Which mineral is found in Gondwana rocks | గోండ్వానా శిలల్లో లభించే ఖనిజం?

-రాష్ట్రం గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడిన భారత ద్వీపకల్ప భూభాగంలోని దక్కన్ పీఠభూమిలో అంతర్భాగం.
-ఇది అతిపురాతనమైన గ్రానైట్లాంటి అగ్ని, నీస్, సిష్ట్ రూపాంతర శిలలతో ఏర్పడింది.
-పడమటి పీఠభూమిగా పిలుస్తున్న రాష్ట్ర భూభాగం సమద్విబాహు త్రిభుజాకృతిలో ఉంది.
-మెసోజాయిక్ కాలానికిచెందిన అగ్నిమయ ఉదరవిద్భేదనాల వల్ల లావా పెల్లుబికి చల్లారి ఘనీబవించడంవల్ల కొండలు, గుట్టలు, పీఠభూమి లక్షణాలతో రాష్ట్ర భూ ఉపరితల స్థలాకృతి ఏర్పడింది. సముద్ర మట్టానికి 150-600 మీటర్ల ఎత్తులో ఉంది.
-రాష్ట్ర భూభాగాన్ని మూడు ప్రధాన నైసర్గిక భాగాలుగా విభజించవచ్చు. అవి.. 1) పడమటి పీఠభూమి 2) పశ్చిమ కనుమలు 3) తూర్పుకనుమలు.
-పడమటి పీఠభూమి: ప్రస్తుతమున్న రాష్ట్ర భూభాగం ఏపీలోని అనంతపూర్, నంద్యాలప్రాంత భూభాగాన్ని కలిపి పడమటి పీఠభూమిగా పిలుస్తారు.
-పీఠభూమి మధ్యలో హైదరాబాద్ నగర ప్రాంత భూభాగం సముద్రమట్టం నుంచి 600 మీటర్ల ఎత్తులో, కృష్ణా-తుంగభద్ర నదీలోయల మధ్యభాగం 350-450 మీటర్ల ఎత్తులో, భీమ-గోదావరి నదుల మధ్య భాగం దాదాపు 730 మీటర్ల ఎత్తుతో, మెదక్-మహబూబ్‌నగర్‌ల మధ్య 600-900 మీటర్ల ఎత్తుతో విస్తరించి ఉంది.
-ఈ పీఠభూమి ఉపరితల దృశ్యవాలు వాయవ్యం నుంచి ఆగ్నేయం వైపు ఉన్నందున ఇక్కడ ప్రవహించే, జన్మించే నదులన్నీ వాయవ్యం నుంచి ఆగ్నేయానికి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
-పీఠభూమి ప్రాంతంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి నదీలోయ ప్రాంతమంతా ప్రధానంగా గోండ్వానా శిలలతో ఏర్పడి ఉంది. ఈ శిలల్లో లభించే ఖనిజం బొగ్గు.
-హైదరాబాద్ నగర ప్రాంత భూభాగం సముద్రమట్టం నుంచి దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఉన్నందున ఇక్కడ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం చల్లగా ఉంటుంది.
-పశ్చిమ కనుమలు: పీఠభూమికి ఉత్తర, వాయవ్య దిశల్లో పశ్చిమకనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు అజంతాశ్రేణి నుంచి విడిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
-ఈ పశ్చిమకనుమలను వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి..
-ఆదిలాబాద్ – నిర్మల్ గుట్టలు, సాత్మల కొండలు
-కరీంనగర్ – గోలికొండలు, రాఖీగుట్టలు, జగిత్యాల కొండలు
-వరంగల్ – కందికల్ కొండలు లేదా కంగల్ కొండలు
-ఖమ్మం – కందికల్ కొండలు……
-నిజామాబాద్ – సిర్నాపల్లి కొండలు
-పశ్చిమకనుమల్లోని అత్యంత ఎత్తయిన ప్రాంతం- నిర్మల్ గుట్టల్లోని మహబూబాఘాట్.
-తూర్పుకనుమలు: రాష్ర్టానికి తూర్పుకనుమలు ఈశాన్య, ఆగ్నేయ సరిహద్దుగా నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి అగ్నిమయ, క్వార్ట్ శిలలతో ఏర్పడి ఉన్నాయి. వీటిని వివిధ జిల్లాల్లో కింది విధంగా పిలుస్తారు. అవి..
-మహబూబ్‌నగర్ – నల్లమలకొండలు, అమ్రాబాద్ గుట్టలు, షాబాద్ గుట్టలు
-రంగారెడ్డి – అనంతగిరి గుట్టలు
-నల్లగొండ – రాచకొండలు, నందికొండలు
-ఖమ్మం – పాపికొండలు, రాజుగుట్టలు, యల్లండ్లపాడు గుట్టలు
శీతోష్ణస్థితి
-రాష్ట్ర శీతోష్ణస్థితిని అయనరేఖా రుతుపవన రకపు శీతోష్ణస్థితిగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడి వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది. దీన్నే అర్ధశుష్క శీతోష్ణస్థితి అంటారు.
-రాష్ట్ర భూభాగంలో శీతోష్ణస్థితిని సమరీతిగాలేకుండా కొంత వైవిధ్యాలతో కూడి ఉంది. ఉత్తరప్రాంతంలో ఉప ఆర్ధ్రశీతోష్ణస్థితి నుంచి దక్షిణ తెలంగాణలో అర్ధశుష్క శీతోష్ణస్థితి కలిగి ఉంది.
-రాష్ట్రంలో ఏడాదిని నాలుగు శీతోష్ణస్థితి రుతువులుగా విభజించారు.
-శీతాకాలం – జనవరి నుంచి ఫిబ్రవరి: ఈ కాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పొడి వాతావరణం నెలకొని ఉంటుంది.
-వేసవికాలం – మార్చి నుంచి జూన్: ఈ రుతువులో సంవహన ప్రక్రియ అధికంగా జరగడంవల్ల వాతావరణంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన సంవహన వర్షపు జల్లులు సంభవిస్తాయి. వీటినే తొలకరి జల్లులు అంటారు. మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతోపాటు వడగాల్పులు వీస్తాయి.
-నైరుతి రుతపవన లేదా వర్షాకాలం – జూన్ నుంచి సెప్టెంబర్: జూన్‌లో ఈ రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాలు పడటం ప్రారంభమవుతుంది.
-ఈశాన్య రుతుపవనకాలం – సెప్టెంబర్ నుంచి డిసెంబర్: ఈ రుతువులో బంగాళాఖాతంతో ఏర్పడే చక్రవాతాల వల్ల రాష్ట్రంలో వర్షం పడుతుంది.
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?