తెలంగాణలోని రక్షిత అడవులు ఏవి?
ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు.
– అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అంటారు. ఫారెస్ట్ అనేది లాటిన్ భాషా పదమైన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది.
– ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం.
– అడవుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్ట్రీ అంటారు.
– దేశంలో 1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది.
– 1952లో నూతన అటవీ విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. (ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్)
– ఈ అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి.
– తెలంగాణ రాష్ట్ర అటవీ నివేదిక – 2015-16 ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణం – 27,292 చ.కి.మీ.
– తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం – 24.35
– భారత్‌లో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ స్థానం – 12 (టీఎస్ సెస్ రిపోర్ట్- 2016-17)
గమనిక: భారతదేశ అటవీ విస్తీర్ణం – 7,01,673 చ.కి.మీ.
– భారతదేశ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం – 21.34 అటవీ విధాన లక్ష్యం
– ప్రధాన లక్ష్యం – గ్రామీణ పేదరిక నిర్మూలనకు అడవులను ఆయుధంగా చేసుకోవడం
– అటవీరంగం ద్వారా జీవనోపాధి కల్పన తెలంగాణలో జీవ వైవిధ్యత
– 2800 రకాల మొక్కలు
– 21 రకాల ఉభయచరాలు
– 108 రకాల క్షీరదజాతులు
– 365 రకాల పక్షిజాతులు
– 28 రకాల సరీసృపాలు ఉన్నాయి
– జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలు 12. దీనిలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)-9, జాతీయ పార్కులు- 3 ఉన్నాయి.
గమనిక: తెలంగాణలో చిరుతపులి, అడవిదున్న, పులులు, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, బురద మొసలి, డేగలు మొదలైన జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిని కాపాడటానికి ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది.
– ఆవాసాంతర రక్షణ- జాతీయపార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు. ఆవాసాంతర రక్షణ- జీన్ బ్యాంకుల ఏర్పాటు ఉంటుంది.
తెలంగాణలోని జాతీయ పార్కులు
1. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, జూబ్లీహిల్స్, హైదరాబాద్
– స్థాపన – 1998
– విస్తీర్ణం – 1.42 చ.కి.మీ.
– ఇది పక్షులకు ప్రసిద్ధి
– పక్షి జాతుల సంఖ్య – 140
– మొక్క జాతుల సంఖ్య – 600
మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు, వనస్థలిపురం, రంగారెడ్డి
– స్థాపన – 1975
– విస్తీర్ణం – 14.59 చ.కి.మీ.
– సంరక్షిస్తున్న ముఖ్య జంతువు – జింక
మృగవని జాతీయ పార్కు, చిలుకూరు, మొయినాబాద్, రంగారెడ్డి
– స్థాపన – 1994
– విస్తీర్ణం – 3.6 చ.కి.మీ.
– ఇక్కడ సంరక్షిస్తున్న జంతువు – కుందేలు, అడవిపిల్లి, రక్తపింజర, పైథాన్ (కొండ చిలువ), అడవి పంది
– ఈ జాతీయ పార్కు పూర్వపు పేరు – చిలుకూరు రిజర్వు ఫారెస్ట్
– దీన్ని 1994లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
గమనిక: దేశంలోని మొత్తం జాతీయ పార్కుల సంఖ్య- 104, అభయారణ్యాల సంఖ్య- 536 (2016, ఏప్రిల్ వరకు)
తెలంగాణలోని అభయారణ్యాలు -9
1. కవ్వాల్ అభయారణ్యం – వైశాల్యం – 892 చ.కి.మీ.
– ఇది ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉంది.
– దీనిలో 4 పులులు ఉన్నాయి. నీల్గాయ్, అరిచే జింకలు, అడవి దున్న ఉన్నాయి.
2. ప్రాణహిత అభయారణ్యం
– మంచిర్యాల జిల్లా (ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం)
– వైశాల్యం – 136 చ.కి.మీ.
– అంతరించిపోయే దశలో ఉంది.
– కృష్ణజింక, చింకార, తాబేళ్లు ఉన్నాయి.
3. శివారం అభయారణ్యం
– పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది
– వైశాల్యం – 29.81 చ.కి.మీ.
– మొసళ్లు, కష్ణజింక, ఎలుగుబంట్లు ఉన్నాయి
4. ఏటూరు నాగారం అభయారణ్యం
– ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లిలో విస్తరించి ఉంది.
– వైశాల్యం – 806.15 చ.కి.మీ.
– దీనిలో తోడేళ్లు, నీల్గాయ్, సాంబార్, కృష్ణజింక, మచ్చల జింక ఉన్నాయి.
గమనిక: ఇది తెలంగాణలో పురాతన అభయారణ్యం
– దీని గుండా గోదావరి నది ప్రవహిస్తుంది
– ఈ అభయారణ్యంలో రాక్షస గూళ్లు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి.
5. పాకాల అభయారణ్యం
– పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది.
– వైశాల్యం – 860 చ.కి.మీ
– దీనిలో జంతు జాతులు- సాంబార్, నీల్గాయ్, స్లోత్ బేర్, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, అడవి పందులు
– దీనిలోని పక్షి జాతులు – కొంగలు, గుడ్లగూబలు, అడవి బాతులు
6. కిన్నెరసాని అభయారణ్యం
– పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం
– వైశాల్యం – 635.40 చ.కి.మీ.
– దీనిలోని జంతువులు – చింకార, హైనా, సాంబార్, అడవి పంది, అడవి దున్న, పులి, కృష్ణజింక
7. అమ్రాబాద్ అభయారణ్యం (రాజీవ్ గాంధీ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం)
– నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది.
– విస్తీర్ణం – 2166.37 చ.కి.మీ.
– సంరక్షించే జంతువులు – బెంగాల్ పులి, చిరుత, సాంబార్, కృష్ణజింక
గమనిక: ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.
– ఇది దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం
– రాష్ట్ర విభజనవల్ల ఈ అభయారణ్యాన్ని విభజించారు. తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది.
– దీనిలోని పులుల సంఖ్య – 9
– ఇండియాలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం- కర్ణాటక (406)
– ఇండియాలో మొత్తం పులుల సంఖ్య- 2226
8. మంజీర అభయారణ్యం
– మెదక్ జిల్లాలో ఉంది
– విస్తీర్ణం – 20 చ.కి.మీ.
– ఈ అభయారణ్యంలో 70 రకాల వివిధ పక్షిజాతులు, క్షీరదాలు, వృక్షజాతులు, సరీసృపాలు ఉన్నాయి.
– ఇది ప్రధానంగా మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి.
9. పోచారం అభయారణ్యం
– ఇది కామారెడ్డి- మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది.
– విస్తీర్ణం- 130 చ.కి.మీ.
– ఈ అభయారణ్యం నెమళ్లు, పాములు, కొంగలు, బాతులు, చిరుత పులులకు ప్రసిద్ధి
గమనిక: ఔషధ అభయారణ్యం – అనంతగిరి
– దేశంలో మొదటి జాతీయ పార్కు – హేలి (ఉత్తరాఖండ్, 1935)
– ప్రస్తుతం దీన్ని జిమ్‌కార్బెట్ జాతీయపార్కు అని పిలుస్తున్నారు.
– ఇది ఒక వేటగాడి పేరున ఏర్పడిన జాతీయ పార్కు
జీవావరణ కేంద్రాలు
– వీటి సరిహద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను రక్షిస్తారు. ఇందులో టూరిజాన్ని అనుమతివ్వరు.
– ఇండియాలో మొదట గుర్తించిన జీవావరణ కేంద్రం – నీలగిరి (తమిళనాడు, 1986)
– ఇండియాలో ఇటీవల గుర్తించిన జీవావరణ కేంద్రం- పన్నా (మధ్యప్రదేశ్, 2011)
– ప్రస్తుతం ఇండియాలోని జీవావరణ కేంద్రాల సంఖ్య- 18
– వీటిలో 10 జీవావరణ కేంద్రాలు యునెస్కో జాబితాలో చేర్చారు.
– ఇండియాలోని అతిపెద్ద జీవావరణ కేంద్రం- రాణా ఆఫ్ కచ్ (గుజరాత్, 12,454 చ.కి.మీ.)
– ఇండియాలోని అతిచిన్న జీవావరణ కేంద్రం- దిబ్రు సైకోవా (అసోం, 765 చ.కి.మీ.)
యునెస్కో వారు గుర్తించిన జీవావరణ కేంద్రాలు
1. నీలగిరి (తమిళనాడు)
2. మన్నార్ సింధుశాఖ (తమిళనాడు)
3. సుందర్బన్ (పశ్చిమబెంగాల్)
4. నందాదేవి (ఉత్తరాఖండ్)
5. అగస్త్యమలై (కేరళ, తమిళనాడు)
– అగస్త్యమలై జీవావరణ కేంద్రాన్ని ఇటీవల 2016లో యునెస్కో జాబితాలో చేర్చారు.
తెలంగాణలోని జూలాజికల్ పార్కులు
1. నెహ్రూ జూలాజికల్ పార్క్
– షామీర్పేట, హైదరాబాద్, 1963, అక్టోబర్ 3
– ఇది సహజ పరిస్థితులను కల్పింపజేసి ఏర్పాటుచేసిన జూపార్కుల్లో దేశంలోనే మొదటిది.
2. వన విజ్ఞాన కేంద్రం
– వరంగల్, 1985
గమనిక: 2001లో కరీంనగర్లో ఉజ్వల పార్కును ఏర్పాటు చేశారు.
తెలంగాణలోని ప్రధాన జింకల పార్కులు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి)
1. కిన్నెరసాని జింకల పార్కు- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం
2. లోయర్ మానేరు డ్యాం జింకల పార్కు- కరీంనగర్
3. జవహర్లాల్ నెహ్రూ జింకల పార్కు- షామీర్పేట,హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు