చర్మం (Skin) పోటీ పరీక్షల ప్రత్యేకం
జీవుల దేహాన్ని కప్పి, రక్షించే పొర ‘చర్మం’. ఇది వివిధ జీవుల్లో వేర్వేరుగా ఉంటుంది. శరీరంలో అన్ని భాగాల్లో ఒకేవిధంగా ఉండదు. మానవ శరీరంలో చర్మాన్ని అతిపెద్ద జ్ఞానేంద్రియం అని పిలుస్తారు.
# చర్మం గురించి చదివే శాస్త్రాన్ని ‘డెర్మటాలజీ’ అంటారు.
# చర్మంలో రెండు భాగాలు ఉంటాయి. అవి..
# బాహ్యచర్మం (Epidermis)
# . అంతశ్చర్మం (Endodrsmis)
బాహ్యచర్మం
# బాహ్యచర్మంలో కార్నియస్ స్థరం, మాల్ఫీజియన్ స్థరం ఉంటాయి.
# కార్నియస్ స్థరంలోని కణాలు నిర్జీవ కణాలు. దీనిలో కెరోటిన్ అనే ప్రొటీన్ పదార్థం ఉంటుంది.
# చర్మానికి రంగునిచ్చే పదార్థం మెలనిన్.
# కెరోటిన్, థైరాక్సిన్ సమక్షంలో అప్పుడప్పుడు నిర్మోచనం చెందుతుంది.
# మాల్ఫీజియన్ స్థరం 2, 3 వరుసల కణాల మందం ఉంటుంది.
# ఇది కార్నియస్ స్థరాన్ని పునఃనిర్మించడంలో, గ్రంథులను ఏర్పర్చడంలో తోడ్పడుతుంది.
# క్షీరదాల్లో పైరెండు స్థరాలతోపాటు ల్యూపీడియం స్థరం, గ్రాన్యులోజా స్థరం ఉంటాయి.
జీవుల్లో బాహ్యచర్మ రూపాంతరాలు
# జీవుల్లో బాహ్య చర్మం నుంచి బాహ్యాస్థిపంజరం ఏర్పడుతుంది. ఇది వివిధ జీవుల్లో వేర్వేరుగా ఉంటుంది. వివిధ జీవుల్లో బాహ్యచర్మ రూపాంతరాలు కింది విధంగా ఉంటాయి.
# సరీసృపాలు-పొలుసులు, ఫలకాలు, నఖాలు, స్క్యూట్స్, కారాపేస్, ప్లాస్ట్రాక్లు
# పక్షులు-ఈకలు, పొలుసులు, నఖాలు, ముక్కు
# క్షీరదాలు-రోమాలు, నఖాలు, గిట్టలు, కొమ్ములు, ఎనామిల్
# జలచర క్షీరదాలు – వెంట్రుకలు, ఎనామిల్
అంతశ్చర్మం
# దీనిలో స్పంజికాస్థరం, ఘనస్థరం అనే రెండు భాగాలుంటాయి.
# దీనిలో రక్తనాళాలు, నాడీతంతువులు, కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి.
# అంతశ్చర్మం ఎగుడుదిగుడుగా ఉండటంవల్ల ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు.
స్పంజికా స్థరం
# దీనిలోని కణాల మధ్య కణాంతరావకాశాలుంటాయి.
# చర్మానికి వర్ణకాలను కలిగించే స్పంజికా స్థరాలు మూడు రకాలు. అవి..
1. మెలనోసైట్లు: ఇవి మెలనిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఇవి గోధుమ, నలుపు వర్ణాలను కలుగజేస్తాయి.
2. జాంథోఫోర్లు: వీటిలో జాంథిన్ అనే పదార్థం ఉంటుంది. ఇవి పసుపు, ఎరుపు రంగులను కలుగజేస్తాయి.
3. గ్వానోఫోర్లు (ఇరియోఫోర్లు): వీటిలో గ్వయనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇవి లేత వర్ణాన్ని కలుగజేస్తాయి.
# ఇవి ‘ఎడ్రినల్ హార్మోన్’ వల్ల సాధ్యమవుతాయి.
# చేపలు వెండివలె మెరవడానికి కారణం ‘గ్వయనిన్’ అనే పదార్థం.
# జీవుల్లో M.S.H (Malano syte Stimm ulating Harmone) సమక్షంలో ముదిరిన రంగులు ఏర్పడుతాయి.
ఘనస్థరం
# ఇందులో రక్తనాళాలు, జ్ఞాన కణాలు, నాడీ తంతువులు మొదలైనవి ఉంటాయి.
# కణాంతరవకాశాలు తక్కువగా ఉంటాయి.
# జలచర క్షీరదాల్లో చర్మానికి ‘బ్లబ్బర్’ అనే కొవ్వుపొర ఉంటుంది. ఇది ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది.
చర్మం-పరిమాణం
# మానవ శరీరంలో చర్మం ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది.
# శరీరంలో చర్మం బరువు – సుమారు 4Kg
# కంటిరెప్పలో చర్మం మందం – అర్ధ మిల్లీమీటర్
# అరికాళ్లు, అరిచేతుల్లో చర్మం మందం – అర్ధ సెంటీమీటర్
చర్మం విధులు
# ఆకారానికి, రక్షణకు, జ్ఞానేంద్రియంగా, శరీర ఉష్ణోగ్రత క్రమతకు, విసర్జన క్రియకు, రంగుల మార్పిడికి, స్పర్శగ్రాహకంగా ఉపయోగపడుతుంది.
# మానవుడిలో చర్మం విసర్జించే చెమటలో Nacl, కరిగిన CO2, యూరియా వంటి పదార్థాలుంటాయి.
# కప్పల వంటి జీవుల్లో శ్వాసావయవంగా ఉపయోగపడుతుంది.
# ఊసరవెల్లిలో రంగుల మార్పిడికి (జీవి రంగు మార్చుకోవడాన్ని ‘కామోఫ్లీజ్’ అంటారు) తోడ్పడుతుంది.
# గుడ్లుపెట్టే (పొదిగే) జీవుల్లో బాహ్యచర్మంలో ‘డయాస్టేజ్’ అనే ఎంజైమ్ ఉంటుంది.
గ్రంథులు
# ఏకకణ శ్లేష్మ గ్రంథులు: ప్రాథమిక జలచర క్షీరదాల్లో, ఉభయచరాల్లో ఉంటాయి.
# ఫిమోరల్ గ్రంథులు: తొండల తొడ భాగంలో (మగ తొండ) ఉంటాయి. వీటి స్రావం వల్ల కంటకాల వంటి నిర్మాణం సంపర్క సమయంలో ఆడ జీవులను పట్టుకోవడానికి తోడ్పడుతుంది.
# ప్రీన్ గ్రంథులు: ఇవి పక్షుల్లో ఉంటాయి. ఈకలను శుభ్రపరుస్తాయి.
# క్షీర, స్వేద గ్రంథులు: ఇవి క్షీరదాల్లో ఉంటాయి (జలచర క్షీరదాల్లో టాకిగ్సోన్లో ఉంటుంది).
# స్వేద గ్రంథులు క్షీరదాల్లో పెదవులు, ముఖంపై ఉంటాయి.
# హిప్పోపొటమస్లో చెవిడొప్పపై అధిక సంఖ్యలో స్వేదగ్రంథులు ఉంటాయి. పిల్లి, కుక్క వంటి జీవుల పాదాల్లో అధిక సంఖ్యలో స్వేద గ్రంథులుంటాయి.
చర్మ వ్యాధులు
# గజ్జి: ఎకారస్ అనే కీటకంవల్ల కలుగుతుంది.
# తామర: ఫంగస్ వల్ల వస్తుంది.
# పెల్లాగ్రా: బి3 (నియాసిన్) విటమిన్ లోపంవల్ల కలుగుతుంది.
# ఎగ్జిమా: చర్మం దళసరిగా మారి ఎరుపుగా ఉండటం.
# సొరియాసిస్: చర్మం Patches మాదిరిగా రాలిపోతుంది.
# గ్యాంగ్రిన్: చర్మానికి రక్తం సరఫరా నిలిచిపోయి ఆ భాగం నలుపు రంగులోకి మారుతుంది.
# తట్టు, ఆటలమ్మ, మశూచి: వైరస్వల్ల కలుగుతాయి.
మాదిరి ప్రశ్నలు
1. చర్మం గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని ఏమంటారు?
ఎ) డెర్మటాలజీ బి) ఆర్టియోలజీ
సి) ఇక్తియోలజీ డి) డెండ్రాలజీ
2. కార్నియస్ స్థరం దేనిలో ఉంటుంది?
ఎ) అంతశ్చర్మం బి) బాహ్యచర్మం
సి) జలచరాలు డి) అన్నీ
3. సరీసృపాల్లో పొలుసులు దేని నుంచి ఏర్పడుతాయి?
ఎ) శరీరం బి) అంతశ్చర్మం
సి) బాహ్యచర్మం డి) చర్మగ్రంథులు
4. కొవ్వు పొర ఉండే భాగం?
ఎ) బాహ్యచర్మం బి) చర్మగ్రంథులు
సి) కార్నియస్ స్థరం డి) అంతశ్చర్మం
5. చర్మానికి రంగునిచ్చే పదార్థం? ఎ) గ్వయనిన్ బి) మెలనిన్
సి) జాంథోఫోర్ డి) ఏదీకాదు
6. చేపలు వెండి రంగుల్లో మెరవడానికి కారణం?
ఎ) మెలనిన్ బి) గ్వయనిన్
సి) జాంథోపోర్
డి) ఎడ్రినల్ హార్మోన్
7. ‘బ్లబ్బర్’ అంటే?
ఎ) కొవ్వు పొర బి) అంతశ్చర్మం
సి) పొలుసులు డి) రక్తం
8. తొండ తొడ భాగం చర్మంలో ఉండే గ్రంథులు?
ఎ) శ్లేష్మ బి) ఫ్రీన్
సి) ఫిమోరల్ డి) స్వేద
9. దేనిలో చర్మం శ్వాసేంద్రియం?
ఎ) కుందేలు బి) పాములు
సి) మానవుడు డి) కప్ప
10. కంటి రెప్పల్లో చర్మం పరిమాణం?
ఎ) 1 మీల్లిమీటర్
బి) 1/2 సెం.మీ
సి) 1/2 మిల్లీమీటర్
డి) 1.5 సెం.మీ
11. చెమటను విసర్జించేవి?
ఎ) తైలగ్రంథులు బి) స్వేదగ్రంథులు
సి) రోమపుటిక డి) కొవ్వుపొర
12. స్వేదంలో ఉండే లవణం?
ఎ) CO2 బి) చెమట
సి) Nacl డి) Na
13. కింది వాటిలో వైరస్వల్ల కలిగే వ్యాధి?
ఎ) తట్టు బి) పెల్లాగ్రా
సి) గజ్జి డి) ఎగ్జిమా
14. జీవి శరీర రంగులు మార్చడాన్ని ఏమంటారు?
ఎ) ప్రీన్స్ గ్రంథి బి) డయాస్టేజ్
సి) కామోఫ్లీజ్ డి) బ్లబ్బర్
15. ఎకారస్ కలుగజేసే చర్మ వ్యాధి?
ఎ) మశూచి బి) తట్టు
సి) పెల్లాగ్రా డి) గజ్జి
16. చర్మానికి రక్తం సరఫరా నిలిచిపోయి ఆ భాగం నలుపు రంగులోకి మారితే అది..?
ఎ) గ్యాంగ్రిన్ బి) పెల్లాగ్రా
సి) మశూచి డి) ఏదీకాదు
17. పాదాల్లో అధిక సంఖ్యలో స్వేదగ్రంథులు ఉండే జీవులు?
1. పిల్లి 2. కుక్క
3. మానవుడు 4. పక్షులు
ఎ) 1, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 4
18. ఘనస్థరంలో ఉండేవి
1. రక్తనాళాలు 2. జ్ఞాన కణాలు
3. నాడీ తంతువులు 4. స్వేదగ్రంథులు
ఎ) 1, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 3, 4
జవాబులు
1-ఎ 2-బి 3-సి 4-డి
5-బి 6-బి 7-ఎ 8-సి 9-డి 10-సి 11-బి 12-సి
13-ఎ 14-సి 15-డి 16-ఎ
17-బి 18-సి
బొడ్డుపల్లి రామకృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్, డీవీఎం కాలేజ్ ఆఫ్
ఎడ్యుకేషన్-నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు