విజ్ఞానశాస్త్ర లక్ష్యాలు – స్పష్టీకరణలు
లక్ష్యాలు-ప్రధాన అంశాలు
ఎ. అభ్యాసకుడి అవసరాలు, సామర్థ్యాలు
బి. సమాజ అవసరాలు
సి. విషయ పరిజ్ఞాన స్వభావం
డి. విద్యావ్యవస్థ స్వభావం
ఈ. భవిష్యత్తు ప్రణాళిక
విజ్ఞానశాస్త్రంలో లక్ష్యాలు – స్పష్టీకరణలు – వివరణ
-జ్ఞానరంగం లక్ష్యాలు: జ్ఞానం: విద్యార్థి విజ్ఞానశాస్త్ర సంబంధమైన పదాలు, సత్యాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, నియమాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానం పొందుతాడు.
1. జ్ఞప్తికి తెచ్చుకోవటం: విద్యార్థి విజ్ఞానశాస్త్ర సంబంధమైన పదాలు, సత్యాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, నియమాలు, పద్ధతులు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.
2. గుర్తించటం: విజ్ఞానశాస్త్ర సత్యాలు, భావనలు, సూత్రాలు, నియమాలు గుర్తిస్తాడు.
లక్ష్యం 2 అవగాహన: పదాలు, సత్యాలు, భావనలు అవగాహన చేసుకుంటాడు.
-భావనలు, నియమాలు, సూత్రాలను ఉదహరిస్తాడు.
-వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను వివరిస్తాడు.
-ఇచ్చిన వాక్యంలోని దోషాలను సవరించి సరిచేస్తాడు.
-వివిధ భావనలు సూత్రాలు, నియమాలు సరిచూస్తాడు.
-విద్యార్థి శాస్త్రీయ పదాలు, సమీకరణాలు, గుర్తులు, పట్టికలు అనువదిస్తాడు.
-విద్యార్థి చిత్రపటాలను, రేఖాపటాలను, దత్తాంశాలపై వ్యాఖ్యానం చేస్తాడు.
-విద్యార్థి శాస్త్ర సత్యాలను, భావనలను, ప్రక్రియలను సరిపోల్చుతాడు.
-విద్యార్థి సమీప సంబంధం గల భావనలు, సూత్రాలు, ప్రక్రియల మధ్య వివేచనం చేస్తాడు.
-విద్యార్థి విజ్ఞానశాస్త్ర సత్యాలను, భావనలు వర్గీకరిస్తాడు.
-విద్యార్థి భౌతికశాస్త్ర సత్యాలకు, భావనలకు, ప్రక్రియలకు సూత్రాలకు మధ్య గల భేదాలను తెలుపుతాడు.
-విద్యార్థి విజ్ఞానశాస్త్ర ప్రక్రియలు, భావనలు, సత్యాలు మధ్య గల సంబంధాలను గుర్తిస్తాడు.
-విద్యార్థి వివిధ భౌతికశాస్త్ర పరికరాలను, సిద్ధాంతాలను, పద్ధతులను వర్ణిస్తాడు.
-సమస్యలను సాధిస్తాడు.
-విజ్ఞానశాస్త్ర పరికరాలను, రసాయనాలను ఎన్నుకుంటాడు.
-భౌతికరాసులకు సరైన ప్రమాణాలు తెలుపుతాడు.
లక్ష్యం 3 వినియోగం (అన్వయం): విద్యార్థి నేర్చుకొన్న విజ్ఞానశాస్త్ర విజ్ఞానాన్ని (జ్ఞానాన్ని, అవగాహనను) నూతన పరిస్థితుల్లో వినియోగిస్తాడు.
స్పష్టీకరణలు
-భావనలు, సూత్రాలు, నియమాలు మొదలైన వాటిని విశ్లేషిస్తాడు.
-విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని నేరుగా వినియోగిస్తాడు.
-విద్యార్థి వివిధ భౌతికశాస్త్ర ప్రక్రియలకు, దృగ్విషయాలకు కారణాలు తెలుపుతాడు.
B. భావావేశ రంగం లక్ష్యాలు: జ్ఞానాత్మక రంగానికి ఉన్న ప్రాధాన్యత, నిర్దిష్టత దీనికి లేవు. తగిన లక్ష్యతక మూల్యాంకనా మాపనాలు కూడా లేవు. వీటిని అభివృద్ధి చేయాలి.
లక్ష్యం 1. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి: జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి. జ్ఞానం పొందే విధానంలో నమ్మకం ఉండటం, నిష్పాక్షక దృష్టిని ప్రదర్శించటం, సమస్యా పరిష్కార పద్ధతిని రూపొందించటం మొదలైనవి.
స్పష్టీకరణలు
-నిజాయితీని పెంపొందించుకుంటాడు.
-అభిప్రాయాలు ఏర్పరుచుకోవటం.
-నమ్మికను కలిగి ఉండటం.
-విజ్ఞానశాస్త్ర పనులు చేయటంలో పట్టుదల.
-కుతూహలం.
-ఆలోచనా సరళి
లక్ష్యం 2 అభిరుచి: గ్రహించిన ఉద్దీపనలకు ప్రతి స్పందనలు మొదలవగానే అభిరుచి ఏర్పడుతుంది.
స్పష్టీకరణలు
ఎ. ప్రదేశాల సందర్శన
బి. నమూనాలు, చిత్రాలు, మ్యాప్‌ల సేకరణ.
సి. జ్ఞానానేష్వణ చేయటం.
డి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటం.
ఈ. పరికరాల తయారీ
లక్ష్యం 3 అభినందన: శాస్త్ర విజ్ఞాన క్రమాన్ని అభివృద్ధిని విద్యార్థులు అభినందిస్తారు.
-శాస్త్ర ప్రాముఖ్యాన్ని గ్రహించటం.
-ఆవిష్కరణలు, అన్వేషణల గొప్పదనాన్ని గుర్తించటం.
-మానవ ప్రయత్నం అభినందిస్తాడు.
-ప్రకృతిని అభినందిచటం.
-శాస్త్రజ్ఞుల సేవలు అభినందించటం
-దృగ్విషయాలలో భిన్నత్వంలోని ఏకత్వాన్ని అభినందిస్తాడు.
C.మానసిక చలనాత్మక రంగం లక్ష్యాలు: ఆలోచనలకు, ఆచరణలకు మధ్య సమన్వయమే ఈ రంగం. ఈ రంగానికి చెందిన ముఖ్య లక్షణం నైపుణ్యం. మెదడు కండరాల సమన్వయమే ఈ మానసిక చలనాత్మక రంగం. చిత్రలేఖన నైపుణ్యాలు, హస్త నైపుణ్యాలు, అభివ్యజంన నైపుణ్యాలు, నివేదనా నైపుణ్యాలు మొదలైనవి.
-చిత్రలేఖనా నైపుణ్యం: వివిధ రకాల పటాలు గీయటం.
స్పష్టీకరణలు
ఎ. కచ్చితత్వంగా గీయటం.
బి. శుభ్రంగా గీయటం.
సి. పటాలలోని భాగాలు గీయటం.
డి. నిర్ణీత కాల వ్యవధిలో గీయకలుగటం.
-హస్త నైపుణ్యాలు: వివిధ వస్తువులు, చేతుల మధ్య సమన్వయంతో జరిగే నైపుణ్యాలను హస్త నైపుణ్యాలంటారు.
స్పష్టీకరణలు
ఎ. నమూనాలు తయారుచేయటం
బి. ప్రత్యామ్నాయ పరికరాలను తయారుచేయటం.
సి. పరికరాలు పట్టుకోవటం.
డి. పరికరాలను వాడటం.
ఈ. పరికరాల భద్రత.
పరిశీలనా నైపుణ్యాలు: పరిశీలనే ప్రయోగానికి పునాది. కచ్చితంగా, నిర్మాణాలు, భాగాలు, నమూనాలు నివేదిస్తాడు.
అభివ్యంజన నైపుణ్యాలు: ఉపాధ్యాయుని బోధనా విజయం అతనిపై ఆధారపడి ఉంటుంది. కచ్చితమైన పదాలు-భాష-సరళత అనుసరిస్తాడు.
నివేదనా నైపుణ్యాలు: విషయాన్ని పరిశీలించటం-దత్తాంశాన్ని సేకరించటం- విశ్లేషణ చేయటం ఎంత ముఖ్యమో మొత్తం పరిశీలనను నివేదించటంలో తగిన నైపుణ్యాన్ని సాధించటం అంత ముఖ్యం.
స్పష్టీకరణలు
ఎ. నివేదన భాషలో స్పష్టత
బి. కచ్చిత పదాల ఎన్నిక
సి. వివిధ విషయాలను సూక్ష్మీకరించటం
డి. పట్టికలలో అమర్చటం
ఈ. తార్కిక పద్ధతిలో విషయాల అమరిక
ఎఫ్. కచ్చితంగా నమోదు చేయటం
-పాఠశాలలో ని ప్రతి దశలోనూ కొన్ని సామర్థ్యాలను పెంపొందించాలని 1986 జాతీయ విద్యావిధానం తెలుపుతుంది.
-విజ్ఞానశాస్త్రం- సహసంబంధం: ఒక విద్యా విషయం-అభివృద్ధికి మిగిలిన విద్యా విషయాలు సహాయపడుతాయి. దీనినే సహసంబంధం అంటారు. బోధనా విధానాలకు ఎంతటి చరిత్ర ఉంటుందో ఈ సహసంబంధానికి కూడా అంతే చరిత్ర ఉంటుంది.
-విజ్ఞానశాస్ర్తానికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వేరే విద్యా విషయాలతో సంబంధం ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు