అఫర్మేషన్లు ఎలా ఉండాలి?
భాషకున్న శక్తి సామాన్యమైనది కాదు. అందుకే అఫర్మేషన్లను అప్రమత్తంగా రూపొందించుకోవాలి. నెగెటివ్ పదాలు దొర్లకుండా చూసుకోవాలి. లక్ష్యాన్ని కంటికి ఎదురుగా స్పష్టంగా కన్పించేలా చేసేవిగా ఉండాలి. ఇవి హిప్నాసిస్‌లో సజెషన్స్లా ఉపయోగపడతాయి.
-ఎన్ఎల్పీలో ఎల్ అంటే లింగ్విస్టిక్ అని అర్థం. అంటే భాషా సంబంధిత విషయం అని అర్థం. మన మెదడులో ప్రధానమైన ఆలోచనలన్నింటికీ భాషే మూలం. ఆలోచన అనేది ఒక న్యూరో ప్రతిస్పందన. భాష కనుగొనని ప్రాథమిక దశలో ఈ న్యూరో ప్రతిస్పందన బాహ్య స్పందనల మేరకు మాత్రమే ఏర్పడి ఒక ఉద్వేగంగా రూపుదిద్దుకొని ఉండేదిగా భావించబడుతోంది. మానవ చరిత్రలో భాష ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. మనిషి పొందే బాహ్య స్పందనలకు భాష్యం ఏర్పడింది. ఈ భాష్యం ఒక భావనగా, ఆలోచనగా మైండ్‌లో నిక్షిప్తం కావడానికి దోహదమైంది. అప్పటినుంచి ప్రతిస్పందన భాషాపరంగానే రూపుదిద్దుకోవడం మొదలైంది.ఇప్పుడు మనం ఏ మానసిక స్పందనైనా జీవన ప్రక్రియలను మరింత చైతన్యవంతం చేసి పురోగతికి దారితీసింది.
అయితే ఈ క్రమంలో పురోగతికి సాయపడిన భాష, నెగెటివ్ ఆలోచనలకు కూడా దారితీయడం జరిగిపోతూ వచ్చింది. ఫలితంగా మన శక్తిసామర్థ్యాలను వినియోగించుకోవడంలో అసంతృప్తికరమైన పరిణామాలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురైంది. దీనిని అధిగమించడానికి ఎన్ఎల్పీ శాస్త్రజ్ఞులు భాషకు, భావానికి మధ్యనున్న సంబంధాన్ని అధ్యయనం చేసి, కొన్ని సాంకేతిక మార్పులకు చేసుకోవడం రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చని కనిపెట్టారు. మీ మైండ్ పవర్‌ను మేల్కొలిపే క్రమంలో, అఫర్మేషన్లు అతిజాగ్రత్తగా రూపొందించుకోవాలి. అఫర్మేషన్లు అంటే తేలికైన మాటలతో తయారుచేసుకొనే పదాల సమూహం అని అర్థం. ఇవి హిప్నాసిస్‌లో ఇచ్చే సజెషన్స్లా ఉపయోగపడ్తాయి.
ఇవి మీ అంతరంగానికి మీరు ప్రత్యక్షంగా పంపిస్తున్న సందేశాలు. మీ అంతరంగం తనకు పంపిన సందేశంలోని పదాలను, వాటికిగల అక్షరార్థాలను మాత్రమే తీసుకొంటుంది. అందువల్ల మీ సందేశంలోని పదాల అర్థం స్పష్టంగా, మీలోని ఉత్పాదక శక్తిని కేంద్రంగా తీసుకొని ఏర్పడిన పదమై ఉండాలి. మీరు ఆ విషయం తలుచుకొంటూనే నాకు కడుపు మండిపోతుంది అని అనుకొంటే, ఈ సందేశంలోని కడుపుమంట అనే పదం అక్షరార్థాన్నే మీ అంతరంగం స్వీకరిస్తుంది. మీకు నిజంగానే కడుపుమంట కలిగేలా చేస్తుంది. అందుచేత, మీరు మీ ప్రవర్తనను మార్చుకొనే నేపథ్యంలో, మీ లక్ష్యానికి అనుగుణంగా ఉండే పదాలనే అఫర్మేషన్ని తయారుచేయడానికి ఉపయోగించాలి. నేను కలెక్టర్ నవుతా అని మీరు సందేశమిస్తే, ఆ పదాన్ని పదేపదే మీ ఆలోచనల్లో చోటుచేసుకొంటే, మీ అంతరంగం మిమ్నల్ని కలెక్టర్‌గానే భావిస్తుంది. మీరు కలెక్టర్ కావడం కన్నా, మీరు కలెక్టర్ అనే భావన మీకు ఏర్పడటం చాలా ముఖ్యం.
మీరు కలెక్టర్ అనే భావన మీకు లేనప్పుడు, మీరు కలెక్టర్ అయ్యే అవకాశాలే ఉండవు. ఒకవేళ పొరబాటున మీరు కలెక్టర్ అయిపోయినా, మీ దృష్టిలో మాత్రం మీరు కలెక్టర్ కాదు. మీ అంతరంగం మిమ్మల్ని కలెక్టర్‌గా గౌరవించదు. అందుచేత మీరు ఏం కావాలని అనుకున్నారో,అది సాధించినట్లుగానే, అది వాస్తవ రూపం దాల్చినట్లుగానే మీ భావాలు కొనసాగాలి. అందుకు తగినట్లుగానే మీ అఫర్మేషన్లు రూపొందించుకోవాలి. కాబట్టి మీ అఫర్మేషనలను రూపొందించుకొనేటప్పుడు కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
-మీ అఫర్మేషన్స్ వ్యక్తిగతంగా ఉండాలి:
నేను, నాకు వంటి పదాలను మాత్రమే ఉపయోగించాలి. నేను అనే పదం మీ అంతరంగానికి డైరెక్టుగా స్ఫూర్తినిస్తుంది.
-అఫర్మేషన్లు పాజిటివ్‌గా ఉండాలి:
మీ సమస్యలు ఎన్ని ఉన్నా, వాటన్నింటిని పక్కన పెట్టేయండి. మీరు కోరుకున్నదేమిటో దానినే నొక్కివక్కానిస్తూ, పాజిటివ్ పదాలతో అఫర్మేషన్ తయారుచేసుకోవాలి.
ఉదా: నేను పరీక్షలంటే భయపడను (తప్పు) నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. పరీక్ష రాయడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను.
-అఫర్మేషన్లు వర్తమాన కాలంలో ఉండాలి:
మీరు మీ మైండ్‌కి అందించే ఏ సందేశమైనా వర్తమాన కాలంలోనే ఉండాలి. వాటిల్లో కొన్ని మీరు పూర్తిచేయాల్సినవి అయినప్పటికీ, మీరు భవిష్యత్తులో చేద్దాం అని అనుకొంటున్నవి అయినప్పటికీ వాటిని మీరు వర్తమానకాలంలోనే తయారుచేసుకోవాలి. నేను బ్రైట్ స్టూడెంట్‌గా మారుతాను. ఇది భవిష్యత్తును సూచిస్తుంది. అంటే మీ అంతరంగం దీనిని ఎప్పటికప్పుడు రేపటి చర్యగానే భావిస్తుంది. ఇది ఏ నాటికీ వర్తమానం కాబోదు. అందుచేత ఇది అఫర్మేషన్కు తగనిది. దీని బదులుగా నేను మంచి స్టూడెంట్‌ని అని అఫర్మేషన్ తయారుచేసుకోవాలి.
-పోలికలు ఉండరాదు:
మీరు ఏ విషయంలోనైనా సరే మీదైన ఒక సొంత బాణీని ఏర్పర్చుకోవాలి. ఎవరినో చూసి వారితో మీ సామర్థ్యాలను పోల్చుకొని అది మీలో ఉండాలని ఆలోచించరాదు. ఒకరి సామర్థ్యాన్ని గుర్తించడం మంచిదే. అయితే వారితో పోల్చుకొని మీ అఫర్మేషన్లు తయారుచేసుకోకూడదు. స్ఫూర్తిని పొందాలిగానీ కాపీ కొట్టకూడదు. మీ అఫర్మేషన్ల్లో పోలికల ప్రస్తావన ఉండకూడదు.
ఉదా: చైతన్య కన్నా నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి (తప్పు). నేను నా క్లాసులో నంబర్ 1 స్టూడెంట్‌ని (ఒప్పు).
-అఫర్మేషన్లను రూపొందించుకునే ముందు మీ ఆలోచనా శైలి ఎలాంటిదో పసిగట్టాలి. ఇది మీ అఫర్మేషన్లకు ప్లాట్‌ఫాం లాంటిది. మీ ఆలోచనా శైలి ఎలాంటిదో మీకు ఎట్లాంటిదో మీకు వెంటనే తెలియకపోయినట్లయితే కంగారు పడనక్కర్లేదు. తీరిగ్గా రెండురోజులపాటు సమయం తీసుకోండి. మీ మైండ్లోకి ఎన్ని ఆలోచనలు వస్తాయో వాటన్నింటినీ యధేచ్ఛగా రానివ్వండి. అలా వచ్చే ఆలోచనల్లో నెగెటివ్ ఆలోచనలు కూడా ఉంటాయి. అఫ్కోర్సు అవే ఎక్కువగా ఉంటాయి. వాటిని అడ్డుకోకండి. ఇలా రెండురోజులు గడిపేసరికి మీ ఆలోచన విధానంలో ఒక క్రమబద్ధత కన్పిస్తుంది. ఒకే పోలిక కలిగిన పదాలు దొరుకుతాయి. మిమ్మల్ని మీరు వర్ణించుకునే పదాల్లో అనేక చోట్ల సారూప్యత కన్పిస్తుంది. ఇప్పుడు నెగెటివ్ ఆలోచనలన్నింటినీ విభజించండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు