How to think happens as well | యద్భావం.. తత్భవతి!
గుడ్ మార్నింగ్ సార్! విద్యార్థులంతా గ్రీట్ చేశారు నందు సార్ గదిలోకి రాగానే. చిరనవ్వుతో గుడ్ మార్నింగ్ అని వేదికపైకి చేరుకున్నారాయన. కాసేపు అందరివైపు చూసి హ్యాపి మార్నింగ్ అన్నారు. హ్యాపీ మార్నింగ్ అని మరోసారి గట్టిగా గ్రీట్ చేశారు. విద్యార్థులు ఆయన వైపే చూస్తూ ఉండిపోయారు. ఈ రోజు నిజంగా హ్యాపీ డేనే, మనమంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన రోజు. ఏమిటీ ఈ వేళ ప్రత్యేకత? విద్యార్థులంతా ఆలోచనలో పడ్డారు.
-ఈ రోజు న్యూఇయర్ డే కాదు
-ఇండిపెండెన్స్‌డే కాదు
-ఏదైనా కప్పు గెలిచామా అనుకోవడానికి క్రికెట్ మ్యాచ్‌లూ ఏవి జరగటం లేదు.
-ప్రముఖ నాయకుల పుట్టినరోజు కాదు.
-ఏదైనా పండుగ రోజేం కాదు
ఎంత ఆలోచించినా వారికేం అర్థం కాలేదు. అనేక తర్జనభర్జనలు పడ్డాక మీరే చెప్పండి సార్ అన్నారు. ఒకే చెప్తాను కానీ డైరెక్ట్‌గా చెప్పను. కొన్ని హింట్స్ ఇస్తాను మీరే కనుక్కొంటారు. జనవరి 1ని సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటాం.
ఎందుకు చేసుకుంటారు? ఇదేం ప్రశ్న? న్యూయర్ కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. సంవత్సరంలో మొదటిరోజు అయినంత మాత్రాన మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? గతంగతః అనుకొని పోయిన సంవత్సరం తాలూకు కష్టాలు, బాధలను మర్చిపోయి మనం గతేడాది చేసిన తప్పులను మళ్లీ చేయకుండా నిర్ణయం తీసుకొని చక్కటి దృక్పథంతో మొదటిరోజును ఆరంభిస్తాం. అందుకే ఆ సందర్భాన్ని మనసారా ఆస్వాదిస్తూ సెలబ్రేట్ చేసుకుంటాం వివరంగా చెప్పింది శ్రావణి. మీరు చెప్పింది నిజమే. అదే లెక్కన తీసుకుంటే ఈరోజు జనవరి 1 కన్నా ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. జనవరి 1 అనేది కేవలం ఒక్క సంవత్సరానికే మొదటిరోజు. కానీ ఈ రోజు అంతకన్నా ముఖ్యమైన రోజు. విద్యార్థులంతా అయోమయంలో పడిపోయారు. అప్పుడు బోర్డుపై రాశాడు నందు సార్. Today is the first day of rest of my life
విద్యారులు బోర్డు వైపూ చూస్తుండిపోయారు. గతంగతః అనుకొని జీవితాన్ని ఎప్పటికప్పుడు తాజాగా ప్రారంభించాలి. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. అదేమిటంటే నీ మిగిలిన మొత్తం జీవితానికి ఈ రోజు మొదటిరోజు సగటున మీరొక ఎనభై సంవత్సరాల కాలం ఇంకా జీవించబోతున్నారనుకుంటే ఆ మిగిలిన సంవత్సరాలన్నింటికే ఇవాళే మొదటిరోజు. జనవరి 1 ఒక్క సంవత్సరానికే మొదటి రోజు. మరీ ఈ రోజు ఎన్నో సంవత్సరాల జీవితానికి మొదటిరోజు. మరి అలాంటి ఈరోజును ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి? యద్భావం, తద్భవతి అనేది వేదాల సారం. నీ మనసంతా ఆనందం నింపుకొని ప్రతిక్షణాన్ని ఆనందంగా ఆస్వాదించగలిగితే నీ జీవితంలో విషాదానికి, నిస్పృహకు చోటే ఉండదు. కొంతమంది ఎప్పుడూ ఏదో కోల్పోయినవారిలా నిరాశగా ఉంటారు. ముఖ్యంగా అలాంటివారికి అవసరం ఈ విధమైన ఆలోచన. ఇంకొంతమంది దేవుడు మాకేమీ ఇవ్వలేదని అనుకుంటు ఉంటారు. అలాంటి ఆలోచన కరెక్ట్ కాదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆహా! నాకు మరో సరికొత్త రోజు బహుమతిగా లభించిందనే పాజిటివ్ ఆలోచనతో రోజు ప్రారంభించండి. ఆ రోజంతా పాజిటివ్‌గా ఉంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?