ఓట్ ఆన్ అకౌంట్ గురించి వివరించే ఆర్టికల్?
ఎకో సిటీ/ జీరో కార్బన్ సిటీ
-ఎకో సిటీ అనే భావనను 1975లో కాలిఫోర్నియాలో బెర్కలీ రిచర్డ్ ప్రతిపాదించారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి నగరంలో చర్యలు చేపట్టాలి. పునరుత్పాదక శక్తివనరుల వాడకం పెంచాలి. పేదరికం తగ్గి, ఆర్థిక వృద్ధి జరిగితే కాలుష్య నివారణ జరుగుతుంది.
-భారతదేశంలో మొదటి కర్బన తటస్థ జిల్లా అసోంలోని మజులీ జిల్లా.
-భారతదేశంలో మొదటి కర్బన తటస్థ పంచాయతీ కేరళలోని మీనన్‌గడి.
-భారతదేశంలో ఎకో సిటీ కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం బెంగళూరు.
-ప్రపంచంలో తొలి జీరో కార్బన్ పట్టణం అబుదాబిలోని మస్టర్డ్.
1. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1946, నవంబర్ 1 2) 1947, అక్టోబర్ 2
3) 1946, అక్టోబర్ 2 4) 1946, సెప్టెంబర్ 2
2. బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించిన తేదీ?
1) 1947, సెప్టెంబర్ 18 2) 1947, ఆగస్టు 18
3) 1947, జూలై 18 4) 1947, జూన్ 18
3. 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారి ప్రతిపాదించినది?
1) సైమన్ కమిషన్ 2) క్యాబినెట్ మిషన్ ప్లాన్
3) వేవెల్ ప్లాన్ 4) క్రిప్స్ మిషన్
4. 2000 ఏడాదిలో ఏర్పడిన రాష్ర్టాలు?
1) పాండిచ్చేరి, జార్ఖండ్, గోవా
2) నాగాలాండ్, జార్ఖండ్, త్రిపుర
3) ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్
4) జార్ఖండ్, ఉత్తరాంచల్, త్రిపుర
5. ప్రాథమిక హక్కుల్లో ఏ నిబంధన నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచాలని పేర్కొంటుంది?
1) 22 2) 20 3) 23 4) 18
6. రాజ్యాంగంలో 4వ అధికరణను మార్చడానికి వాడే సవరణ పద్ధతి?
1) 2/3వ వంతు 2) ప్రత్యేక మెజారిటీ 3) హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీ
4) సాధారణ మెజారిటీ
7. రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనే అంశంపై సుప్రీంకోర్టు ఏ కేసు ద్వారా తీర్పునిచ్చింది?
1) ఇందిరా సహానీ కేసు
2) కేశవానంద భారతి కేసు
3) గోలక్‌నాథ్ కేసు 4) మినర్వామిల్స్ కేసు
8. 2005లో ఏ సవరణ చట్టం ద్వారా విద్యాపరంగా వెనుకబడిన వారికి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది?
1) 93వ సవరణ, 15(5) అధికరణం
2) 93వ సవరణ, 15(2) అధికరణం
3) 96వ సవరణ, 16(2) అధికరణం
4) 93వ సవరణ, 15(3) అధికరణం
9. నిర్దేశిక నియమాలు ఆర్థిక ప్రజాస్వామ్యానికి మంచిమార్గం అన్నవారు?
1) జవహర్లాల్ నెహ్రూ 2) బీఆర్ అంబేద్కర్
3) బీఎన్ రావ్ 4) ఆస్టిన్
10. ఏ అధికరణం ద్వారా దేశంలో హిందీ భాషను ప్రోత్సహించారు?
1) 350 అధికరణం 2) 340వ అధికరణం
3) 351వ అధికరణం 4) 330వ అధికరణం
11. రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించేవారు?
1) ఉపరాష్ట్రపతి 2) స్పీకర్
3) సీనియర్ సభ్యుడు 4) రాష్ట్రపతి
12. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రారంభోత్సవ సమావేశానికి అధ్యక్షతవహించినవారు?
1) బీఆర్ అంబేద్కర్ 2) రాజగోపాలచారి
3) జవహర్లాల్ నెహ్రూ 4) సచ్చిదానంద సిన్హా
13. రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
1) అమెరికా 2) ది రిపబ్లిక్ ఐర్లాండ్
3) ది వైమూర్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ 4) దక్షిణాప్రికా
14. ప్రజాప్రయోజన వ్యాజ్యం అనే భావన ఏ దేశంలో ఉద్భవించింది?
1) అమెరికా 2) ఆస్ట్రేలియా 3) కెనడా 4) బ్రిటన్
15. మొదట రాజ్యాంగం రూపొందించుకోండి. ఆ తర్వాతే మాట్లాడండి అని భారతీయులకు సవాల్ విసిరినవారు?
1) లార్డ్ లిట్టన్ 2) లార్డ్ వేవెల్
3) లార్డ్ బిర్కెన్హుడ్ 4) లార్డ్ రీజింగ్
16. డెమొక్రసీ ఇన్ ఇండియా అండ్ జ్యుడీషియల్ పేసెస్ (Paces) గ్రంథ రచయిత?
1) బీఆర్ అంబేద్కర్ 2) హిదయతుల్లా
3) నానా ఫాల్కీవాలా 4) ఫకృద్దీన్ అలీ మహ్మద్
17. సహజ న్యాయసూత్రాలను గుర్తించడానికి తిరస్కరించిన కేసు?
1) ఏకే గోపాలన్ కేసు 2) బొమ్మై కేసు
3) మేనకాగాంధీ కేసు 4) బాలాజీ రాఘవన్ కేసు
18. మనం కలలుగన్న ఒక ఆదర్శ రాజ్యాంగం అనే భావనను రాజ్యాంగ ప్రవేశిక పేర్కొందన్నవారు?
1) నానా ఫాల్కీవాలా 2) బీఆర్ అంబేద్కర్ 3) గ్రాన్విల్ ఆస్టిన్ 4) కృష్ణస్వామి అయ్యర్
19. ప్రాథమిక హక్కుల కోసం మొదటిసారిగా డిమాండ్ చేసింది?
1) కరాచీ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం
2) స్వరాజ్ బిల్లు
3) కామన్వెల్త్ బిల్ ఆఫ్ ఇండియా
4) హోమ్ రూల్ ఉద్యమం
20. సహజ న్యాయసూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది?
1) ఉన్నికృష్ణన్ Vs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు (1993)
2) బాలాజీ రాఘవన్ Vs మద్రాస్ రాష్ట్ర కేసు (1996)
3) మేనకాగాంధీ Vs భారత ప్రభుత్వం కేసు (1978)
4) ఏకే గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్ర కేసు (1950)
21. దేశంలో ఉమ్మడి పౌరసత్వం అమల్లో ఉన్న రాష్ట్రం?
1) గోవా 2) జమ్ముకశ్మీర్
3) హర్యానా 4) తమిళనాడు
22. ద వైల్డ్ లైఫ్ యాక్ట్ ఎప్పుడు చేశారు?
1) 1978 2) 1976 3) 1974 4) 1972
23. కాగ్ నివేదికపై అంతిమంగా చర్యలు తీసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది?
1) ప్రధానమంత్రి 2) పార్లమెంటు
3) సుప్రీంకోర్టు 4) రాష్ట్రపతి
24. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 2007, ఏప్రిల్‌లో నియమించిన కమిషన్ చైర్మన్?
1) జస్టిస్ శ్రీకృష్ణ 2) ఎన్ మాధవ మీనన్ 3) ఎంఎం పూంచీ 4) ప్రణబ్ ముఖర్జీ
25. దేశంలో మొదటిసారిగా స్పీకర్ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1919 2) 1947 3) 1930 4) 1910
26. పార్లమెంటులో జీరో అవర్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1975 2) 1964 3) 1984 4) 1962
27. పార్లమెంటరీ కమిటీల్లో పెద్దది?
1) ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)
2) అంచనాల కమిటీ
3) ప్రభుత్వ ఉపక్రమాల కమిటీ 4) సౌకర్యాల కమిటీ
28. మైనారిటీ కమిషన్‌కు చట్టబద్ధత ఎప్పుడు కల్పించారు?
1) 1992 2) 1984 3) 1979 3) 1956
29. కొత్త అఖిల భారత సర్వీస్ ఏర్పాటు చేయాలంటే?
1) కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా
2) రాజ్యాంగ సవరణ ద్వారా
3) నిబంధన 312 ద్వారా
4) యూపీఎస్సీ ద్వారా
30. గవర్నర్ ముఖ్య శాసనాధికారం ఏది?
1) రాష్ట్ర శాసనసభ రద్దు
2) రాష్ట్ర శాసనసభకు సభ్యులను నామినేట్ చేయడం
3) శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం
4) ఆర్డినెన్స్ జారీచేయడం
31. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ క్రెడిట్ గురించి వివరించే రాజ్యాంగ నిబంధన?
1) 116 2) 116(1) 3) 116(2) 4) 112(1)
32. సామాజిక అభివృద్ధి పథకం ముఖ్య లక్ష్యం?
1) నిరుద్యోగులకు నిరుద్యోగభృతి కల్పించడం
2) ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం
3) పరిపాలనా వ్యవస్థను అభివృద్ధిచేయడం ద్వారా గ్రామాల్లో సంపూర్ణాభివృద్ధి సాధించడం
4) నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం
33. రాజ్యాంగంలోని ఏ అధికరణం మెట్రోపాలిటన్ ప్రణాళిక మండలి గురించి వివరిస్తుంది?
1) 243 ZC 2) 243 ZD
3) 243 ZB 4) 243 ZE
34. బల్వంత్రాయ్ మెహతా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు?
1) కేంద్ర మంత్రిమండలి 2) పార్లమెంటు
3) జాతీయ అభివృద్ధి మండలి
4) ప్రణాళికా సంఘం
35. ఏ కమిటీ సిఫారసుతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను 1952లో ప్రవేశపెట్టారు?
1) వీటీ కృష్ణమాచారి 2) బల్వంత్రాయ్ మెహతా 3) సతీష్‌చంద్ర 4) శ్రీకృష్ణ
36. అశోక్‌మెహతా కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 1977, ఆగస్టు 2) 1978, నవంబర్ 3) 1978, ఆగస్టు 4) 1977, నవంబర్
37. గ్రామ పంచాయతీల్లో స్థాయీసంఘాల సంఖ్య?
1) ఐదు 2) ఆరు
3) ఎనిమిది 4) స్థాయీసంఘాలు ఉండవు
38. పంచాయతీ సభ్యునిగా ఎన్నికవ్వాలంటే ఎంత వయస్సు ఉండాలి?
1) 21 ఏండ్లు 2) వయోజనుడై ఉండాలి
3) 26 ఏండ్లు 4) 30 ఏండ్లు
39. ప్రాచీన భారతదేశంలో ఎవరికాలంలో స్థానిక సంస్థలు ప్రాధాన్యత వహించాయి?
1) కుతుబ్‌షాహీలు 2) చోళులు
3) కాకతీయులు 4) శాతవాహనులు
40. స్థానిక సంస్థలకు సంబంధించి దేన్ని మొదటి తీర్మానంగా పేర్కొంటారు?
1) మేయో తీర్మానం
2) హనుమంతరావు కమిటీ తీర్మానం
3) రిప్పన్ తీర్మానం
4) వికేంద్రీకరణ కమిషన్ తీర్మానం
41. రాజ్యాంగం ప్రకారం గ్రామసభ కోరం ఎంత?
1) మొత్తం సభ్యుల్లో 1/10
2) మొత్తం సభ్యుల్లో 1/20
3) మొత్తం సభ్యుల్లో 1/15
4) మొత్తం సభ్యుల్లో 1/25
42. 340 అధికరణ ఎవరి గురించి తెలుపుతుంది?
1) ఎస్సీ కమిషన్ 2) బీసీ కమిషన్
3) ఎస్టీ కమిషన్ 4) పైవన్నీ
43. మండల్ కమిషన్‌ను ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
1) రాజీవ్‌గాంధీ 2) జనతా
3) వీపీ సింగ్ 4) పీవీ నరసింహారావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు