నానో టెక్నాలజీకి సంబంధించిన శాటిలైట్ ఏది?
1.భారత్ 2008, అక్టోబర్ 22న పీఎస్ఎల్వీ-సీ11 రాకెట్ ద్వారా చంద్రయాన్-1 యాత్రను చేపట్టింది. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మలయస్వామి అన్నాదురై. ప్రాజెక్టు వ్యయం రూ.386 కోట్లు. అయితే చంద్రుడిపైకి యాత్రను చేపట్టిన మొదటి దేశం అమెరికా కాగా.. భారత్ ఎన్నో దేశం?
1) 4వ 2) 5వ 3) 6వ 4) 7వ
2. కింది వాటిలో చంద్రయాన్ -1 ఉద్దేశం కానిది ఏది?
ఎ. భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని కొలవడం
బి. చంద్రుడిపై నీటి జాడలు, ఖనిజ వనరుల గుర్తింపు
సి. చంద్రుడి ఆవిర్భావం గురించి అధ్యయనం
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
3. కింది వాటిలో చంద్రయాన్-1కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఈ యాత్ర ద్వారా 11 పేలోడ్లను ప్రవేశపెట్టారు
బి. ఇది 322 రోజులు పనిచేసి 60 శాతం పనిని పూర్తిచేసింది
సి. 2009 ఆగస్టు 29న దీని స్టార్ సెన్సర్ విఫలం కావడంతో సంకేతాలు నిలిచిపోయాయి
1) ఎ 2) బి 3) సి 4) ఏదీకాదు
4. డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది?
1) అంతరిక్ష కేంద్రం 2) దేశంలో అతిపెద్ద యాంటెన్నా
3) ఒక ఉపగ్రహం 4) స్పేస్ క్రాఫ్ట్
5. ఇస్రో 2013, నవంబర్ 5న మార్స్ యాత్ర చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ ద్వారా మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఈ యాత్రకు మంగళ్యాన్ అని పేరు పెట్టింది. మార్స్ స్వరూప, స్వభావాలను తెలుసుకోవడంతోపాటు, ఆ గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేయడం మంగళ్యాన్ ఉద్దేశం. మామ్ ఉపగ్రహం 2014 , సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి చేరింది. అయితే ఈ ప్రయోగం కోసం ఇస్రో చేసిన ఖర్చు ఎంత?
1) రూ.450 కోట్లు 2) రూ.550 కోట్లు
3) రూ.650 కోట్లు 4) రూ. 4500 కోట్లు
6. కింది వాటిలో సిల్వర్ జూబ్లీ రాకెట్గా పేరుపొందిన ఉపగ్రహ వాహకనౌక ఏది?
1) పీఎస్ఎల్వీ-సీ11 2) పీఎస్ఎల్వీ-సీ21
3) పీఎస్ఎల్వీ-సీ22 4) పీఎస్ఎల్వీ-సీ25
7. కింది వాటిలో IRNSS ఉపయోగాలకు సంబంధించి సరైనది?
ఎ. ఇది భూతల, వాయు, జలమార్గాల్లో కచ్చితత్వంతో మార్గ నిర్దేశనం చేస్తుంది
బి. వాతావరణ అధ్యయనం, విపత్తు నిర్వహణ, భూ ఫలకల కదలికలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది
సి. పట్టణ ప్రణాళిక, మ్యాపింగ్, సర్వేయింగ్కు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది
డి. భారత వ్యవసాయరంగంలో కీలకపాత్ర పోషించనున్న ప్రిసిషన్ ఫార్మింగ్కు ఉపయోగపడుతుంది
1) ఎ,బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
8. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపిన ఒక వ్యోమనౌక సౌర కుటుంబాన్ని దాటి అవతలికి వెళ్లిన తొలి మానవ నిర్మిత వస్తువుగా గుర్తింపు పొందింది. సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిని అధ్యయనం చేసేందుకు నాసా 1977లో దీన్ని ప్రయోగించింది. 1900 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ వ్యోమనౌక 2013లో సౌర కుటుంబాన్ని దాటింది. అయితే ఆ వ్యోమనౌక పేరు ?
1) వాయేజర్-I 2) చాలెంజర్
3) కొలంబియా 4) డిస్కవరీ
9. కింది ఉపగ్రహాలు, వాటికి సంబంధించిన విషయాలను సరిగా జతపర్చండి.
ఎ. మెఘాట్రాపిక్స్ 1. ఇది ఉష్ణమండల ప్రాంతంలోని వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది
బి. SRM శాట్ 2. విపత్తు నిర్వహణ
అధ్యయనానికి సంబంధించిన ఉపగ్రహం
సి. సరళ్ 3. ఇది సముద్ర ఉపరితల నీటి మట్టం పెరుగుదల, తగ్గుదలను అధ్యయనం చేస్తుంది
డి. ఎన్విశాట్ 4. ఇది వాతావరణ కాలుష్యాన్ని కనిపెట్టేందుకు ఉద్దేశించినది
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
10. నానో టెక్నాలజీకి సంబంధించిన శాటిలైట్ ఏది?
1) సరళ్ 2) జుగ్ను 3) గ్రామ్శాట్ 4) ఎడ్యుశాట్
11. జుగ్ను అనే శాటిలైట్ దేనికి ఉపయోగపడుతుంది?
1) ఖగోళ పరిశోధనలు చేస్తుంది
2) నక్షత్రాలను గురించి అధ్యయనం చేస్తుంది
3) విపత్తు నిర్వహణను అధ్యయనం చేస్తుంది
4) వాటర్ షెడ్ల నిర్వహణ, జలాశయాల లభ్యతను అధ్యయనం చేస్తుంది
12. గ్రామీణ ప్రజలను సాంస్కృతికపరంగా చైతన్యవంతులను చేయడానికి ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రత్యేకంగా అనేక టెలివిజన్ కార్యక్రమాలను రూపొందిస్తుంటారు. అలాంటి కార్యక్రమాల ప్రసారం కోసం ప్రయోగించే ఉపగ్రహాలను ఏమంటారు?
1) జీశాట్ 2) క్యూబ్ శాట్
3) గ్రామ్శాట్ 4) టెలిశాట్
13. ఇన్మర్శాట్ అనేది ఇంటర్నేషనల్ మారిటైమ్ శాటిలైట్. ఇది సంయుక్త ఉపగ్రహ వ్యవస్థ. దీనిలో 84 సభ్యదేశాలు ఉన్నాయి. సముద్రంలో ప్రయాణించే నౌకలకు తీరం నుంచి సమాచారాన్ని చేరవేసేందుకు ఈ సంయుక్త ఉపగ్రహ వ్యవస్థ తోడ్పడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) లండన్ 2) టోక్యో
3) ప్యారిస్ 4) మాస్కో
14. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. టెలిశాట్ – రైతులకు, వయోజనులకు శాటిలైట్ సమాచారంతో విద్యను అందించేందుకు ఉపయోగిస్తారు
బి. ఎడ్యుశాట్ – దేశంలో విద్యాబోధన వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు
సి. స్టడీశాట్ – ఇస్రో ప్రయోగించిన అతిచిన్న ఉపగ్రహం. బరువు కిలో కంటే తక్కువ. వీటిని పికో ఉపగ్రహాలు అంటారు.
డి. యూత్శాట్ – వాతావరణం, నక్షత్రాల అధ్యయనానికి తోడ్పడుతుంది.
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి 4) పైవన్నీ
15. GPS అనేది అమెరికాకు చెందిన ఉపగ్రహ వ్యవస్థ. దీన్ని అమెరికా 1978లో సైనిక అవసరాల కోసం రూపొందించింది. 1980 నుంచి పౌర సేవల కోసం వాడుతున్నది. మన దేశంలో ఈ సేవలను 1993లో లాతూర్ భూకంపం తర్వాత ఉపయోగించారు. GPS తరహాలో భారత్ కూడా అంతరిక్షంలో నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందుకోసం IRNSS శ్రేణికి చెందిన 7 ఉపగ్రహాలను విడివిడిగా రోదసిలోకి పంపింది. ఈ ప్రయోగాల కోసం ఇస్రో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే భారత నావిగేషన్ వ్యవస్థకు ప్రధాని మోదీ పెట్టిన పేరు?
1) సైనిక్ 2) దిక్సూచి
3) నావిక్ 4) ఇండియన్ శాటిలైట్ సిస్టం
జవాబులు
1-3, 2-1, 3-4, 4-2, 5-1, 6-4, 7-4, 8-1, 9-3, 10-2, 11-4,12-3, 13-1, 14-4, 15-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు