వైరస్ల గురించి మీకేం తెలుసు?
వైరస్లు అతిచిన్న సూక్ష్మజీవులు. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. వైరస్‌లను కనుగొన్నది ఇవనోవ్ స్కీ. వీటికి పేరు పెట్టింది బైజరింక్. వైరస్ల అధ్యయనాన్ని ‘వైరాలజీ’ అంటారు. ఈ వైరస్లవల్ల మానవుల్లో, ఇతర జీవుల్ల్లో రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వైరస్లు అప్పటికే వైరస్ బారినపడిన రోగులను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, రోగులు తాకిన వస్తు వులను ముట్టుకోవడం ద్వారా, గాలి ద్వారా, కలుషిత నీరు, ఆహారం ద్వారా, ఈగలు, పందులు, గబ్బిలాల వంటి వివిధ జీవుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ కథనంలో వైరస్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వైరస్లు ఇతర జీవుల్లో రకరకాల వ్యాధులను కలుగజేసే చిన్న సూక్ష్మజీవులు. వీటిలో కణ నిర్మాణం ఉండదు. కాబట్టి శ్వాసక్రియ, ఇతర జీవక్రియలు జరుగవు. ఇవి ఇతర జీవులపై దాడిచేసి జీవనం గడుపుతాయి. వీటిని అవికల్ప పరాన్న జీవులు అంటారు. ఎందుకంటే ఇవి ఇతర జీవులపై దాడిచేసినప్పుడు సజీవంగా, ఇతర సమయాల్లో వాతావరణంలో స్ఫటికాల రూపంలో నిర్జీవంగా ఉంటాయి. అందుకే వీటిని ‘సజీవులకు, నిర్జీవులకు మధ్య సంధాన సేతువులు’ అని కూడా అంటారు.
వైరస్ల దేహ నిర్మాణం
వైరస్లు రసాయనికంగా న్యూక్లియో ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి. అంటే వీటి నిర్మాణంలో మధ్యలో కేంద్రకామ్లం, దాని చుట్టూ ప్రొటీన్ నిర్మిత ‘కాప్సిడ్’ అనే తొడుగు ఉంటాయి. జంతువులపై దాడిచేసే వైరస్లలో కేంద్రకామ్లం DNA, మొక్కలపై దాడిచేసే వైరస్లలో కేంద్రకామ్లం RNA ఉంటాయి. జెనెటిక్ ఇంజినీరింగ్ లేదా బయోటెక్నాలజీ ప్రయోగాల్లో వాహకంగా ‘లెంటి వైరస్’ను ఉపయోగిస్తారు. ఇది మొక్కలపై తెగుళ్లను కలుగజేసే వివిధ రకాల కీటకాలను సంహరిస్తుంది. అందుకే దీన్ని ‘జీవ కీటకనాశిని (బయో ఇన్సెక్టిసైడ్)’ అంటారు.
వైరస్లవల్ల సంక్రమించే వ్యాధులు
వైరస్లు మనుషులతోపాటు వివిధ జీవుల్లో రకరకాల వ్యాధులను కలుగజేస్తాయి. పశువుల్లో ‘మ్యాడ్ కౌ (Madcow)’ వ్యాధి, గొర్రెల్లో స్క్రాపీ వ్యాధి కలుగజేస్తాయి. పపువా న్యూగినియాలోని మానవ తెగల్లో వైరస్లవల్ల ‘కురు (Kuru)’ వ్యాధి సంక్రమిస్తుంది.
ఇక మానవుల్లో వారిసెల్లా అనే వైరస్వల్ల ఆటలమ్మ (చికెన్ పాక్స్), వారియోలా అనే వైరస్వల్ల మశూచి (స్మాల్ పాక్స్), పారామిక్సో వైరస్వల్ల తట్టు (మీజిల్స్), రెనో వైరస్వల్ల జలుబు, మిక్సోవైరస్ పెరోటిడస్ అనే వైరస్వల్ల గవదబిళ్లలు (మంప్స్), ఆల్ఫా వైరస్/CHIK-V వైరస్వల్ల చికున్ గున్యా, ఆర్బో వైరస్వల్ల డెంగ్యూ, మెదడు వాపు, రాబ్డో వైరస్వల్ల రేబిస్, కరోనా వైరస్వల్ల సార్స్, హెపటైటిస్-B వైరస్ వల్ల పచ్చకామెర్లు, ఎంటిరో వైరస్ లేదా పోలియో మైలిటిస్ వైరస్వల్ల పోలియో (శిశు పక్షవాతం), ఆర్థో మిక్సో వైరస్వల్ల ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా), H1N1 వైరస్ ద్వారా స్వైన్ ఫ్లూ, HIV లేదా రిట్రోవైరస్ ద్వారా ఎయిడ్స్, ఎబోలా వైరస్వల్ల ఎబోలా హెమరేజిక్ జ్వరం అనే వ్యాధులు కలుగుతాయి.
వైరస్ వ్యాధులు, అవి సంక్రమించే తీరు
వైరస్ వ్యాధి – సంక్రమణ
ఇన్‌ఫ్లూయెంజా – రోగిని ప్రత్యక్షంగా తాకడం, వస్తువుల ద్వారా
మశూచి (స్మాల్ఫాక్స్) – రోగిని ప్రత్యక్షంగా తాకడం, వస్తువుల ద్వారా
ఆటలమ్మ (చికెన్‌ఫాక్స్) – రోగిని ప్రత్యక్షంగా తాకడం, వస్తువుల ద్వారా
తట్టు (మీజిల్స్) – రోగిని ప్రత్యక్షంగా తాకడం, గాలి ద్వారా
గవద బిల్లలు (మంప్స్) – రోగిని ప్రత్యక్షంగా తాకడం, లాలాజలం ద్వారా
పొలియో – కలుషిత నీరు, ఆహారం, ఈగల ద్వారా
రేబిస్ – పిచ్చికుక్క కాటు ద్వారా
ఎయిడ్స్ – రక్తమార్పిడి, లైంగిక సంబంధాలు, కలుషిత సిరంజిలు, బ్లేడ్ల ద్వారా
పచ్చ కామెర్లు (హెపటైటిస్-బీ)- రక్తమార్పిది, కలుషిత ఆహారం, నీరు, వీర్యం ద్వారా
మెదడు వాపు – పందుల ద్వారా
స్వైన్‌ఫ్లూ – పందుల ద్వారా
ఎబోలా – పండ్ల గబ్బిలాల ద్వారా
దాడి చేసే అతిథేయి ఆధారంగా వైరస్ల రకాలు
జంతువులపై దాడిచేసే వైరస్ – జాఫేజ్
మొక్కలపై దాడిచేసే వైరస్ – ఫైటోఫేజ్
శిలీంద్రాలపై దాడిచేసే వైరస్ – మైకోఫేజ్
ఈస్ట్‌లపై దాడిచేసే వైరస్ – జైమోఫేజ్
బ్యాక్టీరియాలపై దాడిచేసే వైరస్ – బ్యాక్టీరియోఫేజ్
నీలిఆకుపచ్చ శైవలాలపై దాడిచేసే వైరస్ – సయనోఫేజ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు