-శ్వేత విప్లవంలో భాగంగా దేశ ప్రజల అవససరాలకు సరిపడా పాల ఉత్పత్తిని సాధించడం కోసం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) ద్వారా మూడు దశల ప్రణాళికను రూపొందించారు.
-శ్వేత విప్లవంలో మొదటి దశ 1970లో ప్రారంభమై 1980లో ముగిసింది. పాల ఉత్పత్తిలో వేగం పెంచడం కోసం ఈ దశలో దేశంలో అధికంగా పాలు ఉత్పత్తయ్యే ప్రాంతాలను ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో అనుసంధానం చేశారు.
-రెండో దశ 1981 లో మొదలై 1985లో ముగిసింది. ఈ దశలో ప్రధాన పాల ఉత్పత్తి ప్రాంతాలు 18 నుంచి 136కు పెరిగాయి.
-పట్టణ ప్రాంతాల్లో పాల అమ్మకం కేంద్రాలను విస్తరించారు.
-1985వ సంవత్సరం ముగిసేసరికి 43,000 గ్రామాల్లో పాల సరఫరా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 42,50,000 కుటుంబాలు పాల ఉత్పత్తిలో భాగమయ్యాయి.
-ఆఖరి, మూడో దశ 1986లో ప్రారంభమై 1996లో ముగిసింది. ఈ దశలో పాడిపరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలతోపాటు పాల సహకార సంఘాల సంఖ్య పెరిగింది.
-అధిక పాల ఉత్పత్తి కోసం పరిశోధనలు ఊపందుకున్నాయి. పశువుల ఆరోగ్యం, పోషణ, కృత్రిమ గర్భధారణ వంటి అంశాల్లో అభివృద్ధి జరిగింది.
-ఈ విధంగా శ్వేత విప్లవం మూడు దశల ప్రణాళిక విజయవంతమైంది. దీంతో 1970కి ముందు పాల కొరత ఎదుర్కొన్న భారత్.. 1998 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలిచింది.
White Revolution | శ్వేత విప్లవం (వైట్ రివల్యూషన్)

-1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. పాల ఉత్పత్తిలో స్వయంప్రతిపత్తి సాధించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశంలో శ్వేత విప్లవాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా పిలుస్తారు.
Previous article
Gentlemen’s agreement | తెలంగాణ ఉద్యమం..పెద్దమనుషుల ఒప్పందం
Next article
A test of talent | ప్రతిభకు పరీక్ష
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు