ వ్యవసాయం కూడా ఒక భాగం.
వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను కూడా వృద్ధిలోకి తీసుకురావడానికి వివిధ రకాల విప్లవాలను వాటి పెంపకాలను ప్రవేశపెట్టారు. అవి..
1. తేనెటీగల పెంపకం- ఎపికల్చర్
2. పట్టు పురుగుల పెంపకం- సెరికల్చర్
3. చేపల పెంపకం- ఆక్వా కల్చర్ (పిసీ కల్చర్)
4. కూరగాయలు, మొక్కల పెంపకం- ఆర్బొరికల్చర్
5. ఉద్యానవన పంటల పెంపకం (పండ్లు, పూలు, కూరగాయలు)- హార్టి కల్చర్
6. పండ్లు, పండ్ల తోటల పెంపకం- పోమి కల్చర్
7. పూల పెంపకం- ఫ్లొరికల్చర్
8. ద్రాక్ష తోటల పెంపకం- విటి కల్చర్
ఆసియాలో ప్రధానంగా పండించే పంటలు ఆహార పంటలు
-వరి, గోధుమ, ఓట్స్, జొన్నలు, సజ్జలు, రాగుల వంటి చిరు ధాన్యాలు.
-భారతదేశం, చైనాలో వరి ప్రధాన పంట.
నగదు (వాణిజ్య) పంటలు
-పత్తి, జనుము, చెరుకు, పొగాకు, టీ, కాఫీ
ఆసియాలో ప్రధాన ఖనిజాలు
-ఖనిజాలన్నింటికి మాతృక మాగ్మా లేదా లావా
-భూమిలోపల సహజ సిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను ఖనిజ వనరులు అంటారు.
-భూమిలోపల నుంచి తవ్వి తీసే దాన్ని ఖనిజం అంటారు. నీరు కూడా ఒక ఖనిజమే.
-ఖనిజాలు పునరుత్పత్తి చేయలేని వనరులు.
ఖనిజాల వర్గీకరణ
-ఖనిజాలను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
-లోహ ఖనిజాలు: ఫెర్రస్ (ఇనుము, మాంగనీస్, కోబాల్ట్, నికెల్), నాన్ ఫెర్రస్ ఖనిజాలు (రాగి, సీసం, తగరం, జింక్, బాక్సైట్), విలువైన ఖనిజాలు (బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు)
-అలోహ ఖనిజాలు: మైకా, సున్నపురాయి (లైమ్‌స్టోన్), ముగ్గురాయి (బెరైటీస్), ఆస్బెస్టాస్ (రాతినార), గ్రాఫైట్, గ్రానైట్
-ఇంధన ఖనిజాలు : బొగ్గు, పెట్రోలియం
-అణుఖనిజాలు: యురేనియం, థోరియం, జిర్కానియం, ఇల్మనైట్
లోహ ఖనిజాలు:ఎ. ఫెర్రస్ ఖనిజాలు
1. ఇనుము
-ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. -దేశంలో ఒడిశా, జార్ఖండ్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో వరంగల్- మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది.
-దేశంలో ఇనుము అధికంగా హెమటైట్ ముడిఖనిజం నుంచి లభిస్తుంది. తక్కువ మొత్తం మాగ్నటైట్ రూపంలో ఇనుప ఖనిజం లభిస్తుంది. ఇది నాణ్యమైన ముడి ఖనిజం.
-దేశంలో మొదటి ఇనుప గని సింగ్భమ్ (జార్ఖండ్), ఇనుప నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్.
-దేశంలో అతిపెద్ద ఇనుపగని బైలదిల్ల (ఛత్తీస్‌గఢ్). బైలదిల్ల అంటే ఎద్దుమూపురం అని అర్థం.
గమనిక: ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇనుప ఖనిజం విశాఖ రేవు ద్వారా జపాన్, దక్షిణ కొరియాలకు ఎగుమతి అవుతుంది. గోవాలోని ఇనుపఖనిజం మర్మగోవా ఓడరేవు ద్వారా స్పాంజ్ ఐరన్ రూపంలో జపాన్‌కు ఎగుమతి అవుతుంది.
జీవనాధార వ్యవసాయం
-ఇది ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండి చేసే వ్యవసాయం. ఇందులో రైతు కుటుంబం పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో లాభం ఉండదు.
-ఈ వ్యవసాయంలో అవసరం కంటే ఎక్కువ మంది కూలీల లభ్యత ఉంటుంది.
-దీనివల్ల ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది.
-దేశంలో ఈ వ్యవసాయం రుతుపవనాల మీద ఆధారపడి ఉండటంతో దీన్ని రుతుపవనాలతో జూదం వంటిది అంటారు.
విస్తృత వ్యవసాయం
-కమతాల పరిమాణం ఎక్కువగా ఉండి, జనసాంద్రత తక్కువ ఉన్న చోట యంత్రాలను ఎక్కువగా ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని విస్తృత/ ఆధునిక వ్యవసాయం అంటారు.
ఉదా: వరినాటు, వరికోత యంత్రాలను ఉపయోగించడం. డ్రోన్ల ద్వారా రసాయనాలు చల్లడం, బిందుసేద్యం, తుంపరసేద్యం మొదలైనవి.
-మధ్య ఆసియాలో విస్తృత వ్యవసాయం ఎక్కువగా అమల్లో ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు