పెట్రోలియం నుంచి ఏర్పడిన మొదటి సమ్మేళన పదార్థం?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/11/PetroleumUNFC.jpg)
కెమిస్ట్రీ
1. కిందివాటిలో సరికానిది ఏది?
1) ద్రవ బంగారం అని పెట్రోలియంకు పేరు
2) కోల్ నుంచి కోక్‌ను తయారు చేసే
ప్రక్రియలో లభించే వాయువు కోల్ వాయువు
3) తరిగిపోని శక్తి వనరు పెట్రోలియం
ఎ) 3 బి) 1 సి) 2 డి) 1, 2
2. 200 పదార్థాల మిశ్రమంగా దేనిని పిలుస్తారు?
ఎ) కోల్ బి) కోల్ వాయువు
సి) కార్బన్ డి) కోల్ తార్
3. సీఎన్జీని విస్తరించండి?
ఎ) Codensed Natural gas
బి) Compressed Natural gas
సి) Complet Natural gas
డి) Condensed Natural gas
4. కిందివాటిలో శుద్ధమైన కార్బన్ ఏది?
ఎ) కోల్ బి) చార్కోల్
సి) కార్బన్ డి) కోక్
5. సరిత: గాలి మరలను ఉపయోగించి విద్యుత్ తయారు చేయలేం.
సంగీత: కోల్తార్ నుంచి నాఫ్తలిన్ లభిస్తుంది.
ఎవరిది సరికాని వాక్యం
ఎ) సంగీత బి) సరిత
సి) సంగీత, సరిత డి) ఏదీకాదు
6. భావన (ఎ): కోల్, పెట్రోల్‌ను తరిగిపోయే ఇంధన వనరులు అని పిలుస్తారు.
కారణం (ఆర్): ఇవి తక్కువ పరిమాణంలో ఉన్నాయి. వీటిని త్వరగా ఉత్పత్తి చేయలేం
ఎ) ‘ఎ’ సత్యం, ఆర్ సత్యం, ఆర్ ‘ఎ’కి సరైన వివరణ
బి) ‘ఎ’ సత్యం, ఆర్ సత్యం, ఆర్ ‘ఎ’ కి సరైన వివరణ కాదు
సి) ఎ సత్యం, ఆర్ అసత్యం
డి) ఎ అసత్యం, ఆర్ సత్యం
7. పెట్రోలియంను ఏ పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు?
ఎ) స్వేదనం బి) బాష్పీభవనం
సి) ఉత్పతనం డి) అంశిక స్వేదనం
8. బొగ్గు, పెట్రోలియం లేకపోతే ఏమి జరుగుతుంది?
ఎ) ప్రస్తుతం ఉన్న వాహనాలు నిరుపయోగం అవుతుంది
బి) థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిలిచిపోతాయి
సి) రవాణా సౌకర్యాలు తగ్గుతాయి
డి) పైవన్నీ
9. లోహాలను సంగ్రహించడానికి కిందివాటిలో ఉపయోగించేది?
ఎ) కోల్ బి) కోక్
సి) కోల్ తార్ డి) కోల్ వాయువు
10. జతపరచండి.
ఎ) తరిగిపోయే వనరు 1) నాఫ్తలిన్
బి) తరిగిపోని వనరు 2) లోహసంగ్రహణం
సి) కోల్తార్ 3) అలల శక్తి
డి) కోక్ 4) వెలుతురు
ఇ) కోల్ గ్యాస్ 5) సహజవాయువు
ఎ) ఎ-5, బి-3, సి-1, డి-2, ఇ-4
బి) ఎ-5, బి-1, సి-2, డి-4, ఇ-3
సి) ఎ-3, బి-5, సి-1, డి-2, ఇ-4
డి) ఎ-3, బి-5, సి-2, డి-4, ఇ-1
11. ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ బల్లలు వేటి నుంచి తయారుచేస్తారు.
ఎ) పెట్రోలియం బి) కోల్
సి) సహజవాయువు డి) చెట్లు
12. కోల్తార్ను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) నాఫ్తలిన్ బి) పెయింట్
సి) కృత్రిమ దారాలు డి) పైవన్నీ
13. పెట్రోలియం నుంచి లభించని ఉత్పన్నం?
ఎ) క్యాండిల్ బి) ఎల్పీజీ
సి) పెట్రోలు డి) నాఫ్తలిన్
14. కిందివాటిలో తరిగిపోయే శక్తి వనరు?
ఎ) సౌరశక్తి బి) పవనశక్తి
సి) కోల్ డి) అలలశక్తి
15. కింది వాటిలో శిలాజ ఇంధనాలు ఏవి?
ఎ) కోల్ బి) పెట్రోలియం
సి) సహజవాయువు డి) పైవన్నీ
16. సరికానిది ఏది/ఏవి?
1) ఉక్కుతయారీలో కోక్‌ను ఉపయోగిస్తారు
2) మాత్‌లు, కీటకాల నుంచి రక్షణకు నాఫ్తలిన్ను ఉపయోగిస్తారు
3) గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన వాయువు – ఆక్సిజన్
ఎ) 1, 2 బి) 2. 3
సి) 3 డి) 1, 3
17. కిందివాటిలో హానికరం కాని విద్యుత్ కేంద్రం/కేంద్రాలు?
ఎ) సౌర విద్యుత్ కేంద్రం
బి) థర్మల్ విద్యుత్ కేంద్రం
సి) హైడ్రల్ విద్యుత్ కేంద్రం
డి) ఎ, సి
18. పారాఫిన్ మైనం ఉత్పన్నం కానిది?
ఎ) ఫేస్‌క్రీమ్ బి) గ్రీస్
సి) క్యాండిల్ డి) పెయింట్స్
19. సరికానిది ఏది
1) పునరుత్పత్తి , విషం కాని ఇంధనం –
జీవ ఇంధనం
2) వాయు ఇంధనంగా పెట్రోలు, కోల్ ఉంటాయి
3) కోల్తార్ నుంచి నాఫ్తలిన్, పెస్టిసైడ్లు, రంగులు లభిస్తాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 2 మాత్రమే
2 సమాచారం
సంవత్సరం శక్తి కొరత శాతం
1992 7.8
1993 8.0
1994 8.3
1996 9.1
1997 9.3
1998 11.5
20. సరైన సమాధానాన్ని గుర్తించండి?
ఎ) శక్తి వినియోగం సంవత్సరం సంవత్సరానికి పెరుగుతుంది
బి) శక్తి కొరత శాతం తగ్గుతుంది
సి) శక్తి అవసరాలు సంవత్సరం సంవత్సరానికి పెరుగుతున్నాయి
డి) శక్తి కొరత శాతం పెరుగుతుంది
21. 1993 నుంచి 1996 వరకు శక్తి లోపం శాతాల్లో తేడా?
ఎ) 0.3 బి) 0.8 సి) 1.9 డి) 1.1
22. పెట్రోలియం నుంచి ఏర్పడిన మొదటి సమ్మేళన పదార్థం?
ఎ) డీజల్ బి) కిరోసిన్
సి) ఆస్ఫాల్ట్ డి) పెట్రోలు
23. పెట్రోలియం నుంచి ఏర్పడిన అవశేషం?
ఎ) డీజిల్ బి) పెట్రోల్
సి) ఆస్ఫాల్ట్ డి) కిరోసిన్
24. పెట్రో కెమికల్ నుంచి లభించేవి?
1) కోల్ 2) కోల్తార్
3) కోల్ వాయువు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
25. సీత : సాధారణంగా పెట్రో కెమికల్స్ వాతావరణానికి హానికరమైనవి.
గీత: హానికరం కాని పెట్రోకెమికల్ –
సహజ వాయువు.
సత్యవాక్యం ఏది?
ఎ) సీత బి) గీత
సి) సీత, గీత డి) ఏదీకాదు
26. జతపరచండి.
ఎ) కోల్ 1) ప్లాంక్టన్
బి) పెట్రోలియం 2) తరిగిపోని శక్తి వనరు
సి) గాలి 3) కార్బోనైజేషన్
ఎ) ఎ-3, బి-2, సి-1
బి) ఎ-2, బి-1, సి-3
సి) ఎ-3, బి-1, సి-2
డి) ఎ-2, బి-3, సి-1
27. రేవంత్ : కాలుష్య పరంగా ఆదర్శ ఇంధనం సహజవాయువు.
రమణ: బొగ్గులోని ముఖ్య అనుఘటకం- నైట్రోజన్
అసత్య వాక్యం ఏది?
ఎ) రేవంత్ బి) రమణ
సి) రేవంత్, రమణ డి) ఏదీకాదు
28. సరైనది ఏది?
1) షూ పాలిష్‌ను తయారు చేయడానికి పారాఫిన్ ఉపయోగిస్తారు.
2) మందులు, పేలుడు పదార్థాలు,పెర్ఫ్యూమ్ తయారీలో కోల్తార్ను ఉపయోగిస్తారు.
3) వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్‌లో కోల్ వాయువులను ఉపయోగిస్తారు.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
29. పెట్రోలు ఉపయోగం కానిది?
1) డ్రైక్లీనింగ్ ద్రవం 2) గ్యాసోలిన్
3) ఆయిట్మెంట్ తయారీ
4) వ్యాజలిన్ తయారీ
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 2, 3
30. జతపరచండి.
ఎ) గాజు 1) కోలమైట్ ఖనిజం నీటిలో కలవడం వల్ల
బి) బంకమన్ను 2) చెట్ల నుంచి
సి) కలప 3) ఇసుకను ఇతర
పదార్థాలను కరిగించి క్రమంగా చల్లార్చడం వల్ల
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-2, బి-1, సి-2
సి) ఎ-3, బి-2, సి-1
డి) ఎ-2, బి-3, సి-1
31. కిందివాటిలో 1000 ఏండ్ల క్రితం వాడిన పదార్థం ఏది?
ఎ) కలప బి) బంగారం
సి) ప్లాస్టిక్ డి) ఎ, బి
32. కిందివాటిలో సంప్రదాయేతర వనరు కానిది?
1) పవన శక్తి 2) సౌరశక్తి
3) సహజవాయువు 4) అలలశక్తి
ఎ) 1 బి) 1, 2 సి) 1, 4 డి) 3
33. ఎ: పూర్వం చైనాలో పెట్రోలియం కోసం బావి తవ్వేవారు
బి: కలప బోట్లు నీటిలో తడవకుండా ఉండటం కోసం దీపాలకు ఇంధనంగాను పూర్వీకులు పెట్రోలియం వాడేవారు
ఎ) ఎ, బి సత్యం బి) ఎ, బి అసత్యం
సి) ఎ సత్యం, బి అసత్యం
డి) ఎ అసత్యం, బి సత్యం
34. 1) ఉతికిన బట్టలు ఆరడానికి సౌరశక్తి ఉన్న వాషింగ్ మిషన్‌లో డ్రైయర్ వాడటం
2) కొద్ది దూరం కూడా నడవకుండా పెట్రోలు బైకులను వాడటం
పై రెండు విషయాలు దేనిని గురించి తెలియజేస్తున్నాయి?
ఎ) ప్రత్యామ్నయ ఇంధనాల వాడకం
బి) ఇంధన వనరుల ఉపయోగం
సి) ఇంధన వనరుల దుర్వినియోగం
డి) శిలాజ ఇంధనాల వాడకం
35. ఓఎన్జీసీని విస్తరించండి?
ఎ) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
బి) ఆయిల్ అండ్ నేటివ్ గ్యాస్ కార్పొరేషన్
సి) ఓపెన్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
డి) ఆయిల్ అండ్ నేచురల్ గెయిన్ కార్పొరేషన్
36. సరైన వాక్యం (వాక్యాలు)
1) కోక్ దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం
2) కోల్తార్ దాదాపు 200 పదార్థాల మిశ్రమం
3) నేలబొగ్గు నుంచి కోక్ పొందే ప్రక్రియలో కోల్ వాయువు ఉత్పత్తి అవుతుంది.
4) కోల్తార్ దుర్వాసన గల నల్లని సచ్చిద్ర పదార్థం
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3, 4
డి) 1, 2, 3, 4
37. జీవ పదార్థం నుంచి తయారయ్యే ఇంధనం పేరు?
ఎ) శక్తి వనరు బి) శిలాజాలు
సి) జీవ విచ్ఛిన్నం చెందని వనరు
డి) తరగని శక్తి వనరు
38. పెట్రోలియంలో ఉండే మూల వనరు?
ఎ) హైడ్రోజన్ బి) కార్బన్
సి) ఎ,బి డి) ఏదీకాదు
39. బొగ్గు మండించే కర్మాగారాల్లో ఉత్పత్తి అయ్యేవి?
1) మెర్క్యురీ 2) సెలీనియం
3) ఆర్శినిక్ 4) సీసం
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2 ,3 4
40. సరికానిది గుర్తించండి?
1) ఆర్ అండ్ డీ అంటే రిసెర్చ్ అండ్
డెవలప్మెంట్
2) అధిక ఉష్ణోగ్రతా పీడనాల వద్ద చెట్లు క్రమంగా బొగ్గుగా మారతాయి
3) పవన శక్తి: విండ్మిల్ : బొగ్గు : స్టీమ్ ఇంజిన్
ఎ) 1 బి) 1, 3 సి) 1, 2, 3
డి) ఏదీకాదు
41. పెట్రో రసాయనాలు : ప్లాస్టిక్ :: సీఎన్జీ —
1) ఇంధనం 2) ఉక్కు
3) ఎరువులు 4) కృత్రిమ రంగులు
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 1, 4
42. కిందివాటిలో సముద్రంలోకి ట్యాంకర్ల చమురు జారి కలిసినందు వల్ల ఏర్పడని నష్టం?
ఎ) సహజ పర్యావరణానికి నష్టం కల్గించడం
బి) సముద్రపు పక్షులు చంపబడును
సి) చేపల వంటి ఎన్నో సముద్ర జీవులు
చనిపోవడం
డి) సముద్ర ప్రభావాన్ని వృద్ధి చేయడం
43. గృహరంగంలో ప్రసుత్తం ఉపయోగిస్తున్న ఇంధనం?
ఎ) సీఎన్జీ బి) ఎల్పీజీ
సి) కలప డి) కిరోసిన్
44. కిందివాటిలో ప్రత్యామ్నాయ ఇంధనం?
ఎ) పవన శక్తి బి) అలల శక్తి
సి) జియోథర్మల్ డి) పైవన్నీ
45. 1) నేలబొగ్గు పొడిని ఒక గట్టి పరీక్షనాళికలో తీసుకోండి. పరీక్ష నాళికను రబ్బరు కార్కుతో బిగించి వాయు వాహక నాళం అమర్చండి.
2) పరీక్షనాళిక నుంచి గోధుమ నలుపు రంగు వాయువు విడుదలవుతుంది
3) మరొక పరీక్ష నాళికను నీటితో నింపండి
4) జెట్ నాళం చివరన తెల్లని కాంతితో కూడిన మంటలను చూడగలరు
పైవాటిలో బొగ్గును మండించే ప్రయోగంలో సరైన క్రమం ఏది?
ఎ) 1-2-4-3 బి) 1-3-4-2
సి) 2-3-1-4 డి) 1-2-3-4
46. సరైనది ఏది?
1) వేర్వేరు వస్తువుల తయారీలో ప్లాస్టిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు.
2) ప్రస్తుతం ఆహారం వండటానికి వాడే పాత్రలు అల్యూమినియంతో తయారు చేస్తున్నారు.
3) ప్రస్తుతం పచ్చళ్లు, ఊరగాయలు ప్లాస్టిక్ జార్లలో నిల్వ చేయుటకు కారణం- ప్లాస్టిక్ పచ్చళ్లతో చర్య జరపదు
1) 1, 2 బి) 1, 3
సి) 1, 2, 3 డి) 2, 3
47. ఇంధనం గురించి కొన్ని అంశాలు కింద ఇవ్వబడినవి?
1) విషరహితంగా, పునరుత్పత్తి చేసేదిగా ఉండాలి
2) సంప్రదాయేతర ఇంధనంగా ఉండాలి
3) మొక్కలు, జంతువుల కొవ్వు రసాయన చర్యల ద్వారా తయారవ్వాలి
డి) డీజిల్ ఇంజిన్‌లో వాడాలి
పై విధంగా ఉండే ఇంధనాన్ని గుర్తించండి
ఎ) డీజిల్ బి) పెట్రోలు
సి) బయో డీజిల్ డి) సీఎన్జీ
48. వీణ : 1859 నుంచి 1969 వరకు చమురు ఉత్పత్తి 221 బ్యారెల్స్.
వాణి : చమురు ఉత్పత్తి < వినియోగ రేటు సత్యవాక్యం ఏది?
ఎ) వీణ బి) వాణి
సి) వీణ, వాణి డి) ఏదీకాదు
49. చరణ్ : పెట్రోలియం ఘన పరిమాణాన్ని కొలవడానికి చమురు పరిశ్రమ బ్యారెల్‌ను
ప్రమాణంగా తీసుకుంది.
కిరణ్: 1 బారెల్ = 100 లీటర్లు
సరికానిది గుర్తించండి.
ఎ) చరణ్ బి) కిరణ్
సి) చరణ్, కిరణ్ డి) ఏదీకాదు
-స్రవంతి ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు