దేశంలో భూసేకరణ చట్టాలు ఏవి..?

ఆర్థిక వృద్ధి స్థానభ్రంశం
-ఆర్థిక వృద్ధి అంటే వస్తు ఉత్పత్తి పెరుగుదలతోపాటు దాన్ని సాధించడానికి కావాల్సిన వ్యవస్థాపరమైన మార్పును లేదా సాంకేతిక మార్పులను కలిపి అభివృద్ధి అంటారు.
-ఒక దేశంలోని ఆర్థికవ్యవస్థ వ్యవసాయరంగం నుంచి పారిశ్రామిక, సేవా రంగ ప్రాధాన్యతగల ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందడాన్ని అభివృద్ధి అంటారు.
-పారిశ్రామికీకరణ జరిగే ప్రయత్నంలో ఎన్ని పరిశ్రమలను స్థాపిస్తారు. అందులో భాగంగా ఎంతో భూమి పరిశ్రమలకు ఇవ్వాల్సి ఉంటుంది. నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల వంటి నిర్మాణాల వల్ల ఇండ్లు, భూములు, జీవనోపాధి కోల్పోయిన ప్రజలను నిరాశ్రయులు లేదా నిర్వాసితులు అంటారు. ఈ ప్రక్రియను నిర్వాసిత్తం లేదా స్థానభ్రంశం అంటారు.
స్థానభ్రంశం రెండు రకాలు. అవి.. అంతర్గత స్థానభ్రంశం, బహిర్గత స్థానభ్రంశం.
-ఒక దేశంలోని ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించబడితే దాన్ని అంతర్గత స్థానభ్రంశం అంటారు.
-ఒక దేశంలోని ప్రజలు మరొక దేశానికి వెళ్లిపోతే దాన్ని బహిర్గత స్థానభ్రంశం అంటారు.
-ఆర్థికాభివృద్ధిలో భాగంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పారిశ్రామికాభివృద్ధి లేదా అవస్థాపనా సౌకర్యం అభివృద్ధి కోసం భూములను సేకరించే విధానాన్ని భూసేకరణ అంటారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లు
-ఆర్థికాభివృద్ధిలో భాగంగా కొన్ని పరిశ్రమల కూడళ్లను, వాటికి సంబంధించిన కార్యాలయాన్ని ఒకే చోట సముదాయంగా నిర్మిస్తారు. ఈ నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో భూమి అవసరమవుతుంది. వీటికి ప్రత్యేకంగా ఆర్థిక నియంత్రణ అంటే సబ్సిడీలు, పన్నుల వెసులుబాటు వంటివి ఉంటాయి.
పునరావాసం
-మైఖల్ సర్నియా ప్రకారం స్థానభ్రంశం చెందిన నిర్వాసితులకు ఆరోగ్యం, విద్య సదుపాయాలను కల్పించడంతోపాటు జీవన ప్రమాణాలను కల్పించడం.
పునర్నిర్మాణం
-పునరావాసం కల్పించిన నిర్వాసితులకు వైద్య, ఆరోగ్య, విద్య సదుపాయాలు కల్పించి జీవన నైపుణ్యాలను పెంపొందింపచేసేట్లు చేయడం.
నిర్వాసితులు
-అనేక అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉదాహరణకు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కానీ, పారిశ్రామిక సంస్థల నిర్మాణం కాని, మౌలిక సదుపాయాల వంటి నిర్మాణాల వల్ల కానీ తమ ఇండ్లు లేదా భూములు, జీవనోపాధులను కోల్పోయిన ప్రజలను నిరాశ్రయులు లేదా నిర్వాసితులు అంటారు.
భూసేకరణ చట్టాలు రెగ్యులేషన్ 1824
-దేశంలో భూసేకరణకు సంబంధించిన మొదటి చట్టం బెంగాల్ ప్రావిన్స్‌కు మాత్రమే వర్తించేలా బ్రిటిష్ ప్రభుత్వం 1824లో చేసింది. దీన్నే బెంగాల్ రెగ్యులేషన్ అంటారు.
-ఈ తీర్మానం ప్రకారం రోడ్లు, కాలువల నిర్మాణానికి, ఇతర ప్రజాప్రయోజనాలకు సంబంధించిన భూమిని బ్రిటిష్ ప్రభుత్వం సేకరించే అధికారం కలిగి ఉంటుంది.
భూసేకరణ చట్టం- 1839
-బొంబాయి ప్రెసిడెన్సీ (మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక)కి వర్తించే విధంగా బొంబాయి ప్రెసిడెన్సీ యాక్ట్-1928ని చేశారు. దీనిప్రకారం భూసేకరణ జరిగినప్పుడు నష్ట పరిహారం నిర్ణయించడానికి 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.
బ్రిటిష్ ఇండియా చట్టం-1857
-బ్రిటిష్ ఇండియా అంతటా వర్తించేలా 1857లో బ్రిటిష్ ఇండియా చట్టం తీసుకువచ్చారు. అంటే దేశం మొత్తం ఇదే చట్టం అమలవుతుంది.
-మొదటి భూసేకరణ చట్టం 1824లో చేసినప్పటికీ భారతదేశం అంతటా భూసేకరణ 1857లో అమలయ్యింది. ఈ చట్టానికి 1861, 1863, 1870లో సవరణలు చేశారు.
-1870 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, చట్టం నచ్చకపోయినా యజమానులు సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం కల్పిస్తుంది.
1894 భూసేకరణ చట్టం
-దీన్ని బ్రిటిష్ ఇండియా మొత్తం వర్తించేవిధంగా చేశారు. అయితే హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్, జమ్ముకశ్మీర్‌లకు ఇది వర్తించదు. దీన్ని రాజ్‌లా అనికూడా పిలుస్తారు.
-ఈ చట్టం 2013 వరకు అమల్లో ఉంది. కానీ ఈ చట్టానికి 1919-20, 1921, 1923, 1933, 1938, 1951, 1984, 2007లో సవరణలు చేశారు. అయినా దాని స్వరూపం మార్చలేదు. 1984లో సవరించినప్పుడు జమ్ముకశ్మీర్ మినహా దేశమంతటా ఇది అమల్లోకి వచ్చింది.
చట్టంలోని అంశాలు
-ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేయవచ్చు.
-గ్రామాల విస్తరణ, అభివృద్ధి లేదా ప్రణాళికా యుతమైన వృద్ధి
-ప్రభుత్వ స్థాపించే కార్పొరేషన్ కోసం భూసేకరణ
-ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా నిర్వాసితులైన ప్రజల కోసం జరిపే భూసేకరణ
-ప్రకృత్తి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లోని ప్రజలకోసం జరిపే భూసేకరణ. పేద ప్రజానీకానికి గృహ నిర్మాణం కోసం సేకరణ.
-ప్రభుత్వ కార్యాలయం కోసం జరిపే భూసేకరణ
-ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆరోగ్య సంస్థలు, మురికి వాడల నిర్వహణకు అవమసరమై భూమి.
-భూసేకరణ అధికారైన కలెక్టర్ మాత్రమే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత దీనిపై అభ్యంతరం ఉన్నవారు 30 రోజుల్లోగా తెలియజేయాలి. వాటిని కలెక్టర్ పరిశీలించి, నివృత్తిచేసి అవసరమైతే నష్టపరిహారంలో మార్పులు చేస్తారు.
-అయితే నష్టపరిహారం కోసం సెక్షన్ 18 ప్రకారం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించవచ్చు.
-కోర్టు కాలాన్ని వృధా చేయకుండా జిల్లా కలెక్టర్, భూ యజమానుల పరస్పర అంగీకారం ప్రకారం భూముల ధరను నిర్ణయించి నష్టపరిహారాన్ని నిర్ణయించవచ్చు.
1934లో జమ్ముకశ్మీర్ భూసేకరణ చట్టం
-1934లో జమ్ముకశ్మీర్‌కి భూసేకరణ చట్టం (స్టేట్ ల్యాండ్ అక్విజైజేషన్ యాక్ట్- ఎస్ఎల్ఏఏ)ని రూపొందించారు. 1900 నాటి భూసేకరణ చట్టాన్ని రద్దు చేశారు.
-2007లో భూమిలేని నిరుపేద రైతు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు 1894 భూసేకరణ చట్టంలోని ప్రజా ప్రయోజన పదం నిర్వచనానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
-అయితే చట్టభద్రత కల్పించే దిశగా 1894 భూసేకరణ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవడానికి భూసేకరణ బిల్లు- 2007, పునరావాస, పునర్ ఉపాధి బిల్లు- 2007 రూపొందించి 2009లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ లోక్‌సభ గడువు ముగియడంతో ఇది చట్టంగా రూపొందలేదు. దీంతో కొత్త భూసేకరణ చట్టాన్ని 2013లో రూపొందించి, 2014 నుంచి అమల్లోకి తెచ్చారు.
భూసేకరణ చట్టం- 2013
-జమ్ముకశ్మీర్ మినహా దేశమంతా వర్తించేలా ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్- 2013 (ఎల్ఏఆర్ఆర్ఏ)ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ రాష్ర్టానికి ప్రత్యేకంగా భూసేకరణ చట్టం- 1934 అమల్లో ఉన్నది.
-ఈ చట్టంలో నాలుగు చాప్టర్లు, రెండు షెడ్యూళ్లు ఉన్నాయి.
-ఆర్థికాభివృద్ధిలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు భూములను వదులకున్న వారికి సరైన పరిహారం చెల్లించాలనే లక్ష్యంతో ఈ బిల్లును ఆమోదించారు.
-ఈ భూసేకరణ చట్టంలో రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూమి, నీటిపారుదల వసతులున్న భూమిని సేకరించకుండా, ఆహార భద్రతకు నష్టం వాటిల్లకుండా ఇది నిర్దేశిస్తుంది.
-1894 చట్టాన్ని బలవంతపు సేకరణ చట్టం అని పేర్కొంటారు. కలెక్టర్‌కు అధికారాలు ఎక్కువగా ఉండటం, కుటుంబాలను కూడా ఖాళీ చేయించే పరిస్థితి ఉండేది. కానీ 2013లో చేసిన చట్టంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అయితే 70 శాతం, ప్రైవేటు ప్రాజెక్టుల కోసం నిర్వాసితులైన వారిలో 80 శాతం మంది అంగీకారం తప్పనిసరి. అందువల్ల బలవంతపు భూసేకరణ ఉండదు.
-ఈ చట్టం నిర్వాసితులైన వారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారి అనుమానాలను తీరుస్తుంది.
-చట్టం ప్రకారం గ్రామాల్లోని భూమి విలువకు 4 రెట్లు నష్టపరిహారాలను, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం ఇచ్చేలా చూడాలి. ఇందులో మార్కెట్ విలువనే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు.
-ఈ భూసేకరణ వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాన్ని అంచనావేస్తారు.
-భూసేకరణ సందర్భంలో భూమికి బదులు భూమి కేటాయించాలి. ఇండ్లు మంజూరుచేసి ఉపాధికి మార్గం చూపించాలి.
-భూమిని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ వర్గం వారికి భూమికి బదులు భూమినే ఇవ్వాలని చట్టం నిర్ధేశించింది.
-భూ సేకరణ అధికారం కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వానిది కాగా పాండిచ్చేరిలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి ఉంటుంది.
ఎల్ఏఆర్ఆర్-2013 చట్టం
-ప్రజాప్రయోజనాల పరిధిలోకి వచ్చే అంశాలు.. వ్యసాయపమైన సంస్థలు, నీటిపారుదల అభివృద్ధికోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ఆహార తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లకు, విమానయాన రంగం అభివృద్ధి, నౌకాయానరంగం, మిలటరీ వ్యవస్థ కోసం, క్రీడా, పర్యాటక రంగం, ఆరోగ్య, రవాణా రంగాలు, గనుల తవ్వకాలు, పేదలకు నిర్మించే ఇండ్ల కోసం.
-షెడ్యూల్ ఏరియా భూమిని సేకరించేటప్పుడు గ్రామసభ లేదా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి.
-భూసేకరణ జరిగిన తర్వాత నష్ట పరిహారం పొందిన మొత్తానికి ఆదాయపన్నును మినహాయింపు ఇవ్వాగా, భూమి బదలాయింపు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ కూడా మినహాయించారు.
-భూసేకరణ (ఎల్ఏఆర్ఆర్) చట్టం- 2013లో కొన్ని మార్పులు 2014లో ఆర్డినెన్స్ ద్వారా సవరణ చట్టం తీసుకువచ్చారు.
-దీనిప్రకారం ఐదు రకాల భూములకు ప్రజాసేకరణ నుంచి మినహాయింపు ఇచ్చారు. అవి…
1. రక్షణ రంగానికి చెందినవి
2. పారిశ్రామిక కారిడార్లు నిర్మించడం
3. ఇంటి సదుపాయాలు కల్పించడం
4. గ్రామాల్లో అవస్థాపనా సదుపాయాలు
5. అవస్థాపనా సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులు
-అంతేకాకుండా ప్రజాప్రయోజనం పరిధి కిందికి ప్రైవేటు విద్యా, వైద్య సంస్థలు హోటళ్లు తీసుకువచ్చారు.
-ఈ చట్టం ప్రకారం రెండు, అంతకు ఎక్కువ పంటలు పండే భూమి కూడా సేకరించవచ్చు.
భూసేకరణ బిల్లు (సవరణ)-2015
-భూసేకరణ ఆర్డినెన్స్- 2014ని 2015, ఫిబ్రవరి 24న లోక్‌సభలో ప్రవేశపెట్టి కొన్ని సవరణలు చేశారు. అవి..
-2014 ఆర్డినెన్స్‌లో పేర్కొన్న ఐదు రంగాలకు భూసేకరణ కోసం ప్రజా అంగీకారం నుంచి మినహాయింపు ఇచ్చారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు ఇరువైపులా పారిశ్రామిక కారిడార్లను కిలోమీటర్ దూరానికి పరిమితం చేశారు.
బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొదటి నాలుగు భూసేకరణ చట్టాలు..
1. భూసేకరణ (రెగ్యులేషన్-1) చట్టం- 1824
2. భూసేకరణ చట్టం- 1839
3. భూసేకరణ చట్టం- 1850 (రైల్వేల నిర్మాణానికి కలకత్తాలో భూసేకరణ)
4. బ్రిటిష్ ఇండియా భూసేకరణ చట్టం- 1857
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?