ప్రణతి.. విజ్ఞాన భారత ప్రగతి
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
20వ శతాబ్దపు ప్రారంభంలో బ్రిటిష్ పాలనా కాలంలో రసాయన శాస్త్రవేత్తలైన జె.ఎల్.సిమన్సన్, పి.ఎస్.మెక్మోహన్ అనే ఇద్దరు బ్రిటిషర్ల చొరవతో భారతీయసైన్స్ కాంగ్రెస్ రూపుదిద్దుకుంది. బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ తరహాలో దేశంలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలనే సంకల్పం వారిరువురినీ పురిగొల్పింది. అలా వారి కృషి ఫలితంగా దేశంలో శాస్త్ర విజ్ఞాన రంగ అభివృద్ధికి కృషి చేస్తూ, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 1914 జనవరి 15-17 తేదీల మధ్య కలకత్తా నగరంలోని ఆసియాటిక్ సొసైటీలో అప్పటి కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షతన భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారంభమైంది. అలా ఏర్పడిన సదస్సు ఏటా సమావేశాలను నిర్వహిస్తుంది.
వార్షిక సమావేశాలు
-ప్రతి సంవత్సరం జనవరి 3న దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు.
-1914లో జరిగిన తొలి సమావేశానికి అశుతోష్ ముఖర్జీ (కలకత్తా విశ్వవిద్యాలయం ఛాన్స్లర్) అధ్యక్షత వహించారు.
– 1976 వాల్తేర్లో జరిగిన సమావేశానికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ అధ్యక్షత వహించారు.
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శాంతి స్వరూప్, భట్నాగర్, మహలనోబిస్, కస్తూరీ రంగన్ , ఎం.జి.కె.మీనన్, పి.సి రాయ్ వంటి
ప్రముఖులు కూడా అధ్యక్షత వహించారు.
– 1973లో వజ్రోత్సవ సమావేశాలు, 1988లో ప్లాటినం జూబ్లీ సమావేశాలు జరిగాయి.
– జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై చర్చలు జరిపే సంప్రదాయం 1976 నుంచి ప్రారంభమైంది. అప్పట్లో అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్గా ఉన్న ఎం.ఎస్ స్వామినాథన్ ఈ ‘ఫోకల్ థీమ్’ అంశాన్ని ప్రవేశపెట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో సమావేశాలు
– 108 సంవత్సరాల సైన్స్ కాంగ్రెస్ సమావేశాల చరిత్రలో అత్యధికంగా హైదరాబాద్లో 6 సార్లు, విశాఖపట్నంలో 2 సార్లు,
తిరుపతిలో ఒకసారి జరిగాయి.
-స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్లో 1937లో నిర్వహించగా, స్వాతంత్య్రం వచ్చాక 1954, 1967, 1979, 1998, 2006లో నిర్వహించారు.
-మొదటి సైన్స్ పాలసీ తీర్మానాన్ని 1958లో ప్రకటించారు.
– 1983లో మొదటి సైన్స్ పాలసీకి సవరణ చేశారు.
– 1983లో సవరించిన టెక్నాలజీ పాలసీకి 1993లో తిరిగి సవరణలు చేశారు.
-నూతన జాతీయ సాంకేతిక విధానాన్ని 2003లో ప్రకటించారు.
93వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం
-హైదరాబాద్లోని ఆచార్య ఎన్ జీ రంగా యూనివర్సిటీలో 2006 జనవరి 3-7 వరకు జరిగింది.
– మొదటి సైన్స్ బహు మతిని 93వ సమావేశంలో మొటీరియల్ కెమిస్ట్రీలో పరిశోధనలకు గాను ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావుకు ప్రదానం చేశారు.
– సైన్స్ అవార్డు పొందిన వారికి రూ. 25 లక్షలు, బంగారు పతకం, ప్రశంసా పత్రం ప్రధానమంత్రి అందజేస్తారు.
-ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఇద్దరు కలిసి పాల్గొన్న తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశం 90వ సైన్స్ కాంగ్రెస్.
– భారత్లో సైన్స్ డే ఫిబ్రవరి 28న అంటే సర్ సి.వి. రామన్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారు.
-భౌతికశాస్త్రంలో నోబెల్ బమతి పొందిన మొదటి భారతీయుడు సర్ సి.వి.రామన్ (1930), రెండవ వ్యక్తి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983).
-వైద్యశాస్త్రంలో నోబెల్ బమతి పొందిన భారతీయుడు హరగోవింద్ ఖురానా.
భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులు
సదస్సు సం||రం వేదిక అధ్యక్షుడు
1 1914 కలకత్తా అశుతోష్ ముఖర్జీ
75 1988 పుణె సి.ఎన్.ఆర్.రావ్
76 1989 మధురై ఎ.పి. మిత్ర
77 1990 కొచ్చి యశ్పాల్
78 1991 ఇండోర్ డి.కె.సిన్హా
79 1992 వడోదర వసంత్గొ వారికర్
80 1993 గోవా ఎస్.జెడ్.ఖాసిం
81 1994 జైపూర్ పి.ఎన్. శ్రీవాస్తవ
82 1995 కలకత్తా ఎస్.సి. పక్రాషి
83 1996 పాటియాలా యు.ఆర్.రావ్
84 1997 ఢిల్లీ ఎస్.కె.జోషి
85 1998 హైదరాబాద్ పి.రామారావు
86 1999 చెన్నై రామారావు
87 2000 పుణె ఆర్. ఎ. మార్షెల్కర్
88 2001 ఢిల్లీ ఆర్. ఎస్. పరోడా
89 2002 లక్నో ఎస్. కె. కతియార్
90 2003 బెంగళూరు కె.కృష్ణస్వామి
91 2004 చండీగఢ్ అసిస్ దత్తా
92 2005 అహ్మదాబాద్ ఎన్. కె. గంగూలీ
93 2006 హైదరాబాద్ ఐ.వి.సుబ్బారావు
94 2007 అన్నామలైనగర్ హర్ష్ గుప్తా
95 2008 విశాఖపట్నం ఇ.రాళ్లపల్లి
96 2009 షిల్లాంగ్ టి. రామస్వామి
97 2010 తిరువనంతపురం జి. మాధవన్ నాయర్
98 2011 చెన్నై కె.సి.పాండే
99 2012 భువనేశ్వర్ గీత బాలీ
100 2013 కలకత్తా మన్మోహన్ సింగ్
101 2014 జమ్మూ రణ్బీర్ ఛాండేర్ సోబ్టీ
102 2015 ముంబై ఎస్.బి. నిమ్సే
103 2016 మైసూర్ అశోక్ కుమార్ సక్సేనా
104 2017 తిరుపతి డి. నారాయణ రావు
105 2018 ఇంఫాల్ డా. అచ్యుతా సమంతా
106 2019 జలంధర్ డా. మనోజ్ చక్రవర్తి (ఎల్.పి.యు)
107 2020 బెంగళూరు సి.ఎన్.ఎ నారాయణ
108 2022 పుణె –
తెలుసుకుందాం
నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం?
– ఇది భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంస్థ. దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్స- హించాలనేది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం, ఉద్దేశం.
ఎవరు ప్రారంభిస్తారు? ఎవరు అధ్యక్షత వహిస్తారు?
-ఈ సమావేశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశవిదేశాల నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు దీంట్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ
సమావేశానికి ప్రముఖ వ్యక్తి లేదా శాస్త్రవేత్త అధ్యక్షత వహిస్తారు.
తొలి ప్రధాని ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారా?
– 1947లో జరిగిన అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి దేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు.
లక్ష్యాలు
– దేశంలో శాస్త్ర పురోగతికి, విస్తృతికి కృషి చేయడం
-ప్రతి సంవత్సరం దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలను నిర్వహించడం
-శాసా్త్రన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం
-సమావేశ కార్యక్రమాన్ని, చిరు పుస్తకాలను, కార్యకలాపాలను ప్రచురించడం.
పరిశోధనా సంస్థలు
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ – బెంగళూరు
-బోస్ ఇన్స్టిట్యూట్ – కలకత్తా
– ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నటిజం – ముంబై
– అగార్కర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – పుణె
– ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ – కలకత్తా
– బీర్బల్ సాహ్నీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ – లక్నో
– వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ – డెహ్రాడూన్
– రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – బెంగళూరు
– జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ – బెంగళూరు
– శ్రీచిత్ర తిరుమల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ – తిరువనంతపురం
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ – పుణె
-ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ – గాంధీనగర్
-ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ – కలకత్తా
-ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – బెంగళూరు
-యస్.ఎస్.బోస్. నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ – కలకత్తా
– ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పవర్
మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ – హైదరాబాద్
-రామానుజన్ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ – చెన్నై
ప్రాక్టీస్ బిట్స్
1. 3477 కిలోల బరువున్న జీశాట్-17 ఉపగ్రహాన్ని ఏరియన్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏ రోజున విజయవంతంగా ప్రయోగించారు?
1) 2017 జూలై 1 2) 2017 జూన్ 29
3) 2017 జూన్ 23 4) 2017 జూన్ 5
2. ఇస్రో జూన్ 23, 2017 న షార్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 38 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన కార్టోశాట్-2ఇ తో పాటు ఎన్ని
ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది?
1) 30 2) 28 3) 38 4) 40
3. 2017, జూన్ 5న శ్రీహరికోటలోని షార్ నుంచి 3136 కిలోల బరువున్న జీశాట్-19 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనికి
సంబంధించి సరైనది గుర్తించండి.
1) దీనిని జీఎస్ఎల్వీ మార్క్-3డి1 ద్వారా ప్రయోగించారు
2) అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది
3) ఈ ప్రయోగం అనంతరం భారత్ ఈ సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది
4) పైవన్నీ
4. పీఎస్ఎల్వీ సీ-37కు సంబంధించి సరైనది ఏది?
1) దీనిని ఫిబ్రవరి 15, 2017న షార్ నుంచి ప్రయోగించారు
2) దీని ద్వారా ప్రపంచంలో అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి(104) ప్రవేశపెట్టారు
3) దీనిముందు వరకు అత్యధిక ఉపగ్రహాలను రష్యా ప్రయోగించింది
4) పైవన్నీ
జవాబులు
1.2 2.1 3.4 4.4
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు