క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
1. కిణ్వ ప్రక్రియకు సంబంధించిన విధానం ఎవరి కృషి వల్ల వెలుగులోకి వచ్చింది?
ఎ) చెయిమ్ వీజ్‌మన్
బి) లూయీ పాశ్చర్
సి) కార్ల్ ఎరికె డి) హాల్డేన్
2. జీవశాస్త్ర సంబంధ సమస్యలను కంప్యూటేషనల్ విధానాల ద్వారా పరిష్కరించడం?
ఎ) బయో లీచింగ్
బి) బయో ఇన్ఫర్మాటిక్స్
సి) బయో ఫార్మాసూటిక్స్
డి) వైట్ బయో టెక్నాలజీ
3. జీవసాంకేతికత తొలి రూపం?
ఎ) బయో లీచింగ్
బి) బ్రీడింగ్ సి) క్లోనింగ్
డి) పార్థెనోజెనిసిస్
4. శిలాజ ఇంధనాలపై ఉన్న డిమాండ్‌ను దేని ద్వారా తగ్గించవచ్చు?
ఎ) బయో లీచింగ్
బి) బయో రెమిడియేషన్
సి) బయో ఫ్యూయల్స్
డి) ఎల్పీజీ
5. జీవసాంకేతికత ఆధారంగా పర్యావరణ వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియ?
ఎ) బయో లీచింగ్
బి) బయో రెమిడియేషన్
సి) బ్రూయింగ్
డి) కిణ్వ ప్రక్రియ
6. జీవసాంకేతికత ద్వారా ఉత్పత్తి చేసిన పేలుడు పదార్థాం?
ఎ) TNT బి) Acetone
సి) IED డి) ఎ, సి
7. మత సంబంధ మత్తు పానీయాలు, ఆల్కహాల్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్న పురాతన జీవసాంకేతిక పరిజ్ఞానం?
ఎ) కిణ్వ ప్రక్రియ బి) పాశ్చరైజేషన్
సి) లీచింగ్ డి) రెమిడియేషన్
8. క్లోనింగ్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
ఎ) లాటిన్ బి) గ్రీక్
సి) ఆంగ్లం డి) ఫ్రెంచ్
9. ‘Studies on Fermentation’ను రచించింది?
ఎ) వీజ్‌మన్ బి) హాన్స్ స్పెమన్
సి) హాల్డేస్ డి) లూయీ పాశ్చర్
10. బహుళ అణువులను రూపొందించే ప్రక్రియ?
ఎ) రెమిడియేషన్ బి) లీచింగ్
సి) పాశ్చరైజేషన్ డి) అణు క్లోనింగ్
11. క్లోనింగ్ ప్రక్రియలో restriction ఎంజైమ్‌ల సహాయంతో వాంఛనీయ జన్యువులను వేటిలో ప్రవేశపెడతారు?
ఎ) వెక్టార్ బి) రైజోపస్
సి) సూడోమోనాస్ డి) ఇన్సులిన్
12. మొదట క్లోనింగ్ ద్వారా రూపొందించిన అంతరించిపోయే జంతువు?
ఎ) గౌర్ బి) టెట్రా
సి) మాషా డి) కార్ప్
13. క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
ఎ) ఇంజాజ్ బి) నూరి
సి) సంరూప డి) స్నప్పీ
14. పాష్మీనా జాతి మేకను రూపొందించడంలో కృషి చేసిన దేశం?
ఎ) భారత్ బి) అమెరికా
సి) స్కాట్‌ల్యాండ్ డి) చైనా
15. మానవ క్లోనింగ్ విధానం?
ఎ) థెరాఫ్యూటిక్ క్లోనింగ్
బి) రీప్రొడక్టివ్ క్లోనింగ్
సి) ఎ, బి
డి) పార్థెనోజెనెసిస్
16. ప్రౌఢ మూలకణాలు వేటిలో కనిపిస్తాయి?
ఎ) ఎముక మజ్జ
బి) అడిపోజ్ కణజాలం
సి) బ్లాస్టోసిస్ట్
డి) ఎ, బి
17. ప్రౌఢ మూలకణాలు కలిగి ఉండే ధర్మం?
ఎ) టోటి పొటెన్సీ
బి) మల్టీ పొటెన్సీ
సి) ఫ్లూరీ పొటెన్సీ
డి) యూనీ పొటెన్సీ
18. ప్రేరిత ప్లూరీ పొటెన్సీ గురించి తొలుత వివరించింది?
ఎ) ఇయాన్ విల్మట్
బి) షిన్యాయమనక
సి) కీత్ క్యాంప్‌బెల్
డి) హిల్డె మ్యాన్‌గోల్డ్
19. 1987లో ప్రచురించిన ‘బయో ఫిజికా’లో ఏ జంతువు ఉత్పత్తిని పేర్కొన్నారు?
ఎ) మాషా బి) టెట్రా
సి) కార్ప్ డి) కాపీ క్యాట్
20. భారత్‌లో మూలకణ పరిజ్ఞానానికి సంబంధించి పరిశోధనలు నిర్వహించే సంస్థ?
ఎ) Roslin Institute
బి) LV Prasad Eye Institute
సి) Reliance Life Sciences
డి) బి, సి
21. జతపరచండి.
ఎ.గ్రీన్ బయో టెక్నాలజీ
1. సముద్ర అనువర్తనాలు
బి. వైట్ బయో టెక్నాలజీ
2. వ్యవసాయ పద్ధతులు
సి. బ్లూ బయో టెక్నాలజీ
3. పారిశ్రామిక అనువర్తనాలు
డి. రెడ్ బయో టెక్నాలజీ
4. వైద్య సంబంధ అనువర్తనాలు
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-2, బి-4, సి-3, డి-1
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-2, బి-4, సి-1, డి-3
22. క్లోనింగ్ ద్వారా సృష్టించిన జీవులను వాటి జతలతో పోల్చండి.
ఎ. కార్ప్ 1. గుర్రం
బి. ప్రొమిటియా 2. చేప
సి. టెట్రా 3. ఎలుక
డి. రాల్ఫ్ 4. రీసస్ జాతి కోతి
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-2, బి-4, సి-1, డి-3
23. కింది మూలకణాలను వాటి వనరులతో జతపరచండి.
ఎ. ఫ్లూరీపొటెంట్ మూలకణాలు
1. ఎముక మజ్జ
బి. మల్టీ పొటెంట్ మూలకణాలు 2. ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్
సి. టోటి పొటెంట్ మూలకణాలు 3. లింఫాయిడ్ కణాలు
డి. ఓలిగో పొటెంట్ మూలకణాలు 4. బ్లాస్టోసిస్ట్
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-2, బి-3, సి-4, డి-1
24. క్లోనింగ్ ద్వారా రూపొందించిన జంతువులను, వాటిని రూపొందించిన శాస్త్రవేత్తలతో జతపరచండి.
ఎ. డాలీ 1. లాల్జీ సింగ్
బి. నూరీ 2. ఇయాన్ విల్మట్
సి. ఇండియన్ బ్లాక్ బక్
3. NDRI, కర్నాల్
డి. సంరూప 4. రియాజ్ అహ్మద్‌షా
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-2, బి-4, సి-3, డి-1
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-2, బి-4, సి-1, డి-3
25. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1- బయో టెక్నాలజీ అనే పదాన్ని కార్ల్ ఎరికే ప్రతిపాదించాడు
2- జీవసాంకేతికతను మానవాభివృద్ధికి అవసరమైన ఉత్పాదకాలను అందించే సాంకేతికత ఇది
3. జీవసాంకేతికతకు సంబంధించిన ఆధునిక పరిజ్ఞానాలకు ఉదాహరణ జినోమిక్స్, ఐప్లెడ్ ఇమ్యునాలజీ
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
26. జీవసాంకేతికతకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
1- జీవ సాంకేతికత ద్వారా రూపొందించిన తొలి ఉత్పన్నంగా వైద్యసంబంధ మందులను పేర్కొంటారు
2- వాంఛనీయ జన్యువులను, ప్లాస్మిడ్ వాహకాల ద్వారా Escherichia Coli వంటి సూక్ష్మజీవుల్లో ప్రవేశపెట్టి వర్ధనం చేస్తారు
3. జన్యుపరమైన పరీక్షల ద్వారా అనువంశిక వ్యాధులను నిర్ధారించడానికి
పార్థెనోజెనెసిస్గా పరిగణిస్తారు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
27. క్లోనింగ్‌కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
1- క్లోనింగ్‌ను JBS హాల్డేన్ కనుగొన్నాడు
2- ‘క్లోనింగ్’ అనే పదానికి ‘రెమ్మ’ అని
అర్థం
3- టోటి పొటెన్సీ ఆధారంగా జీవులను పునరుత్పత్తి చేసే విధానాన్ని ఇది వివరిస్తుంది
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2, 3
28. కిణ్వ ప్రక్రియకు సంబంధించి సరైన
వాక్యాన్ని గుర్తించండి.
1- సూక్ష్మ జీవుల చర్యల ద్వారా కిణ్వ ప్రక్రియ జరుగుతుందని వీజ్‌మన్ రుజువు చేశాడు
2- పాలు పులియడానికి, ఆహారం చెడిపోవడానికి కారణాలు 1860ల్లో వెల్లడయ్యాయి
3. లూయీ పాశ్చర్ కిణ్వ ప్రక్రియను ‘Life without Air’ గా నిర్వచించారు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 3
29. DNA భాగాలను క్లోనింగ్ చేయడంలోని ప్రక్రియలను గుర్తించండి.
1- Fragmentation
2- Ligation
3- Transfection
4- Screening
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
30. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1- Somatic Cell nuclear Transfer ద్వారా వ్యవసాయ రంగం, జంతువులను ఆహార అవసరాలకు అధికంగా ఉత్పత్తి చేయవచ్చు
2- అంతరించిపోయే జీవజాతులను SCNT ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
భారతదేశం శాస్త్ర సాంకేతిక విధానాలు
1. కింది వాటిలో శక్తిమంతమైన నవకల్పనల వ్యవస్థను రూపొందించే లక్ష్యం కలిగిన విధాన తీర్మానం?
ఎ) శాస్త్రసాంకేతిక విధానం-2013
బి) శాస్త్రసాంకేతిక విధానం -2003
సి) సాంకేతిక విధాన తీర్మానం-1993
డి) ఎ, బి
2. దేశ శ్రేయస్సుకు సంబంధించిన దాన్ని గుర్తించండి.
ఎ) సాంకేతికత బి) ముడి వనరులు
సి) పెట్టుబడులు డి) డిమాండ్
3. భారతదేశంలో శాస్త్రసాంకేతిక విధానాలు ప్రారంభించడంలో ఎవరి కృషి అమోఘమైనది?
ఎ) APJ అబ్దుల్ కలాం
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) మాధవన్ నాయర్
డి) హోమీ జె భాభా
4. శాస్త్రసాంకేతికత, నవకల్పనల విధానం-2013 ప్రకారం భారతదేశాన్ని ప్రపంచ శక్తిమంతమైన శాస్త్రసాంకేతిక దేశాల జాబితాలో చేర్చడానికి లక్ష్యంగా పేర్కొన్న సంవత్సరం?
ఎ) 2025 బి) 2020
సి) 2030 డి) 2040
5. శాస్త్రసాంకేతిక, నవకల్పనల విధానం-2013 ప్రకారం సరైనవి?
1- అభిలషణీయ స్థాయిలో వనరుల వృద్ధి
2- పరిమాణం, సాంకేతిక పరిధుల్లో వ్యయప్రభావిత నవకల్పనలను
ప్రోత్సహించడం
3-శాస్త్రసాంకేతికతలో నూతన
ఆవిష్కరణల ద్వారా అతిక్లిష్టమైన
నవకల్పనలు
4- సంప్రదాయ నైపుణ్యాలు,
సామర్థ్యాలను వాణిజ్యపరంగా
అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా
తీర్చిదిద్దడం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
6. దేశాభివృద్ధికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టిన విధాన తీర్మానం?
ఎ) సాంకేతిక విధాన తీర్మానం-1958
బి) సాంకేతిక విధాన తీర్మానం-1983
సి) సాంకేతిక విధాన తీర్మానం-1993
డి) శాస్త్రసాంకేతిక విధాన తీర్మానం-2003
7. సమాజంలోని మహిళలు, ఇతర బలహీనవర్గాల ప్రత్యేక అవసరాలపై దృష్టి సారించిన విధాన తీర్మానం?
ఎ) సాంకేతిక విధాన తీర్మానం- 1993
బి) శాస్త్రసాంకేతిక విధానం- 2003
సి) శాస్త్రసాంకేతిక, నవకల్పనల
తీర్మానం- 2013
డి) శాస్త్రసాంకేతిక విధానం- 1983
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు