సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు? (టెట్ ప్రత్యేకం )
సైకాలజీ
1. వైగాట్స్కీ ప్రకారం నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ ఏది?
1) విచక్షణ 2) తెలుసుకోవడం
3) వివేచన 4) సంశ్లేషణ
2. కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది?
1) పావ్లోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు
2) శాస్త్రీయ నిబంధనం S-రకం నిబంధనం
3) కార్యసాధక నిబంధనంలో కావాల్సిన ప్రవర్తనకు మాత్రమే పునర్బలనం లభిస్తుంది
4) కార్యసాధక నిబంధనంలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం
3. వైగాట్స్కీ ప్రకారం కింది వాటిలో దిగువస్థాయి మానసిక ప్రక్రియ ఏది?
1) ప్రశ్నించడం 2) సంశ్లేషణ
3) సృజనాత్మక ఆలోచన 4) విశ్లేషణ
4. శ్వాసక్రియ పాఠాన్ని అభ్యసించిన తర్వాత కిరణజన్య సంయోగక్రియ సమీకరణం జ్ఞప్తికి తెచ్చుకోవడంలో రాజేష్ ఆటంకాన్ని ఎదుర్కోవడం?
1) దమనం 2) ప్యూగ్
3) పురోగమన అవరోధం
4) తిరోగమన అవరోధం
5. కింది వాటిలో అంతర్గత ప్రేరణకు సంబంధించిన అంశం?
1) శిరీష తన తండ్రి సంతృప్తి కోసం చదువుకోవడం
2) అమృత ఆనందం పొందడానికి జీవశాస్త్ర పటాలు గీయడం
3) కళ్యాణ్ పేదలకు సాయం చేయడానికి డబ్బు సంపాదించడం
4) కుసుమ తన ఉపాధ్యాయుని దండనకు భయపడి పాఠశాలకు వెళ్లడం
6. పియాజే, బ్రూనర్ల బోధనా ప్రక్రియల్లో విభేదించిన అంశం ఏది?
1) బోధన, పరిపక్వతల మధ్య సంబంధం
2) బోధన, ప్రేరణల మధ్య సంబంధం
3) బోధన, విషయాల మధ్య సంబంధం
4) బోధన, మూల్యాంకనం మధ్య సంబంధం
7. కార్తీక్‌కు అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు పిలిచినప్పుడు వాళ్లింటికి వెళ్తే వాళ్ల తండ్రులు కూడా శిక్షిస్తారని భయపడి వెళ్లడానికి నిరాకరిస్తారు. దీనికి కారణం?
1) సామాన్యీకరణం 2) విచక్షణ
3) విరమణ
4) ఉన్నతక్రమ నిబంధన
8. వైగాట్స్కీ ప్రకారం కింది వాటిలో దిగువస్థాయి మానసిక ప్రక్రియ?
1) పోల్చడం 2) విశ్లేషణ
3) సంశ్లేషణ 4) వివేచన
9. బొమ్మలతో ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త?
1) కొహ్లెర్ 2) చోమ్స్కీ
3) వైగాట్స్కీ 4) బండూరా
10. ఇంటిపనిని ప్రోత్సహించే నియమం ఏది?
1) సంసిద్ధత నియమం
2) అభ్యాస నియమం
3) ఫలిత నియమం
4) సామీప్యత నియమం
11. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథకర్త ఎవరు?
1) పావ్లోవ్ 2) స్కిన్నర్
3) థారన్‌డైక్ 4) కొహ్లెర్
12. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడుతారు. కానీ వారు తెచ్చిన బమతుల పట్ల ఆకర్షితులై భయం పోగొట్టుకుని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం ఏమిటి?
1) పునర్బలనం 2) విరమణ
3) అయత్న సిద్ధసాస్థ్యం
4) సామాన్యీకరణ
13. పరిశీలనాభ్యసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ ఏది?
1) తాదాత్మీకరణం 2) అంతర్లీకరణం
3) వ్యవస్థీకరణం 4) నిబంధనం
14. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దోహదం చేస్తాయని అభిప్రాయపడినవారు?
1) వైగాట్స్కీ 2) చోమ్స్కీ
3) పియాజే 4) బ్రూనర్
15. సరయు ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి పాఠశాల వార్షికోత్సవంలో అదేవిధంగా ప్రవర్తించింది. అందరూ సరయుని మెచ్చుకున్నారు. బండూరా ప్రకారం సరయుకి లభించిన పునర్బలనం?
1) ప్రత్యక్ష పునర్బలనం
2) పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం
3) స్వీయ పునర్బలనం
4) చరశీల పునర్బలనం
16. అంతరదృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంప్రదాయం ఏది?
1) ప్రవర్తనా వాదం
2) గెస్టాల్ట్ వాదం
3) మనోవిశ్లేషణా వాదం
4) సంరచాత్మక వాదం
17. ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దేనికి ఉదాహరణ?
1) పునర్బలనం 2) విరమణ
3) సామాన్యీకరణ 4) విచక్షణ
18. సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు?
1) మిల్లర్ 2) డొల్లార్డ్
3) వాల్టార్స్ 4) వైగాట్స్కీ
19. ZPD అనే భావన ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందినది?
1) సాంఘిక అభ్యసన సిద్ధాంతం
2) సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం
3) మనోవిశ్లేషణా సిద్ధాంతం
4) నిబంధన సిద్ధాంతం
20. గెస్టాల్ట్ వాదులు కానివారు?
1) కర్ట్కొఫ్కా 2) మార్స్వర్ధియర్
3) కొహ్లెర్ 4) బ్రూనర్
21. పావ్లోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత ప్రతిస్పదన ఏది?
1) ఆహారం
2) ఆహారానికి లాలాజలం
3) గంట శబ్దానికి లాలాజలం
4) దీపానికి లాలాజలం
22. కార్యసాధక నిబంధనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది?
1) R-రకం అభ్యసనం
2) అభ్యాసకుడు క్రియాత్మకం
3) మొత్తం నుంచి భాగాలకు అనే సూత్రం పాటిస్తుంది
4) ప్రతిస్పందనకు, ఫలితానికి మధ్య నిబంధనం జరుగుతుంది
23. సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఏది?
1) శాస్త్రీయ నిబంధనం
2) కార్యసాధక నిబంధనం
3) యత్నదోష సిద్ధాంతం
4) అంతరదృష్టి
24. బ్రూనర్ సిద్ధాంతాల్లో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది?
1) ఉపన్యాస పద్ధతి
2) క్రియాత్మక పద్ధతి
3) ప్రతీకాత్మక పద్ధతి
4) చిత్రప్రతిమ పద్ధతి
25. తెల్లనిపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులను చూస్తే కూడా భయపడుతున్నాడు. పావ్లోవ్ ప్రకారం ఇది?
1) సామాన్యీకరణం 2) విరమణ
3) ఉన్నతక్రమ నిబంధన 4) విచక్షణ
26. అనుకరణ అభ్యసనంలోని సోపానాల వరుసక్రమం?
1) ప్రేరణ, అవధానం, ధారణ, నిష్పాదనం
2) అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం
3) అవధానం, ధారణ, నిష్పాదన, పునరుత్పాదకం
4) అవధానం, ప్రేరణ, నిష్పాదన, పునర్బలనం
27. వైగాట్స్కీ ప్రకారం కింది వాటిలో ఉన్నతస్థాయి మానసిక ప్రక్రియ ఏది?
1) విచక్షణ 2) ప్రశ్నించడం
3) పోల్చడం 4) పరిశీలించడం
28. ఈత నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సూత్రం ఏది?
1) సంసిద్ధతా నియమం
2) అభ్యాస నియమం
3) ఫలిత నియమం
4) విరమణ నియమం
29. మురళి తను ఆంగ్లం మాట్లాడితే తన గ్రామంలో గుర్తింపు లభిస్తుందని, ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఇక్కడ తీరిన అవసరం?
1) ప్రాథమిక అవసరం
2) శారీరక అవసరం
3) గౌణ అవసరం
4) ఆర్థిక అవసరం
30. సిరి బీదవారికి సాయం చేయడం గమనించిన తల్లి పూర్ణ మెచ్చుకునేసరికి బీదవారికి సాయం చేయడం సిరికి అలవాటుగా మారింది. ఇక్కడ జరిగిన అభ్యసనం?
1) S-రకం అభ్యసనం
2) R-రకం అభ్యసనం
3) నమూనా 4) అంతరదృష్టి
31. విద్యార్థుల్లోని అంతర్బుద్ధి చింతన, అన్వేషణ అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతాయని తెలిపిన సిద్ధాంతం?
1) పరిశీలన
2) బ్రూనర్ బోధనా సిద్ధాంతం
3) సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం
4) అంతరదృష్టి అభ్యసనం
32. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు………
1) పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు
2) అనుకరణ ద్వారా నేర్చుకుంటారు
3) అంతరదృష్టి ద్వారా నేర్చుకుంటారు
4) పెద్దలు, సమవయస్కులతో ప్రతిచర్యలు జరుపడం ద్వారా నేర్చుకుంటారు
33. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీన్ని ఎలా చూపవచ్చు?
1) CR+CS-…………UCR
2) CS+UCS-………CR
3) CS+UCS-……….UCR
4) UCS+CS-………CR
34. ఆవిష్కరణ అభ్యసనంగా పేర్కొన్నది?
1) బ్రూనర్ బోధనా సిద్ధాంతం
2) యత్నదోష
3) సాంఘిక అభ్యసనం
4) అంతరదృష్టి
35. మానవమితి ప్రయోగశాలను స్థాపించి అందు లో స్మృతిపై ప్రయోగాలు చేసినవారు?
1) ఎబ్బింగ్ హాస్ 2) గాల్టన్
3) ప్లేట్ 4) బాగ్లే
36. శబ్దప్రమాణం ద్వారా మాపనం చేసేది?
1) స్మృతి 2) వైఖరి
3) ప్రజ్ఞ 4) సహజ సామర్థ్యం
37. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించినది?
1) వైగాట్స్కీ 2) బ్రూనర్
3) పావ్లోవ్ 4) బండూరా
38. బ్రూనర్ ప్రకారం సరైన బోధనా క్రమం ఏది?
1) కృత్యాధార పద్ధతి, సమస్యా పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి
2) ప్రతీకాత్మక పద్ధతి, క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి
3) కృత్యాధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్యా పరిష్కార పద్ధతి
4) క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి
39. అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్‌లో చూసి వారి ప్రవర్తనలను, వైఖరులను అనుకరించి అభ్యసించే ప్రక్రియ ఏది?
1) సామాజిక స్కఫోల్డింగ్
2) వైకారియస్ మాడలింగ్
3) సామీప్య వికాసప్రదేశం
4) ఉద్వేగ కెథార్సిన్
40. సెల్‌ఫోన్ కొన్న తర్వాత రిస్ట్‌వాచ్ వాడకం మానేసిన పూర్ణ ఇప్పటికీ సమయం కోసం తన చేతి మణికట్టువైపు చూడటం అనేది?
1) పునర్బలనం
2) ఉన్నతక్రమ నిబంధనం
3) సామాన్యీకరణం
4) అయత్నసిద్ధ స్వాస్థ్యం
41. కార్యసాధక నిబంధనకు సంబంధించి సరైనది ఏది?
ఎ. ఆహారపు గుళికలు – సహజ ఉద్దీపన
బి. ఆహారపు గుళికలు ఎలుక తినడం – సహజ ప్రతిస్పందన
సి. మీట – అసహజ ఉద్దీపన
డి. మీటను క్కడం – అసహజ ప్రతిస్పందన
1) ఎ, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
42.అభ్యసన ప్రక్రియలో సమస్యాపద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాలనే అభ్యసన సిద్ధాంతం?
1) అంతర్దృష్టి అభ్యసనం
2) పరిశీలన అభ్యసనం
3) యత్నదోష అభ్యసనం
4) శాస్త్రీయ అభ్యసనం
43. అంతర్దృష్టి అభ్యసనం దేన్ని సమర్థిస్తుంది?
1) ఏకమొత్త అభ్యసన పద్ధతి
2) భాగాలవారి అభ్యసన పద్ధతి
3) ముక్కలు, ముక్కలుగా అభ్యసించే పద్ధతి
4) పరిశీలనా అభ్యసన పద్ధతి
44. కింది వాటిలో సరైనది ఏది?
1) యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసనం రెండింటిలో ఆలోచనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది
2) యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి అభ్యసనం రెండింటిలో అభ్యసానికి ప్రాధాన్యం ఉంటుంది
3) యత్నదోష సిద్ధాంతంలో ఆలోచనకు, అంతరదృష్టి అభ్యసనంలో అభ్యాసానికి ప్రాధాన్యం ఉంటుంది
4) యత్నదోష సిద్ధాంతంలో అభ్యాసానికి, అంతరదృష్టి అభ్యసనంలో ఆలోచనకు ప్రాధాన్యం ఉంటుంది
45. పావ్లోవ్ చేసిన ప్రయోగంలో నిబంధన ప్రక్రియ ఏర్పడిన తర్వాత గంట శబ్దం?
1) నిబంధిత ప్రతిస్పందన
2) నిర్నిబంధిత ప్రతిస్పందన
3) నిబంధిత ఉద్దీపన
4) నిర్నిబంధిత ఉద్దీపన
Answers
1.2 2.1 3.1 4.4 5.2 6.1 7.1 8.1 9.4 10.2 11.1 12.1 13.1 14.1 15.1 16.2 17.4 18.4 19.2 20.2 21.2 22.3 23.4 24.1 25.1 26.2 27.1 28.2 29.3 30.2 31.2 32.4 33.3 34.1 35.2 36.1 37.2 38.4 39.2 40.4 41.4 42.1 43.1 44.4 45.3
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?