వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే..? (TS TET Special)
1. ‘అమరదైత్య వరులమై యబ్ధి ద్రత్తుమా’
ఏ పద్యానికి భావం?
1) దేవతలు, రాక్షసుల్లా యుద్ధం చేద్దామా
2) బలిచక్రవర్తిలా మారి సముద్రం అడుగున ఉందామా
3) దేవతలు, రాక్షసుల్లా కలిసి సముద్రాన్ని మధిద్దామా
4) గంధర్వులు, రాక్షసుల్లా పాటలు పాడదామా
2. వాడి మీద మెల్లగా చెయ్యివేసి, నడిపించుకొనివచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు – ఏ వాక్యం?
1) సమప్రాధాన్యంగల వాక్యాలు ఏక వాక్యంగా ఏర్పడటం
2) ఒక సమాపక్రియ, అనేక అసమాపక క్రియలతో కూడి ఉండటం
3) ఒక సమాపక్రియ, అనేక అసమాపక క్రియలతో కూడి ఉండటం
4) క్రియలన్నీ వర్తమాన కాలంలో ఉండటం
3. ‘హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధ గతినందున్’, ఈ వాక్యంలో ‘హరిత్తులు’ అను పదానికి అర్థం
1) పులులు 2) నాగళ్ళు
3) సింహాలు 4) పాములు
4. ‘ప్రకటన పాఠం’ ఈ ప్రక్రియ చెందినది
1) గేయం 2) ద్విపద
3) వచనకవిత 4) ముత్యాలసరం
5. ‘పారు’ అనే క్రియారూపానికి నానార్థాలు
1) పాలు, క్షీరం 2) ప్రవహించు, పరిగెత్తు
3) కీర్తి, యశస్సు 4) ప్రవహించు, నాశనం
6. జిడ్డు కృష్ణమూర్తి రచన ‘ఎ టైమ్‌లైన్ స్ప్రింగ్’ను అరుణామోహన్ ఈ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు?
1) గరుడయానం 2) స్వేచ్ఛ
3) నీవే ప్రపంచం 4) అనాది స్రోతస్సు
7. పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే ఉద్దేశంగాగల పాఠ్యాంశం
1) బతుకు పుస్తకం 2) ధర్మదీక్ష
3) మాప్రయత్నం 4) గోరంత దీపాలు
8. ‘సైరికా, నీవు భారత క్ష్మాతలాత్మ గౌరవ పవిత్ర మూర్తివి, శూరమణివి’ అని పొగిడినవారు
1) శిల్పి గురించి గుర్రం జాషువా
2) భారతీయుని గురించి జ్ఞానానందకవి
3) రైతును గురించి దువ్వూరి రామిరెడ్డి
4) శివాజీ గురించి గడియారం శేషశాస్త్రి
9. దృష్టాంతాలంకార లక్షణం
1) ఉపమాన, ఉపమేయాల మధ్య అభేదం
2) జాతి, గుణ, క్రియాదుల వర్ణన
3) విడిచిపెట్టిన పదాన్ని గ్రహించుట
4) వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం
10. ‘వృక్షమున+న’ అని ఉన్నప్పుడు లు, ల, నల సంధి జరిగితే
1) మువర్ణలోపం, పూర్వస్వరానికి దీర్ఘం వస్తాయి
2) ఆగమం, పూర్వస్వరానికి హ్రస్వం వస్తాయి
3) మువర్ణలోపం, ‘లు’ ఆగమం వస్తుంది
4) పూర్వస్వరం లోపం, మువర్ణ ఆగమం వస్తాయి
11. యౌవనము ఝరీవేగంతుల్యం-‘ఝరీ’ అంటే వ్యుత్పత్త్యర్థం
1) కాలక్రమాన పెరుగుతుంది
2) కాలక్రమాన స్వల్పమైపోయేది
3) చంద్రోదయం వల్ల వృద్ధి పొందుతుంది
4) నీటిని నిలువ ఉంచేది
12. కింది వాటిని జతపరచండి
ఎ. మీరు రావద్దు 1. అనుమతి
బి. మీరు రావాల్సిందే 2. నిషేధం
సి. మీరు రావొచ్చు 3. విద్యర్థకం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-3, బి-2, సి-1
13. ‘వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప’- ఈ వాక్యంలో శిరీషపుష్పం అంటే
1) మంకెన పువ్వు 2) మోదుగు పువ్వు
3) దిరిసెన పువ్వు 4) సంపెంగపువ్వు
14. ‘రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్ట గ్రొవ్వారు కాలువ ద్రవ్వెననగ ఈ పద్యపాదాలలో అలంకారం’
1) అర్థాంతరన్యాస 2) రూపకాలంకారం
3) అతిశయోక్తి 4) ఉత్ప్రేక్షాలంకారం
15. విద్వాన్ విశ్వం అసలు పేరు
1) మీసరగండ విశ్వరూపాచారి
2) మీసరగండ అనంతాచారి
3) మీసరగండ లక్ష్మణాచారి
4) మీసరగండ వీరరాఘవాచారి
16. ‘కూలీ నుంచి కళాప్రపూర్ణ వరకు’ ఎవరి ఆత్మకథ?
1) గుర్రం జాషువా
2) జ్ఞానానందకవి
3) సి. నారాయణ రెడ్డి
4) నార్ల వేంకటేశ్వరరావు
17. ‘కవిత లక్ష్మీశ, సర్వజగన్నివేశవిమల రవికోటి సంకాశ వేంకటేశ’
ఈ మకుటంలో శతకాన్ని రచించిన కవి
1) తాళ్లపాక పెద్ద వేంకటాచార్యులు
2) తాళ్లపాక చిన తిరుమలాచార్యులు
3) తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు
4) తాళ్లపాక వీర రాఘవాచార్యులు
18. ‘ఊరూరం జనులెల్ల బిచ్చమిండరో, యుండం గుహల్గల్గవో’ ఈ పద్యపాదంలో యతి అక్షరాలను గుర్తించండి
1) ఊ-బి 2) ఊ-యుం
3) ఊ-డం 4) ఊ-రో
19. పూర్వ పదార్థ ప్రధానంగల తత్పురుష సమాసానికి మరొక పేరు
1) ఏకదేశీ సమాసం
2) షష్ఠీతత్పురుష సమాసం
3) ద్విదేశీ సమాసం
4) సప్తమీ తుత్పురుష సమాసం
20. పక్షము- అనే పదానికి వికృతి
1) వక్క 2) పైపు
3) పక్క 4) పసరం
21. ‘వారిజగర్భుడు’ అనే పదానికి పర్యాయపదాలు
1) సూర్యుడు, రవి 2) రవి, బ్రహ్మ
3) బ్రహ్మ, చతుర్ముఖుడు
4) రవి, చతుర్ముఖుడు
22. ‘విశేష జ్ఞానం సంపాదించు’ అనే అర్థం వచ్చే జాతీయాన్ని గుర్తించండి
1) నల్లేరుపై బండి నడక
2) నాలుగాకులెక్కువ చదవడం
3) భగీరథ ప్రయత్నం
4) నోరు మెదల్పుట
23. ‘మాతీరు ముక్కు ముత్యాలగుదురెమీరు’ అని మనుషుల్ని ప్రశ్నించినది
1) వెన్నెల 2) పూవు
3) రైతు 4) శిల్పి
24. ఉత్పల లక్ష్మణరావు ఆత్మకథ పేరు
1) ప్రాచీన భారతంలో బానిసలు
2) అతడు ఆమె
3) బతుకు పుస్తకం
4) బందిపోట్లు
25. ‘కూళతో స్నేహం’ ఎలాంటిదని కవి భావన
1) కొట్టుకొను వాజమ్మ
2) గొంతులో శల్యమ్ము
3) కీర్తివచ్చుట కల్ల
4) నరుడు తన్నున బాల్చి
26. ఆత్మవిశ్వాసం అవయవలోపాన్ని జయిస్తుందని చెప్పడమే ఉద్దేశ్యంగల పాఠ్యాంశం
1) జారినగుండె 2) మధువనం
3) మేము సైతం 4) కళ్ళుండీ చూడలేక
27. మహాభారతంలో తిక్కన తెనిగించిన పర్వాలు
1) ఆది, సభాపర్వాలు
2) ఆదిపర్వం నుంచి అరణ్య పర్వశేషం వరకు
3) ఆది, అరణ్య పర్వశేషాలు
4) విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు
28. ‘స్నేహ బంధం’ కథలో ఉన్న ప్రాణి – దాని పేరు
1) పావురం-మంథరుడు
2) ఏనుగు-హిరణ్యకుడు
3) కాకి-లఘుపతనకుడు
4) నక్క-చూడాకర్ణుడు
29. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి అక్షరాలు లేదా పదాలు
1) భాషా భాగాలు 2) కాలాలు
3) విభక్తి ప్రత్యయాలు
4) సంధులు-సమాసాలు
30. ‘ఇ, ఉ, ఋ’ అనే అసవర్ణాలు పరమైతే క్రమంగా వాటికి బదులుగా వచ్చే అక్షరాలు
1) ఈ, ఊ, ౠ 2) ఏ, ఓ, ఆర్
3) ఎ, ఒ, ర 4) య, వ, ర
31. శ్రీ శివ భారతంలో ‘హరిహర బ్రహ్మలను బురిటి బిడ్డల జేసి’ జోల పాడినది
1) సావిత్రి 2) అరుంధతి
3) సుమతి 4) అనసూయ
32. ‘కవిసార్వభౌమ’ బిరుదాంకితులు
1) నన్నయ 2) శ్రీనాథుడు
3) తిక్కన 4) ఎర్రన
33. ‘కరం’ పదానికి నానార్థాలు
1) చేయి, కేలు 2) కీలు, కేలు
3) చేయి, తొండం 4) ఏనుగు, కేలు
34. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ రచయిత
1) బోయి భీమన్న
2) పరవాస్తు చిన్నయసూరి
3) విద్వాన్ విశ్వం
4) అయ్యలరాజు రామభద్రుడు
35. ‘కార్ముకం’ వ్యుత్పత్తి
1) కర్మకారునిచే తయారుచేయబడింది
2) వృక్షాదులచే తయారు చేయబడింది
3) కార్మికునిచే తయారు చేయబడింది
4) దారువుచే తయారు చేయబడింది
36. గజల్ ప్రత్యేక లక్ష్యం
1) కవి నామముద్ర ఉండటం
2) ప్రతి చరణం చివర అంత్య ప్రాస లేకపోవడం
3) ఒకే విషయాన్ని చెప్పాలన్న నిర్బంధం ఉండటం
4) ప్రేమ, ఆత్మీయత, ఆనందం, ఆవేదన కనిపించకపోవడం
37. ఎన్నో సైన్సు, తాత్విక వ్యాసాలు రాసిన కొడవటిగంటి కుటుంబరావు ప్రఖ్యాత నవల
1) అద్దె కొంప
2) షావుకారు సుబ్బయ్య
3) తిమిరంతో సమరం 4) చదువు
38. కర్తరి వాక్యానికి సంబంధించిన సత్యాన్ని గుర్తించడం
1) కర్త పక్కన తృతీయా విభక్తి ఉంటుంది
2) క్రియ పక్కన బడు చేరుతుంది
3) క్రియ కర్మ ప్రధానంగా ఉంటుంది
4) కర్మ పక్కన ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరి ఉంటుంది
39. ‘మంచు’ పర్యాయపదాలు గుర్తించండి
1) హిమం, తుహినం 2) హిమం, జలం
3) నీరు, జలం 4) పానీయం, జలం
40. ‘నేనొక్కడినే అదృష్టవంతుడిని’ అని అన్నడు జంఘాలశాస్త్రి, ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం
1) తానొక్కడినే అదృష్టవంతుడు అన్నాడు జంగాలశాస్త్రి
2) తానొక్కడినే అదృష్టవంతుడినా? అని అన్నాడు జంగాలశాస్త్రి
3) తానొక్కడినే అదృష్టవంతుడినని అన్నాడు జంగాలశాస్త్రి
4) మీరొక్కరే అదృష్టవంతులని అన్నాడు జంగాలశాస్త్రి
41. UUU ఏ గణం?
1) ‘మ’ గణం 2) ‘త’ గణం
3) ‘న’ గణం 4) ‘ర’ గణం
42. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నైట్లెతే
1) స్వభావోక్తి అలంకారం
2) దృష్టాంతాలంకారం
3) అర్థాంతరన్యాసాలంకారం
4) ప్రతీపాలంకారం
43. ఈ కింది వాటిలో సరైన సామర్థ్యార్థక వాక్యం
1) గోపాల్ చెట్టు ఎక్కుతున్నాడు
2) గోపాల్ చెట్టు ఎక్కగలడు
3) గోపాల్ చెట్టు ఎక్కగలడా
4) గోపాల్ చెట్టు ఎక్కుతాడు
44. ‘అరమరికలు లేకుండా కలిసి ఉండటం’ అనే అర్థం వచ్చే జాతీయం
1) కలగా పులగం 2) కంటికి కాపలా
3) తలలో నాలుక 4) తలదాల్చు
45. నిత్యం భగవంతుడిని ధ్యానించాలి. ‘నిత్యం’ అనే పదానికి వికృతి
1) నిచ్చము 2) నిత్తెం
3) నిచ్ఛయం 4) నిచ్చలు
46. ‘భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ’ అని అభిప్రాయపడినవారు
1) హాకెట్ 2) బ్లూమ్
3) స్కిన్నర్ 4) పావ్లోవ్
47. ఒక వక్త మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణశక్తి
1) వక్తృభేదక గ్రాహక శ్రవణం
2) విస్తారభేదక గ్రాహక శ్రవణం
3) సూక్ష్మ భేదక గ్రాహక శ్రవణం
4) స్థూలభేద గ్రాహక శ్రవణం
48. జాతీయ విద్యాప్రణాళిక చట్రం-2005కు ఆధారమైన నివేదిక
1) జనార్థన్ రెడ్డి కమిటీ నివేదిక
2) కొఠారి విద్యావిషయక నివేదిక
3) భాషా బోధన పరిథిపత్రం
4) భారంలేని విద్య నివేదిక
49. భాషాజ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్నా ప్రధాన ఉద్ధేశ్యం గల బోధన
1) కవితా బోధన
2) కథా బోధన
3) వ్యాకరణ బోధన
4) గద్య బోధన
50. గళ్ల నుడికట్టునకే మరోపేరు
1) పదబంధ ప్రహేళిక
2) పొడుపుకల్టు
3) లోకోక్తి బంధం
4) మానస చిత్రము
51. భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వ
హించే మూల్యాంకనం
1) దోషసవరణ మూల్యాకనం
2) ఉపలబ్ధి మూల్యాంకనం
3) రూపణ మూల్యాంకనం
4) బాహిర మూల్యాంకనం
52. ‘పంచాస్యం’ అనే పదానికి వ్యుత్పత్తి
1) కేసరములు కలిగినది
2) వెడల్పైన ముఖం కలిగినది
3) మృగాలకు రాజైనది
4) కంఠమునందు రవము గలది
53. ‘వంశము’ అనే పదానికి నానార్థాలు
1) కులము, గోత్రము
2) కులము, వెదురు
3) వంగడం, విత్తనం
4) సమూహం, బృందం
54. ‘అక్కు’ అనే పదానికి ప్రకృతి
1) అంకం 2) హక్కు
3) అక్కజం 4) అర్కు
55. ‘కష్టం’ అనే పదానికి వికృతి
1) కష్టి 2) స్వస్తి 3) కస్తి 4) గభస్తి
56. అనుభూతిలో తడుస్తూ వాళ్లు మూగబో
యారు ఈ వాక్యంలోని ‘మూగబోవడం’ అనే
జాతీయం తెలిపే భావం.
1) నోటికి చేతులడ్డం పెట్టుకోవడం
2) అనారోగ్యం కలగడం
3) మాట్లాడటానికి ఇష్టం లేకపోవడం
4) అనిర్వచనీయ అనుభూతిలో మాట్లాడలేక పోవడం
57. ‘తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోయింది’ అనేది ఒక
1) సామెత 2) పొడుపు కథ
3) జాతీయం 4) శబ్దపల్లవం
సమాధానాలు
1.3 2.2 3.3 4.3 5.2 6.4 7.1 8.3 9.4 10.1 11.2 12.3 13.3 14.4 15.1 16.2 17.3 18.2 19.1 20.3 21.3 22.2 23.2 24.3
25.2 26.4 27.4 28.3 29.3 30.4 31.4 32.2 33.3 34.1 35.1 36.1 37.4 38.4 39.1 40.3 41.1 42.2 43.2 44.3 45.1 46.2,4 47.1 48.3 49.4 50.4 51.1 52.3 53.2 54.2 55.1 56.3 57.4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు