జీవిత బీమా – భవిష్యత్తుకు ధీమా
- బీమా గత సంచిక తరువాయి భాగం
- ఆర్థిక వ్యవస్థలో బీమా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రతను సాధించేందుకు ఉపయోగించే సాధనం బీమా.
- ఇరువురి మధ్య లేదా ఒక వ్యక్తి ఒక సంస్థ మధ్య లేదా బీమా చేయించుకున్న వ్యక్తికి, బీమా చేయించిన సంస్థకు మధ్య కుదుర్చుకున్న ఒప్పందం బీమా.
బీమా రకాలు (Types of Insurence)
బీమా ప్రధానంగా రెండు రకాలు
- 1) జీవితబీమా (Life Insurence)
- 2) జీవితేతర బీమా (Non life Insurence) /సాధారణ బీమా (General Insurence)
- జీవిత బీమా మానవుని ప్రాణనష్టానికి సంబంధించింది.
- వ్యక్తి జీవితంపైన చేసే బీమాను జీవిత బీమా అంటారు.
- బీమా చేసిన వ్యక్తి మరణించినపుడు లేదా అంగవైకల్యం సంభవించినపుడు అతడు బీమా పథకంలో పేర్కొన్న నామినీకి బీమా మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది.
- బీమా చేసుకున్న వ్యక్తి చనిపోకపోతే పాలసీ కాలం పూర్తి అయిన తర్వాత అతను చెల్లించిన ప్రీమియం మొత్తానికి కొంత మొత్తం బోనస్ రూపంలో కలిసి అతనికి చెల్లిస్తుంది.
జీవిత బీమా ఒక దీర్ఘకాలిక ఒప్పందం
- భారతదేశంలో జీవిత బీమా భావనను ఆంగ్లేయులు ప్రవేశ పెట్టారు. ఆధునిక పద్ధతిలో జీవిత బీమా భావన విధానం 1818లో ఇగ్లండ్ నుంచి భారతదేశానికి, ఐరోపా సమాజం వితంతువులకు సహాయం చేయటం కోసం భారతదేశంలో నెలకొల్పిన మొదటి బీమా సంస్థ ‘ది ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.
- స్వాతంత్రానికి పూర్వం దేశంలో బీమా వ్యాపారాన్ని నియంత్రించేందుకు మొదట 1912 లో ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్ట్‌ను చేశారు.
- 1938లో మరొక చట్టాన్ని సమగ్ర లైఫ్ ఇన్సూరెన్స్ చట్టాన్ని చేశారు.
- స్వాతంత్రం తర్వాత 1950లో ఈ చట్టాన్ని సవరించారు.
- 1956 జనవరి 19న దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా సంస్థలన్నింటిని ప్రభుత్వ యాజమాన్యం కిందకు తీసుకువచ్చే ఆర్డినెన్స్ జారీ చేసింది.
- 1956 జూన్ 19న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది.
- 1956 సెప్టెంబర్ 1న 5 కోట్ల మూల ధనంతో భారత జీవిత బీమా సంస్థను స్థాపించారు.
భారత జీవిత బీమా సంస్థ (LIfe Insurence Corporation of India-LIC) - జీవిత బీమా సంస్థ (LIC): కుటుంబంలో ఆదాయాన్ని అర్జించే కుటుంబ యజమాని అకాల మరణం జరిగితే నష్టభయం నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించినది ‘జీవిత బీమా సంస్థ’.
జీవిత బీమా పాలసీలు ప్రధానంగా 6 రకాలు
1.మొత్తం జీవిత కాలం పథకం (Whole Life Policy)
- ఈ పథకం పాలసీదారుడి మొత్తం జీవిత కాలంలో అతనికి నష్టభయం నుంచి రక్షణ కల్పిస్తుంది.
- అతడు జీవిత కాలం అంతా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి.
2. ఎండోమెంట్ పథకం (Endoment policy)
- ఈ పథకం ఒక నిర్ణీతకాలం వరకు నష్టభయం నుంచి రక్షణకు బీమా కల్పిస్తుంది.
- వీటిలో బీమా మొత్తం మెచ్యురిటీ పిరియడ్ తర్వాత గాని పాలసీదారుడు మరణించిన తర్వాత గానీ, బీమా సంస్థలు లబ్ద్ధిరునికి చెల్లిస్తాయి.
3.ద్రవ్యం తిరిగి చెల్లింపు పథకం (Money Back Policy) - ఈ పథకం ప్రకారం పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ పరిపక్వత పొందే సమయానికి ప్రత్యేకంగా వివిధ దశల్లో కొంత మొత్తం చొప్పున పాలసీదారుడికి ద్రవ్యం చెల్లిస్తుంది. ఒకవేళ మధ్యలో చనిపోతే బీమా మొత్తాన్ని పాలసీదారుని నామినీకి చెల్లిస్తుంది.
4.కాలపరిమితి బీమా పథకం (Term Insurence Policy)
- ఈ పాలసీలో ఒక నిర్ణీత కాలానికి మాత్రమే బీమా వర్తిస్తుంది. దీన్ని టర్మ్ అంటారు.
- ఈ కాలపరిమితి 5, 10, 15, 20, 30 సంవత్సరాలు ఉంటుంది.
- ఈ కాల వ్యవధి తర్వాత బీమా ఉండదు.
- ఈ కాలవ్యవధిలోపు పాలసీదారుడు చనిపోతే అతనికి బీమా మొత్తం చెల్లిస్తుంది. ఈ పాసీలో ప్రీమియం తక్కువ బీమా ఎక్కువ ఉంటుంది.
5.యూనిట్ అనుబంధ బీమా పథకం (Unit linked Insurence Policy)
- ఈ పథకం వల్ల బీమా ద్వారా నష్టభయం నుంచి రక్షణ కల్పించడం మాత్రమే కాకుండా కొన్ని పన్ను రాయితీలు, ప్రీమియంపైన వడ్డీ కూడా చెల్లించవచ్చు.
6.బృంద బీమా పథకం (Group Insurence Policy)
- ఇది కొంత మంది వ్యక్తుల సమూహానికి బీమా కల్పిస్తుంది. దీన్ని బృంద బీమా అంటారు.
- విద్యార్థులుగాని, ఉద్యోగులు గాని, సంఘాలు గాని బృంద బీమా పొందవచ్చు.
- దేశ, విదేశాల్లో బీమా చేయడానికి అర్హత కలిగిన వారందరికీ అందుబాటులోకి తీసుకురావడం.
- బీమా అనుబంధ పొదుపు పథకాన్ని, ఆకర్షవంతంగా చేసి ప్రజల పొదుపును గరిష్ఠం చేయడం.
- నిధులను పెట్టుబడిగా పెట్టేటప్పుడు, ఎవరి ద్రవ్యాన్నైతే నమ్మకంతో డిపాజిట్‌గా స్వీకరిస్తారో అలాంటి బీమాదారుల పట్ల ప్రాథమిక బాధ్యతను గుర్తుంచుకోవడం.
- నిధులు బీమాదారులకు చెందినవని గుర్తుంచుకొని అత్యంత పొదుపుగా వ్యాపారం నిర్వహించడం.
- పాలసీదారుల వ్యక్తిగత స్థాయిలోను, సామూహిక స్థాయిలోను పాలసీదారుల పలురకాల అవసరాలకు విశ్వాసంగా ఉండటం.
- మారుతున్న సాంఘిక, ఆర్థిక వాతావరణం లో తలెత్తే సామాజిక అవసరాలను తీర్చడం.
- సమర్థవంతమైన సేవలు అందించడం.
- కార్పొరేట్ లక్ష్యాలు అందించే దిశగా అంకిత భావంతో తమ విధులను నిర్వహించటం ద్వారా ఏజెంట్లు ఉద్యోగులందరితో సమర్థవంతమైన విధులను, సేవలను అందించాననే సంతృప్తి గర్వం, పాలొన్నాననే భావన వృద్ధి చెందేలా చేయడం.
- బీమా చేయడం అంటే భవిష్యత్ కోసం పొదుపు చేయడం బీమాదారుడు ప్రాణనష్టం పొందే పరిస్థితిలో దాని వల్ల కలిగే ద్రవ్యనష్టం నుంచి అతని కుటుంబానికి భద్రత, భరోసా కల్పిస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో ఎటువంటి పరిస్థితులు, కష్టాలను, అవసరాలను తీర్చుకోవడానికి పెద్ద మొత్తాన్ని బీమాదారుడికి అందజేస్తుంది.
- వృద్ధాప్యంలో లేదా పదవీ విరమణ తర్వాత కూడా తన జీవన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి బీమా తోడ్పడుతుంది.
- ఆదాయపన్ను చెల్లింపులో పన్ను రాయితీలాంటి ప్రయోజనాలను అందిస్తుంది.
- ప్రీమియం రూపంలో బీమాదారులకు చెల్లించిన ద్రవ్యాన్ని బీమాసంస్థ విభిన్నమైన ఆస్తులపైన పెట్టుబడి పెరుగుతుంది.
- ఐఆర్డీఏ ఆమోదించిన స్వతంత్ర రేటింగ్ సంస్థ చేత శక్తిమంతమైనదిగా ఆమోదించబడిన బాండ్లు వాటాలు, రుణపత్రాలు.
- వాణిజ్య బ్యాంకు డిపాజిట్లు, ఆర్బీఐ చేత ప్రాథమిక డీలర్ గుర్తించిన డీలర్ల డిపాజిట్లు
- స్వతంత్ర రేటింగ్ సంస్థచేత అతి శక్తిమంతమైనదిగా రేటింగ్ ఇచ్చి కంపెనీ జారీ చేసే వాణిజ్య పత్రాలు, మంచి ట్రాక్ రికార్డ్ గల కంపెనీల వెంచర్ మూలధన నిధులు
- జీవిత బీమా పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీల కంటే అవస్థాపన రంగాల్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంది.
- జీవిత బీమా వ్యక్తిలో విశ్వసనీయతను కలిగిస్తుంది.
- బీమా వ్యక్తికి, కంపెనీకి రక్షణ కల్పిస్తుంది.
- బీమా పూలింగ్ ఆఫ్ రిస్క్‌గా పనిచేస్తుంది.
- బీమా ఉత్పాదక ప్రయోజనాలను తీర్చడం
- బీమా పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించడం
- ఉపాధి అవకాశాలను పెంపొందించడం
- ఆర్థిక/ రుణ సహాయ, సహకారాలను అందించడం.
- ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం.
ఎ) బీమా
- ద్రవ్య నష్టంతో కూడిన నష్టభయాన్ని తొలగించేది లేదా తగ్గించేది.
బి) బీమా పట్టా/ బీమా పత్రం
బీమా దారుడు, బీమా సంస్థ మధ్య కుదుర్చుకున్న ఒప్పందం కలిగి ఉండే పత్రం
బీమా ప్రిమియం
- బీమాదారుడు బీమా భద్రత నిమిత్తం ఒకే మొత్తంలోగాని, వాయిదాల్లో గాని బీమా సంస్థకు చెల్లించే మొత్తం.
- ప్రీమియం మీద ఆదాయపన్నులో రాయితీ ఉంటుంది. బీమా చొరబాటు (Insurence Penetration)
- ఒక సంవత్సరకాలంలో స్థూల దేశీయోత్పత్తికి బీమా ప్రీమియం నిష్పత్తిని ‘బీమాచొరబాటు’ అంటారు.
- భారతదేశంలో బీమా చొరబాటు 2001లో 2.7 శాతం ఉండగా 2021 నాటికి 4.2 శాతానికి చేరింది. ఇందులో ఎల్ఐసీ విలువ 3.2 శాతం, జీఐసీ విలువ 1 శాతంగా ఉండి.
బీమా సాంద్రత (Insurency Density)
- దేశ జనాభాకు, బీమా ప్రీమియం మొత్తానికి గల నిష్పత్తిని బీమా సాంద్రత అంటారు.
- బీమా సాంద్రతను అమెరికన్ డాలర్లలో తెలియజేస్తారు.
ప్రాక్టీస్ బిట్స్
1.సామాజిక భద్రతను సాధించేందుకు ప్రధాన సాధనం ఏది?
ఎ) బీమా బి) సంపద
సి) సమూహం డి) విద్య
2.బీమా సాధారణంగా ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
3.జీవిత బీమా అనేది?
ఎ) మానవ సంబంధం గలది
బి) సంస్థ సంబంధం గలది
సి) ఆస్థి సంబంధం గలది
డి) ఆరోగ్య సంబంధం గలది
4.జీవిత బీమా అనేది?
ఎ) స్వల్పకాలిక ఒప్పందం
బి) దీర్ఘకాలిక ఒప్పందం
సి) ఎ, బి
డి) మధ్యాకాలిక ఒప్పందం
5.భారతదేశంలో జీవిత బీమా భావనను ప్రవేశపెట్టినది ఎవరు?
ఎ) ఆంగ్లేయులు బి) ఐరోపియన్లు
సి) ఎ, బి డి) ఆస్ట్రేలియన్లు
6. ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?
ఎ) 1911 బి) 1912
సి) 1818 డి) 1928
7. కిందివాటిలో జీవితబీమా పాలసీలు ఏవి?
ఎ) మొత్తం జీవత కాలం పథకం
బి) ఎండోమెంట్ పథకం
సి) ద్రవ్యం తిరిగి చెల్లింపు పథకం
డి) పైవన్నీ
8. ప్రీమియం తక్కువ బీమా ఎక్కువ ఉండే జీవిత బీమా పాలసీ ఏది?
ఎ) మనీ బ్యాక్ పాలసీ
బి) టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ
సి) గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ
డి) ఎండోమెంట్ పాలసీ
9. కిందివాటిలో జీవిత బీమా లక్ష్యాలు ఏవి?
ఎ) బీమాకు అర్హత గల వారందరికీ అందుబాటులో ఉంచడం
బి) ప్రజల పొదుపును గరిష్ఠం చేయడం
సి) మారుతున్న సాంఘిక, ఆర్థిక అవసరాలను తీర్చడం
డి) పైవన్నీ
10. కిందివాటిలో జీవిత బీమా విధులు ఏవి?
ఎ) వ్యక్తిలో విశ్వనీయతను కల్పించడం
బి) వ్యక్తికి ఆర్థిక రక్షణ కల్పించడం
సి) పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడం
డి) పైవన్నీ
11. ద్రవ్య నష్టంతో కూడిన నష్టభయాన్ని తగ్గించేది లేదా తొలగించేది ఏది?
ఎ) పాలసీ బి) బీమా
సి) ప్రీమియం డి) పైవన్నీ
12. బీమాదారుడు, బీమా సంస్థ మద్య కుదుర్చుకున్న అంగీకారాన్ని ఏమంటారు?
ఎ) బీమాపట్టా బి) బీమా పత్రం
సి) ఎ, బి డి) బీమా సాంద్రత
13. బీమాదారుడు, బీమా భద్రత నిమిత్తం ఒకే మొత్తంలోగానీ, వాయిదాల్లో గాని బీమా సంస్థకు చెల్లించే మొత్తాన్ని ఏమంటారు?
ఎ) బీమా ప్రీమియం
బి) బీమా సాంద్రత
సి) బీమా చొరబాటు డి) పైవన్నీ
14. ఒక సంవత్సర కాలంలో స్థూల దేశీయోత్పత్తికి, బీమా ప్రీమియంకి గల నిష్పత్తిని ఏమంటారు?
ఎ) బీమా చెల్లింపు బి) బీమా చొరబాటు
సి) బీమా డి) బీమా సాంద్రత
15. దేశ జనాభాకు: బీమా ప్రీమియం మొత్తానికి గల నిష్పత్తిని ఏమంటారు?
ఎ) బీమా సాంద్రత
బి) బీమా చెల్లింపు
సి) బీమా ప్రీమియం డి) పైవన్నీ
16. బీమా సాంద్రతను ఏ కరెన్సీలో సూచిస్తారు?
ఎ) రూపాయి బి) డాలర్లు
సి) యూరో డి) బిట్‌కాయిన్
పానుగంటి కేశవ రెడ్డి: రచయిత వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని 9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు