క్లోనింగ్ ద్వారా మొదట జన్మించిన జీవి పేరేమిటి?
జీవ సాంకేతికత
1. డార్క్ బయోటెక్నాలజీ దేనికి సంబంధించింది?
ఎ. బయో టెరరిజం
బి. జీవ ఆయుధాలు
సి. పారిశ్రామిక జీవశాస్త్ర సాంకేతికత
డి. బయోఇన్ఫర్మాటిక్స్
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి, డి 4) ఎ, డి
2. సూక్ష్మజీవ నాశకమైన పెన్సిలిన్‌ను కనుక్కొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) ఫ్లెమ్మింగ్ 2) రాబర్ట్ కోచ్
3) వైజ్మన్ 4) కార్ల్ ఎరికె
3. పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన ఏ ఎంజైమ్‌ను పెరుగు తయారీలో వాడుతారు?
1) కెసిన్ 2) లాక్టేజ్
3) రెనిన్ 4) ఎమైలేజ్
4. లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి ఏది?
1) మ్యూకార్ 2) ఫ్యూసేరియం
3) పెనిసీలియం 4) సిట్రీటం
5. సూపర్ బగ్ ఒక—–
1) వైరస్ 2) ప్రొటోజోవా
3) శిలీంధ్రం 4) బ్యాక్టీరియమ్
6. వైద్య రంగానికి సంబంధించిన బయోటెక్నాలజీ ఏది?
1) రెడ్ బయోటెక్నాలజీ
2) వైట్ బయోటెక్నాలజీ
3) గ్రీన్ బయోటెక్నాలజీ
4) బ్లూ బయోటెక్నాలజీ
7. గ్రీన్ బయోటెక్నాలజీ ఏ రంగానికి సబంధించినది?
1) వైద్య రంగం
2) జల సంబంధమైన
3) వ్యవసాయ రంగం
4) పారిశ్రామిక రంగం
8. బీటీ పత్తి రకంలో బి, టి అంటే ఏమిటి?
1) బయో టెక్నాలజీ
2) బాసిల్లస్ తురింజెన్సిస్
3) బేరియం ట్రీటెడ్
4) బయో ట్రాన్స్ఫార్మ్డ్
9. బ్యాక్టీరియాల్లో ఉండే చిన్న గుండ్రటి డీఎన్ఏమని పిలుస్తారు?
1) మీసోసోములు 2) రైబోసోములు
3) గ్లెకోజెన్ దేహాలు 4) ప్లాస్మిడ్లు
10. మాలిక్యులార్ కత్తెరలు లేదా అణుకత్తెరలు అని వేటిని పిలుస్తారు?
1) డీఎన్ఏ లైగేజ్‌లు
2) రెస్ట్రిక్షన్ ఎంజైమ్‌లు
3) టోపో ఐసోమరేట్లు
4) పాలిమరేజ్లు
11. మాలిక్యులార్ స్టిచ్చర్స్ అని వేటిని పిలుస్తారు?
1) డీఎన్ఏ గేట్లు
2) టోపోఐసోమరేజ్లు
3) రెస్ట్రిక్షన్ ఎంజైములు
4) పాలిమరేజ్లు
12. రెస్టిన్ ఎంజైమ్‌లు డీఎన్ఏలోని వేటిని గుర్తిస్తాయి?
1) లోపాలు 2) బంధాలు
3) పాలిండ్రోమిక్ సీక్వెన్లు
4) పాస్ఫేట్లు
13. రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారైన ఇన్సులిన్‌లో గొలుసుల సంఖ్య ఎంత?
1) 5 2) 4 3) 2 4) 3
14. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలను అదుపులో ఉంచే శక్తి వేటికి ఉంటుంది?
1) ప్రొటీన్లు 2) జీన్స్
3) విటమిన్లు 4) చక్కెరలు
15. కింది వాటిలో ట్రాన్స్జెనిక్ మొక్కల్లో ఉపయోగించే ప్లాస్మిడ్ ఏది?
1) pBR322 2) R-ప్లాస్మిడ్
3) Ti-ప్లాస్మిడ్ 4) అన్నీ
16. రీకాంబినెంట్ డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన మొట్టమొదటి డ్రగ్‌ను ఏ జబ్బు కోసం ఉపయోగించారు?
1) హీమోఫీలియా 2) గుండెజబ్బు
3) మరుగుజ్జుతనం 4) డయాబెటిస్
17. ‘‘నాకౌట్ మౌస్’’ అంటే ఎలుకలో——
1) జన్యు సముదాయం కలది
2) ప్రేరేపించిన ఒక మానవ జన్యువు కలది
3) పలు మానవ జన్యు కాపీలు కలది
4) ప్రత్యుత్పత్తి కారక జన్యువు తొలగించబడింది
18. ట్రాన్స్జెనిక్ జీవి మొదటి పేటెంట్ 1973లో జరిగింది. ఆ జీవి పేరేంటి?
1) ముడి చమురును విచ్ఛిన్నం చేసే సూడోమానాస్ పుటిడా
2) మానవ ప్రొటీన్‌ను పాలలో తయారు చేసే ఎలుక
3) పరిశ్రమలో ఉపయోగించే ఈస్ట్
4) ఈ.కోలై
19. కింది వాటిలో ట్రాన్స్జెనిక్ ఫార్మా ఉత్పత్తులు, వాటి కోసం ఉపయోగించిన వాటి ఆతిధేయిలతో సరిగా జతకానిది ఏది?
1) ఆల్ఫా-1 యాటీ ట్రిప్సిన్- కుక్క
2) హీమోగ్లోబిన్- కుందేలు
3) మానవ పెరుగుదల హార్మోన్- ఎలుక
4) లాక్టోఫెరిన్- ఆవు
20. జీనోమిక్ లైబ్రరీ నుంచి మనకు కావలసిన జన్యువును ఎంచుకునేందుకు దేన్ని ఉపయోగిస్తారు?
1) క్లోనింగ్ వాహకాలు
2) DNA ప్రో
3) రెస్ట్రిక్షన్ ఎంజైమ్‌లు
4) జీన్ టార్గెట్లు
21. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1990 2) 1991
3) 1992 4) 1989
22. మొదటి ట్రాన్స్జెనిక్ పంట ఏది?
1) మొక్కజొన్న 2) గోధుమ
3) వరి 4) బార్లీ
23. అలెన్ జెఫ్రీ పేరు కింది దేనితో ముడిపడి ఉంది?
1) DNA అనుక్రమం
2) RNA అనుక్రమం
3) DNA వేలిముద్రలు
4) ఉత్పరివర్తన జననం
24. క్యారిముల్లిన్ పేరు కింది దేనితో ముడిపడి ఉంది?
1) RFLP 2) PCR
3) AFLP 4) RARD
25. GFP ప్రొటీన్ నుంచి దేన్ని తయారు చేశారు?
1) అరాబి డాంప్సిన్ థాలియానా
2) అక్వేరియా విక్టోరియా
3) సి. ఎలిగాన్స్ 4) డ్రోసోఫిలా
26. కింది వాటిలో దేన్ని జీవ ఎరువుగా ఉపయోగిస్తారు?
1) సెస్బానియా 2) ఓట్స్
3) వరి 4) మొక్కజొన్న
27. ఐ.పి.ఎం (IPM) అంటే?
1) ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్
2) ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ మేనేజ్మెంట్
3) ఇంటిగ్రేటెడ్ ప్రోటాన్ మేనేజ్మెంట్
4) ఇంటిగ్రేటెడ్ పొల్యూషన్ మేనేజ్మెంట్
28. 2006లో దేనిపై RNA ఇంటర్‌ఫెరాన్స్ (RNAi) కనుగొన్నందుకు నోబెల్ బమతి ఇచ్చారు?
1) డ్రోసోఫిలా 2) అరాబిడాంప్సిన్
3) సి. ఎలిగాన్స్ 4) ఎన్. పోంబే
29. తమ జీనోమ్‌కు అదనంగా అన్య జన్యువును వ్యక్తీకరించడానికి డీఎన్ఏను సవరించిన జంతువులను ఏమంటారు?
1) హైబ్రిడ్ జంతువులు
2) జన్యుపరివర్తిత జంతువులు
3) జన్యు వైవిధ్య జంతువులు
4) జన్యులోప జంతువులు
30. ఆల్ఫా-1 యాంటీ ట్రిప్సిన్ సంకేతించే జన్యువును ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
1) సిస్టిక్ ఫైబ్రోసిస్ 2) అల్జీమర్స్
3) రుమటాయిడ్ కీళ్లవాతం
4) ఎంఫైసీమా
31. 1997లో మొట్టమొదటి జన్యు పరివర్తిత ఆవు రోసీని దేని కోసం తయారు చేశారు?
1) మానవ ప్రొటీన్ అధికంగా గల పాల ఉత్పత్తి
2) ఇన్సులిన్ తయారీకి
3) పెరగుదల కోసం ఉయోగపడే హార్మోన్ తయారీకి
4) రోగ అధ్యయనం కోసం
32. 1980లో తయారు చేసిన ‘‘సూపర్ మైస్’’ కింది వేటి కోసం ఉపయోగిస్తారు?
1) మానవ ప్రొటీన్ EPA (గడ్డకట్టిన రక్తం చికిత్స) తయారీకి
2) మరుగుజ్జుతనం చికిత్సలో ఉపయోగించే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ తయారీకి
3) మానవ ఇన్సులిన్ తయారీకి
4) టీకాల తయారీకి
33. GMO అంటే?
1) జెనిటికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్గనిజమ్
2) జెనిటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజమ్
3) జెనిటికల్లీ మల్టీప్లెడ్ ఆర్గనిజమ్
4) జెనిటికల్లీ మాల్ఫంక్షన్డ్ ఆర్గనిజమ్
34. మొక్కల్లోని పాస్ఫరస్‌ను సమృద్ధిగా జీర్ణం చేసుకునేందుకు జన్యుపరంగా మార్పు చెందించిన ఏ జీవిని తయారు చేశారు?
1) సూపర్మైన్ 2) ఎన్విరోపిగ్
3) డాలీ 4) రోసీ
35. GFP అంటే?
1) జెనరల్ ఫుడ్ ప్రొడక్ట్
2) జెనిటికల్లీ పోర్టిఫైడ్ ప్రొడక్ట్
3) గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్
4) జనరల్ ఫంక్షనల్ ప్రొటీన్
36. జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ ‘‘గోల్డెన్ రైస్’’తో ఏ విటమిన్ లోపాన్ని సరిచేయవచ్చు?
1) విటమిన్-ఎ 2) విటమిన్-డి
3) విటమిన్-కె 4) విటమిన్-సి
37. క్లోనింగ్ ద్వారా మొదట జన్మించిన జీవి పేరు ఏంటి?
1) డాలీ 2) టామీ
3) రోసీ 4) మ్యాగీ
38. ఒక కణం నుంచి పూర్తి జీవి తయారయ్యే విధానం?
1) క్లోనింగ్
2) జెనెటిక్ ఇంజినీరింగ్
3) ట్రాన్స్ఫార్మేషన్ 4) ఎవాల్యుషన్
39. క్లోనింగ్ ద్వారా ఉద్భవించిన మొదటి క్షీరదం?
1) ఆవు 2) గేదె
3) గొరెపిల్ల 4) మేక
40. క్లోనింగ్ ద్వారా మొదటగా డాలీ అనే పేరుగల గొరెపిల్లను సృష్టించిన శాస్త్రవేత్త?
1) వాట్సన్
2) ఇయాన్ విల్మెట్ 3) క్రిక్
4) హరగోవింద్ ఖొరానా
41. క్లోనింగ్ ద్వారా సృష్టించిన జీవి దేన్ని పోలి ఉంటుంది?
1) శక్రకణాలను దానం చేసిన జీవిని
2) అండాలను దానం చేసిన జీవిని
3) చర్మకణాన్ని దానం చేసిన జీవిని
4) సరోగసి ద్వారా సృష్టించిన జీవిని
42. క్లోనింగ్ కింది ఏ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది?
1) శాఖీయ కణకేంద్రక మార్పిడి
2) లైంగిక కణకేంద్రక మార్పిడి
3) సంయుక్త బీజ క్రోమోజోము మార్పిడి
4) పిండ కణ క్రోమోజోము మార్పిడి
43. ప్రకృతిలో సహజ క్లోనింగ్ వేటిలో జరుగుతుంది?
1) బ్రయోఫైటా మొక్కలు
2) శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకొనే మొక్కలు
3) పక్షులు 4) క్షీరదాలు
44. క్లోనింగ్ అంటే ఏమిటి?
1) జన్యు పరివర్తన జీవిని సృష్టించడం
2) కొత్త లక్షణాలు గల జీవిని సృష్టించడం
3) కొత్తజాతి జీవిని సృష్టించడం
4) అవే లక్షణాలు గల అదే జాతి జీవిని సృష్టించడం
45. భారతదేశంలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా గేదెను సృష్టించిన సంస్థ ఏది?
1) నేషనల్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
2) నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
3) నేషనల్ ఎనిమల్ హస్బెండరీ సెంటర్
4) నేషనల్ క్లోనింగ్ సెంటర్
46. కశ్మీర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ క్లోనింగ్ ద్వారా ఏ జీవిని సృష్టించింది?
1) డాలి అనే పేరు గల గొరెపిల్ల
2) నోరి అనే పేరు గల లేగ దూడ
3) నోరి అనే పేరు గల ఫాష్మీనా జాతి మేక పిల్ల
4)టెట్రా అనే పేరు గల కోతి
47. హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు 2009లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన జంతువు ఏది?
1) ఆవు దూడ 2) పిల్లి పిల్ల
3) కోతి పిల్ల 4) గేదె దూడ
48. క్లోనింగ్ ప్రక్రియలో క్లోన్ అనే పదానికి అర్థం ఏమిటి?
1) జన్మించడం
2) ఒకే జాతి జీవుల సముదాయం
3) ఫలం 4) శిశువు
49. కశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు సృష్టించిన ఫాష్మీనా అనే జాతి మేక ప్రత్యేకత ఏమిటి?
1) అధిక వేడిని తట్టుకుంటుంది
2) అత్యంత నాణ్యమైన ఉన్నిని ఇస్తుంది
3) అధిక మాంసాన్ని ఇస్తుంది
4) నాణ్యమైన తోలును ఇస్తుంది
అత్యధిక అటవీ విస్తీర్ణం గల పది దేశాలు (2020 గణాంకాల ప్రకారం)
దేశం విస్తీర్ణం (మిలియన్ హెక్టార్లలో..)
రష్యా 815
బ్రెజిల్ 497
కెనడా 347
యూ.ఎస్ 310
చైనా 210
ఆస్ట్రేలియా 134
కాంగో రిపబ్లిక్ 126
ఇండోనేషియా 92
పెరూ 72
ఇండియా 72
శక్తి – రూపాంతరాలు
పరికరం రూపాంతరం
మైక్రోఫోన్ ధ్వని శక్తి నుంచి విద్యుత్ శక్తి
ఫ్యాన్ విద్యుత్ శక్తి నుంచి యాంత్రిక శక్తి
ఆవిరి యంత్రం ఉష్ణ శక్తి నుంచి యాంత్రిక శక్తి
సోలార్ బ్యాటరీ సౌర శక్తి నుంచి విద్యుత్ శకి
జల విద్యుత్ కేంద్రం యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తి
విద్యుత్ బ్యాటరీ రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తి
డైనమో యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తి
విద్యుత్ బల్బు విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తి, ఉష్ణ శక్తి
జవాబులు
1. 2 2. 1 3. 3 4. 1 5. 4 6. 1 7. 3 8. 2 9. 4 10. 2 11. 1 12. 3 13. 3 14. 2 15. 3 16. 4 17. 4 18. 4 19. 1 20. 3
21. 1 22. 1 23. 3 24. 2 25. 2 26. 1 27. 1 28. 3 29. 2 30. 4 31. 1 32. 1 33. 2 34. 2 35. 3 36. 1
37. 1 38. 1 39. 3 40. 2 41. 3 42. 1 43. 2 44. 4 45. 2 46. 3 47. 4 48. 2 49. 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు