Symbols of India | భారతదేశ చిహ్నాలు జనగణమన
జాతీయ గీతం
-1950, జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించారు.
-జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు, సంక్షిప్తంగా అయితే 20 సెకండ్ల సమయం పడుతుంది.
-ఈ గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రాయగా అందులో మొదటి చరణంలోని ఎనిమిది లైన్లను మాత్రమే స్వీకరించారు.
-ఈ గీతాన్ని 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా సరళా చౌదురాణి బృందం ఆలపించింది.
-మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలో కూడా ఠాగూర్ 1919లో అనువాదం చేశారు.
-ఈ గీతాన్ని చిత్తుప్రతిపై రచించగా 1912లో భారత విధాత పేరుతో తత్వబోధిని పత్రికలో ప్రచురితమయ్యింది.
వందేమాతరం-జాతీయ గేయం
-1950, జనవరి 24న జాతీయ గేయంగా స్వీకరించారు. ఈ గేయాన్ని 1882లో బంకించంద్ర చటర్జీ రచించిన ఆనంద్‌మఠ్ గ్రంథం నుంచి తీసుకున్నారు.
-ఈ గేయాన్ని చటర్జీ సంస్కృతంలో రాయగా, అరబింద ఘోష్ ఆంగ్లంలో అనువదించారు.
-తొలిసారిగా 1896 కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు.జాదునాథ్ భట్టాచార్య ఆ గేయానికి సంగీతం సమకూర్చారు.
జాతీయపతాకం
-1947, జూలై 22న స్వీకరించారు.
-జాతీయపతాకాన్ని పింగళి వెంకయ్య (విజయవాడ) రూపొందించగా, తొలిసారిగా 1921 విజయవాడలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ప్రదర్శించారు.
-పతాకంలోని కాషాయం రంగు ధైర్యానికి, త్యాగానికిగాను, తెలుపురంగు శాంతి, సత్యానికిగాను, ఆకుపచ్చరంగు విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు
-పతాకం మధ్య భాగంలోని తెలుపు రంగుపై 24 గీతలతో, ముదురు నీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. దీన్ని సారనాథ్‌లోని అశోకుని స్తంభం నుంచి స్వీకరించారు. ఇది దేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం. దీని స్థానంలో మొదట చరఖా ఉండేది.
-3:2 నిష్పత్తిలో పోడవు, వెడల్పు కలిగినప స్వచ్చమైన నూలు గుడ్డతో ఉంటుంది
-2002, జనవరి 26 నుంచి పౌరులందరూ అన్ని సందర్భాల్లో ఎగురవేయడానికి వీలుగా ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002 అమల్లోకి వచ్చింది.
జాతీయ చిహ్నం
-1950, జనవరి 26న జాతీయ చిహ్నంగా స్వీకరించారు.
-ఒకే పీటపై నాలుగు దిక్కులకు ముఖం చేసి నిలబడిన నాలుగు సింహాలు ఉంటాయి. చూడటానికి మూడు మాత్రమే కన్పిస్తాయి.
-ఈ ముద్రను సారనాథ్‌లోని అశోకుని ధర్మస్తూపం నుంచి స్వీకరించారు?
-నాలుగు సింహాలు నిలబడిన పీఠం కింది భాగంలో అశోకచక్రం, ఆ చక్రానికి కుడివైపున ఎద్దు (స్థిరత్వాన్ని, చిహ్నం), కుడివైపున పరుగెడుతున్న గుర్రం (వేగానికి చిహ్నం) ఉంటాయి.
-ఈ పీఠం గంట ఆకారంలో గల తామర పువ్వుపై ఉంటుంది. ఈ చిహ్నంలో దేవనాగరిలిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఈ పదాన్ని ముండకోపనిషత్ గ్రంథం నుంచి స్వీకరించారు.
-నాలుగు తలలు అనేవి శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం అనే నాలుగు గుణాలకు ప్రతీక.
జాతీయ ప్రతిజ్ఞ
-1965, జనవరి 26న జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. ఈ ప్రతిజ్ఞను తెలుగులో పైడిమర్రి వెంకట సుబ్బారావు రంచించారు. దీన్ని 1962లో విశాఖపట్నం పాఠశాలలో ఆలపించారు.
జాతీయ భాష- హిందీ
-జాతీయ భాషగా హిందీనీ 1950లో ప్రకటించగా, 1963 అధికార భాషా చట్టం అనుసరించి 1965 నుంచి అధికార భాషగా వాడుతున్నారు.
-ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా ప్రకటించారు.
-ప్రస్తుతానికి ఇండియాలో ఐదు రాష్ట్రాలకు మాత్రమే అధికార భాషగా ఉంది. అవి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్.
జాతీయ క్రీడ-హాకీ
-భారత హాకీ జట్టు 1928-1956 మధ్య ఒలింపిక్స్‌లో వరుసగా 6 సార్లు, మొత్తంగా 8 సార్లు స్వర్ణం సాధించింది.
జాతీయ జంతువు-పెద్దపులి
-శాస్త్రీయ నామం- పాంథారా టైగ్రిస్
-దట్టమైన పసుపు రంగు వర్ణంలో నల్లటి మసక చారలు కలిగి ఉంటుంది.
-పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు