తొలి అంతరిక్ష పర్యాటక యాత్ర విజయవంతం
మీకు తెలుసా?
-మానవసహిత రోదసి యాత్రల్లో కొత్త అధ్యాయం మొదలైంది. వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూరిజానికి స్పేస్ ఎక్స్ రాకెట్‌తో శ్రీకారం చుట్టారు. ప్రొఫెషనల్ వ్యోమగాములే లేని ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరిట్ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం 2021 సెప్టెంబర్ 16న ధవళ వర్ణ స్పేస్ సూట్లు ధరించిన క్రిస్ సెమ్‌బ్రోస్కీ, జేర్డ్ ఐజాక్‌మ్యాన్, సియాన్ ప్రోక్టర్, హేలే ఆర్సేనెక్స్లతో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగానంతరం రాకెట్‌కు సంబంధించిన మొదటి దశ బూస్టర్ ఫాల్కన్ రాకెట్ నుంచి విడిపోయింది. నిర్దేశించిన రీతిలో తిరిగి మహాసముద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వేదికపై నిట్టనిలువుగా దిగింది. దీన్ని తదుపరి అంతరిక్ష యాత్రలకూ ఉపయోగిస్తారు. ఇక ప్రయోగించిన 10 నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశించింది. అంతిమంగా ఇది భూమికి 575 కిలోమీటర్ల ఎత్తులోకి చేరింది. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఉన్న కక్ష్య కన్నా 160 కిలోమీటర్లు ఎక్కువ ఎత్తు కావడం విశేషం. హబుల్ టెలిస్కోప్ ఉన్న ప్రాంతాన్నీ క్రూ డ్రాగన్ దాటివెళ్లింది. అక్కడ గంటకు 27,360 కిలోమీటర్ల వేగంతో 90 నిమిషాలకోసారి భూమిని చుట్టింది. ఇది ధ్వని కన్నా 22 రెట్లు ఎక్కువ వేగం. మొత్తమ్మీద వ్యోమగాములు మూడు రోజుల పాటు భూ కక్ష్యలో గడిపారు.
– పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో కూడిన వ్యోమనౌక ఒకటి పుడమి కక్ష్యలో పరిభ్రమించడం ఇదే తొలిసారి. మూడు రోజుల పాటు రోదసిలో గడిపిన నలుగురు యాత్రికులు 2021 సెప్టెంబర్ 19న క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. వీరు ప్రయాణించిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక నిర్దేశిత రీతిలో ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహా సముద్ర జలాల్లో దిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు