తెలంగాణ హామీల దినం
కేఆర్ ఆమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీఓ యూనియన్ 1968, జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది. ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించడం, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించడం, కోర్టు తీర్పులను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఉత్తర్వులను అమలు చేయకపోవడం, బోగస్ ముల్కీ సర్టిఫికెట్లపై ఇతర కారణాలతో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల్లో వేలాది మంది ఆంధ్రావారిని నియమించడం వంటి కారణంతో టీఎన్జీఓలు తెలంగాణ రక్షణల ఉద్యమం ప్రారంభించారు. ఇందులో భాగంగా 1968, జూలై 10న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ హక్కుల దినం సభలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ 1968, ఆగస్టు 18న 209 మందిని (నాన్ ముల్కీ), తాత్కాలికంగా నియమితులైన ఉపాధ్యాయుల సర్వీసులను పర్మినెంట్ చేశారు. వారిని నియమించినప్పుడు ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్స్‌లోని రూల్ 3 ప్రకారం సడలింపు పొందలేదు. వీరంతా హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ చిన్నపరెడ్డి ఈ టీచర్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు. జస్టిస్ చిన్నపరెడ్డి నల్లగొండ టీచర్ల రిట్తోపాటు ఇతర రిట్లలో సంయుక్తంగా ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు బెంచ్ 1969, మార్చి 21న పార్లమెంట్ వీటిని రద్దు చేసేవరకు ముల్కీ రూల్స్ అమల్లో ఉన్నట్లు పరిగణించాలని తీర్పునిచ్చింది. తెలంగాణ ఉద్యోగులపై అన్యాయాలు, చట్టాల తీర్పుల ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోపక్క కోర్టులో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముల్కీ నిబంధనలు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టంలోని నిబంధనలు చెల్లుతాయని, చెల్లవని విభిన్న తీర్పులు వెలువడుతూనే ఉన్నాయి. మరోపక్క 1968, జూలై నుంచి టీఎన్జీఓలు ప్రారంభించిన ఆందోళన కొత్తగూడెం, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, 1969 జనవరి 3వ వారం నాటికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదిగా తెలంగాణ రక్షణల ఉద్యమంగా పేర్కొనవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు