Telangana History | ‘తెలంగాణ మట్టి మనుషుల వేదిక’ సంస్థను స్థాపించినవారు?
తెలంగాణ చరిత్ర
1. తెలంగాణ రచయితల వేదికకు సంబంధించి అధ్యక్షులు, కార్యదర్శులను జతపర్చండి?
ఎ. మొదటి అధ్యక్షుడు 1. వేణు సంకోజు
బి. ప్రస్తుత అధ్యక్షుడు 2. నందిని సిధారెడ్డి
సి. మొదటి కార్యదర్శి 3. జూలూరి గౌరీశంకర్
డి. ప్రస్తుత కార్యదర్శి 4. జూకంటి జగన్నాథం
1. ఎ-2, బి-4, సి-1, డి-3
2. ఎ-4, బి-2, సి-1, డి-3
3. ఎ-2, బి-4, సి-3, డి-1
4. ఎ-2, బి-1, సి-4, డి-3
2. కింది వాటిని జతపరచండి?
(పత్రికలు-సంపాదకులు)
ఎ. తెలంగాణ గుండెదరువు 1. ఎస్.రఘువీరరావు
బి. నడుస్తున్న తెలంగాణ 2. పాశం యాదగిరి
సి. తెలంగాణ రసా 3. నెల్లుట్ల వేణుగోపాల్
డి. వీక్షణం 4. ప్రొ.కాశీం
1. ఎ-2, బి-4, సి-1, డి-3
2. ఎ-1, బి-4, సి-2, డి-3
3. ఎ-3, బి-4, సి-2, డి-1
4. ఎ-1, బి-4, సి-3, డి-2
3. కింది వాటిని జత పరచండి.
ఎ. తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతున్నది 1. వేనెపల్లి పాండురంగారావు
బి. కావడి కుండలు 2. అశోక్
సి. గిది తెలంగాణ 3. కార్టూనిస్ట్ శేఖర్
డి. తెలంగాణ రాజకీయ,ఆర్థిక, సామాజిక వ్యాసాలు 4. శ్రీధర్
1. ఎ-2, బి-1, సి-4, డి-3
2. ఎ-1, బి-2, సి-3, డి-4
3. ఎ-2, బి-3, సి-1, డి-4
4. ఎ-2, బి-1, సి-3, డి-4
4. రచయితలు, కవితా సంకలనాలు జతపరచండి.
ఎ. జయశిఖరం 1. జూలూరి గౌరీశంకర్
బి. పొక్కిలి 2. వేముగంటి మురళీకృష్ణ
సి. పొక్కిలి వాళ్లపులకింత 3. అంబటి సురేందర్
డి. మత్తడి 4. అన్నవరం దేవేందర్
1. ఎ-2, బి-1, సి-4, డి-3
2. ఎ-1, బి-2, సి-4, డి-3
3. ఎ-2, బి-1, సి-3, డి-3
4. ఎ-2, బి-4, సి-1, డి- 3
5. కింది వాటిని (కథలు, రచయితలు) జతపరచండి.
ఎ. తెలంగాణ చౌక్ 1. పెద్దింటి అశోక్
బి. యుద్ధనాదం 2. ఎల్లారెడ్డి
సి. తెలంగాణ 3. వెల్దండి శ్రీధర్
డి. నాలుగు కోట్లపిడికిళ్లు 4. ఓదెల వెంకటేశ్వర్లు
1. ఎ-2, బి-1, సి-4, డి-3
2. ఎ-1, బి-2, సి-4, డి-3
3. ఎ-2, బి-4, సి-1, డి-3
4. ఎ-2, బి-1, సి-3, డి-4
6. కింది వాటిలో సరికాని జత?
1) కేవై రెడ్డి- తెలంగాణ స్టేట్, పాపులర్ డిమాండ్
2) బి.కమలాకర్‌రెడ్డి – సెపరేట్ స్టేట్ ఫర్ తెలంగాణ
3) వెల్చాల కొండలరావు పోరాటం(2010) – తెలంగాణ అస్తిత్వం
4) సంగిశెట్టి శ్రీనివాస్- తిరగబడ్డ తెలంగాణ
7. కింది వాటిలో సరికాని జత?
1) ఎస్.బి. సీతారామారావు- గరిబోజ్జి
2) బండారు శ్రీనివాసరావు – రాజయ్య సోమయాజులు
3) వట్టికోట ఆళ్వారుస్వామి- పరిగె, పరిసరాలు
4) ఆవుల పిచ్చయ్య- దావతు
8. సరైన జతను గుర్తించండి.
1) ఎన్.వేణుగోపాల్- మన తెలంగాణ
2) ఇన్నయ్య – తెలంగాణ నుంచి తెలంగాణ దాకా
3) పిట్టల రవీందర్- తెలంగాణ రాష్ట్రసాధన-ఉద్యమ డైరీ
4) ఎం.ఎల్. నరసింహారావు- రాష్ట్రంలో రైతు ఉద్యమం
9. తెలంగాణ ఉద్యోగుల కార్యాచరణ కమిటీకి చెరుకు సుధాకర్ తర్వాత చైర్మన్‌గా వ్యవహరించినవారు?
1) దేవీ ప్రసాద్ 2) శ్రీనివాస్ గౌడ్
3) స్వామిగౌడ్ 4) సి.విఠల్
10. జీవో 610 అమలు కోసం ఎన్జీవోల తెలంగాణ యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది?
1) 2005 డిసెంబర్ 20
2) 2006 డిసెంబర్ 20
3) 2007 డిసెంబర్ 20
4) 2008 డిసెంబర్ 20
11. కింది వారిలో ‘తెలంగాణ మట్టి మనుషుల వేదిక’ అనే సంస్థను స్థాపించినవారు?
1) మణికొండ వేదకుమార్
2) వేనేపల్లి పాండురంగారావు
3) మల్లేపల్లి లక్ష్మయ్య
4) జూలూరి గౌరీశంకర్
12. కింది వాటిలో సరికాని జత?
1) తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య-2007 జూన్ (గూడ అంజయ్య)
2) సింగిడి రచయితల సంఘం 2008 సెప్టెంబర్ 21
3) తెలంగాణ సాంస్కృతిక వేదిక-2002 నవంబర్ 1
4) తెలంగాణ రచయితల వేదిక-2001 అక్టోబర్ 14
13. సరికాని జత ఏది?
1) నా జన తెలంగాణ- నర్రా పురుషోత్తం
2) తల్లి తెలంగాణ- ఎర్రం రాజు శోభారాణి
3) పాలపిట్ట -గుడిపాటి వెంకటేశ్వర్లు
4) జనపక్షం- చిక్కుడు ప్రభాకర్
14. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఉద్యమాన్ని ‘ఆత్మగౌరవం’, ‘సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం’గా నిర్వచిస్తూ ‘తెలంగాణ ధిక్కార సాహిత్య ఉద్యమం’ పేరుతో ‘ఊరేగింపు’ పుస్తకంలో వ్యాసాలు రాసినది ఎవరు?
1) జూలూరి గౌరీశంకర్
2) సామిడి జగన్‌రెడ్డి
3) డా.అంబటి సురేందర్
4) డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
15. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రకు సంబంధించి సరైన వ్యాఖ్య?
ఎ. అల్లం నారాయణ వ్యవస్థాపకులుగా 2001 మే 31న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడింది
బి. టీజేఎఫ్ ఆధ్వర్యంలో 2010 అక్టోబర్ 4న తెలంగాణ కోసం హైదరాబాద్ మీడియా మార్చ్
సి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో 2011 మే 17 నుంచి 19 వరకు ‘కలం కవాతు’
డి. టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో మాక్ అసెంబ్లీని 2011 మార్చి 14న నిర్వహించారు
1) ఎ, బి, సి, సరైనవి, డి తప్పు
2) ఎ, బి తప్పు, సి, డి సరైనవి
3) ఎ, బి, సి, డి సరైనవి
4) ఎ, సి సరైనవి, బి, డి తప్పు
16. కింది వాటిలో సరైన స్టేట్మెంట్?
ఎ. జోగిని వ్యవస్థ నిమ్నకుల సంప్రదాయం, ద్రావిడ సంప్రదాయం
బి. దేవదాసీ వ్యవస్థ అగ్రవర్ణ సంస్కృతి
సి. దేవదాసీ, జోగిని వ్యవస్థలు రెండు కూడా నిమ్నకులాల సంస్కృతికి చెందినవి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి, సి
17. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ పండగకు ఒక్కొక్క రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. మొదటి మూడు రోజులు గౌరీదేవి సౌభాగ్యం ఇస్తుంది
బి. తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవి సిరి సంపదలు ఇస్తుంది
సి. చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజిస్తారు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) పైవన్నీ
18. సమ్మక్క సారక్క గురించి కింది వాక్యాల్లో సరైనది?
ఎ. మొదటి రోజు: గద్దెలపై ఉన్న అమ్మవార్లను కొలుస్తారు. అమ్మవార్లిద్దరు గద్దెలపై కొలువుదీరుతారు
బి. రెండో రోజు: చిలుకల గుట్టలో కొలువై ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దెపైకి తీసుకొస్తారు
సి. మూడో రోజు: కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెపైకి తీసుకొస్తారు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) పైవన్నీ
19. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. ఇస్లాం మతస్థులు సంతాప సూచకంగా మొహర్రం మాసాన్ని ‘శోక మాసం’గా పాటిస్తారు. ప్రాణ త్యాగాలు చేసిన వీరులకు పుణ్యం కలగాలంటూ 9, 10వ రోజుల్లో ఉపవాస దీక్షలు చేపడతారు
బి. షియా ముస్లింలు మొహర్రంను యౌముయె-ఆఘారా అని అంటారు. అరబ్బీలో ఆఘారా అంటే 9 అని అర్థం
సి. మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లోని షియా మతానికి చెందిన ముస్లింలు సంతాప సూచకంగా రక్తం చిందిస్తారు. మొహర్రం అనే పేరు హారామ్ (నిషిద్ధం) అనే పదం నుంచి ఆవిర్భవించింది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) ఎ
20. కింది వాక్యాల్లో సరికానివి?
ఎ. నిజాం రాష్ట్రంలో మొత్తం గ్రామాల సంఖ్య 21,870
బి. హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం 92,698 చదరపు మైళ్లు
సి. హైదరాబాద్ సంస్థానంలో మూడు ప్రాంతాలు కలవు
డి. హైదరాబాద్ సంస్థానంలోని మొత్తం జిల్లాల సంఖ్య 16
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) పైవన్నీ
21. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. కొన్ని గ్రామాల సమూహాన్ని హల్క (లేదా) సర్కిల్ అంటారు
బి. నీరడి- సర్కారీ సమాచారాన్ని గ్రామవాసులకు అందజేసే ఉద్యోగి
సి. దేహరి- గ్రామ నీటిపారుదల, చెరువులు, కాల్వల పర్యవేక్షణాధికారి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) ఎ
22. కింది వాటిలో సరైంది?
ఎ. నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్టెంట్ 1932లో 27 బస్సులను 166 మంది సిబ్బందితో ప్రారంభించారు
బి. కాచిగూడ రైల్వేస్టేషన సెంట్రల్, సైడ్ డోమ్లతో పాటు మినార్లు కలిగి ఉండి గోథిక్ శైలిలో నిర్మించారు
సి. 1938లో నిజాం జారీ చేసిన ఫర్మానా ప్రకారం దక్కన్ విమానయాన సంస్థ నిజాం ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడి నిజాం రైల్వే ఆధ్వర్యంలో వచ్చింది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) పైవన్నీ
23. సరైన వాక్యం?
ఎ. తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గల కొండలపైన అధికంగా నివసిస్తారు. వీరికి కొండారెడ్లు అని పేరు వచ్చింది. వీరినే హిల్ రెడ్లు అని, రాచరెడ్లు అని, పాండవ రెడ్లు అని కూడా పిలుస్తారు
బి. కొండారెడ్లు బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. బాలింతలను 21 రోజులు వేరే ఇంట్లో ఉంచుతారు. దీన్నే ‘కీడుపాక’ అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
24. గజల్ గురించి సరికాని వాక్యం?
ఎ. సినారె తెలుగు గజల్లు, గదిలో సముద్రం, సినారె గజల్లు అనే సంకలనాలతో పాటు వారి ఇతర గ్రంథాలతో కలిపి దాదాపు 200 పైగా గజల్లు రచించారు
బి. ఉర్దూ భాషలో మొదటగా గజల్లు రచించిన వారు షావలి ఉల్లాఖాన్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
25. గుస్సాడి నృత్యం గురించి కింది వాక్యాల్లో సరికానిది?
ఎ. ఆదిలాబాద్ జిల్లాలోని లంబాడీలు సమూహాలుగా చేరి ఈ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు
బి. ఇందులోని చిన్న చిన్న సమూహాలను గుస్సాడి అంటారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
26. యక్షగానానికి సంబంధించి సరైన వాక్యం?
ఎ. తెలంగాణ యక్షగాన పితామహుడు- చెర్విరాల భాగయ్య కవి
బి. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్‌తేజలు వీర తెలంగాణ అనే యక్షగానాన్ని రచించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
27. ఏడుపాయల జాతర గురించి కింది వాక్యాల్లో సరైనది?
ఎ. ఏడుపాయల్లో మూడు పాయలు దుర్గాభవాని ఆలయం ముందు వైపు నుంచి, మిగిలిన నాలుగు పాయలు దుర్గాభవాని ఆలయం వెనుక వైపు నుంచి ప్రవహిస్తాయి
బి. ఏడుపాయల పేర్లు ఏడుగురు రుషుల పేర్లు.. 1. అత్రి, 2. జమదగ్ని, 3. విశ్వామిత్ర, 4. కశ్యప, 5. వశిష్ఠ, 6. భరద్వాజ, 7. గౌతమి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
28. రామప్ప దేవాలయానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
1) చాళుక్య వాస్తుశైలిలో నిర్మాణం
2) ఏకశిల పద్ధతిలో నిర్మించిన దేవాలయం
3) శిల్పి పేరు మీద ఉన్న ఏకైక దేవాలయం
4) ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో స్థానం దక్కించుకుంది
29. 1919లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ చేసిన చట్టం ప్రకారం ముల్కీలు అంటే?
ఎ. స్థానికులకు జన్మించినవారు
బి. హైదరాబాద్‌లో 15 ఏళ్లుగా ఉంటూ స్వస్థలాలకు తిరిగి వెళ్లమని అఫిడవిట్ సమర్పించినవారు
సి. ముల్కీలను వివాహం చేసుకున్న మహిళలు
డి. నిజాం ప్రభుత్వంలో 15 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేస్తున్నవారు, వారి కుటుంబ సభ్యులు
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
30. భూదాన ఉద్యమం గురించి కింది వాటిలో సరైనవి?
ఎ. భూదాన ఉద్యమాన్ని వినోబాభావే ప్రారంభించారు
బి. 1951 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో భూదాన ఉద్యమం ప్రారంభమైంది
సి. మొదటగా వెదిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి భూదానం చేశారు
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు