‘Kaviloka Bhojudu’ | కవిలోక భోజుడు అనే బిరుదుగలవారు?
శేషం లక్ష్మీనారాయణాచార్య
కాలం: 1947-98
జన్మస్థలం: కరీంనగర్ జిల్లా నగునూరు
-పడ్త్య, వచన, గేయ, కవితలు రచించాడు.
-ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు స్రవంతి పత్రికలో ప్రచురించారు.
-స్రవంతి పత్రిక నడిపినది దక్షిణ భారత హిందీ ప్రచార సభ
-లలిత మనోహరంగా దైవభక్తి, దేశభక్తి గేయాలు రాయడం లో ఈయన సుప్రసిద్ధులు
-ఈయన రైతులు, సైనికులను స్మరిస్తూ వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అనే గేయాన్ని రాశారు.
-ఈయన స్వరభారతి అనే గేయ సంకలనం రచించారు.
-గేయమంటే చరణం, పల్లవి ఉండి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
చిన్నయసూరి
కాలం: క్రీ.శ. 1806-62
స్థలం: శ్రీపెరంబుదూరు
తల్లిదండ్రులు: శ్రీనివాసాంబ-వేంకటరంగాచార్యులు
బిరుదు: సూరి
గురువు: కంచి రామానుజాచార్యులు
నడిపిన పత్రిక: సుజన రంజని
రచనలు: నీతి చంద్రిక, శబ్ధ లక్ష్మణ సంగ్రహం, బాలవ్యాకరణం, అక్షరగుచ్ఛం, నీతి సంగ్రహం, ఆంధ్రశబ్ధ చింతామణి వ్యాఖ్య
-నీతి చంద్రికను అర్బత్నాట్ దొరకు అంకితం చేశారు.
-శబ్ధ లక్షణ సంగ్రహాన్ని గాజులశెట్టి నరసింహశెట్టికి అంకితం చేశారు.
గమనిక: పశుపక్ష్యాదులను పాత్రలుగా పెట్టి సమాజానికి గీతిని తెలియజేశారు.
-సూరి రచించిన నీతిచంద్రికకు మూలమైన రచన సంస్కృతంలో విష్ణుశర్మ రచించిన పంచతంత్రం
-ఈయన తండ్రి వేంకట రంగాచార్యులు వ్యాసాన్ని సంగ్రహాలు అన్నారు.
పల్లా దుర్గయ్య
కాలం: 1914-83
జన్మస్థలం: వరంగల్లు జిల్లా మడికొండ
రచనలు: పాలవెల్లి పద్యాలు, గంగిరెద్దు, ప్రబంధ వాజ్ఞయ వికాసం, చతురవచోనిధి, అల్లసాని పెద్దన
-ఈయన నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణంపై పరిశోధన చేశారు.
-రామరాజ భూషణుడు రచించిన వసు చరిత్రపై విమర్శనా వ్యాసం రాశారు.
-ఉస్మానియా వర్సిటీ నుంచి మొదటి ఎంఏ పట్టా పొందారు.
వానమామలై వరదాచార్యులు
కాలం: 1912-84
జన్మస్థలం: వరంగల్ జిల్లా మడికొండ గ్రామం.
బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి
రచనలు: జయధ్వజం, మణిమాల, మచ్చు తునక, పోతన చరిత్రము, జోగినీలాస్యం, సూక్తి వైజయంతి, వ్యాసవాణి, రైతుబిడ్డ, కూలిపోయేకొమ్మ
-ఈయన ఐదు ప్రసిద్ధ క్షేత్రాల (తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం, సింహాచలం, బాసర) గురించి తెలుపుతూ సవరాంజ పంచశతిని రచించారు.
-మానవులంతా మనవాళ్లే అనే నవల రచించారు.
-రైతు బిడ్డ (బుర్రకథా సంపుటి)
-మణిమాల (దేశభక్తి, దైవభక్తి, సంఘ సంస్కరణ, పల్లెజన వాతావరణం కనిపిస్తుంది)
-ఈయన బుద్ధ చరితం, ప్రజాసేవ, మనదే జయం, ఎవడు రాజు, చైనా యుద్ధం అనే బుర్ర కథలు రాశారు.
గోన బుద్ధారెడ్డి
శతాబ్ది: 13
తండ్రి: విరల రంగనాథుడు
బిరుదులు: కవి కల్ప తరువు, కవిలోక భోజుడు
రచన: రంగనాథ రామాయణం
-తన తండ్రి పేర రచన చేయడం వల్ల రంగనాథ రామాయణం అనే పేరు వచ్చింది.
-ఇది తెలుగులో తొలి రామాయణం.
-రంగనాథ రామాయణం ద్విపద కావ్యం
-రంగనాథ రామాయణంలో యుద్ధకాండ వరకు గోన బుద్ధారెడ్డి రాయగా, ఉత్తర భాగాన్ని ఆయన కుమారులు కాచవిభుడు, విఠలనాథుడు పూర్తిచేశారు.
-గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించాడని బూదపూరు శాసనం (మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది) తెలుపుతుంది.
పొట్లపల్లి రామారావు
కాలం: 1917-2001
జన్మస్థలం: ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం
రచనలు: ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కక్ష,జీవితం, జైలు
-పొట్లపల్లి రామారావు కవి మరణిస్తాడు, కావ్యం బతికి ఉంటుంది, కవి శరీరం, ఆత్మ అని పలికారు.
-వరంగల్లులో సత్యాగ్రహం చేసిన తొలికవి
-ఈయన కాళోజీ, వట్టికోట ఆళ్వారు స్వామి రచనల చేత ప్రభావితులయ్యారు.
సుద్దాల హన్మంతు
కాలం: 1910-85
జన్మస్థలం: నల్లగొండ జిల్లా, పాలడుగు గ్రామం
రచనలు: వీర తెలంగాణ, గొల్ల సుద్దులు, పల్లెటూరి పిల్లగాడా, రాజకీయ సాధువేషాలు
-ఈయన గొల్ల సుద్దులు, బుర్రకథలు, యక్షగానాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు.
కొరవి గోపరాజు
కాలం: 15వ శతాబ్దం
ఆస్థానం: పల్లికొండ సంస్థానంలో ఆస్థాన పండితుడు
రచన: సింహాసన ద్వాత్రింశిక (12 అశ్వాసాల కథా కావ్యం)
అంకితం: హరిహర నాథుడు
-సింహాసన ద్వాత్రింశిక మొదట ఆంధ్రుల సాంఘిక జీవనాన్ని తెలుపుతుంది.
-ద్వాత్రింశిక అంటే 32 కథలు ఉన్నాయి.
-భోజుడు విక్రమార్కుని సింహాసనాన్ని అధిష్టించే సమయంలో 32 సాలభంజికలు చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి. సాలభంజిక అంటే బొమ్మ
టి.క్రిష్ణమూర్తి యాదవ్
జన్మస్థలం: కరీంనగర్ జిల్లా
రచనలు: తొక్కుడుబండ, షబ్నం
-మొదటి రచన: తొక్కుడుబండ
-రెండో రచన: షబ్నం
-గ్రామీణ జీవితానుభవాలను, మధ్య తరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
-సరళమైన నిరాడంబర శైలి ఈయన ప్రత్యేకత
ముద్దు రామకృష్ణయ్య
కాలం: 1907-85
జన్మస్థలం: కరీంనగర్ జిల్లా మంథని
-ఈయన 1957-58 మధ్యకాలంలో ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి ఖండాల్లో అనేక దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు.
-భారతదేశ విద్యావిధానంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.
-నిరక్షరాస్యత నిర్మూలనకు ఈచ్ వన్-టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.
-ఈయన రాసిన యాత్రా చరిత్ర నా ప్రథమ విదేశీయాత్ర
కృష్ణస్వామి ముదిరాజ్
-ఈయన దక్కన్ స్టార్ ఆంగ్ల వారపత్రికను స్థాపించారు.
-హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై మాస్టర్ ప్లాన్ తయారు చేసిన కవి.
-హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాలతో పిక్టోరియల్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రచించాడు.
-భాగ్యరెడ్డి వర్మతో కలిపి ఉర్దూలో హైదరాబాద్-కి- తీస్ సాలాసియాసి జాదు జహిద్ రాశాడు.
చేమకూర వేంకట కవి
కాలం: 17వ శతాబ్దం
జన్మస్థలం: ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం.
రచనలు: సారంగధర చరిత్ర, విజయ విలాసం
-ప్రతిపద్య చమత్కారం గల కావ్యంగా విజయ విలాసాన్ని మలిచాడు.
-సారంగధర చరిత్రను పద్య కావ్యంగా రాసిన వారిలో మొదటివాడు.
-విజయ విలాస కృతికర్త రఘునాథ నాయకుడు.
సామల సదాశివ
కాలం: 1928- 2012
జన్మస్థలం: ఆదిలాబాద్ జిల్లా తెనుగుపల్లె
రచనలు: ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, సాంబశివ శతకం, స్వరలయలు, మలయమారుతాలు, సంగీత శిఖరాలు, నిరీక్షణ, ఉర్దూ కవితా సామగ్రి
స్వీయచరిత్ర: యాది
-అమ్జద్రుబాయిలకు 1964లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
-స్వరలయలు పుస్తకానికి 2011లో కేంద్ర సాహిత్ర అకాడమీ అవార్డు లభించింది.
వేముగంటి నరసింహాచార్యులు
కాలం: 1930- 2005
జన్మస్థలం: మెదక్ జిల్లా సిద్దిపేట
బిరుదులు: కవి కోకిల, విద్వత్ కవి, కావ్య కళానిధి
రచనలు: తిక్కన, రామదాసు (పద్యకావ్యాలు), మంజీర నాదాలు (గేయ కావ్యం), వివేక విజయం (కావ్యఖండిక)
-అమరజీవి, బాపూజీ, కవితాంజలి, ఆంధ్రవిష్ణువు, కాంతి వైజయంతి
సురవరం ప్రతాపరెడ్డి
కాలం: 1896- 1953
జన్మస్థలం: మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాలపాడు గ్రామం.
కలం పేర్లు: సంగ్రామ సింహ, భావకవి రామమూర్తి, విశ్వామిత్ర, చిత్రసప్త, అమృత కలశి, జంగం బసవయ్య
-చీకటిలో దివ్వె. అతడు ఆకాశంలో అరుణుడతడు అతడాంధ్రుల హృదయాంతరాన దాగిన మహాదాశయమ్మ అని సురవరం వారిని దాశరథి కీర్తించాడు.
-నడిపిన పత్రిక: గోల్కొండ
-రచనలు: శుద్ధాంత కాంత(నవల), ఉచ్చల విషాదము, భక్త తుకారాం (నాటకాలు), గ్రామ జన దర్పణం, గ్రంథాలయోద్యమం, సంఘోద్ధరణం(వ్యాసాలు), హైంధవ ధర్మవీరులు, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయి కథలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర.
-కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి సురవరం.
-పరిశోధన గ్రంథాలు: రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు