సామాజిక సంస్థల అధ్యయనమే సమాజశాస్త్రం
గ్రామీణ సామాజిక సంస్థలు (social institutions)
గిడ్డింగ్స్ ప్రకారం మానవ జాతి చరిత్రలో మంచిని నిల్వ చేసి పంచేవే సామాజిక సంస్థలు.
ఉదా. Religion, Kinship, Family
Family అనేది, ప్రాథమిక సమూహం, ప్రాథమిక సామాజిక సంస్థ, సామాజిక వ్యవస్థలో అతిచిన్న యూనిట్, మనుషులను సామాజిక జంతువులుగా తయారు చేసే సామాజీకరణ ప్రక్రియలో ప్రథమ పాత్ర వహిస్తుంది.
ప్రతి సమాజంలో సామాజిక సంస్థలు ఉంటాయి. అవి కుటుంబం, వివాహం, బంధుత్వం రాజకీయ సంస్థ/ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంస్థ, మత సంస్థసామాజిక సంస్థల లక్షణాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల మధ్యలో సాంస్కృతిక పరంగా, జీవన విధానాల్లో భేదాలున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమాజాల్లో గల సామాజిక సంస్థలు కింది లక్షణాలను కలిగి ఉంటాయి.
1. సామూహిక లక్షణాన్ని కలిగి ఉంటుంది
2. విశ్వవ్యాప్తమైనది
3. ప్రామాణిక కార్యకలాపాలను తెలుపుతాయి
4. ప్రాథమిక అవసరాలు తీర్చేవి
5. మానవ ప్రవర్తన నియంత్రణ సాధనాలు
6. సామాజిక సంస్థలన్నింటి మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి
7. సామాజిక సంస్థలు గుర్తులు లేదా Signs కలిగి ఉంటాయి
8. సామాజిక సంస్థలు రాత పూర్వకంగా కాని మౌఖికంగా గాని ఉంటాయి
9. సామాజిక సంస్థలు ఉమ్మడి
కార్యకలాపాలపై ఆధారపడి ఉంటాయి
10. సామాజిక సంస్థలు సామాజిక నియంత్రణ సాధనాలుగా పనిచేస్తాయి
11. ఇవి కంటికి కనిపించవు. అంటే అమూర్త స్వభావాన్ని కలిగి ఉంటాయి
సామాజిక సంస్థల రకాలు
l సామాజిక సంస్థలు ప్రధానంగా 2 రూపాల్లో ఉంటాయి. అవి..
1. ప్రాథమిక సామాజిక సంస్థలు (Primary Social Institution)
2. గౌణ లేదా ద్వితీయ సామాజిక సంస్థలు (Secondary Social Institution)
l ప్రాథమిక సామాజిక సంస్థలు మనిషి
జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల అవసరాలు అధిక మొత్తంలో ప్రాథమిక సామాజిక సంస్థల ద్వారా నెరవేరుతాయి. మనుషుల సామాజీకరణలో కూడా ఇవి కీలకపాత్ర వహిస్తాయి.
ఉదా. Family, Kinship, Marriage
ప్రాథమిక సామాజిక సంస్థలు తప్ప మిగిలిన సామాజిక సంస్థలను ద్వితీయ సామాజిక సంస్థలు అంటారు.
ఉదా. చట్టం, న్యాయం, రాజ్యాంగం
సామాజిక సంస్థల విధులు లేదా ప్రకార్యాలు
జంతు సమాజం నుంచి మానవ సమాజాన్ని వేరుచేస్తాయి
జంతువుల సమాజంలో సామాజిక సంస్థలు ఉండవు
ఉమ్మడి ప్రవర్తన, ఉమ్మడి జీవనాన్ని నిర్దేశిస్తాయి
సామాజిక క్రమాన్ని, సామాజిక నియంత్రణకు దోహదపడతాయి
మానవుడు సంఘజీవి కాబట్టి మానవ సంఘ జీవనానికి కావలసిన ఏర్పాట్లను చేకూరుస్తాయి
మనుషుల అవసరాలను క్రమపద్ధతిలో తీర్చుకునేందుకు సాంఘిక ఏర్పాట్లను అందిస్తాయి
సామాజిక సంస్థల వల్ల మనుషులకు వారి వయస్సు, లింగం, హోదా, అర్హతలను బట్టి నిర్వర్తించవలసిన పాత్రలు, బాధ్యతలు తెలిసివస్తాయి.
మనుషుల మధ్య పరస్పర జీవన విధానాన్ని బలోపేతం చేస్తాయి
ఆటవిక జీవనం నుంచి సరైన జీవన క్రమాన్ని ఏర్పాటు చేస్తాయి
వివిధరకాల మనుషుల మధ్య ఏకతను, ఏకత్వాన్ని అందిస్తాయి
సామాజిక సంస్థల వల్ల మనుషులకు, సమాజానికి పైన తెలిపిన విధంగా ఉపయోగితలు ఉన్నప్పటికీ కొన్ని
రకాల సామాజిక సంస్థల్లో గల లోపాల వల్ల సమాజంలోని కొన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురికావల్సి వస్తుంది.
ఉదా. కులవ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో, మత వ్యవస్థలో గల లోపాల వల్ల బాల్య వివాహాలు, అంటరాని-తనం, వెట్టిచాకిరి, వరకట్నం, వృద్ధుల
నిరాశ్రయత వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని సవరించేందుకు ఆయా కాలాల్లో యందు సంస్కరణల ద్వారా
విశ్వాసాల్లో మార్పులు, చట్టాల ద్వారా కూడా మార్పులు తీసుకువచ్చేందుకు
ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గ్రామీణ కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవన చక్రం, కుటుంబ జీవన విద్య
భారతీయ గ్రామాలు సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, భారతదేశంలోని సుమారు 70 శాతం కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. అధిక శాతం కుటుంబాలు పితృస్వామ్య వ్యవస్థని, పతిస్థానిక కుటుంబ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కొంతమంది గిరిజనుల్లో మాతృస్వామ్య వ్యవస్థ, పత్నిస్థానిక కుటుంబ విధానాలు కనిపిస్తాయి.
ఉదా. నీలగిరి తోడాలు. వీటితో పాటుగా భారతదేశ గ్రామాల కుటుంబ వ్యవస్థ కింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంది.
దృఢమైన కుటుంబ సంబంధాలు
దృఢమైన పితృస్వామ్యం
దృఢమైన లింగపర పాత్రలు
లింగ అసమానతలు
బాలికల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరి
దృఢమైన మతపర కార్యక్రమాలు
లింగం, వయస్సు, ఆధారిత పాత్రలు
కుల పట్టింపులతో కూడిన కుటుంబాలు
సంప్రదాయ జీవన విధానాలు
సామాజిక కర్మలు
ప్రత్యేకమైన కుటుంబ ఒత్తిడులు
కుటుంబ జీవన చక్రం, అభివృద్ధి క్రియలు
కుటుంబ జీవన చక్రం అంటే బాల్యదశ నుంచి వృద్ధాప్య దశ వరకు ఒక వ్యక్తి లేదా కుటుంబ సభ్యుడికి ఎదురవుతున్నటువంటి వివిధ కీలకమైన, మానసిక పరమైన మార్పులతో కూడి ఉన్న వివిధ స్థాయిలనే కుటుంబ జీవన చక్రం అంటారు.
అభివృద్ధి క్రియ : వివిధ కుటుంబ అభివృద్ధి దశలో కుటుంబంలోని ప్రతి వ్యక్తి చేపట్టవలసిన క్రియలే ‘Family Life Cycle Development Task’ అంటారు.
కుటుంబ జీవన చక్రదశలు
l Duvall 1977లో కుటుంబ జీవన చక్రాన్ని 8 దశల్లో వివరించారు.
1. Married couple stage (without children)
2. Child Bearing Families
3. Family with Preschool Children
4. Family with School age Children
5. Families with Teenagers
6. Families Launching Young adults
7. Middle-aged Parents Stage
8. Ageing Family Members Stage
Married Couple without Children
Husband task – వృత్తి చేపట్టాలి, కుటుంబం పట్ల బాధ్యతలను కలిగి ఉండాలి. ఇంటి వాడిగా మారాలి.
Wife task- ఆర్థిక అంశాల్లో సహాయం చేయడం, సంతృప్తికరమైన సంబంధాలను పొందేలా చేయడం. బంధువులు వంటి వ్యవహారాలు చూడటం.
భర్త, భార్య ఉమ్మడిగా చేయవలసిన పనులు
1. వివాహ సంబంధాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడం
2. ఇంటి పనులు పంచుకోవడం
3. Mutuality పరస్పర సంబంధాలు, సర్దుబాటు, పనులు పంచుకోవడం
4. పరస్పరం శారీరక అవసరాలు Phsycological needs, Social needs తీర్చుకోవడం
Child bearing families
పేరెంట్స్‌గా మొదటి అనుభవం
శిశువుకు అనుకూలంగా భర్త, భార్య, నివాసం మారడం లేదా సర్దుబాటు కావడం
పిల్లవాడిని పెంచేందుకు ప్రస్తుతం కావలసిన, భవిష్యత్తులో అవసరమైన వనరులు సంపాదించడం
పిల్లల పెంపకానికి సంబంధించిన అంశాలు నేర్చుకోవడానికి
Families with Pre-school Children
ఈ దశలో చొరవ చూపడం v/s తప్పు చేసాము అనే భావన కనిపిస్తుంది
పిల్లలకు అలవాట్లు, భాష, ప్రాథమిక
సామాజీకరణ, టాయిలెట్ ట్రైనింగ్ వంటివి నేర్పించటం
భౌతిక, చలన నైపుణ్యాలు పెంపొందించడం పిల్లలను కుటుంబంలో పాల్గొనేల చేయడం
పిల్లల స్వాతంత్య్రం గుర్తించడం
Families with school age Children
l ఈ దశలో తల్లిదండ్రులు చేయవలసిన పనులు పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన వనరులను సరిపోయేంతగా కల్పించడం. పిల్లలతో కలిసి ఆటలు ఆడటం.
l ఈ దశలో పిల్లలు చేయవలసిన కార్యక్రమాలు-
1. కుటుంబంలో పాలుపంచుకోవడం
2. శారీరక నైపుణ్యాలు
3. భౌతిక నైపుణ్యాలు
4. స్థూల నైపుణ్యాలు, సూక్ష్మ నైపుణ్యాలు పెంపొందించుకోవడం
5. ఈ దశలో పిల్లల్లో ఇగో అభివృద్ధి అవుతుంది
Families with Teenagers
తల్లిదండ్రులు నిర్వహించవలసిన పాత్రలు –
పిల్లలతో ఘర్షణ లేకుండా చూసుకోవడం, పిల్లలతో Ethics, Morals నాటుకు పోయే విధంగా ప్రవర్తించడం, కౌమారదశ సర్దుబాటుకు కావలసిన సహాయం అందివ్వడం
ఈ దశలో టీనేజర్స్ చేయవలసిన పనులు
1. శరీరంలో వస్తున్న మార్పులపై సరైన పరిజ్ఞానాన్ని సరైన విధంగా తెలుసుకోవడం
2. మానసిక పరిపక్వతకు సంబంధించిన విజ్ఞాన్నాన్ని పెంపొందించుకోవడం
3. వృత్తిపరజీవితానికి పునాదులు వేసుకోవడం
4. పౌరసృ్మతిని పెంపొందించుకోవాలి
Families Launching in Adults
ఈ దశలో కుటుంబం విస్తృతం అవుతుంది
అందరూ బహిరంగంగా మాట్లాడుకునే విధానం ఉండాలి
బాధ్యతలు పంచుకోవాలి
పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వనరుల సేకరణ ఉండాలి
కుటుంబంలో భౌతిక అవసరాలు వస్తువుల అవసరాలు సమయానుకూలంగా ఉండాలి
ఈ దశలోని కుటుంబంలో నూతన సభ్యుల చేరిక కలుగుతుంది
Middle age parents stage
l ఈ దశ ఇంట్లో ఉన్న చివరి సంతానం కుటుంబం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లిన సందర్భం నుంచి తండ్రి రిటైర్మెంట్ అయ్యే వరకు సాగుతుంది. కాకి గూడు లక్షణాలు కనిపిస్తుంది
Aging family members stage
రిటైర్మెంట్ సమస్యలతో సర్దుబాటు చేసుకోవడం
శారీరక, మానసిక సమస్యలు
జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు సర్దుబాటుకు లోనవ్వడం
స్వతంత్రతను కోల్పోయిన భావన
మనుమలు, మనుమరాళ్లు మూర్తిమత్వాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం
కుటుంబ జీవన విద్య
కుటుంబం సరైన దిశలో అభివృద్ధి చెందేందుకు కుటుంబ సభ్యులకు సామర్థ్యాలు పెంపొందించడమే ‘జీవన విద్య’
కుటుంబ జీవన విద్య అనేది ప్రస్తుతం కుటుంబసభ్యులు నిర్వహించవలసిన పాత్రలే కాకుండా వారు భవిష్యత్తులో నిర్వహించవలసిన పాత్రలకు సంబంధించి పరిజ్ఞానం అందిస్తుంది
కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పసిగడుతుంది. కుటుంబంలో వచ్చే మార్పులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
కుటుంబ జీవన విద్య అనేది భారతదేశంలో నూతనమైనది. కుటుంబజీవన విద్య అనే భావనను ‘అమెరికా’లోని ‘National Commision on Family Life’ వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
నిర్వాణ పబ్లిషింగ్ హౌజ్
సౌజన్యంతో..
8142070502
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?