‘Gun Kingdom’?తుపాకీ రాజ్యం నాటిక రాసిన కవి?
తెలంగాణ పోరాటాన్ని కావ్య వస్తువుగా స్వీకరించి 1949లో తెలంగాణ కావ్యాన్ని 16 పర్వములుగా రాసిన కవి?
– కుందుర్తి ఆంజనేయులు
పూర్తిగా వచన కవిత్వంలో మొదటి కావ్యం?
— కుందుర్తి తెలంగాణ (తెలంగాణ తొలి తెలుగు విప్లవ కావ్యం)
తెలంగాణ పోరాటాన్ని చిత్రించే కావ్యం?
– గంగినేని రాసిన ఉదయిని
కేవీ రమణారెడ్డి రాసిన తెలంగాణ పోరాట కావ్యాలు?
– అడవి, భువన ఘోష్
హరీంధ్రనాథ్ చటోపాధ్యాయ రాసింది?
– Tales of Telangana
తెలంగాణలో సామాన్యులు అనుభవించే బాధలను చిత్రీకరించిన కావ్యం?
– ఆరుద్ర త్వమేవాహం
కాక్సార్ ఉద్యమం అంటే?
– ముసల్మానుల ఆత్మరక్షణ కోసం ఇచ్చే సాయుధ శిక్షణ
ఆర్య సమాజం ముఖ్య గ్రంథం?
– సత్యార్థ ప్రకాశిక (తొలి తెలుగు అనువాదం 1921లో ప్రచురితమైంది)
పోలీస్ చర్యకు ముందు హైదరాబాద్లో భారత ప్రభుత్వ ఏజెంట్గా ఉన్నవారు?
– కేఎం మున్షీ
నిజాం తన రాజశాసనంలో తబ్లీగ్ను ప్రారంభించాడు. తబ్లీగ్ అంటే?
– మతాంతీకరణ
తెలంగాణ రచయితల సంఘం ఎప్పుడు ప్రారంభమైంది?
– 1952లో
మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
– 1897లో హైదరాబాద్లో
తెలంగాణ నగ్నస్వరూపం రచయిత?
– రావి నారాయణ రెడ్డి
ఇల్లెందులో బొగ్గుగనులను కనుగొన్న వారు?
– 1886లో విలియం కింగ్
తుపాకీ రాజ్యం నాటిక రాసిన కవి?
– కేఎల్ఎన్ రావు
తెలంగాణలో అతిపెద్ద జాతర?
– సమ్మక్క, సారక్క జాతర
జై బోలో తెలంగాణ-నిలువెల్ల గాయాల వీణ పాట రచయిత?
– అందెశ్రీ
బోనాల పండుగ సందర్భంగా చేసే నృత్యం?
– గరగ నృత్యం
తెలంగాణ కవి సామల సదాశివ ఎప్పుడు మరణించారు?
– 2012, ఆగస్టు 7న
తెలంగాణ ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కథానాయకుడు కాంతారావు నిర్మించిన సొంత సినిమా?
– సప్తస్వరాలు
శ్రీనాథుడు, పోతన, అన్నమయ్యల్లో సమవయస్కులు?
– పోతన, అన్నమయ్య
కలకత్తా కాంగ్రెస్ కన్నా 10 ఏండ్ల ముందే స్వదేశీ ఉద్యమం లేవదీసిన తెలంగాణ వ్యక్తి?
– రావిచెట్టు రంగారావు
స్వామీ రామానంద తీర్థ అసలు పేరు?
– వెంకట్రావ్ ఖేడ్కర్
హైదరాబాద్లోని సితారాంభాగ్లో సంస్కృత పాఠశాలను ఎన్కే రావు స్థాపించారు. ఆయన ఏ జిల్లాకు చెందినవారు?
– మహబూబ్నగర్ జిల్లా, బిక్కేపల్లి
వరంగల్ కోటలో శంభుని గుడిలో ఉన్న పార్శనాథ విగ్రహం చుట్టూ ఎన్ని ప్రతిమలు ఉన్నాయి?
– 23 తీర్థంకరులు
నిజామాబాద్ జిల్లా బోధన్ను శాసనాల్లో ఏమని పేర్కొన్నారు?
– బహుధాన్యపురం
కరీంనగర్ జిల్లా కుర్క్యాల గ్రామం వద్ద ఉన్న గుట్టపై ఉన్న చక్రేశ్వరి దేవతను మలిచినవారు?
– జీనవల్లభుడు
నాగర్కర్నూల్ వద్ద ఉన్న వర్ధమానపురం ఎవరిపేరుతో వెలసింది?
– జైన వర్ధమానుడు
పెద్దపల్లి వద్ద ఉన్న అప్పారావు పేట?
– జైన కేంద్రం
తెలంగాణ విమోచనోద్యమం రాసినవారు?
– వరవరరావు
మొదటి సాలార్జంగ్ ఏ నిజాం వద్ద దివాన్గా పనిచేయలేదు?
– సికిందర్జా
స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు కలిగిన అసఫ్జాహీ రాజు?
– అఫ్జల్ ఉద్దౌలా
గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి తెలంగాణ-ఆంధ్రుల కర్తవ్యం పుస్తకాన్ని రచించింది?
– సురవరం ప్రతాపరెడ్డి
Previous article
విజ్ఞానశాస్త్ర బోధన – లక్ష్యాలు
Next article
విజ్ఞానశాస్త్ర లక్ష్యాలు – స్పష్టీకరణలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు