మానవాభివృద్ధి సూచీలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం?
జనాభా
1. జనన, మరణ రేట్లకు, ఆర్థికాభివృద్ధికి మధ్యగల సంబంధాన్ని తెలియజేసేది జనాభా పరిణామ సిద్ధాంతం. దీన్ని మొదటగా ఎవరు పేర్కొన్నారు?
1) కోల్, హావర్
2) థామ్సన్, నోటెస్టీన్
3) నియో, మాల్థూసియన్లు
4) టీఆర్ మాల్థస్, ఎడ్విన్కానన్
2. MAX జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా విభజించారు?
1) మూడు 2) నాలుగు
3) ఐదు 4) ఆరు
3. ప్రపంచ జనాభా దినోత్సవంగా ఏ రోజును ప్రకటించారు?
1) జూలై 1 2) జూలై 21
3) జూలై 12 4) జూలై 11
4. 2011 జనాభా లెక్కల్లో Registar General Census Commissioner of India గా ఎవరు ఉన్నారు?
1) చంద్రమౌళి 2) వివేక్ దూబే
3) ఆర్కే పరంజిపే 4) వివేక్ జోషి
5. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రమం తప్పకుండా 10 సంవత్సరాలకు ఒకసారి చొప్పున 15 సార్లు జనాభా లెక్కలు నిర్వహించిన దేశం ఏది?
1) ఇండియా 2) చైనా
3) ఇండోనేషియా 4) జపాన్
6. అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర 2) బీహార్
3) పశ్చిమబెంగాల్ 4) ఉత్తరప్రదేశ్
7. అల్ప జానాభా గల కేంద్రపాలిత ప్రాంతం?
1) దాద్రానగర్ హవేలి
2) లక్షదీవులు 3) డామన్ డయ్యూ
4) అండమాన్ నికోబార్ దీవులు
8. అధిక అక్షరాస్యులు గల రాష్ట్రం ఏది?
1) బీహార్ 2) సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్
9. స్త్రీ, పురుషుల్లోనూ అధిక అక్షరాస్యులు
గల రాష్ట్రం?
1) సిక్కిం 2) బీహార్
3) మహారాష్ట్ర 4) ఉత్తర ప్రదేశ్
10. అధిక ఆయుర్థాయం గల రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) రాజస్థాన్
3) గోవా 4) కేరళ
11. ముస్లింలు అధికంగా ఉన్న రాష్ట్రం?
1) జమ్ముకశ్మీర్ 2) మిజోరం
3) కేరళ 4) ఉత్తరప్రదేశ్
12. Gray collar workers అంటే?
1) వృత్తిలో అధిక నైపుణ్యం కలవారు. ఉదా: అధిక డిమాండ్ గలవారైన డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లను 1985లో గుర్తించారు
2) సూర్యకాంతి కింద పనిచేసే వ్యవసాయదారులు ఇతర ప్రభుత్వ పనివారు
3) నైపుణ్యం గల సాంకేతిక పనివారు 1981లో గుర్తించారు.
ఉదా: ఐటీ రంగ పనివారు
4) 1975లో వీళ్లను గుర్తించారు.
ఉదా: ఆఫీస్లో గుమాస్తాలు
13. ఎన్ని సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న జనాభా అంతా ఉత్పాదకత శ్రామిక వర్గంలోకి రారు?
1) 15-59 2) 14-30
3) 17-59 4) 18-45
14. Scarlet collar workers అనే పదాన్ని 2000 సంవత్సరంలో ఉపయోగించారు. దీని అర్థం?
1) బొగ్గు గనులు, చమురు పరిశ్రమల్లో పనిచేసే మహిళలు
2) ఆఫీసుల్లో పని చేసే మహిళా గుమాస్తాలు
3) ఇంటి వద్ద నుంచే పనుల్లో పాల్గొనే మహిళలు
4) షాపుల్లో పనిచేసే మహిళలు
15. ప్రణాళికా లక్ష్యాల్లో భాగంగా MMRగాని, IMRని గాని, TFRని గాని ఎంతకు తగ్గించాలని సూచించింది?
1) MMR 1కు, IMR 28కి, TFR
1.02కి తగ్గించాలి
2) MMR 1కు, IMR 28కి, TFR
1.20కి తగ్గించాలి
3) MMR 1కు, IMR 28కి, TFR
2.1కి తగ్గించాలి
4) MMR 1కు, IMR 28కి, TFR
2.10కి తగ్గించాలి
16. ఆర్థిక వ్యవస్థలో వివిధ వృత్తుల్లో పనిచేసే జనాభా వివరాలను తెలియజేసేది వృత్తులవారీ వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థను, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా ఎవరు చెప్పారు?
1) ఏజీబీ ఫిషర్ 2) ఫిషర్
3) కొలిన్ క్లార్క్ 4) సైమన్ కుజినెట్స్
17. అమెరికా, ఇంగ్లండ్లలో వ్యవసాయంపై ఆధారపడేవారు 1 నుంచి 2 శాతం మధ్యలో ఉండగా, ఇండియాలో ఎంతశాతం ఉన్నారు?
1) 70 శాతం 2) 60 శాతం
3) 50 శాతం 4) 80 శాతం
18. ఏ దేశాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో శ్రామిక శక్తికి అడవులు ఎక్కువగా ఉపాధిని కల్పిస్తున్నాయి?
1) నార్వే, స్వీడన్, కెనడా
2) న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
3) జపాన్, కెనడా, పశ్చిమ ఐరోపా
4) ఇండియా, నెదర్లాండ్స్, సింగపూర్
19. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిశీలిస్తే ప్రాథమిక రంగంపై ఆధారపడేవారు ఎంత శాతం నుంచి ఎంత శాతం తగ్గారు?
1) 72 శాతం నుంచి 57.6 శాతం తగ్గారు
2) 72 శాతం నుంచి 67.5 శాతం తగ్గారు
3) 72 శాతం నుంచి 56.7 శాతం తగ్గారు
4) 72 శాతం నుంచి 65.7 శాతం తగ్గారు
20. ఆరోగ్య, పారిశుద్ధ్య పథకాల్లో లేనిది?
1) సౌభాగ్యయోజన (ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన)
2) ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్
3) ప్రధానమంత్రి జన ఔషధ యోజన
4) నేషనల్ బాల్ స్వచ్ఛతామిషన్
21. మానవ వనరుల అభివృద్ధి, భారతదేశంలోని విద్యపై గతంలో కొఠారి కమిషన్ జీడీపీలో విద్యపై పెట్టుబడిని ఎంత శాతం ఉండాలని సూచించింది?
1) 3% 2) 4% 3) 5% 4) 6%
22. 1952-53లో మాధ్యమిక విద్యపై ఏ కమిషన్ను నియమించారు?
1) కొఠారి కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) రామ్మూర్తి కమిషన్
4) కస్తూరిరంగన్ కమిషన్
23. భారతదేశం తక్కువ పురోగమనం కలిగి ఉండటానికి విద్య, విజ్ఞానం కొంతమందికే పరిమితమైందని ఎవరు పేర్కొన్నారు?
1) మహబూబ్-ఉల్-హక్
2) కరుణాకరన్
3) స్వామి వికేకానంద
4) సైమన్ కుజినెట్స్
24. HDI (Human Development Index) రూపశిల్పి పేరు?
1) వివేక్ దూబే 2) ఆర్కే పరంజిపే
3) డాక్టర్ సీ చంద్రమౌళి
4) మహబూబ్-ఉల్-హక్
25. 2010 HDRలో HDI గణనలో నూతనంగా చేసిన మార్పుల్లో తలసరి ఆదాయ గణనలో తలసరికి GDPకి బదులు తలసరిగా దేన్ని తీసుకోనున్నారు?
1) GNI 2) HDI
3) LHDC 4) HDR
26. BRICS దేశాల్లో తక్కువ HDI కలిగిన దేశం ఏది?
1) దక్షిణాఫ్రికా 2) సింగపూర్
3) ఇండియా 4) హాంకాంగ్
27. HDR, 2019లో భారతదేశ HDI విలువ ఎంత?
1) 0.761 2) 0.647
3) 0.650 4) 0.779
28.HDIలో మహబూబ్-ఉల్-హక్ గణనలో దేశంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం?
1) కేరళ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) గుజరాత్
29. భారత్ HDI ర్యాంకింగ్లో ఎన్నో స్థానం సాధించింది?
1) 126 2) 127
3) 128 4) 129
30. మానవాభివృద్ధి సూచీలో కేరళ మొదటి స్థానం కాగా చివరి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది?
1) జార్ఖండ్ 2) బీహార్
3) మహారాష్ట్ర 4) గుజరాత్
31. 2020 నాటికి సగటు చైనాలో ఆయువు 37 సంవత్సరాలు, అమెరికాలో 37 ఏళ్లు, జపాన్లో 48 ఏళ్లు ఉండగా భారతీయుడి సగటు ఎన్ని సంవత్సరాలు కలిగి ఉంది?
1) 26 2) 27 3) 28 4) 29
32. డెమో గ్రాఫిక్స్ గిఫ్ట్ అంటే?
1) చిన్నపిల్లల కంటే వృద్ధులు అధికంగా ఉంటే భవిష్యత్తులో ఉపయోగపడతారు
2) వృద్ధుల కంటే చిన్నపిల్లల సంఖ్య అధికంగా ఉంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయి
3) ఒకపక్క సంతాన ఉత్పత్తిరేటు తగ్గుతూ, మరోపక్క వృద్ధులు, ఆయుర్దాయంలో క్షీణత కొనసాగుతుంది
4) ఒకపక్క వృద్ధుల ఆయుర్దాయంలో క్షీణత కొనసాగుతూ మరోపక్క సంతాన ఉత్పత్తి రేటు పెరుగుతుంది
33. శాంపిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ 2013 ప్రకారం, 2020 నాటికి దేశంలో మనిషి సగటు జీవన వయస్సు ప్రపంచంలో చాలా తక్కువగా ఎన్ని సంవత్సరాలు ఉండనుంది?
1) 29 2) 28 3) 27 4) 26
34. స్కిల్ ఇండియా (2015) : 2020 నాటికి ఎన్ని కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది?
1) 29 కోట్లు 2) 35 కోట్లు
3) 40 కోట్లు 4) 45 కోట్లు
35. భూమిపై పుట్టే ప్రతి బిడ్డా అభివృద్ధి కారకుడవుతాడని ఎవరు పేర్కొన్నారు?
1) మాలినీ బాలసింగం
2) టీఆర్ మాల్థస్ 3) ఎడ్విన్ కానన్
4) నియో మాల్ఫూసియన్లు
36. 2019 జాతీయ విద్యా విధానం ఎవరి నేతృత్వంలో నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాను కేంద్రానికి సమర్పించింది?
1) కస్తూరి రంగన్ 2) డీఎస్ కొఠారి
3) థియోడర్ ఘల్జ్ 4) చార్లి మేయర్స్
37. NPEGEL (నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవల్) ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
1) 2001 2) 2003
3) 2002 4) 2004
38. పడే భారత్- బడే భారత్ : సర్వశిక్ష అభియాన్లో ఉప పథకంగా 2014లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఉద్దేశం?
1) 10, 9 తరగతుల్లో వేగంగా చదవడం, రాయడం గణితంలో ఆసక్తిని పెంచడం
2) 7, 8 తరగతుల్లో వేగంగా చదవడం, రాయడం గణితంలో ఆసక్తిని పెంచడం
3) 5, 6 తరగతుల్లో వేగంగా చదవడం, రాయడం గణితంలో ఆసక్తిని పెంచడం
4) 1, 2 తరగతుల్లో వేగంగా చదవడం, రాయడం గణితంలో ఆసక్తిని పెంచడం
39. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరభారత్ అభియాన్ (PMGDISHA) ఎన్ని కోట్ల గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ లిటరసీని అందించారు?
1) 3 కోట్లు 2) 5 కోట్లు
3) 4 కోట్లు 4) 6 కోట్లు
40. అధిక జనసాంద్రత గల జిల్లా?
1) దిబంగ్ వ్యాలీ (అరుణాచల్ ప్రదేశ్)
2) నార్త్ ఈస్ట్ (ఢిల్లీ)
3) లాంగ్లెంగ్ (నాగాలాండ్)
4) నిర్సా (పశ్చిమబెంగాల్)
41. పురుష జనాభా కంటే స్త్రీ జనాభా సుమారు ఎంత తక్కువగా ఉంది?
1) 1.5% 2) 1.6%
3) 1.7% 4) 1.8%
42. అధిక పిల్లల జనాభా గల రాష్ట్రం?
1) మేఘాలయా 2) బీహార్
3) ఉత్తరప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
43. అల్ప జనాభా వృద్ధి గల రాష్ట్రం?
1) బీహార్ 2) మిజోరం
3) పశ్చిమబెంగాల్ 4) నాగాలాండ్
44. స్వాతంత్య్రానికి పూర్వం 1901 నుంచి 1951 వరకు 50 ఏళ్లలో స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత నుంచి ఎంతకు తగ్గింది?
1) 972 నుంచి 946
2) 970 నుంచి 940
3) 973 నుంచి 943
4) 971 నుంచి 941
45. ‘భారత్లో తగ్గుతున్న స్త్రీలు’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) ఎడ్విన్కానన్ 2) అమర్త్యసేన్
3) మాలిని బాలసింగం
4) డ్రీజ్, సేన్
46. సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనీస డిపాజిట్ మొత్తం రూ.250/-ఉండగా గరిష్ఠం ఎంత?
1) 1,00,000 2) 1,50,000
3) 2,00,000 4) 2,50,000
47. 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) బీహార్ 2) జార్ఖండ్
3) పశ్చిమబెంగాల్ 4) కేరళ
48. Child Mortality Rate (CMR) ఏ సంవత్సరంలో మధ్యలో చనిపోయే పిల్లల సంఖ్యను తెలియజేసేది?
1) 0-3 సంవత్సరాలు
2) 0-4 సంవత్సరాలు
3) 0-5 సంవత్సరాలు
4) 0-6 సంవత్సరాలు
49. స్మార్ట్ సిటీమిషన్ భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1) 2005 జూన్ 25
2) 2010 జూన్ 25
3) 2015 జూన్ 25
4) 2020 జూన్ 25
50. హిందువులు అధికంగా ఉండే రాష్ట్రం ఏది?
1) మిజోరం 2) నాగాలాండ్
3) పశ్చిమబెంగాల్
4) హిమాచల్ ప్రదేశ్
ప్రాథమిక హక్కులను ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ 1215లో మొట్టమొదటి సారిగా గుర్తిస్తూ ఒక ప్రమాణపూర్వకమైన ప్రకటన చేశాడు. దీనినే ‘మాగ్నాకార్టా’ అంటారు.
1789లో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా ఫిలడెల్ఫియా సమావేశంలో ‘బిల్ ఆఫ్ రైట్స్’ను ఆమెదించారు.
1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది.
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రకరణ 12-35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
ప్రాథమిక హక్కులను Post Dated Cheque తో పోల్చిన వారు -ప్రొ. కేటీ షా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు