Godavari and Krishna | గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం
– గోదావరి నుంచి శ్రీశైలానికి నీటి మళ్లింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఒక నిర్ణయానికి రావడానికి మరింత సమయం పడుతుంది. నాలుగు టీఎంసీల నీటిని ఒకేచోట నుంచి మళ్లించాలా లేక రెండు చోట్ల నుంచి తరలించాల అన్నదానిపై స్పష్టత రావడంతో పాటు, ఎక్కడెక్కడి నుంచి అన్న అంశంపైనా అవగాహన అవసరం. ఆ తర్వాతనే ముందడుగు పడే అవకాశం ఉంది.
– ఒకే చోట నుంచి అయితే ఇంద్రావతి , రెండు చోట్ల నుంచైతే ఇంద్రావతి తర్వాత తుపాకులగూడెం దిగువన దుమ్ముగూడెం నుంచి మళ్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. ఇంద్రావతి తర్వాత రాంపూర్ నుంచి శ్రీశైలానికి మళ్లిస్తూ మధ్యలో ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు పోలవరం నుంచి కూడ మళ్లించాలని తెలంగాణ ప్రతిపాదించింది.
– రాంపూర్ నుంచి నాగార్జునసాగర్‌కు, రాంపూర్ నుంచి శ్రీశైలానికి రెండు టీఎంసీల నీటిని మళ్లించే ప్రతిపాదనకు ఎంత ఖర్చవుతుందనే దానిపై తెలంగాణ ఇంజినీర్లు ప్రాథమిక అంచనాలు తయారుచేశారు.
– గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని మళ్లించే మార్గంలో వన్యమృగ సంరక్షణ ప్రాంతం ఉంది. ఇక్కడ సొరంగమార్గాలు తవ్వాలి. ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనల్లో ఒక మార్గంలో 69.54కిలోమీటర్లు ఇంకోమార్గంలో 83కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. ఇంత దూరం అందునా 4టీఎంసీల నీటిని మళ్లించే సామర్థ్యంతో సొరంగ మార్గాలు తవ్వాలంటే భారీవ్యయం, సమయంతో కూడుకున్నపని. ఒక టీఎంసీ నీటి ప్రవాహనికి కిలోమీటరు సొరంగమార్గం తవ్వాలంటే రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తవ్వకం సక్రమంగా జరిగిన 8సంవత్సరాలు సమయం పడుతుంది. దీనివల్ల వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.
తెలంగాణ ప్రతిపాదనలు కాళేశ్వర గంగావతరణం:
– తెలంగాణ జల అవసరాలను అత్యధికంగా తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21, 2019న ప్రారంభమైంది. తెలంగాణ రైతాంగానికి జలప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో గోదావరిని లోతునుంచి పైకి తీసుకువచ్చి వ్యతిరేక దిశలో పారించి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
– ఈ ప్రాజెక్టు మొత్తం ఒక్కటే ప్రాజెక్టుగా రూపు దిద్దుకోవడం లేదు. ఇది బ్యారేజీలు, పంపుహౌజ్‌లు, కాలువలు, సొరంగాలతో ఉమ్మడిగా రూపొందించబడ్డ ప్రాజెక్టు. ఇవన్ని కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి. గోదావరిలో నీరు పుష్కలంగా ఉంది. ఎన్నో టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. అలాంటి నీటిని వృధాగాపోనివ్వకుండా తెలంగాణ బీడునేలను తడపడానికి ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు నీటిని వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇందులో భాగంగా గోదావరి నదినే రిజర్వాయర్‌గా చేసి నదిపై పలుచోట్ల బ్యారేజీలు నిర్మించారు. దీనివల్ల ఒక బ్యారేజీకి, మరోబ్యారేజీకి మధ్య గోదావరి నదిలో రెండు తీరాలను తాకుతూ నిండుగా నీరు ప్రవహిస్తుంది.
– సుమారు 150 కిలోమీటర్లు మేర గోదావరి నది నిత్యం నిండుకుండలా ప్రవహిస్తుంది. ప్రతిబ్యారేజీ నుంచి పంపుహౌజ్‌లు, కాలువలు, సొరంగాల ద్వారా నీటిని పొలాలకు మళ్లిస్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
– ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేయించింది. ముందుగా అనుకున్నట్లు ప్రాణహిత నదిపై కాకుండా కింది బాగాన, ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు.
– ఒక బ్యారేజీలా కాకుండా మూడు బ్యారేజీలు, 19పంపుహౌజ్‌లు, వందకిలోమీటర్ల కాలువలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్, చిట్యాల, శామీర్‌పేట్ వరకు నిళ్లు వచ్చేలా ఈ కొత్త డిజైన్ తీర్చిదిద్దబడింది. కన్నెపల్లిలో నిర్మిస్తున్న ఓపెన్పంపు హౌజ్ త్రాగునీటికి పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.
– కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13జిల్లాల్లోని 45లక్షల ఎకరాలకు కొత్తగా నీరిస్తామని అధికారులు చెబుతున్నారు. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలని ఈ ప్రణాళికను అమలులోకి తెచ్చారు. కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, ఎగువమానేరు ప్రాజెక్టులను కూడ ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపుహౌజ్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టు స్థీరికరిస్తారు. వీటికి అదనంగా, పాతప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన చోటే అప్పటికంటే ఎత్తు తగ్గించి మరో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2లక్షల ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.
– కొత్త బ్యారేజీ వల్ల గోదావరిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరుంటుంది. ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిముఖ్యమైన అంశంగా సొరంగం, సర్జ్‌పూల్, భారీపంపు, గ్యాస్ ఇన్సులేట్ సబ్‌స్టేషన్‌ను చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టులో వాడే పంపులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఒక్కోటి చిన్నభవనం అంత ఉంటాయి. కాళేశ్వరంలో వాడే అతిపెద్ద పంపు సామార్ధ్యం 139మెగావాట్లు. ఇలాంటివి మొత్తం ఏడు పంపులు బిగించారు. ఈ పంపుకు కరెంట్ సరఫరా చేయడానికి 400 కెవీ సబ్‌స్టేషన్ నిర్మించాల్సి వచ్చింది.
– గోదావరి నదిపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడ బ్యారేజీలే…డ్యామ్‌లు కాదు. డ్యామ్‌లు అంటే నదిపై ఆనకట్ట నిర్మించి నీటిని నిలువ చేయడం. ఇక బ్యారేజీ అంటే నదికి రెండు తీరాలను కలుపుతూ గోడ నిర్మించి ఎక్కువైన నీరు దిగువకు పారేలా ఏర్పాటు చేయడం ఇలా గోదావరి నీటిని నదిలో రెండు ఒడ్లు కలిపేలా నదిలోనే నిలువ చేయడం. దీనివల్ల నది ఒడ్డును ఆనుకుని ఉన్న భూమి ముంపునకు గురికాదు. నదిలో నీటి ప్రవాహన్ని ఆపి నిలువ చేస్తారు. ఇలా కట్టే నిర్మాణాన్ని బ్యారేజీ అంటారు. దీనివల్ల ఎక్కువ నీరు నిలువ ఉంటుంది. తక్కువ భూమి ముంపుకు గురవుతుంది.
– ఇప్పుడు గోదావరిపై మూడు చోట్ల మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బ్యారేజ్‌లు కడుతున్నారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజ్ నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్ ముందుకు వదిలేలా ఏర్పాటు ఉంటుంది. ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకూ నీటిని తెస్తారు. (గోదావరి ప్రవాహనికి వ్యతిరేక దిశలో, ఎగువకు) అక్కడ నుంచి కాలువ ద్వారా నీటిని పంపిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా పనులు చేస్తున్నారు. ఇందుకోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారానే రుణాలను కూడ సమకూర్చుకున్నారు.
– ఎక్కువ సామార్థ్యాన్ని కలిగి ఉండే 400KV సబ్‌స్టేషన్ నిర్మించడానికి 60ఎకరాల స్థలం కావాలి. ధర్మారం దగ్గర్లో నిర్మిస్తున్న పంపుహౌజ్ సరిగ్గా ఒక కొండ కింద ఉంది.ఆ పంపుహౌజ్‌కు కరెంట్ ఇవ్వడానికి సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన 60 ఎకరాల స్థలం అందుబాటులో లేదు. దీంతో భూమిలోపలే సబ్‌స్టేషన్ నిర్మించాల్సి వచ్చింది. భూమి లోపల 60 ఎకరాలు తొలచడం, సబ్‌స్టేషన్ నిర్మించడం అసాధ్యం. అందువల్ల గ్యాస్ ఇన్సులెటేడ్ సాంకేతికతను వాడి రెండు ఎకరాలు తక్కువ స్థలంలో భూగర్భంలో నిర్మించారు. ఈ సాంకేతికత వల్ల సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ల మధ్య ఖాళీస్థలం పెద్దగా అవసరం లేకుండా ద్రవరూపంలోని గ్యాసును వాడతారు.స్ఫర్ హెక్సాప్లోరైడ్-6 ను ఇన్సులేటర్‌గా వాడి భూమిపైన 60 ఎకరాల్లో నిర్మించాల్సిన సబ్‌స్టేషన్ భూమిలోపల రెండెకరాల కంటే తక్కువ స్థలంలో నిర్మిస్తున్నారు. దీనివల్ల ఖర్చు రెండున్నర కోట్లు పెరుగుతోంది. జర్మన్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. ప్రపంచంలో ఇదే పెద్ద ఎత్తిపోతల పథకం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు