మొక్కల్లో గాయాలను మాన్పేందుకు తోడ్పడే కణజాలం?
కణం
41. విభాజ్య కణజాల కణాల గురించి సరైన వాక్యం కానిది?
ఎ. కణాలు దగ్గరగా అమరి ఉంటాయి
బి. కణాలు దూరంగా అమరి ఉంటాయి
సి. కణాలకు విభజన శక్తి ఉండదు
డి. కణాలకు విభజన శక్తి ఉంటుంది
1) ఎ, డి 2) ఎ, సి
3) బి, సి 4) బి, డి
42. జతపర్చండి?
ఎ. కొన భాగాల్లో ఉండి పెరుగుదలను కలిగించును 1. ఊర్థముఖ కణజాలం
బి. కాండంలో అంచుల చుట్టూ ఉండి పెరుగదల కలిగించును 2. మధ్యస్థ విభాజ్య కణజాలం
సి. శాఖలు ఏర్పడేచోట ఆకులు పుష్పవృంతం పెరిగే చోట ఉండును 3. అవిభాజ్య కణజాలం
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-3, బి-1, సి-2
43.
పైన సూచించిన భాగం?
1) కేంద్రకం 2) మిధ్యాపాదం
3) సంకోచ రిక్తిక 4) ఏదీకాదు
44. బుగ్గకణ ఆకారం?
1) గుండ్రం 2) నిచ్చెన
3) దీర్ఘచతురస్రం 4) సర్పిలం
45. త్వచ కణజాలం ఎన్ని వరుస కణాలను కలిగి ఉంటుంది?
1) 1 2) 2 3) 3 4) 4
46. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి త్వచ కణజాలం 4 రకాలు
బి. విధుల్ని బటి,్ట స్థానాన్ని బట్టి త్వచ కణజాలం 3 రకాలు
సి. త్వచ కణజాలం గోడలు దళసరిగా ఉంటాయి
డి. త్వచ కణజాలం గోడలు పలుచగా ఉంటాయి
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, డి 4) బి, సి
47. త్వచ కణజాలం గురించి సరైన అంశం?
ఎ. బాహ్యచర్మంలో పత్రరంధ్రాలు ఉంటాయి
బి. పత్రరంధ్రాలను ఆవరించి మూడు రక్షక కణాలుంటాయి
సి. వేరులోని బాహ్యచర్మ కణాలు పొడవైన మూలకేశాలుంటాయి
డి. పైవన్నీ సరైనవే
1) ఎ, బి 2) ఎ, సి
3) బి 4) డి
48. జిగురు మొక్కల్లో జిగురు స్రవించే కణజాలం?
1) త్వచ కణజాలం 2) విభాజ్య కణజాలం
3) సంధాయక కణజాలం
4) ప్రసరణ కణజాలం
49. త్వచకణజాలంలోని రకాలు?
1) 4 2) 3 3) 2 4) 1
50. పటంలోని గుర్తించిన భాగం?
1) రక్షకకణాలు 2) పత్రరంధ్రం
3) అనుబంధకం 4) ఏదీకాదు
51. కింది వాటిలో సరైన అంశం?
ఎ. నీటి ఎద్దడి నుంచి త్వచకణజాలం రక్షింస్తుంది
బి. కొమ్మలు విరగడాన్ని ప్రోత్సహిస్తుంది
సి. చీలడం వంటి యాంత్రిక నష్టాల నుంచి త్వచ కణజాలం రక్షిస్తుంది
డి. పరాన్నజీవులు రోగకారక క్రిముల నుంచి త్వచ కణజాలం రక్షిస్తుంది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి
52. బెరడును ఏర్పరచే కణజాలం?
1) త్వచ కణజాలం
2) విభాజ్యకణజాలం
3) సంధాయక కణజాలం
4) ప్రసరణ కణజాలం
53. ఎల్లప్పుడూ విభజన చెందే శక్తిగల కణజాలం?
1) త్వచకణజాలం
2) విభాజ్య కణజాలం
3) సంధాయక కణజాలం
4) ప్రసరణ కణజాలం
54. కింది వాటిలో సరైన అంశం?
ఎ. వాయుమార్పిడికి, బాష్పోత్సేకానికి పత్రరంధ్రాలు అవసరం
బి. మూలకేశాలు త్వచకణజాలం నుంచి ఏర్పడుతుంది
సి. త్వచ కణజాలంలోని కకాలు కిరణజన్యసంయోగక్రియ జరుపును
డి. పత్రరంధ్రాలు విభాజ్య కణజాలం నుంచి ఏర్పడుతుంది
1) ఎ, సి, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
55. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. కణాలు పెద్దవిగా ఉంటాయి
బి. కేంద్రకం ఉండదు
సి. మొక్క దేహంలో ఎక్కువ భాగం సంధాయక కణజాలం నుంచి ఏర్పడుతుంది
డి. తక్కువ దేహభాగం ఈ కణజాలం నుంచి ఏర్పడుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) బి, డి 4) డి
56. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. సంధాయక కణజాలం ఆహారం నిల్వచేయడానికి తోడ్పడుతుంది
బి. సంధాయక కణజాలం మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది
సి. సంధాయక కణజాలం మూడు రకాలు
డి. సంధాయక కణజాలం నాలుగు రకాలు
1) డి 2) ఎ, డి 3) సి 4) ఎ, సి
57. సంధాయక కణజాలంలోని రకం కానిది?
1) మృదుకణజాలం
2) స్థూలకోణక కణజాలం
3) దృఢ కణజాలం 4) త్వచ కణజాలం
58. ‘నెహేమియా గ్రూ’ మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేసిన సంవత్సరం?
1) 1664 2) 1665
3) 1666 4) 1667
59. ‘అనాటమీ ఆఫ్ ప్లాంట్స్’ అనే గ్రంథాన్ని రచించిన సంవత్సరం?
1) 1682 2) 1683
3) 1684 4) 1685
60. ‘అనాటమీ ఆఫ్ ప్లాంట్స్’ గ్రంథ రచయిత?
1) ఆంథోనివాన్ లీవెన్క్
2) రాబర్ట్క్ 3) డార్విన్
4) నెహేమియా గ్రూ
61. మృదుకణజాలం గురించి సరికాని అంశం?
ఎ.కణాలు మృదువుగా ఉంటాయి
బి. మందమైన గోడలు ఉంటాయి
సి. వదులుగా సంధించబడి ఉంటాయి
డి. గట్టిగా సంధించబడి ఉంటాయి
1) బి, సి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, బి, సి
62. మృదుకణజాలం రకాలు?
1) 3 2) 4 3) 1 4) 2
63. కింది వాటిలో సరైన అంశం?
ఎ. హరిత మృదుకణజాలం కిరణజన్యసంయోగ క్రియ జరుపుతుంది
బి. పెద్దగాలి గదులను కలిగిన మృదు కణజాలంను వాయుగత కణజాలం అంటారు
సి. నిల్వమృదుకణజాలం ఆహారాన్ని నిల్వచేస్తుంది
డి. హరిత కణజాలంలో హరితరేణువులు ఉండవు
1) బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) డి
64. దళసరి గోడలు కలిగిన సంధాయక కణజాలాలు ఏవి?
ఎ. స్థూలకోణ కణజాలం
బి. దృఢకణజాలం సి. మృదుకణజాలం
డి. నిల్వక కణజాలం
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఎ, డి
65. నెహేమియా గ్రూ పనిచేసిన రాయల్ సొసైటీ గల నగరం?
1) లండన్ 2) పారిస్
3) డల్లాస్ 4) క్యూబా
66. కింది వాటిలో సరికానిది?
ఎ. స్థూలకోణ కణజాలం కణాలు పొడవుగా ఉంటాయి
బి. స్థూలకోణ కణజాలం కణాలు పొట్టిగా ఉంటాయి
సి. దృఢ కణజాలం కణాల మధ్య ఖాళీలు ఉంటాయి
డి. దృఢ కణజాలం కణాల మధ్య ఖాళీలు ఉండివు
1) ఎ, బి 2) బి, సి
3) బి, డి 4) ఎ, సి
67. రవాణాలో పాల్గొనే కణజాలం?
1) విభాజ్యకణజాలం
2) సంధాయక కణజాలం
3) త్వచ కణజాలం
4) ప్రసరణ కణజాలం
68. మొక్కల్లో గాయాలను మాన్పేందుకు తోడ్పడే కణజాలం?
1) సంధాయక కణజాలం
2) విభాజ్య కణజాలం
3) త్వచ కణజాలం
4) ప్రసరణ కణజాలం
69. కింది వాటిలో సరైన అంశం?
ఎ. ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా రవాణ చేస్తాయి
బి. నీరు దారువు ద్వారా రవాణా చేస్తాయి సి. ఆహార పదార్థాలు దారువు ద్వారా రవాణా చేస్తాయి
డి. నీరు పోషక కణజాలం ద్వారా రవాణా చేస్తాయి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) సి
70. దారువులో కలిగిన భాగాలు?
ఎ. దారు కణాలు బి. దారునాళీలు
సి. తంతువులు డి. మృదు కణజాలం
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
71. పోషక కణజాలంలో గల భాగాలు?
ఎ. చాలనీ కణాలు బి. చాలనీ నాళాలు
సి. తంతువులు
డి. సష కణాలు, మృదు కణజాలం
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
72. నాళికా పుంజాన్ని ఏర్పరచే కణజాలాలు ఏవి?
ఎ. దారువు బి. పోషక కణజాలం
సి. త్వచ కణజాలం డి. మృదు కణజాలం
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, డి
73. జతపర్చండి?
ఎ. ప్రసరణ వ్యవస్థ 1. మెదడు
బి. జీర్ణవ్యవస్థ 2. ఊపిరితిత్తులు
సి. శ్వాసవ్యవస్థ 3. హృదయం
డి. నాడీ వ్యవస్థ 4. కాలేయం
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-2, సి-1, డి-3
74. ద్రవరూప కణజాలం?
1) రక్తం 2) పైత్యరసం
3) ఉపకళా కణజాలం 4) క్లోమరసం
75. కణజాలాన్ని గుర్తించేందుకు ఉపయోగించే ద్రావణం?
1) caco3 2) Hcl
3) Mgcl2 4) Cacl2
76. కింది వాటిలో సరైన అంశం?
ఎ. జంతువుల లోపలి అవయవాలను, బయటి అవయవాలను కప్పి ఉంచే కణజాలం-ఉపకణజాలం
బి. అవయవవాలను కలుపు కణం- సంయోజక కణజాలం
సి. శరీర కదలికలకు తోడ్పడే కణజాలం- కండర కణజాలం
డి. బాహ్య, అంతర ఉద్దీపనలకు, ప్రతిచర్యలకు తోడ్పడే కణజాలం- నాడీ కణజాలం
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
77. పొలుసుల ఉపకళ గురించి సరికాని అంశం?
ఎ. కణాలు బల్లపరుపుగా ఉంటాయి
బి. దృఢమైన పొరను కలిగి ఉంటాయి
సి. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో ఉంటాయి
డి. పలుచని పొరను కలిగి ఉంటాయి
1) ఎ, డి 2) ఎ, బి 3) బి 4) డి
78. స్తరిత ఉప కణజాలం కలిగిన శరీర భాగం?
ఎ. చర్మం బి. రక్తనాళాలు
సి. అన్నవాహిక డి. ఊపిరితిత్తులు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ
79. మూత్రనాళాల్లో కనిపించే ఉపకళా కణజాలం?
1) స్తరిత ఉపకళ 2) పొలుసుల ఉపకళ
3) ఘనాకార ఉపకళ 4) గ్రంథి ఉపకళ
80. స్తంభాకార ఉపకళా కణజాలం కలిగిన భాగాలు?
ఎ. కొమ్ములు, గిట్టలు బి. రోమాలు
సి. గోర్లు, పొలుసులు డి. పక్షుల ఈకలు
1) ఎ, బి, సి, డి 2) ఎ
3) సి 4) ఎ, బి
81. కిందివాటిలో సరైన అంశం?
ఎ. అవయవాలను, కండరాలను కలిపే కణజాలం ఉపకళా కణజాలం
బి. అవయవాలను, కండరాలను కలిపే కణజాలం సంయోజక కణజాలం
సి. సంయోజక కణజాలం అంతర్భగాలకు చట్రంలా ఉంటుంది
డి. సంయోజక కణజాలం
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
82. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. సంయోజక కణజాలం శరీరరక్షణకు తోడ్పడుతుంది
బి. శరీర కణాల మరమ్మతు చేయడానికి సంయోజక కణజాలం తోడ్పడుతుంది
సి. సంయోజక కణజాలం కొవ్వుపదార్థాలను నిల్వ చేస్తుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
83. కింది వాటిలో సరికాని అంశం?
ఎ. పరిహేలార్ కణజాలంలో గల పెద్ద ఖాళీ ప్రదేశాలను పరిహేల్స్ అంటారు
బి. పరిహేల్స్ వేరుచేసినప్పుడు పల్చటి ద్రవం ఏర్పడుతుంది
సి. పరిహేలార్ కణజాలంలో గల తంతువులు ఫైబ్రో బ్లాస్ట్లను కలిగి ఉంటుంది
డి. ఫైబ్రోబ్లాస్ట్లు పోషకాల రవాణాలో తోడ్పడుతాయి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) బి
జవాబులు
41-3, 42-4, 43-3, 44-1, 45-1, 46-3, 47-2, 48-1, 49-2, 50-1, 51-2, 52-1, 53-2, 54-3, 55-3, 56-1,
57-4, 58-1, 59-1, 60-4, 61-3, 62-1, 63-2, 64-1, 65-1, 66-2, 67-4, 68-2, 69-1, 70-4, 71-2, 72-1,
73-2, 74-1, 75-2, 76-4, 77-3, 78-4, 79-3, 80-1, 81-2, 82-4, 83-4
శ్రీకాంత్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు