Pollination | పరాగ సంపర్కానికి కీటకాలను ఆకర్షించేవి?
పుష్పవిన్యాసం (The Inflorescence)
– పుష్పవిన్యాసాక్షం (florataxis) మీద పుష్పాలు అమరి ఉండటాన్ని పుష్పవిన్యాసం (Inflorescence) అంటారు.
-కాండం రూపాంతరం పుష్పం.
-అతిపెద్ద పుష్ప విన్యాసం- అమర్ఫోపాలస్ టైటానం.
-అతిపెద్ద శాఖీయ మొగ్గ లేదా కోరకం- క్యాబేజీ
-వృక్షరాజ్యంలో పుష్పవిన్యాసాక్షంపై పుష్పాలు వివిధ రకాలుగా అమరి ఉంటాయి. అవి..
పుష్పం (The Flower)
-పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఆంథాలజి అని, పుష్పాలను ఇచ్చే మొక్కల పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అని అంటారు.
-వృక్షరాజ్యంలో అతిపెద్ద పుష్పం- రఫ్లీషియా ఆర్నాైల్డె
-వృక్షరాజ్యంలో అతిచిన్న పుష్పం- ఉల్ఫియా ఆంగుస్టా
-పుష్పం అనేది ఆవృతబీజాల్లో ప్రత్యుత్పత్తి ప్రమాణం (Reproductive unit). ఇది లైంగిక ప్రత్యుత్పత్తి కోసం ఏర్పడింది.
-పుష్పానికి ఉండే కాడ వంటి నిర్మాణాన్ని పుష్పవృంతం (Stalk/Pedicel), దాని చివర ఉబ్బిన నిర్మాణాన్ని పుష్పాసనం (Thalamus/Receptacle) అంటారు.
-పుష్పాసనంపై పుష్పం నాలుగు భాగాలు భిన్నవలయాలుగా ఒకదాని తరువాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి. అవి..
1. రక్షక పత్రావళి (Calyx)
2. ఆకర్షణ పత్రావళి (Corolla)
3. కేసరావళి (Androecium)
4. అండకోశం (Gynoecium)
-కేసరావళి, అండకోశం అనేవి ప్రత్యుత్పత్తి భాగాలు కాగా, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళిలు అదనపు భాగాలు.
సంపూర్ణ పుష్పం (Complete flower)
-పుష్పంలో రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం అనే భాగాలన్ని ఉంటే దాన్ని సంపూర్ణ పుష్పం అంటారు.
ఉదా: మందార, ఉమ్మెత్త
అసంపూర్ణ పుష్పం
-పుష్పంలోని నాలుగు భాగాల్లో ఏదైనా ఒకటి లోపిస్తే అలాంటి పుష్పాన్ని అసంపూర్ణ పుష్పం (Incomplete flower) అంటారు.
ఉదా: దోస, కాకర, పొప్పడి
ద్విలింగక పుష్పాలు
-కేసరావళి, అండకోశం అనే రెండు ప్రత్యుత్పత్తి భాగాలు కలిగిన పుష్పాలను ద్విలింగక పుష్పాలు (Bisexual flowers) అంటారు.
ఉదా: మందార, ఉమ్మెత్త
ఏకలింగక పుష్పాలు
-కేసరావళి కాని, అండకోశం కాని ఏదైనా ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉన్న పుష్పాలను ఏకలింగక పుష్పాలు (Unisexual flowers) అంటారు.
ఉదా: దోస, ఆనిగెపు కాయ, కాకర
-కేసరావళి మాత్రమే వుంటే పురుష పుష్పం (Staminate flower) అని, అండకోశం మాత్రమే ఉంటే స్త్రీ పుష్పం (Pistillate flower) అని అంటారు.
ద్విలింగాశ్రయ స్థితి
-ఒకే మొక్కపై రెండు ఏకలింగక పుష్పాలు (స్త్రీపుష్పం, పురుష పుష్పం) ఉండే దాన్ని ద్విలింగాశ్రయ స్థితి (Monoecious condition)అంటారు.
ఉదా: కోకస్, కారా, మొక్కజొన్న
ఏకలింగాశ్రయ స్థితి
-ఒక మొక్కపై ఏదో ఒక ఏకలింగక పుష్పం (స్త్రీ పుష్పం లేదా పురుష పుష్పాల్లో ఏదో ఒకటి) ఉంటే దాన్ని ఏకలింగాశ్రయ స్థితి అంటారు.
ఉదా: బొరాసస్, మార్కాన్షియా, పొప్పడి, ఆనిగెపు కాయ
బహులింగాశ్రయ స్థితి
-ఒకే మొక్కపై ఏకలింగక, ద్విలింగక పుష్పాలు రెండు ఉంటే దాన్ని బహులింగాశ్రయ స్థితి (Polygamous condition) అంటారు.
ఉదా: మాంజిఫెరా (మామిడి)
పుష్ప భాగాలు రక్షక పత్రావళి
-రక్షక పత్రావళి పుష్పంలో అన్నింటికన్నా వెలుపల ఉండే వలయం. ఇది మొదటి వలయం.
-రక్షక పత్రావళిలోని భాగాలను రక్షక పత్రాలు (Sepals) అంటారు. సాధారణంగా రక్షక పత్రాలు పత్రాల్లా ఆకుపచ్చ రంగు (హరిత వర్ణం)లో ఉండి పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షణ కల్పిస్తాయి.
గమనిక: టమాటా, మిరప, వంకాయల్లో రక్షకపత్రాలు ఫలంతోపాటు శాశ్వతంగా ఉంటాయి.
ఆకర్షణ పత్రావళి
-ఆకర్షణ పత్రావళిలో ఆకర్షణ పత్రాలు (Petals) ఉంటాయి. ఇవి సాధారణంగా పరాగ సంపర్కంలో (Pollination) కీటకాలను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి. ఇది రెండో వలయం.
గమనిక: రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి లేకపోయినప్పటికీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కాబట్టి వీటిని అదనపు భాగాలు (Accessory parts) లేదా అనావశ్యక అంగాలు (Non-essential organs) అంటారు.
-ఏకదళ బీజాల్లో (లిల్లీ లాంటి కొన్ని పుష్పాలు) రక్షక, ఆకర్షణ పత్రావళి ఒకే విధంగా ఉంటాయి. దీన్ని పరిపత్రం (Perianth) అంటారు.
పుష్పరచన
-పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి అమరి ఉండే విధానాన్ని పుష్పరచన (Aestivation) అంటారు. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. అవి..
1. కవాటయుత పుష్పరచన (Valvate aestivation)- జిల్లేడు (Calotropis)
2. మెలితిరిగిన పుష్పరచన (Twisted aestivation)- మందార, పత్తి, బెండ
3. చిక్కైన పుష్పరచన (Imbricate aestivation)- తంగేడు, గుల్మొహర్
4. వెక్సిల్లరీ లేదా పాపిలియోనేషియస్ పుష్పరచన (Vexillary aestivation)- బఠానీ, చిక్కుడు
కేసరావళి
-ఇది మూడో వలయం. కేసరావళి (Androecium) కేసరాలను (Stamens) కలిగి ఉంటుంది. కేసరం (Stamen) పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం.
-కేసరం గద ఆకారంలో ఉండి కేసరదండం (Filament) లేదా వృంతం (Stalk), పరాగ కోశం (Anther)లను కలిగి ఉంటుంది.
-ప్రతి పరాగ కోశంలో సాధారణంగా రెండు తమ్మెలు (Lobes) ఉంటాయి. ప్రతి తమ్మె (Lobe) రెండు పుప్పొడి సంచులను (Pollen sacs) లేదా పుప్పొడి గదులను (Pollen chambers) కలిగి ఉంటుంది.
-పుప్పొడి సంచులు లేదా గదుల్లో పరాగ రేణువులు (Pollen grains) ఉత్పత్తి చెందుతాయి.
పరాగ రేణువులు
-పరాగ రేణువుల అధ్యయనాన్ని పేలినాలజి అంటారు.
-పెలినాలజి పితామహుడు ఎర్డట్మన్.
-పరాగ రేణువుల లోపలి పొరను ఇంటైన్ అని, వెలుపలి పొరను ఎైక్టెన్ అని అంటారు. ఎైక్టెన్లో స్పోరో పోలినిన్ అనే పదార్థం ఉండి ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అంతేకాకుండా శిలాజాలుగా భద్రపరచడానికి ఉపయోగపడుతుంది.
-ఆవృతబీజాల్లోని 60 శాతం మొక్కల్లో పరాగరేణువులు రెండు కణాల దశలో విడుదలవుతాయి.
అండకోశం
-ఇది నాలుగో వలయం. ఇది పుష్పంలో స్త్రీప్రత్యుత్పత్తి భాగం. ఇది ఒకటి లేదా అనేక ఫలదళాలతో ఏర్పడి ఉంటుంది. ఈ ఫల దళాలను స్థూలసిద్ధబీజాశయ పత్రాలు అని కూడా అంటారు.
-ప్రతి ఫలదళంలో కీలాగ్రం (Stigma), కీలం (Style), అండాశయం (Ovary) అనే మూడు భాగాలు ఉంటాయి.
-పీఠంలో ఉబ్చిన భాగాన్ని అండాశయం అని, మధ్యన సాగిన నాళం వంటి భాగాన్ని కీలం అని, కీలం కొన భాగాన్ని కీలాగ్రం అని అంటారు. కీలాగ్రం పరాగ రేణువులను స్వీకరిస్తుంది.
-ప్రతి అండాశయంలో బల్లపరుపు దిండువంటి అండన్యాస స్థానానికి (Placenta) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అండాలు అతుక్కొని ఉంటాయి.
-ప్రతి అండంలో ఉండే పిండకోశంలో 7 కణాలు, 8 కేంద్రకాలు ఉంటాయి.
-పిండకోశాన్ని స్త్రీ సంయోగబీజదం అంటారు.
-కేసరావళి, అండకోశాలు ప్రత్యుత్పత్తి భాగాలు కావడంతో ఆవశ్యక అంగాలు అంటారు.
గమనిక:-ఎండిన మొగ్గలను లవంగాలుగా, ఎండిన కీలాగ్రాన్ని కుంకుమ పువ్వు (Crocus sativus)గా వాడుతారు.
-వర్షాకాలంలో పుష్పించే మొక్కలు- గులాబి, గన్నేరు
-శీతాకాలంలో పుష్పించే మొక్కలు- బంతి, చామంతి
-ఎండాలంలో పుష్పించే మొక్కలు- మల్లె, మామిడి, వేప.
పుష్పవిన్యాస రకం-మొక్క
సమశిఖి (Corymb)- తంగేడు (కాసియా), కాలిఫ్లవర్
గుచ్చం (Umbel)- నీరుల్లి (Onion), క్యారెట్, కొత్తిమీర
స్పాడిక్స్ (Spadix)- మ్యూసా (అరటి), కోకాస్ (కొబ్బరి), కొలకేసియా (చేమ)
శీర్షవత్ (Head Inflorecsence)- ట్రైడ్రాక్స్ (గడ్డిచామంతి), సూర్యకాంతం (పొద్దుతిరుగుడు)
ఏకాంతనిశ్చితం (Solitary cyme)- హైబిస్కస్ రోజాసైనెన్సిస్ (మందార), దతూర (ఉమ్మెత్త)
సైమ్యూల్ (Cymule)- బోగన్విల్లియా (కాగితపు పూలచెట్టు), జాస్మిన్ (మల్లె)
వర్టిసెల్లాస్టర్ (Verticellaster)- లామియేసి కుటుంబం మొక్కలు (తులసి, రణబేరి)
సయాథియమ్ (Cyathium)- యుఫోర్బియేసి కుటుంబం మొక్కలు (యుఫర్బియా)
హైపన్థోడియం (Hypanthodium)- ఫైకస్ (మర్రి)
కాట్కిన్- మల్బరి
కంకి (Spike)- వరి, మొక్కజొన్న
సామాన్య అనిశ్చితం- ఆవాలు, ముల్లంగి
-కేసరావళిని ముష్కాలకు, పరాగ రేణువులను శుక్రకణాలకు సమజాతంగా పరిగణిస్తారు.
-అండకోశాన్ని స్త్రీ బీజకోశాలకు, పిండ కోశాన్ని అండానికి సమజాతంగా పరిగణిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు