టీవీ రిమోట్ పనిచేసేటప్పుడు వెలువడే కిరణాలు ?
ఆధునిక భౌతిక శాస్త్రం
( అక్టోబర్ 10 తరువాయి)
65. కేంద్రక సంలీన ప్రక్రియలో ఒక న్యూక్లియన్కు వెలువడే శక్తి?
1) 7 MeV 2) 0.8 MeV
3) 231 MeV 4) 931.5 Mev
66. రేడియో ధార్మికత ఏ దృగ్విషయం?
1) పరమాణు 2) అణు
3) కేంద్రక 4) ఎలక్ట్రాన్
67. కింది వాటిలో అర్ధవాహకాలుగా పనిచేసేవి?
1) కాపర్ 2) సిలికాన్
3) జెర్మేనియం 4) బి, సి
68. విద్యుత్‌పరంగా పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
1) 3 2) 4 3) 5 4) 2
69. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన అర్ధవాహకం ఎలా ప్రవర్తిస్తుంది?
1) అతివాహకం 2) బంధకం
3) వాహకం 4) నిరోధం
70. అర్ధవాహకాల్లో ఉష్ణోగ్రత పెరిగితే శక్తి అంతరం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మొదట పెరిగి తగ్గుతుంది
4) మారదు
71. కింది వాటిలో త్రిసంయోజక మూలకం?
1) అల్యూమినియం 2) గాలియం
3) ఇండియం 4) పైవన్నీ
72. అర్ధవాహకాల్లో విద్యుత్ప్రవాహం వేటివల్ల కలుగుతుంది?
1) రంధ్రాలు 2) ఎలక్ట్రాన్లు
3) ఎ, బి 4) అయాన్లు
73. జెర్మేనియంను N- రకం అర్ధవాహకంగా మార్చడానికి కలుపవలసిన పదార్థం ఏది?
1) అల్యూమినియం 2) పాస్ఫరస్
3) గాలియం 4) ఇండియం
74. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత అధికంగా ఉండే పదార్థం ఏది?
1) రాగి 2) జెర్మేనియం
3) చెక్క 4) రబ్బరు
75. ఏక ధిక్కరణి(రెక్టిఫయర్) గా ఉపయోగపడేది?
1) ట్రయోడ్ 2) ట్రాన్సిస్టర్
3) డయోడ్ 4) పైవన్నీ
76. ఏకధిక్కరణి చేసే పని?
1) ఏకాంతర ప్రవాహాన్ని ఏకముఖ ప్రవాహంగా మార్చుతుంది
2) ఏకముఖ ప్రవాహాన్ని ఏకాంతర ప్రవాహంగా మార్చుతుంది
3) పరివర్తకంగా పనిచేస్తుంది
4) పైవన్నీ
77. LED పూర్తి రూపం ?
1) Low Electricity Device
2) Light Emitting Diode
3) Large Electricity Device
4) Light Ejecting Diode
78. టీవీ రిమోట్ ముందు భాగంలో ఉండే చిన్న బల్బు వంటి పరికరం ?
1) సాధారణ బల్బు
2) సాధారణ LED
3) UV-LED
4) IR-LED
79. వోల్టేజ్ లేదా విద్యుత్ ప్రవాహాలను వర్ధనం చేయడానికి ఉపయోగించే పరికరం?
1) డయోడ్ 2) ట్రాన్సిస్టర్
3) తర్కాద్వారం 4) డోలకం
80. టీవీ రిమోట్ పనిచేసేటప్పుడు వెలువడే కిరణాలు ?
1) పరారుణ 2) దృశ్యకాంతి
3) అతినీలలోహిత 4) గామా
81. రేడియో ప్రసారాలను ఉపయోగించే పౌనఃపున్యాల అవధి?
1) 300 kHz – 30 kHz
2) 30 MHz – 300 MHz
3) 30 kHz – 300 kHz
4) 300 MHz – 3000 MHz
82. టీవీ ప్రసారంలో వీడియో సంకేతాలను ఉత్పాదించడంలో ప్రధాన దశ?
1) ప్రాపగేషన్ 2) మాడ్యులేషన్
3) స్కానింగ్ 4) డీమాడ్యులేషన్
83. కంప్యూటర్ పనిచేయడంలో ఉపయోగపడే సంఖ్యామానం?
1) దశాంశమానం 2) ద్విసంఖ్యామానం
3) షోడషాంశమానం 4) సప్తాంశ మానం
84. దశాంశమానంలోని 8కి సమానమైన సంఖ్య ద్విసంఖ్యామానంలో?
1) 1010 2) 1101
3) 1000 4) 1111
85. కింది వాటిలో నిర్గమాన సాధనం కానిదేది?
1) మానిటర్ 2) ప్రింటర్
3) స్పీకర్ 4) స్కానర్
86. కింది వాటిలో శాశ్వత మెమరీ కానిది ఒక?
1) పెన్‌డ్రైవ్ 2) డీవీడీ డిస్క్
3) RAM 4) ROM
87. FORTAN, COBAL, JAVA అనేవి కంప్యూటర్లోని …?
1) పరిక్రియా వ్యవస్థలు 2) భాషలు
3) సాఫ్ట్వేర్లు 4) వైరస్లు
88. కంప్యూటర్ వైరస్ అనేది?
1) పరిక్రియా వ్యవస్థ 2) భాష
3) కార్యక్రమణిక 4) జీవవ్యవస్థ
89. 1 కిలోబైట్లో ఉండే సమాచారం ఎంత?
1) 28 బైట్లు 2) 82 బైట్లు
3) 210 బైట్లు 4) 102 బైట్లు
90. కంప్యూటర్లో ఉపయోగించే ఐసీకి పూర్తి రూపం?
1) Internal Chip
2) Integrated Circuit
3) Istropic Circuit
4) International Circuit
91. మొబైల్ ఫోన్లో ఉపయోగించే SIM కార్డ్‌కు సంబంధించి SIM అంటే?
1) Small Internal Module
2) Semicondoctor Internal Module
3) Subscriber Identity Module
4) Special Identity Module
92. ఫోన్ కెమెరా సామర్థ్యాన్ని MPలలో చెబుతారు. MP అంటే?
1) మెగా పిక్సెల్ 2) మోషన్ పిక్చర్
3) మొబైల్ ఫొటో 4) మిల్లీ పిక్సెల్స్
93. ఎలక్ట్రాన్ స్పిన్ భావనను ప్రవేశపెట్టింది?
1) రూథర్ ఫర్డ్ 2) రామన్
3) బోర్ 4) ఉలెన్ బెక్ & గోల్డ్‌స్మిత్
94. రేడియోధార్మిక పదార్థాలు ఉద్గారం చేయనివి?
1) బీటా కిరణాలు 2) ప్రోటాన్లు
3) ఆల్ఫా కిరణాలు 4) పాజిట్రాన్లు
95. కింది వాటిలో దేనికి ఆవేశం ఉండదు?
1) కాథోడ్ కిరణాలు 2) బీటా కిరణాలు
3) ధనకిరణాలు 4) X- కిరణాలు
96. వికిరణాన్ని దేనితో గుర్తించవచ్చు?
1) డోలకం 2) ఎలక్ట్రోమీటర్
3) వోల్ట్‌మీటర్ 4) అమ్మీటర్
97. 92U235 కేంద్రకంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య?
1) 92 2) 143
3) 235 4) 0
98. దర్పణకేంద్రకాలు అంటే?
1) సమాన సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉండేవి
2) సమాన సంఖ్యలో ప్రోటాన్లను కలిగి ఉండేవి
3) ప్రోటాన్ల సంఖ్య న్యూట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉండేవి
4) ఒకదానిలోని ప్రోటాన్ల సంఖ్య మరోదానిలో న్యూట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉండేవి
99. ప్రాథమిక కాస్మిక్ కిరణాల్లో చాలా వరకు ఉండేవి?
1) న్యూట్రాన్లు 2) ఎలక్ట్రాన్లు
3) ప్రోటాన్లు 4) ఆల్ఫాకణాలు
100. ఒక రేడియోధార్మిక పదార్థం నుంచి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు ఎప్పుడు వెలువడతాయి?
1) దాన్ని వేడిచేసినప్పుడు
2) దాన్ని పరమాణు రియాక్టర్లో ఉంచినప్పుడు
3) దాన్ని పీడనానికి గురిచేసినప్పుడు
4) స్వచ్ఛందంగా
101. ఏదైనా ఒక స్థావర కక్ష్యలో ఎలక్ట్రాన్ మొత్తం శక్తి?
1) ఎప్పుడూ రుణాత్మకం
2) ఎప్పుడూ సున్నా
3) ఎప్పుడూ ధనాత్మకం
4) కొన్నిసార్లు రుణాత్మకం, కొన్నిసార్లు ధనాత్మకం
102. కార్బన్‌డేటింగ్ పద్ధతి పనిచేయడానికి కారణం?
1) C14 స్థిర ఐసోటోపు
2) C14, C12 కంటే అధిక పరమాణు భారాన్ని కలిగి ఉంటుంది
3) మృత శరీరం పరిసరాల నుంచి C14 తీసుకోవడం జరగదు
4) మృత శరీరంలో C14 పరిమాణం కాలంతో పాటు పెరుగుతుంది
103. ఐసోమర్ల అభిలక్షణం?
1) ఒకే పరమాణు సంఖ్య, ఒకే ద్రవ్యరాశి సంఖ్య
2) ఒకే న్యూట్రాన్ల సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు
3) ఒకే ద్రవ్యరాశి సంఖ్య, వేర్వేరు న్యూట్రాన్లు, పరమాణు సంఖ్యలు
4) ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు
104. ఒక తరంగదైర్ఘ్యం గల కాంతిని శోషించుకొని వేరొక తరంగదైర్ఘ్యం గల కాంతిని ఇచ్చే దృగ్విషయం?
1) ప్రతిదీప్తి 2) ఉత్తేజనం
3) భాసనం 4) ఫొటో-ఉద్గారం
105. పరమాణువులోని ఏ ఆంగికాలు దాని రసాయన స్వభావానికి కారణం?
1) న్యూట్రాన్లు
2) ప్రోటాన్లు, న్యూట్రాన్లు రెండూ
3) ప్రోటాన్లు 4) ఎలక్ట్రాన్లు
106. కేంద్రక విచ్ఛిత్తి కంటే కేంద్రక సంలీనాన్ని ప్రారంభించడం కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ?
1) అధిక ఉష్ణోగ్రతలు అవసరం
2) తేలిక కేంద్రకాల్లో ఎలక్ట్రాన్లు తక్కువగా ఉండటం
3) తేలిక కేంద్రకాలు వికర్షణ బలాలను కలిగి ఉంటాయి
4) తేలిక కేంద్రకాలు పరిమాణంలో పెద్దగా ఉండటం
107. విశ్వ(కాస్మిక్) కిరణాలు అనేవి?
1) అధిక శక్తిమంతమైన కణాలు
2) తక్కువ శక్తిమంతమైన కణాలు
3) మితశక్తి గల కణాలు
4) సున్నా శక్తి గల కణాలు
కాంతి (అక్టోబర్ 17 తరువాయి)
63. వస్తువులపై ఉన్న బార్ కోడ్ చదవడానికి ఉపయోగించే కాంతి?
1) నియాన్ బల్బుకాంతి
2) సోడియం కాంతి
3) లేజర్ కాంతి
4) మెర్క్యూరీ ఆవిరి కాంతి
64. సోడియం ఆవిరి దీపం నుంచి వెలువడే కాంతి తరంగదైర్ఘ్యం విలువ దాదాపు?
1) 5293
2) 5693
3) 5893
4) 6093
65. అక్కడక్కడ నల్లని గీతలు ఉండే వర్ణపటం?
1) శోషణ వర్ణపటం
2) అవిచ్ఛిన్న వర్ణపటం
3) పట్టీ వర్ణపటం
4) రేఖా వర్ణపటం
66. సౌరకాంతితో ఏర్పడే వర్ణపటం ఏది?
1) శోషణ వర్ణపటం
2) అవిచ్ఛిన్న వర్ణపటం
3) పట్టీ వర్ణపటం 4) రేఖా వర్ణపటం
67. సౌర వర్ణ పటంలోని నల్లని రేఖలను ఏమంటారు?
1) ఫ్రాన్ హాఫర్ రేఖలు 2) ఫ్రెనెల్ రేఖలు
3) యంగ్ రేఖలు 4) హైగెన్స్ రేఖలు
68. ఫ్రాన్హాఫర్ రేఖల ఆధారంగా సౌర వాతా-వరణంలో కనుగొన్న మొదటి మూలకం?
1) హైడ్రోజన్ 2) హీలియం
3) లిథియం 4) బెరీలియం
69. MASER పూర్తి రూపం?
1) Microwave Amplification by Stimmulated Emission of Radiation
2) Microwave Analysis by
Spontaneous Emission of Radiation
3) Microwave Analysis by Stipulated Emission of Radiation
4) Microwave Amplification by
Spontaneous Emission of Radiation
70. కాంతి ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రవేశించినప్పుడు మారకుండా ఉండే రాశి?
1) వేగం 2) పౌనఃపున్యం
3) తరంగదైర్ఘ్యం 4) ఎ, సి
71. తెల్లని కాగితం తెల్లగా కనిపించడానికి కారణం?
1) అది అన్ని రంగులను శోషణం చేసుకోవడం వల్ల
2) అది అన్ని రంగులను పరావర్తనం చెందించడం వల్ల
3) నలుపు రంగును పరావర్తనం చెందించడం వల్ల
4) నలుపు రంగును శోషణం చేసుకోవడం వల్ల
72. వస్తువు V వేగంతో దర్పణాన్ని సమీపిస్తున్నైట్లెతే, వస్తు-ప్రతిబింబాల మధ్య సాపేక్ష వేగం?
1) 0 2) v 3) 2v 4) 0.5v
73. గడియారం 8.35ను సూచిస్తే, దానికి ఎదురుగా ఉన్న దర్పణంలో ఎంత సమయాన్ని సూచిస్తుంది?
1) 3:25 2) 3:45
3) 8:35 4) 4:45
74. VIBGYORలో దేనికి వేగం కనిష్ఠం?
1) V 2) R 3) G 4) Y
75. సన్‌గ్లాసెస్‌కు సామర్థ్యం?
1) సున్నా 2) అనంతం
3) +1 4) -1
76. భూమిపై వాతావరణం లేకపోతే ఏ సమయంలోనైనా ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
1) నీలం 2) తెలుపు
3) నలుపు 4) ఎరుపు
77. ఒక వ్యక్తి ఇంద్రధనస్సు చూస్తున్నప్పుడు?
1) సూర్యుడికి అభిముఖంగా వ్యక్తి ఉంటాడు
2) వ్యక్తికి వెనుకవైపు సూర్యుడు ఉంటాడు
3) ఇంద్రధనస్సు, సూర్యుడు పక్కపక్కనే ఉంటారు
4) సూర్యుని అవసరం లేకుండా కూడా ఇంద్రధనస్సు ఏర్పడుతుంది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు