ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ కాదు..!
-ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది… అంటూ మధ్యలోనే ఆపేశాడు నందు సార్. మధ్యలోనే ఆపి స్టూడెంట్స్ వంక అర్థవంతంగా చూశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ విద్యార్థులంతా సమాధానం చెప్పారు.
-వెరీ గుడ్. కానీ ఈ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే భావనతో ఎంతమంది పూర్తిగా ఏకీభవిస్తారు?అని అడిగితే అందరూ ఒకేసారి చేతులు ఎత్తారు.
-మీరంతా చాలామందిలానే పొరబాటు అభిప్రాయంలో ఉన్నారు. ఈ ఫ్రేజ్ లేదా నానుడి పూర్తిగా సరికాదు అన్నాడు నందు సార్.
-అదెలా సార్? అని విద్యార్థులు అడిగారు.
-అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది శ్రావణి. ఆత్మవిశ్వాసానికి తను ప్రతీక. కానీ, శ్రావణి చూడటానికి సాధారణంగా కూడా ఉండదు. నల్లటి శరీరఛాయ, సోడాబుడ్డి కళ్లజోడు, ముఖమంతా స్ఫోటకం మచ్చలు, అందరికన్నా బాగా పొట్టి. తనకు ఆత్మన్యూనత భావనలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. చిన్నప్పట్నుంచీ అనేక కామెంట్లు ఎదుర్కొంటూ తనలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంకా బలపడింది.
కానీ నందు సార్ శిక్షణ వల్ల తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని అధిగమించగలిగింది. తన ఆలోచనలు తిరిగి గతంలోకి వెళ్లాయి. క్లాసులో జరిగిన ఓ గమ్మత్తయిన సంఘటన తన జీవిత గతినే మార్చివేసింది.
-సార్ క్లాస్‌కి ఆలస్యంగా రావడం అసంభవం. ఒకరోజు ఆయనింకా క్లాసుకి రాలేదు.
-ఓ అపరిచితుడు అకస్మాత్తుగా క్లాసులోకి ప్రవేశించాడు. ఆయన్ని చూడగానే చక్కటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఎవరికైనా. కమాండింగ్ ద రెస్పెక్ట్ అని ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లిష్‌లో. ఆ అపరిచితుడిని చూడగానే అందరూ అసంకల్పితంగా లేచి నించుని ఆయనకు గ్రీట్ చేశారు. ఆరడుగుల ఎత్తు తెల్లటి శరీర ఛాయ సూటు, బూటు, టై, మెడలో ఐడీకార్డు, చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్. ఇదీ ఆయన గెటప్. గుడ్ మార్నింగ్ సార్ అందరూ గ్రీట్ చేయగానే అయోమయానికి గురవటం ఆయన వంతయింది.
-అయ్య బాబోయ్! నాకు ఇంగ్లిష్ తెలీదండి, మన్నించండి. డ్రామా కంపెనీలో పనిచేస్తున్నాను. పొరబాటున ఇక్కడికి వచ్చాను. ఏమనుకోకండి అంటూ చల్లగా జారుకున్నాడు. అందరూ తెల్లబోయారు.
-తిరిగి నందు సార్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇంతలో ఇంకో అపరిచితుడు క్లాసులోకి ప్రవేశించాడు. చూట్టానికి బక్కపలచగా, కాస్త నలుపునకు దగ్గరగా అతి సామాన్యుడిలా ఉన్నాడితడు. సాదాసీదా ప్యాంటు, షర్టు, ఇన్‌షర్టు కూడా చేసుకోలేదు. హవాయి చెప్పులు, మామూలు కళ్లజోడు, నూనెపెట్టి కుదురుగా దువ్విన పల్చటి క్రాఫింగ్. ఇదీ ఇతడి అవతారం. ఏదయినా చందా అడగడానికి వచ్చాడేమోనని చూశారు అందరూ. అంతకుమించి ఆయన గురించి శ్రావణికి కూడా మరే ఇతర ప్రత్యేక అభిప్రాయం కలగలేదు.
-అందరి అంచనాల్ని అభిప్రాయాల్ని తల్లకిందులు చేస్తూ ఆ వ్యక్తి నేరుగా వేదికవైపు నడిచాడు. చూస్తుండగానే మైకు అందుకుని గొంతు సవరించుకుని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు. స్వచ్ఛమైన, సులభమైన ఇంగ్లిష్‌లో అది ఉపన్యాసమా! కాదుకాదు అది సమ్మోహనపర్చే వాగ్ధాటి. ఎదుటివారిని మంత్రముగ్ధులను చేసి, కట్టిపడేసే ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వ వికాస ప్రసంగం. ఓ జీవితకాలానికి సరిపడా ఆత్మవిశ్వాసం, మోటివేషన్ పుష్కలంగా అందించాడు. తన రెండుగంటల ప్రసంగంలో తరువాత తెలిసింది ఆయన నందు సార్ ఫ్రెండ్ అని. గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చాడని.
-ఆయన ప్రసంగం ముగియడమే ఆలస్యం విద్యార్థులంతా ఆయన చుట్టూ మూగిపోయారు. ఇంతలో నందు సార్ కూడా వచ్చి నిశ్శబ్దంగా వారిలో చేరిపోయారు.
-గెస్ట్ ఫ్యాకల్టీకి వీడ్కోలు చెప్పిన అనంతరం మైకు అందుకున్నాడు నందుసార్.
-మీకో చిత్రమైన విషయం చెప్పనా? మొదట టిప్‌టాప్‌గా వచ్చిన ఆరడుగుల ఆజానుబాహుడైన డ్రామా కంపెనీ వ్యక్తి కూడా మన ఫ్యాకల్టీ మెంబరే. కేవలం మీకొక బలమైన పాఠం చెప్పడానికి అలా డ్రామా ఆడాడు అంతే. ఫస్ట్ ఇంప్రెషన్ గురించి తెలుసుకుందాం ఈ రోజు.
-ఆరడుగుల అందగాడు టిప్‌టాప్‌గా ఉన్నాడు. ఆయన్ని చూడగానే మీకందరికీ మంచి ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది. కానీ ఎప్పుడయితే ఆయన నిరక్షరాస్యుడు అని, ఇంగ్లిష్ కూడా రాదని భావించారో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ కాస్తా తుడిచిపెట్టుకుపోయింది.
అంటే ఏమిటర్థం? అప్పియరెన్స్‌ను బట్టి, శరీరవర్ణాన్ని బట్టి, వారి ఖరీదైన ఉపకరణాల్ని బట్టి ఏర్పడే ఫస్ట్ ఇంప్రెషన్ బలమైంది కాదు. ఇది తాత్కాలికం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?