వేద పరిభాషలో ఆదివస దేనిని సూచిస్తుంది?
1. సంస్కృత పదమైన ఆర్య అంటే పెద్దవాడు, గౌరవనీయుడు, సంస్కారి అనే వివిధ అర్థాలున్నాయి. ఆర్యుల రాకతో భారతదేశంలో చారిత్రక యుగం ప్రారంభమైంది. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా వారి జన్మభూమి నేటికీ అపరిష్కృతంగానే ఉంది. అయితే రుగ్వేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని వ్యాఖ్యానించింది ఎవరు?
1) స్వామి దయానంద సరస్వతి 2) బాలగంగాధర్ తిలక్
3) మాక్స్ ముల్లర్ 4) ఏసీ దాస్
2. ఆర్యులు యూరప్‌లోని డాన్యూబ్ నదీ తీరవాసులని గైల్, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర్ తిలక్, మధ్య ఆసియా నుంచి వచ్చారని మాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారు. అయితే ఆర్యులు స్వదేశీయులని, సప్త సింధు ప్రాంతంవారని అంటే పంజాబ్, సింధు ప్రాంతాలవారని అభిప్రాయపడింది ఎవరు?
1) స్వామి దయానంద సరస్వతి 2) ఏసీ దాస్
3) బాలగంగాధర్ తిలక్ 4) మాక్స్ ముల్లర్
3. కింది వేదాలు, శ్లోకాలను జతపర్చండి.
1) రుగ్వేదం ఎ) 1028
2) సామవేదం బి) 1603
3) యజుర్వేదం సి) 1984
4) అధర్వణ వేదం డి) 711
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4. ప్రాచీన భారతీయుల సమగ్ర చరిత్రకు మూలం వేద సాహిత్యం, అనుబంధ వేద సాహిత్యం మూలం. వేద సాహిత్యంలో సామవేదం, యజుర్వేదం, రుగ్వేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలు, శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, సామ బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణం అనే నాలుగు బ్రాహ్మణాలు, వీటికి సంపూరకంగా (ముగింపు గ్రంథాలు) రాసిన అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే ఉపనిషత్తుల సంఖ్య ఎంత?
1) 100 2) 101 3) 108 4) 109
5. వేదాల్లో మొదటిది, భారతీయ సాహిత్యంలో తొలి గ్రంథం రుగ్వేదం. దీన్ని రాసిన కాలం క్రీ.పూ. 1500-1000. దీన్నే తొలివేద కాలం అంటారు. ఆ తరువాతనే యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు వెలువడ్డాయి. ఈ వేదాల కాలాన్ని మలివేద కాలం అని అంటారు. అయితే ఈ వేదాలు వెలువడిన కాలం?
1) క్రీ.పూ 1400-1100 2) క్రీ.పూ 1200-1000
3) క్రీ.పూ 1300-900 4) క్రీ.పూ 1000-600
6. శిష్యుడు గురువు వద్ద కూర్చొని ప్రశ్నలడిగే విధానాన్ని ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులను రాసినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారి పేర్లేమిటి?
1) గార్గి, సావిత్రి 2) సౌమిత్రి, మైత్రేయి
3) గార్గి, మైత్రేయి 4) సావిత్రి, సౌమిత్రి
7. 10 మంది రాజులతో జరిగిన యుద్ధాన్ని దశరాజ్ఞ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో 5 ఆర్య, 5 అనార్య తెగలు పాల్గొన్నాయి. ఈ యుద్ధానికి పచ్చిక బయళ్లు, నదీజలాలు కారణం. దీనికి ప్రధాన కారకుడు విశ్వామిత్రుడు. ఈ యుద్ధం పరుష్ని నది ప్రాంతం వద్ద జరిగింది. అయితే ఈ నదిని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?
1) చీనాబ్ 2) రావి 3) బియాస్ 4) జీలం
8. తొలివేద ఆర్యుల ప్రధానవృత్తి పశుపోషణ. ఒక వ్యక్తి వద్దగల పశువులను బట్టి ఆ వ్యక్తి సంపదను నిర్ణయించేవారు. అధిక గో సంపదగల సంపన్నుడిని గోమట్ అని, నాయకుడిని గోపతి అని పిలిచేవారు. పశువుల కోసం జరిగే యుద్ధాన్ని ఆర్యులు ఏమని పిలిచేవారని రుగ్వేదం తెలుపుతుంది?
1) గవిష్ఠి 2) గణ 3) గహపతి 4) ఫణిజ
9. ఆర్య తెగల నాయకుడిని రాజన్ అని అనేవారు. తెగలోని సభ్యులు రాజన్‌కు చెల్లించే పన్నును బలి అని అనేవారు. అయితే యుద్ధాల నుంచి సంపాదించిన సొమ్ములో రాజన్‌కు లభించే వాటాను ఏమని పిలిచేవారు?
1) భాగ 2) గణ 3) ధన 4) భార
10. ఆర్యులు కుటుంబ పెద్ద తండ్రిని గహపతి లేదా దంపతి అని అంటారు. ఆర్యులు ధరించే ధోవతిని వస అని, ఉత్తరీయాన్ని ఆదివస అని అంటారు. ఉప్లీషంను ఏమంటారు?
1) అంగీ 2) తలపాగా 3) పంచె 4) తువ్వాలు
11. కిందివాటిని జతపర్చండి.
1) న్యాయ ఎ) పతంజలి
2) సాంఖ్య బి) జైమిని
3) మీమాంస సి) గౌతముడు
4) యోగ డి) కపిల ముని
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
12. రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రచించారు. భారతీయ వాజ్మయంలో రామాయణాన్ని ఆదికావ్యంగా పిలుస్తారు. వీటిలోని భాగాలను కాండలు అంటారు. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు, కాండలు ఉన్నాయి?
1) 22 వేలు, 4 2) 23 వేలు, 5
3) 25 వేలు, 6 4) 24 వేలు, 7
13. మలివేద ఆర్యుల ప్రధానవృత్తి వ్యవసాయం. 18 ముఖ్యవృత్తులవారు శ్రేణులుగా ఏర్పడ్డారు. వరిని వర్షాకాలంలో 60 రోజుల్లో పండించేవారు. దీన్ని స్వస్తిక అని అనేవారు. వరినాట్లు వేసి పండించడాన్ని ఏమనేవారని శతపథ బ్రాహ్మణం తెలిపింది?
1) కిసుక 2) తుసుక 3) వసుక 4) ప్లసుక
14. రుగ్వేదంలోని 10వ మండలం విశ్వం ఆవిర్భావం, చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తెలుపుతుంది. 9వ మండలం సోమ అనే మత్తు పానీయం గురించి వివరిస్తుంది. సావిత్రి (సూర్యదేవత)ని ఉద్దేశించిన గాయత్రీ మంత్రం ఏ మండలంలో ఉంది?
1) 1 2) 2 3) 3 4) 4
15. ఆర్యులకాలంలో ఒక మనిషి వేరొక మనిషిని హత్యచేస్తే హతుని కుటుంబానికి హత్యచేసిన వ్యక్తి నష్టపరిహారంగా ఎన్ని ఆవులను చెల్లించేవారు?
1) 90 2) 100 3) 200 4) 300
16. వేదకాలంలో క్షత్రియ పురుషుడు-బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన సంతానాన్ని సూతులు అని, వైశ్య పురుషుడు-క్షత్రియ స్త్రీకి జన్మించిన సంతానాన్ని మగధులు అని, బ్రాహ్మణ పురుషుడు-శూద్ర స్త్రీకి జన్మించిన సంతానాన్ని నిషాదులు అని అంటారు. అయితే బ్రాహ్మణ స్త్రీ, శూద్ర పురుషునికి జన్మించిన సంతానాన్ని ఏమంటారు?
1) చండాలురు 2) క్షత్రియులు
3) బ్రాహ్మణులు 4) వైశ్యులు
17. పశుగ్రాస భూముల పర్యవేక్షణాధికారిని వ్రజపతి అని, పోలీస్ అధికారిని అధీకృత అని, గూఢచారిని స్పాస్ అని, మంగళిని వాప్త అని అంటారు. మత్స్యకారుడిని ఏమంటారు?
1) కైవర్త 2) వ్రిహి 3) నిషాద 4) సీత
18. మానవుని మనసు నుంచి యుద్ధం మొదలవుతుందని ఏ వేదం చెబుతుంది?
1) సామవేదం 2) రుగ్వేదం
3) యజుర్వేదం 4) అధర్వణవేదం
జవాబులు
1-1, 2-2, 3-4, 4-3, 5-4, 6-3, 7-2, 8-1, 9-1, 10-2, 11-3,12-4, 13-4, 14-3, 15-2, 16-1, 17-1, 18-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు