ఒత్తిడిని ఇలా జయిద్దాం..!
కాలంతో పోటీపడే రోజులివి. అందుకుతగ్గట్టుగానే ప్రతిఒక్కరిపై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఫైనల్ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఒత్తిడి ఏ మేరకు ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్యాలు, ర్యాంకుల వేటలో చిత్తవుతున్న విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా? ఒత్తిడి బారిన పడకుండా తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు ఏంటి? వంటి విషయాల గురించి నిపుణ సలహాలు.
సోషల్ మీడియాకు దూరంగా..
మంచి నిద్ర మెడిసిన్ లాంటిది. నిర్ణీత వేళలో నిద్రపోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు సోషల్ మీడియాకు అడిక్ట్ కావడంవల్ల నిద్రకు దూరమవుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, మెయిల్స్ చెకింగ్ వంటి వాటికి అలవాటు పడటం వల్ల తెలియకుండానే నిద్రాభంగం కలుగుతుంది. ఎక్కువ గంటలు కంప్యూటర్‌కూ అతుక్కుపోవడం కూడా ఒత్తిడికి గురిచేస్తుంది. నిద్రకు ఉపక్రమించేముందు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.
కాస్త నడవండి!
స్పోర్ట్స్ అంటే ఇష్టమా? అయితే తరచుగా ఇష్టమైన గేమ్స్ ఆడుతుండండి. స్పోర్ట్స్‌తో ఈజీగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. గేమ్స్ ఆడటం వల్ల బాడీ ఎండార్ఫిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల శరీరానికి స్వాంతన చేకూరి రిలాక్స్డ్గా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు కనీసం అరగంటయినా నడిస్తే స్ట్రెస్ లెవల్స్ తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. తరచుగా జాగింగ్ చేసేవారి మూడ్ కూడా బాగుంటుంది. గేమ్స్‌తో పాటు యోగా కూడా ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
పది నిమిషాలు బ్రీతింగ్
అదేపనిగా మాట్లాడటం చాలా సులువు. కానీ రోజులో కనీసం పది నిమిషాలు సైలెంట్‌గా ఉండటానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఓ పది నిమిషాలు ప్రశాంతంగా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ మెడిటేషన్ చేసినట్లయితే స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. బ్రీతింగ్ టెక్నిక్స్‌తో మనసు తేలిక పడుతుంది.
పెట్స్‌తో సరదాగా
పెంపుడు జంతువులతో సరదాగా గడపడంవల్ల అరోగ్యంగా ఉండగలుగుతారు. ఇతరులతో పోల్చితే పెంపుడు జంతువులతో గడిపేవారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. పెట్స్ కూడా ఒత్తిడిని దూరం చేస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు.
సంగీతం వినడం
ఒత్తిడిని అధిగమించే దివ్యౌషధం సంగీతం. సంగీతం వినడం ద్వారా మనసు తేలికపడి ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. ఏ కాస్త ఒత్తిడికి గురైనా ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మనసు తేలికపడుతుంది. మూడ్ బాగాలేనప్పుడు ఇష్టమైన మ్యూజిక్‌ను ఆస్వాదిస్తే ఆ ఆనందమే వేరు.
అంచనాలొద్దు
కొంతమంది ఏదైనా పనిని ప్రారంభించిప్పుడు వెంటనే ఫలితాలను ఆశిస్తారు. పనికంటే ఫలితం మీద ఫోకస్ చేయడంవల్ల తాము ఏర్పర్చుకున్న అంచనాలు తారుమారవుతుంటాయి. కాబట్టి అంచనాలకు తావివ్వకుండా ఫలితమేదైనా పనిచేసుకుంటూ పోవాలి.
నో స్మోకింగ్
స్మోకింగ్ వల్ల మనసు రిలాక్స్ అవుతుందని భావిస్తుంటారు కొందరు. కానీ అందులోని నికోటిన్, టొబాకో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీని కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతారు. స్మోకింగ్‌కు వీలైనంత దూరంగా ఉండాలని పరిశోధకులు సైతం హెచ్చరిస్తున్నారు.
జర నవ్వండి
ఒత్తిడిని అధిగమించడంలో ముందుండేది నవ్వు ఒకటి. కొంతమందికి నవ్వడానికి మొహమాటం అడ్డొస్తుంటుంది. కానీ బిగ్గరగా నవ్వడం వల్ల రక్తప్రసరణలు బాగా జరిగి స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. ఎప్పుడు సీరియస్‌గా ఉండకుండా హాస్యచతురత ఉన్నవారు ఇతరుల కంటే చురుగ్గా ఉంటారనేది సైకాలజిస్టుల అభిప్రాయం.
కొత్త విషయాలపై ఆసక్తి
రోజులో పది, పదిహేను నిమిషాలు కొత్త విషయాలపై ఆసక్తి చూపడంవల్ల ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటికప్పుడు మైండ్‌కు పని చెబుతూ ఉండాలి. కొత్త విషయాల్లో నిమగ్నం కావడంవల్ల ఒత్తిడి దరి చేరకుండా ఉత్సాహంగా ఉండగలుగుతారు. దీనివల్ల చురుగ్గా ఉంటూ షెడ్యూల్‌ను కొనసాగించవచ్చు.
మీరే రోల్‌మోడల్
ప్రస్తుత పోటీ యుగంలో ఎవరిని ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండవు. మీ సమస్యలను వినడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. దీనివల్ల మరింత కుంగుబాటుకు లోనుకాకుండా మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. సెల్ఫ్ టెస్ట్‌తో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మంచి పుస్తకాలను చదవాలి. విజేతల నుంచి స్ఫూర్తి పొందాలి.
ఒత్తిడికి గల కారణాలు
-సరైన ప్లానింగ్ లేకపోవడం
-క్రమశిక్షణ లోపించడం
-ప్రాక్టీస్ చేయకపోవడం
-రివిజన్‌కు సమయం కేటాయించకపోవడం
-స్పష్టమైన లక్ష్యం లేకపోవడం
-ఓటమి ఎదురైనప్పుడు మరో ప్రయత్నం చేయకపోవడం
వీటికి దూరంగా ఉండాలి
-క్రికెట్
-సినిమాలు
-కంప్యూటర్. టీవీ
-సెల్‌ఫోన్
ప్రధాన కారణాలు
-ఏదైనా అంశం పట్ల బలవంతంగా శ్రద్ధ చూపడం
-సమస్యలు ఉన్నాయని పదేపదే చింతించడం
-నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సిన అసైన్‌మెంట్స్‌ను పూర్తిచేయకపోవడం
-ఆందోళన, తలనొప్పి
-ఆహారపు అలవాట్లు, నిద్రవేళల్లో మార్పులు
తల్లిదండ్రులకు సూచనలు
-ప్రిపరేషన్, పరీక్షల సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక ధైర్యం ఇవ్వాలి.
-బి12, ప్రొటీన్ ఎక్కువగా లభించే మాంసాహారం ఇవ్వాలి.
-సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
-ప్రతిభను ప్రోత్సహించాలి.
-అసంతృప్తి వీడేలా చూడాలి.
-పిల్లల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.
-టైమ్ మేనేజ్మెంట్ పాటించేలా చూడాలి.
-సానుకూల ఆలోచనలను పెంపొందించాలి.
ర్యాంకులు ముఖ్యం కాదు!
విద్యార్థులు ముఖ్యంగా ప్రణాళిక ఏర్పర్చుకోవాలి. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. చాలామంది స్టూడెంట్స్ పరీక్షలు సమీపిస్తున్నాయంటేనే ప్రిపరేషన్ మొదలుపెడుతారు. ఇది సరైంది కాదు. గతంలోని ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చదువుకోవాలి. దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఒక్కో విద్యార్థి ఒక్కోస్థాయి కలిగి ఉంటాడు. ఇతరులతో పోల్చుకున్నట్లయితే ఒత్తిడిబారిన పడతారు. ఇతరులతో కంపేర్ చేసుకోకుండా చదువుకోవాలి. దీనికితోడు తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా ఎలాంటి ఒత్తిడికి గురిచేసే టార్గెట్స్ ఇవ్వకూడదు. చదువు అనేది కేవలం జ్ఞానం కోసం మాత్రమే. ర్యాంకుల కోసం కాదు. మనసుకు నచ్చే పనులు చేయడంవల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు